వికేంద్రీకరణతో వికాసం


Fri,August 16, 2019 12:52 AM

తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, మండలాల సంఖ్యను పెంచి, జిల్లాల సంఖ్యను పెంచి స్వయం పాలనకు, ప్రజల ముంగిట్లోకి పాలన, అధికార వికేంద్రీకరణ తద్వారా తెలంగాణ ఆత్మ గౌరవానికి ద్వారాలు తెరిచారు సీఎం కేసీఆర్. ఇదివరకెప్పుడూ లేని అనేకానేక సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలతో పాటు పాలనాపరమైన సంస్మరణలు చేసి న ప్రజాబంధు కేసీఆర్ ఈ వినూత్న కార్యక్రమాల వల్లనే మరోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు.

Yadav
2014 ఎన్నికల తర్వాత నాలుగున్నరేండ్ల పాలనలో తనదైన శైలిలో అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందేలా చేశా రు సీఎం కేసీఆర్. సాగునీటి కోసం మిషన్ కాకతీయ, తాగునీటి అవరాల కోసం మిషన్ భగీరథ వంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత ఆయనది. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో స్వల్పకాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసిన అపరభగీరథుడు కేసీఆర్. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ తెలిసినవే. ముందెన్నడూ లేనివిధంగా సంక్షేమాన్ని సమ్మిళితం చేసిన పద్ధతి అద్వితీయం. స్వయంపాలనలో అందరికీ సంక్షేమం అందాలనే లక్ష్యంతో పోరాడి సాధించిన తెలంగాణలో ఇవన్నీ ఒకెత్తయితే పాలనపరంగా సౌలభ్యం కోసం, ఇంటి ముం దుకు పాలన తీసుకురావడం హర్ణణీయమని తెలంగాణ ప్రజలు ఆయన ను కీర్తిస్తున్నారు.

పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే సంకల్పంతో పది జిల్లాలున్న తెలంగాణను, ముప్ఫై మూడు జిల్లాలుగా రూపొందించారు. మండలాల సంఖ్యను పెంచారు. గూడాలను పంచాయితీలుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. మా తండాల్లో మా రాజ్యం నినాదానికి కార్యరూపం ఇచ్చారు. కొత్త గ్రామపంచాయితీల ఏర్పాటు అధికార వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ. అధికారులు ప్రజలకు అం దుబాటులో ఉండటానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేసింది. ప్రజలు తమ జిల్లాలకు, మండలాలకు, గ్రామ పంచాయతీలకు వెళ్లడానికి దూరా న్ని తగ్గించింది. సమయం వృథాను అరికట్టింది. శ్రమనూ తగ్గించింది. ప్రభుత్వం, పాలన తన దగ్గరికొచ్చిందన్న విశ్వాసాన్ని కలిగిచింది. జిల్లాల విభజనను కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. వాస్తవాలను చూడకుండా విమర్శించడమే ప్రతిపక్షాల పని. కేసీఆర్ గ్రామ పంచాయతీల, మండలాల, జిల్లాల సంఖ్యను పెంచి ప్రజలకు చేరువయ్యారు. కేసీఆ ర్ తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రజల ముంగిటికి పాలన ఎలా వచ్చిందో, తాము కూడా పాలనలో భాగమేనన్న భావం ఎలా కలిగిందో పరిశీలిద్దాం.

ఇంతవరకు గిరిజన తండాలు ముఖ్యంగా లంబాడి తండాలు ఓ ఊరు గాను పంచాయతీ కింద ఉండేవి. ఏ చిన్న పనికైనా సరే ఈ తండా ప్రజలు ఆ గ్రామానికి వెళ్ళవలసి వచ్చేది. ఆ తండా నుంచి ఓ పంచాయతీ మెంబరున్నా సర్పంచ్, ఇతర అధికారులంతా ఆ గ్రామానికి చెందినవాళ్లే. ఈ తండాలు ఆ గ్రామ పంచాయతీ కింద ఉప గ్రామంగా మాత్రమే ఉండేవి. ఈ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం వల్ల వాటికి గ్రామ ప్రతిపత్తి వచ్చింది. ప్రత్యేక నిధులనిచ్చారు. ఆ తండాల నుంచే సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. గ్రామ పరిపాలనా పగ్గాలు ఆ గిరిజన తండాల చేతుల్లోకి వచ్చాయి. ఇందంతా అభివృద్ధికరమైన చర్యలే అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలన్న మానవీయ ప్రతిపాదన కు ఇది అతి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు తండా నుంచి సర్పంచ్‌లు ఎంపీటీసీలుగా వెళ్లే అవకాశం మరింత మెరుగైంది. ఇలా ఆనాదిగా ఓటర్లుగా మిగిలిపోయిన గిరిజనతండవాసులు నేడు పాలకులుగా ఆత్మగౌరవంతో వారి తండాలను వారే పరిపాలించుకుంటున్నారు.

జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల ప్రజలకు చెప్పలేనన్ని ప్రయోజనాలు చేకూరాయి. జిల్లా కేంద్రానికి ఒకప్పుడు సామాన్య ప్రజలు చేరు కోవాలం టే ఐదారు గంటలు పట్టేది. ఏ చిన్న పని కోసమైనా జిల్లా కేంద్రానికి రావాలంటే రోజంతా వృథా అయ్యేది. భరించరాని ఖర్చు. ఉదాహరణకు సిర్‌పూర్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే 6 గంటలు పట్టేది. రావడానికి మరో 6 గంటలు. పనికాకుంటే అక్కడే ఉండాలి. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రం కావడం వల్ల రెండున్నర గంటల్లో రాగలుగుతున్నా రు. పనిచేసుకొని ఇంటికెళ్తున్నారు. ఏ కారణం చేతనైనా పనికాకుంటే తెల్లవారి రావచ్చు. దీంతో ఖర్చు, సమయం ఆదా అవుతున్నది. ఇటు ప్రజల కు, అటు అధికారులకు దురాభారం తగ్గింది. అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ర్టాల ఏర్పాటు ఎంత ప్రజాస్వామ్యమో చిన్న జిల్లాల ఏర్పాటు కూడా అంతే ప్రజాస్వామికం. లంబాడీ తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇచ్చి గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేశారు కేసీఆర్. చిన్న జిల్లాలను చేసి ప్రజల వాకిళ్లలోకి అధికారులను నడిపించా రు. కలెక్టర్లు, విద్యాధికారులు, పోలీసు అధికారులను, జిల్లా పరిషత్ చైర్మన్‌ను, ఇతర అధికారుల ను, ప్రజాప్రతినిధు లను కలువడానికి సామాన్య మానవులకు మార్గం సుగమమైం ది. జిల్లాల విభజనతో ఆ జిల్లాలో అన్ని ప్రాంతాలపై దృషిపెట్టే అవకాశాలు మెరుగయ్యాయి.

10 జిల్లాల నుంచి 33 జిల్లాలు కావడం వల్ల అనేకమందికి పదోన్నతులు లభించడమే కాకుండా ఉద్యోగావకాశాలు కూడా మెరుగయ్యాయి. చిన్నచిన్న టౌన్‌లుగా ఉన్న కొత్త జిల్లా కేంద్రాలు పెద్ద పట్టణాలుగా అభి వృద్ధిచెందే అవకాశాలు పెరిగాయి. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న గ్రామాలు కేంద్రంలో కలిసిపోవడమే కాకుండా ఆయా గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. జిల్లాల విభజనతో అధికార వికేంద్రీకరణ జరుగడమే కాకుం డా అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజల ఇళ్లల్లకు చేరు తున్నాయి.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, మండలాల సంఖ్యను పెంచి, జిల్లాల సంఖ్యను పెంచి స్వయం పాలనకు, ప్రజల ముంగిట్లోకి పాలన, అధికార వికేంద్రీకరణ తద్వారా తెలంగాణ ఆత్మ గౌరవానికి ద్వారాలు తెరిచారు సీఎం కేసీఆర్. ఇదివరకెప్పుడూ లేని అనేకానేక సంక్షే మ, ప్రజాహిత కార్యక్రమాలతో పాటు పాలనాపరమైన సంస్మరణలు చేసి న ప్రజాబంధు కేసీఆర్ ఈ వినూత్న కార్యక్రమాల వల్లనే మరోసారి తెలం గాణలో అధికారంలోకి వచ్చారు. ప్రజల మనసులను గెలుచుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అనడంలో సందేహం లేదు.

285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles