స్నేహశీలి, ప్రజల మనిషి

Wed,September 4, 2019 12:24 AM

governor-esl-narasimhan
అనంతపూర్‌లో మేము ట్రయినింగ్‌లో ఉన్నప్పుడు చాకులాంటి ఒక ఏఎస్పీ మాకు పరిచయం అయ్యారు. మాతో పాటే ఆయన కూడా పోలీసు స్టేడియం గదుల్లో ఉండేవారు. ప్రాక్టికల్ ట్రయినింగ్‌లో అనంతపూర్ ఏఎస్పీగా ఉన్న ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటూ మా అందరితో సరదాగా, కులాసాగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. చకచకా కబుర్లు చెప్పటమే కాకుండా మాలో ఎవర్నో ఒకర్ని టార్గెట్‌గా చేసుకొని, మిగతా వారితో కలిసి ఆటపట్టిస్తుండేవారు. ఒకరోజు మేమంతా పరేడ్ గ్రౌండ్ నుంచి తిరిగివచ్చేసరికి నన్ను రావులపాటీ! కమ్ హియర్ అని పిలిచారు. నేను దగ్గరికి వెళ్లాను. నువ్వు రైటర్‌వు కదా అని సూటిగా అన్నారు. నేను ఆశ్చర్యపోతూ ఎలా తెలుసు అన్నట్లుగా మొహం పెట్టాను. సిట్ డౌన్! నీ జాతకం మొత్తం చెబుతా అన్నారు సీరియస్‌గా, కూర్చున్నాను. నువ్వు బ్రతుకు బంగా రం అనే నవల రాశావ్ కదా, అన్నారు. బంగారం కాదు బొంగరం అని సరిదిద్దాను. ఏదో ఒకటి! రాశావా లేదా? రాసినట్లు తలూపాను. పేరు తో సహా ఆయన ఎలా తెలుసుకోగలిగారా అని యింకా నేను ఆశ్చర్యం లో మునిగితేలుతూనే ఉన్నాను. కాసేపు పైకి చూస్తూ దీర్ఘాలోచనలో వున్నట్లు నటించి ఆ నవలను ఫ్రాంక్‌ఫర్డ్‌లో జరిగే వరల్డ్ బుక్‌ఫెయిర్‌కు త్వరలో పంపించే అవకాశం ఉంది అని సీరియస్‌గా అన్నారు. ఆయన ఏం చెబుతున్నారో కాసేపు నాకు అర్థం కాలేదు. ఆయనే ఆ తర్వాత కంగ్రాట్స్! మీరంతా పరేడ్‌కు వెళ్లినప్పుడు ఒక లెటర్ వచ్చింది నవ్వుతూ నాకు దాన్ని యిచ్చారు.

చాలారోజుల తర్వాత చెన్నైలో ఆయన సహాయం వ్యక్తిగత పనిలో అవసరమైంది. అరమరికలు లేకుండా భేషజాలకు పోకుండా సహాయపడిన వ్యక్తి-ఆ వ్యక్తిత్వపు విలువలు ఎప్పుడూ ఏదో సందర్భంలో జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఆయన గురించి ప్రస్తావించాను. కానీ పేరు చెప్పలేదు కదూ! ఆయన పేరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్. మనల్ని వీడివెళ్తున్న గవర్నర్!


బ్రతుకు బొంగరం నవల ఇంగ్లీష్ సినాప్సిస్‌తో పాటు ఎమ్మెస్కో ఆ బుక్‌ఫెయిర్‌కు పంపే యాభై పుస్తకాల పేర్లు ఆ ఉత్తరంలో ఉన్నాయి. అం దులో ఆ నవల ఒకటి! అప్పటినుంచి (రావులపాటీ! బ్రతుకు బొంగరం అని పిలువటమే ఆయనకు అలవాటు. సాయం సమయాల్లో సొంత ఫియట్ కార్లో మాలో ఇద్దర్నో-ముగ్గుర్నో అక్కడికీ యిక్కడికీ సరదాగా తిప్పుతుండేవారు. రాత్రివేళల్లో ఆయన టౌన్‌లో డ్యూటీ చేస్తున్నప్పుడు సబ్‌జైలు చెకింగ్‌కో, కేడీల చెకింగ్ కో ఏదో ఒక వ్యాపకం మీద ఆయనతో పాటు తీసుకొని వెళ్తుండేవారు. ఆయన లేనప్పుడు ఆయన గదిలోకి స్వతంత్రంగా వెళ్లి ఏదో ఒకటి తినటమో, కాఫీ లాంటిది పెట్టుకొని తాగటమో ఒకరిద్దరం చేసేవాళ్లం. రాగానే ధాం ధూం నటిస్తూ యూ ఫెల్లోస్ మీ మీద ట్రెస్‌పాస్, థెఫ్ట్ కేసు వన్‌టౌన్ స్టేషన్‌లో బుక్‌చేయిస్తా అని ఎగిరేవారు. ఆ తర్వాత మీకు దొంగతం చేయటం కూడా చేతగాదు. ఇక్కడ ఇన్ని తినే పదర్థాలు దాచిపెడితే అవి తినకుండా ఉత్తి కాఫీయే తాగారా! అని అవ్వన్నీ మా ముం దుంచి తినిపించేవారు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. చిలిపితనం ఎక్కువ. క్రమశిక్షణ, నిబద్ధత-అన్నీ ఎక్కువే! ఆయన సోదరుడు ఐఏఎస్ ఆఫీసర్‌గా అస్సాంలో కమిషనర్‌గా ఉన్నప్పుడు తీవ్రవాదులు దారుణంగా పొట్టనపెట్టుకున్నారు. బడబాగ్నిలా ఆ చేదు నిజాన్ని తనలో దాచుకున్నారు గానీ ఆ విషయాన్ని మాటవరుసకైనా ఎప్పుడూ ప్రస్తావించలేదు. నంద్యాలలో ఆయన ఏఎస్పీగా ఉన్నప్పుడు సీరియస్ రోడ్డు ప్రమాదం జరిగింది. కొన్నిరోజులు కోమాలో ఉండి కేవలం విల్ పవర్‌తో కోలుకోగలిగారు. త్వరగా కోలుకోవాలని మేం రాసిన ఉత్తరాలకు హ్యమర్ రంగరించి మరీ జవాబులు రాసేవారు.

వ్యక్తిగత విషయం పక్కనపెడితే గవర్నర్ నరసింహన్, రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారని చెప్పటంలో అతిశయోక్తి లేనే లేదు. రాజ్యాంగపరమైన పదవిని కూడా ప్రజల దగ్గరకు తెచ్చారు. కేవలం తెలిసినవారే కాదు ఎవరైనా గవర్నర్‌ను నిరాఘటంగా కలువొచ్చు అనే సంప్రదాయాన్ని ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి చేసి చూపించారు. గవర్నర్ ఇచ్చిన ఎట్ హోమ్ పార్టీలకు చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా బహళ సంఖ్యలో ఎందరో హాజరవ్వటమే దానికి నిదర్శనం.


నేను పెనుకొండ నుంచి ట్రాన్స్‌ఫర్ అయి హైదరాబాద్‌కు వెళ్తున్నప్పుడు ట్రయిన్‌లో నంద్యాల మీదు నుంచే వెళ్తున్నామని ఫోన్‌లో క్యాజువల్‌గా తెలియజేస్తే నంద్యాలలో అర్ధరాత్రి కంపార్ట్‌మెంట్ తలుపుతట్టి, ట్రయిన్ ఆగిన రెండు నిముషాల్లోనే ఆప్యాయతను బెస్ట్ విషెస్‌లో రంగరించి మమ్మల్ని నివ్వెరపోయేటట్లు చేసిన స్నేహశీలి! చాలా కొద్దికాలమే ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసి సెంటర్‌కు వెళ్లిపోయినా, ఆయన మమ్మల్ని మరిచిపోలేదు. ఆయన పనిచేసేచోట కలిసినా, హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసినా అదే ఆప్యాయత! అదే చిలిపి పలుకరింపు! అదే స్నేహపు గుబాళింపు! చాలారోజుల తర్వాత చెన్నైలో ఆయన సహాయం వ్యక్తిగత పనిలో అవసరమైంది. అరమరికలు లేకుండా భేషజాలకు పోకుండా సహాయపడిన వ్యక్తి-ఆ వ్యక్తిత్వపు విలువలు ఎప్పుడూ ఏదో సందర్భంలో జ్ఞాప కం వస్తూనే ఉంటాయి. ఆయన గురించి ప్రస్తావించాను. కానీ పేరు చెప్పలేదు కదూ! ఆయన పేరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్. మనల్ని వీడి వెళ్తున్న గవర్నర్! ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి గవర్నర్‌గా ఉన్నవారిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించటం మాబోటివారికి చాలా ఆనందాన్ని కలిగించింది. తెలిసినవారిని గవర్నర్‌గా చూడటంలో వచ్చే అనుభూతే వేరు! ఆయన ప్రమాణస్వీకారం తర్వాత కలుద్దామని రాజ్‌భవన్‌కు ఫోన్‌చేశాను, అప్పాయింట్‌మెంట్ కోసం. లైన్‌లోకి వచ్చిన గవర్నర్ నేను అభినందనలు చెబుతుండగానే స్వేరింగ్ ఇన్ సెర్‌మనీలో కనపడలేదేమిటి? అని అడిగారు. నసుగుతూ ప్రొటోకల్ అదీ.. అంటూ కారణం చెప్పబోయాను. కుంటిసాకులు చెప్పొద్దు, నేను మీ రాష్ర్టానికి వస్తే నీవు రావా? ఆత్మీయతతో కూడుకున్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగల ను? కలిసినప్పుడు ముచ్చటించుకున్నవన్నీ పాత జ్ఞాపకాలే! అనంతపూర్ మధురస్మృతులే! పేరుపేరునా నా బ్యాచ్‌మేట్స్ బాగోగులు కనుక్కున్నారు!
Ravulapati-Sitaramarao
అప్పటినుంచి రాజ్‌భవన్‌లో ప్రతి జనవరి 26న, ఆగస్టు 15న, ఉగాదిలాంటి పర్వదినాలలో జరిగే కార్యక్రమాల్లో మా లాంటివారి అటెండె న్స్ కంపల్సరీ! అక్కడ ప్రతి పరిచయస్తుడినీ ఆత్మీయంగా పలుకరించే ధోరణే! యథావిధిగా నన్ను వాట్ బ్రతుకు బొంగరం అంటూ పరామర్శించటమే! స్నేహితులుగా వెలిగినవారంటే ఆయనకు అత్యంత ప్రేమ. మా నాన్న చనిపోయినప్పుడు ప్రత్యేకంగా ఇంటికివచ్చి పలుకరించిన తీరు హృదయాన్ని కదిలించింది. ఆయన నుంచి ఏదీ ఆశించలేదు. అదేవిధంగా ఆయన కూడా! కేవలం పాతకాలపు స్నేహం-సాన్నిహిత్యమే! వ్యక్తిగత విషయం పక్కనపెడితే గవర్నర్ నరసింహన్, రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారని చెప్పటంలో అతిశయోక్తి లేనే లేదు. రాజ్యాంగపరమైన పదవిని కూడా ప్రజల దగ్గరకు తెచ్చారు. కేవలం తెలిసినవారే కాదు ఎవరైనా గవర్నర్‌ను నిరాఘటంగా కలువొచ్చు అనే సంప్రదాయాన్ని ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి చేసి చూపించారు. గవర్నర్ ఇచ్చిన ఎట్ హోమ్ పార్టీలకు చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా బహళ సంఖ్యలో ఎందరో హాజరవ్వటమే దానికి నిదర్శనం. బహుశా ఏ గవర్న ర్ ఇంతకాలం రాజ్యాంగ పదవిని చేసి ఉండకపోవచ్చు! అది కాదు ముఖ్యం-ఇంతకాలం ఎక్కువమంది మన్ననలు పొందుతూ పూర్వాశ్రమంలో అధికారిగా వున్న వ్యక్తి పదవిలో ఉండటమే-ఆయన విజయానికి గీటురాయిగా చెప్పొచ్చు. తెలుగువారిని వీడివెళ్తున్న ఈ సందర్భంలో గవర్నర్ నరసింహన్‌గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తూ, వారి శ్రీమతి విమలానరసింహన్‌కు భవిష్యత్తు శుభప్రదంగా ఉండాలని కోరుతున్నాను. ఏ పద వి అయినా శాశ్వతం కాదు, విలువలు, స్నేహధర్మం ముఖ్యం. ఆయన మాటలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి.

589
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles