మానేరు మా నీరు

Mon,September 2, 2019 01:03 AM

lower-manair-dam
గోదారి నా మదిని
దోచిన జలకన్య
జలజీవాల్ని గంప నెత్తికుని
వచ్చిన వనకన్య
రెండు గుట్టల మధ్య
కొడుముంజ గట్లల్ల
దేవకన్యలా తారాడుతున్న గోదారి
నా మానేరు దారిలోకి మళ్ళింది
పచ్చని ప్రకృతి మధ్య
కొంగలు వాలుతున్న కరకట్ట
జలపుష్పాల్ని వలల్లోంచి
తీసుకుంటున్న జాలర్లు
ఒడ్డున నేనూ...
పచ్చని ప్రకృతి చీరను కట్టుకుని
వాలు చూపులతో
నా కేసి చూసినట్లుగా
తనువెల్లా తరగలతో
పలకరిస్తూ
సయ్యాటల నడుమ
నేనో పులకింతనై
చంటి పిల్లాడిని ఒళ్లోకి తీసుకుంటున్న
కేరింతలు
నా మనసులో ఉద్విగ్న
భావాలు
నా కవితకు రూపమై
తెల్లని కాగితాన్ని ఆవహించింది
గోదారి
వరిచేన్లలో వరిగుత్తుల
గొలకల్లా.. అక్షరాల మాల...!

- ఆడెపు లక్ష్మణ్, 98491 57752

83
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles