నీవో హరితం..

Mon,September 2, 2019 01:02 AM

దేహాల్ని
బీడు మైదానాలు చేసి
గుండెలపై పచ్చని మొక్కల్ని నాటుతున్నం..
నాగరికతంటే
పునాదిని కూల్చుకొని
ఉపరితలాన్ని
బోర్లిచ్చుకోవడమేనా?
కాళ్ళకు ఇనుప కంచెలు కట్టి
వీపులకు డప్పుల స్వాగతాలు..

బుక్కెడు బువ్వ పుట్టని అజ్ఞానానికి
ఎన్నడు ఓదార్చని నమ్మకానికి
లక్షలు కోట్లు తగులబెడ్తున్నవు
నిన్ను కాటికి మోసే పాడెకు
నీవో కట్టెవు కావాలి
నీవో మొక్కవు కావాలి
కాదంటే.. చరిత్రనే నీ బూడిదెత్తుతది..!

- వనపట్ల సుబ్బయ్య, 94927 65358

78
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles