చికాగోలో నానమ్మ-వస్తువైవిధ్యం

Mon,September 2, 2019 01:08 AM

ramulu-bs
కథ, నవల కల్పిత ఇతివృత్తమైనప్పటికీ నేటి ఆధునిక సమాజం లో సామాజిక పరిణామం దృష్ట్యా కథానికకు విశిష్ఠమైన స్థానం ఉన్నది. కథ మొట్టమొదట మౌఖికంగా ప్రారంభమైనప్పటికీ సాహిత్యంలో కథానికకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. చారిత్రక పరిణామంలో రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం, కథా సరిత్సాగరం, గాథాసప్తశతి మొదలైన వాటిలో కథానికకు ప్రముఖ స్థానం ఉన్నది. నేడు సమాజంలో మానవీయ విలువలప్రాధాన్యం చాలా ఉన్నది. వాటిని కాపాడుకోవాలంటే సాహిత్యం ప్రధానమైన సాధనం. మానవతా విలువలు, సంస్కృతిని ఉన్నతీకరించడం సాహిత్యకారుల కర్తవ్యం. బి.ఎస్.రాములు గారి సాహిత్యంలో సామాజిక వాస్తవికత, వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. వాస్తవికతతో పాటు సమస్యను ప్రతిభావంతంగా చిత్రీకరించి సమస్యకు పరిష్కా ర మార్గాన్ని సూచిస్తారు. పాఠకులను ఆలోచించే దిశగా ప్రయాణం చేయిస్తారు. చికాగోలోని నానమ్మ కథలో నానమ్మ గతాన్ని ప్రేమిస్తుంది. గతంతో పాటు వర్తమానం, భవిష్యత్తు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. చికాగోలో కొడుకు, కోడలు, మనవడు, మనవరాలుతో నానమ్మ (భూదేవి) ఉంటుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గంప కింద కోడిని కమ్మినట్లు ఇండ్లదిండ్లనే తిరుగాలి. వసతు లన్నీ బాగానే ఉన్నయి. కానీ మాట్లాడటానికి ఎవరూ లేరు. ఎవరు పరిచయమైనా ఏం కూర, డీవీడీల ఏం చూసినవ్ అనే ముచ్చట్లే ఉంటాయి. మనిషి ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ ఉన్నా తన సొంత గడ్డను, ఆచార సాంప్రదాయాలను మరిచిపోవడం జరుగదు. చికాగోలో నానమ్మ కథలోనూ భూదేవి అమెరికాలో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నప్పుడు, ఇండియాలో లాగ అందరు బతుకమ్మను రకరకాల పువ్వులతో పేర్చుకొని, ఆటపాటల పోటీలు పెట్టుకొని, రకరకాల వంటలతో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఆడుతారు.

చికాగోలోని నానమ్మ కథలో నానమ్మ గతాన్ని ప్రేమిస్తుంది. గతంతో పాటు వర్తమానం, భవిష్యత్తు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. చికాగోలో కొడుకు, కోడలు, మనవడు, మనవరాలుతో నానమ్మ (భూదేవి) ఉంటుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గంప కింద కోడిని కమ్మినట్లు ఇండ్లదిండ్లనే తిరుగాలి. వసతులన్నీ బాగానే ఉన్నయి. కానీ మాట్లాడటానికి ఎవరూ లేరు. ఎవరు పరిచయమైనా ఏం కూర, డీవీడీల ఏం చూసినవ్ అనే ముచ్చట్లే ఉంటాయి.


భారతీయులు సప్త సముద్రాలు దాటివెళ్లినా కులాల వేర్లు ఎంత బలంగా భారతీయుల మెదళ్ళలో పాతుకుపోయాయనే విషయా న్ని ఈ కథలో వివరించారు. ఈ విషయం భూదేవి ఆవేదన ద్వారా వ్యక్తపరుస్తారు. వెనుకటి ముచ్చట చెపితే పేదరికం బయటపడి కులం తెలిసిపోతుందని భయమట! అక్కడికి అక్కడ కులాల వారీ గా అమెరికాలో తెలుగువాళ్లు సంఘాలుగా చీలిపోయారని వేరే కులాల వారిని వేరేవిధంగా చూస్తారని అందుకే వాళ్లతో కలిసి తిరుగ లేకపోతున్నామని అంటారు. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞా నం పెరిగిన కొద్దీ మానవునికి తృప్తిలేకుండా పోతున్నది. డబ్బు వెం ట పరుగెత్తటం జరుగుతున్నది. ఎంత సంపాదించినా తృప్తిలేదు. ఉరుకులు, పరుగులే అని భూదేవి పాత్ర చెబుతుంది.
ప్లేటో సిద్ధాంతం ఈ కథలో కనిపిస్తుంది. భూదేవి మనవరాలు రిచర్డ్ అనే అమెరికా యువకున్ని ప్రేమిస్తుంది. ఆమె మాటలో రిచర్డ్ అమెరికా సమాజాన్ని మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నాడని, అమెరికాలో నేరాలు తగ్గాలంటే ప్రభుత్వం, సమాజం దృష్టిని మార్చాలి. అమెరికాలో 12వ తరగతి తర్వాత స్త్రీ, పురుషులు సొంత సం పాదన ద్వారా విచ్చలవిడితనం పెరిగిపోయి కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుందని, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ ప్రాధాన్యాన్ని తెలియజేశారు. యువతకు గత దృష్టితో పాటు వర్తమాన, భవిష్యత్తు దృష్టి పట్ల అవగాహన కలుగాలి. ఇండియాలో తల్లిదండ్రులు సంపాదించింది ఉండటం గొప్ప అనుకుంటారు. కష్టపడి పైకి రావడమే అమెరికాలో గొప్ప ఆదర్శం. ఈ అవగాహన ఇండియాలో ప్రతి ఒక్కరికి కలుగాలి. ఈ విషయాన్ని మనవరాలు స్వప్న మాటల ద్వారా చర్చిస్తారు రచయిత. ఆధునిక జీవనంలో మానవ విలువలు ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయం పాతచీర కథానికలో కనిపిస్తుంది. వస్తు మార్పి డి పోయి ధన మార్పిడి ఎప్పటినుంచి మొదలైందో సమాజంలో ఆర్థి క, సామాజిక రంగాల్లో అనేకమార్పులు వచ్చాయి.


బి.ఎస్.రాములు గారి ప్రతి కథానిక పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. ప్రపంచీకరణం, పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎదుగుదలను సాధించినప్పటికీ అది ఎంతమంది కళ్ళల్లో వెలుగులకు బదులు చీకట్లను పంచిన వైనం రాములు గారి కథానికల్లో కనిపిస్తుంది. ప్రతి పాత్ర సజీవంగా మన కళ్ళముందు నిలిచి మనల్ని నిలదీస్తున్నట్లు ఉంటుంది.వీటి ఫలితం మానవ జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ విధంగా పాతచీరను ప్రతీకగా తీసుకొని మానవ సంబంధాలను తెలియజేశారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి ద్వారా ఆధునిక అభివృద్ధి సాధ్యమ ని భావించిన తరుణంలో పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశా లు కోల్పోయి జీవితాన్ని నిస్సారంగా ఈడుస్తూ ఉన్న స్థితిని వరుసలు కథానికలో వివరిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో యంత్రా లపై తయారైన వస్తువులు వెనుకబడిన దేశాల్లోకి దిగుమతి అవటం తో సాంప్రదాయిక చేతివృత్తుల ఉత్పత్తి నాశనమైంది. ఆ వృత్తుల్లో ఉన్నవారు తమ జీవనోపాధిని కోల్పోయి నిరుద్యోగులై భూమిపై ఆధారపడవలసిన స్థితి ఏర్పడింది. భూమిపై ఒత్తిడి పెరిగి భూమి వాస్తవ విలువలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. వరుసలు కథానికలో గానుగలు పోయి ఆయిల్ మిల్లులు వచ్చా యి. గానుగ వ్యాపారం చేసినవారు కొత్త వృత్తులను వెతుక్కోవలసి వచ్చింది. చేనేత కులవృత్తి అయినప్పటికీ వ్యాపారం, వ్యవహారంతోచక బొంబాయిలో కార్మికులుగా చేరవలసిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు గిట్టుబాటు కాక తిరిగి బీదర్ భీవండి వెళ్లారు. కష్టమైన, సుఖమైన అందరూ కలసి ఉంటేనే ఆనం దం కలుగుతుందని, బతుకటానికి ఎక్కడికో పోవలసిన అవసరం లేదని సరస్వతి పాత్ర ద్వారా వివరిస్తారు. చేనేతరంగం వికాసం ఏ విధంగా నష్టపోయిందో వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణలో సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉపాధి కారణంగా పేదవారు కూడా అందివచ్చిన అవకాశాలను అం దిపుచ్చుకొని ఎదిగిన తీరు బతుకు పయనంలో కనిపిస్తుంది. దేశం అభివృద్ధిని సాధించాలంటే సమాజం ఉన్నతంగా ఉండాలి. సమాజం ఉన్నతంగా ఉండాలంటే కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనదనే విషయాన్ని ప్యారాసైట్స్‌కథానికలో వివరిస్తారు. ఆదర్శవంతమైన కుటుంబం ఉండాలంటే కుటుంబంలో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుండాలి. అవి లోపించినపుడు కుటుంబం సరిగా ఉండదు.

వేదవతి, ప్రేమధార రెండు కథలలో స్త్రీ జీవితాన్ని చిత్రించిన భిన్నమైన దృక్పథం కనిపిస్తుంది. ఏమి తెలియని వయస్సులో ఒడిదుడుకుల పాలైన స్త్రీ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవటం వేదవతి కథలో కనిపిస్తుంది. పురిటికి వచ్చిన వేదవతి అక్క భర్త వేదవతితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఈ విషయాన్ని వేదవతి తల్లితో సరదాగా ఉంటారు అంటుంది. వేదవతికి గర్భం వస్తే మంత్రసానితో గండం గట్టెక్కిస్తుంది. ఈ విషయం బయటపెట్టి తన కాపురంలో చిచ్చు పెట్టవద్దని అక్క చెబుతుంది! వేదవతి కథకు భిన్నంగా ప్రేమధార కథానిక ఉంటుంది. సువర్ణ తండ్రి కులవృత్తిని వదిలి బట్టల మిల్లులో కార్మికుడిగా మారాడు. కొద్దిరోజులకు అది మూతబడి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి లో ఉంటాడు. కూతుర్లకు కట్నాలు ఇచ్చి వివాహం చేయలేని స్థితి ఉంటుంది. పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోతుంది. చిన్న కూతురు సువర్ణ ప్రేమలో పడుతుంది. ఈ విషయం తల్లికి తెలిసినా చూసీచూడనట్లు ఉంటుంది. సువర్ణ ప్రేమించిన శేఖర్ మంచి వాడే అయినప్పటికీ జీవితం మీద ఉన ్నఆశతో సువర్ణను వదిలిపెట్టి కట్నంతో వివాహం చేసుకొని అదే కట్నంతో చెల్లెలు వివాహం చేస్తాడు. సువ ర్ణ ఇదివరకే వివాహమై పిల్లలున్న టీ కొట్టు నడుపుతున్న సూరిబాబును వివాహం చేసుకుంటుంది. అతనితో ఒక బిడ్డకు తల్లి అవుతుంది. అతను సువర్ణ గురించి పూర్తిగా తెలిసినా ఆమెను వివాహం చేసుకుంటానని అంటాడు. సువర్ణకు హరిబాబును వివాహం చేసుకుంటే హరికి తనపై ప్రేమ పోతుందని అతని ప్రేమకు ముగ్ధురాలై ఊహాకల్పితమైన ఆదర్శాలకు జీవితాన్ని బలి చేసుకుంటుంది. నేటికాలంలో సమాజంలో చివరి గడియల్లో ఉంటున్న వారు ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని ఎదుర్కొంటున్నారో తులసి కథానికలో కనిపిస్తుంది. తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సున్నితమైన బంధంతో తల్లి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని పిల్లలే తన సర్వస్వం అనుకొని జీవితాన్ని ధారబోస్తుంది.

తులసికి ఇద్దరు కొడుకులుంటారు. వారు ఆమె పట్ల చూపే నిరాదరణ వారి పిల్లలు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తారు. తులసమ్మను ఒక పనిమనిషి కంటే హీనంగా చూస్తారు. తులసి చెల్లెలు కూతురు జయ కడుపుతో ఉండి పెద్దమ్మను సహాయానికి రమ్మంటుంది. తులసిపై జయ, ఆమె భర్త, జయ కొడుకు చూపే ఆదరణకు ప్రేమకు తులసమ్మ ముగ్ధురాలవుతుంది. తులసమ్మ పెద్ద కొడుకు తులసమ్మ ను వారి అవసరాల కోసం తీసుకెళ్లటానికి వచ్చినప్పుడు అయిష్టంగానే బయల్దేరుతూ తనను స్వర్గం నుంచి నరకానికి తీసుకు వెలుతున్నట్లుగా భావిస్తూ కొడుకు భుజంపైన తల వాలుస్తుంది. ఉమ్మడి కుటుంబ విచ్ఛిన్నం వరలక్ష్మి కథానికలో కనిపిస్తుంది. వరలక్ష్మికి తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మేనబావతో వివా హం అవుతుంది. అల్లుడిని తన మూడవ కొడుకుగా భావించి అల్లు డి వ్యాపారానికి పెట్టుబడి పెడుతాడు. క్రమంగా వ్యాపారంలో ఎది గిన తర్వాత అల్లుడు వరలక్ష్మి చెవిటిదని వదిలివేసి లక్ష రూపాయల కట్నంతో వేరొకరిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఉమ్మడి కుటుంబం ఎలా పతనమైందో తెలుస్తుంది. బి.ఎస్. రాములు గారి ప్రతి కథానిక పాఠకున్ని ఆలోచింపజేస్తుం ది. ప్రపంచీకరణం, పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎదుగుదలను సాధించినప్పటికీ అది ఎంతమంది కళ్ళల్లో వెలుగులకు బదులు చీకట్లను పంచిన వైనం రాములు గారి కథానికల్లో కనిపిస్తుంది. ప్రతి పాత్ర సజీవంగా మన కళ్ళముందు నిలిచి మనల్ని నిలదీస్తున్నట్లు ఉంటుంది.

- బి.జ్యోతి,93473 71272

143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles