వాతావరణ మార్పుపై పోరాటం


Tue,August 13, 2019 01:09 AM

మారిన మన జీవనశైలి, ప్రమాణాలు ప్రపంచ వాతావరణ వ్యవస్థల గందరగోళ పరిస్థితి ఒక విపత్తు ప్రభావాన్ని సృష్టిస్తున్నాయి. 4.5 బిలియన్ సంవత్సరాల వయస్సున్న భూమికి సమస్య లేదు. ఏ జీవరాశి కూడా భూమికి సమస్య కాదు. భూమి అప్పుడే అంతరించదు. కానీ భూమిపై ఉన్న కోటానుకోట్ల జీవరాశి నెమ్మదిగా నశించిపోతుంది. మానవులు సృష్టించిన అధునాతన వ్యవస్థలు తయారుచేసిన పరిస్థితులు భూమి వినాశనానికి దారితీస్తుంది. మనకు వేరే శత్రువులు అవసరం లేకుండానే మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. మనం మన వాతావరణాన్ని తీవ్రంగా పరిగణించం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పర్యావరణ వినాశ చర్యలే దానికి సాక్ష్యం. గతే డాది కేరళలో ఈ విపత్తును చూశాం. ఈ ఏడాది మన దేశంలోని ఒడిశాతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ వైపరీత్యాలు కనిపించాయి. వర్షాలు ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వెచ్చని భూమిని తాకడానికి 45 రోజులు ఆలస్యమయ్యాయి. దానికి కారణం మనం కాదా? మన పిల్లలు, వారు వారసత్వంగా పొందే ప్రపంచం గురించి ఏమిటి? 4 డిగ్రీల సెల్సియస్ మార్పులు కొన్ని లక్షణాలను సృష్టి స్తే అది మనం ఊహించనంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భవిష్యత్తు తరాలపై అది భరించలేనంత ప్రకృతి విళయాన్ని సృష్టిస్తే జీవజా తులన్నీ ఒక్కొక్కటిగా ఈ సమస్త భూ మండలాన్ని వీడిపోతాయి. ఇది మనం రోజూ వింటున్నాం, చూస్తున్నాం. 2020 లోపు కార్బన్ ఉద్గారాలను అరికట్టలేమని మనకు తెలుసు. మన మొత్తం నాగరికతను దెబ్బతీసే, చెదరగొట్టే శక్తి ఈ కార్బన్, మిథేన్ వినాశక వాయువులకు ఉన్నది. మనం యంత్రాల వలె యుద్ధానికి అలవాటు పడ్డాము.


మనం మన వాతావరణాన్ని తీవ్రంగా పరిగణించం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పర్యావరణ వినాశ చర్యలే దానికి సాక్ష్యం. గతేడాది కేరళలో ఈ విపత్తును చూశాం. ఈ ఏడాది మన దేశంలోని ఒడిశాతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ వైపరీత్యాలు కనిపించాయి. వర్షాలు ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ వెచ్చని భూమిని తాకడానికి 45 రోజులు ఆలస్యమయ్యాయి. దానికి కారణం మనం కాదా? మన పిల్లలు, వారు వారసత్వంగా పొందే ప్రపంచం గురించి ఏమిటి?


పేదరికంపై యుద్ధం, మాదక ద్రవ్యాలపై యుద్ధం, క్యాన్సర్‌పై యుద్ధం. కానీ కార్బన్, మిథేన్ అనే శత్రువులు మన భూ భాగంపై వినాశనాన్ని సృష్టించి ప్రాణ నష్టం చేస్తాయి. ఈ నష్టం కోలుకోలేనిది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మనం చేయవలసిన యుద్ధం ఏ విధంగా ఉండాలో తెలువాలె. ఈ యుద్ధంలో భాగంగా- మానవులందరూ భూమిని పచ్చదనం కాపాడుకోవాలె. చెట్ల పెంపకం, నాటిన చెట్లను పరిరక్షించడం, చెత్తను శుభ్రపరుచగడం, రిసైక్లింగ్ చేయడంతోపాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే పునరుత్పాదక వనరులను వాడాలి. ఇందుకోసం అన్నిదేశాలు మేల్కొవాలి. మన భూమి కోసం బాధ్యత తీసుకోవాలి. పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీయకుండా నీరు, జంతుజాలం, వృక్షజాలాలను కాపాడుకోవాలి. 40,000 ఉన్న పెద్ద పెంగ్విన్ కాలనీలో ఈ ఏడాదిలో రెండు పెంగ్విన్ పిల్లలు మాత్రమే బతికి బయటపడ్డాయి. అంటే మనం వినాశనానికి ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచించండి. పక్షుల సామూహిక మరణంతో సహా, గ్రహం అన్నిరకాల సంకేతాలను వినిపిస్తుందని మనం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేండ్లుగా చాలా పక్షులు ఆకలితో చనిపోతున్నాయి. ఈ మరణాలు పక్షుల పొరపాటు వల్ల కాదు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ ఉష్ణ ఉత్పాదక వ్యవస్థలను వాడుకలోకి తీసుకొని రావద్దు. సరళమైన ప్రజా రవాణా వ్యవస్థను వాడాలి. దీనివల్ల పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉంటుంది. భూతాపం పెరిగిపోయి అనేక విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి గొలుసుకట్టు పరిణామాలను ఆపడం ఇప్పటికే ఆలస్యమైంది. కాబట్టి కార్యక్రమం చేపట్టేముందు ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుం దా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి పర్యావరణ కోణంలో ఆలోచించినప్పుడే కొంతవరకు విధ్వంసం తగ్గిపోతుంది. భూమిపై మానవ జీవనాన్ని విస్తరించడానికి, నిలుపుకోవడానికి చాలా ప్రాధాన్యం ఇస్తూ చాలావరకు పర్యావరణ హితంగా ఉండాలి.

వాతావరణ మార్పు అనే ఒక బాంబు. ఒక బిలియన్ సిలిండర్ల లోపల ఒక బిలియన్ పిస్టన్ల బిలియన్ పేలుళ్ల వలె ప్రపంచ ముప్పునకు ఆజ్యం పోస్తుంది. మనం వాతావరణ మార్పు అనే దాడికి గురవుతున్నామనేది నిజం. ఇందుకు రెండో ప్రపంచయుద్ధంలో మాదిరగా అందరమూ ఒక తాటిపైకి వచ్చి అన్ని అస్ర్తాలను సమీకరించుకోవాలి. మనమంతా కలిసి పర్యావరణ మార్పు అనే శత్రువుపై ఏకకాలంలో దాడి చేయాలి. అదే మనకు మిగిలిన ఏకైక ఆశ.


కార్బన్ డయాక్సైడ్ మానవ చరిత్రలో అత్యధిక స్థాయిని తాకింది. 2019 జూన్‌లో చివరల్లో ఆర్కిటిక్ మహా సముద్రం దగ్గర ఉష్ణోగ్రత 84 ఎఫ్ డిగ్రీలు (29 సీ)గా నమోదైంది. మనందరం మన వినియోగ అలవాట్లను సర్దుబాటు చేసుకొని ఉంటే ఈ అస్తిత్వ సమస్య పరిష్కరించబడుతుందనే నమ్మకం కలిగేది. ఈ సంకేతాలు ప్రమాదకర వాతావర ణ పరిస్థితులను చెప్పకనే చెప్తున్నాయి. భూగోళం వేడెక్కడం ప్రపంచ యుద్ధం లాంటిది కాదు. ఇది నిజమైన ప్రపంచయుద్ధం. దాని మొదటి బాధితులు (అమాయక ప్రజలు) ఈ సంక్షోభానికి ఏ మాత్రం కారణం కారణం కాదు. కానీ ఇది మనందరినీ లక్ష్యంగా చేసుకున్నది. గ్లోబల్ గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు 2030లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. శిలాజ ఇంధన వాడకం తగ్గించడం వల్ల వాయు ఉద్గారాలు పడిపోవడం ప్రారంభమౌతాయి. అయితే ఇప్పటికే జరుగాల్సిన నష్టం జరిగింది. భూమి వేడెక్కడం ప్రారంభమైంది. ఇప్పటికే 1.25 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత పెరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చూడబోయేది వేరే ప్రపంచం. ఎందుకంటే మనం ఇప్పటికే అటవీ మంటల వంటి వైపరీత్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 55 శాతం మంది సంవత్సరానికి 20 రోజులకు పైగా ప్రాణాంతక వేడికి లోనవుతారు. కోట్లాదిమంది ప్రజలపై ఇది తీవ్ర ప్రభా వం చూపిస్తుంది. ఉత్తర అమెరికా అడవి మంటలు, వేడి తరంగాలు, కరువు, వరదలతో, వినాశకరమైన వాతావరణ తీవ్రతతో సతమతమవుతుంది. భవిష్యత్తులో ఇది మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు. కరువు, వేడి తరంగాలు, వరదలు, తుఫానులు పం టలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఆహార ఉత్పత్తి ఐదవ వంతు తగ్గుతుంది. సుమారు వంద కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇది చాలామంది ప్రజలను నాశనం చేస్తుంది. మూగజీవాలు నశిస్తాయి. సముద్రం స్వల్పంగా పెరుగడం వల్ల కొన్ని నగరాలు నివసించలేని విధం గా మారుతయి.

సమద్రమట్టాలు పెరుగడం వల్ల ముంబై, జకర్తా, హాంగ్‌కాంగ్, షాంఘై, లాగోస్, బ్యాంకాక్, మనీలాతో సహా ప్రపంచంలోని పలు నగరాలు నీటిలో మునిగే ప్రమాదం ఉన్నది. అందువల్ల కోట్లాదిమందికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. మనం తెలిసీతెలువక జీవన స్థితిగతులను, పర్యావరణ సమతుల్యా న్ని, అందులోని విలువైన సంపదను ఎంతో కోల్పోతున్నాం. కొన్నేం డ్లుగా పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను విస్మరిస్తున్నాం. వారు ఎం తోకాలంగా భూగోళం వేడెక్కడం వల్ల చెడు ప్రభావాలుంటాయని చెప్తున్నారు. వ్యర్థ పదార్థాలను వెదచల్లవద్దని చెప్పినా పట్టించుకోలేదు. ఈ తప్పిదాల వల్ల లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. మనం నిత్యం వాతావరణ మార్పులకు గురవుతున్నాం. రెండో ప్రపంచయు ద్ధంలో చేసినట్లుగా వనరులను సమీకరించడం, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా మానవులను రక్షించడంలో అవిశ్రాంతంగా పనిచేయాలి. వాతావరణ మార్పుపై యుద్ధాన్ని చేయడం ప్రతి దేశానికి తప్పనిసరి కావాలె. దీనిని రాజ్యాంగ నిబంధనలోకి తీసుకురావాలె. ఈ భూగోళం వేడెక్కడమనే పరిణామం ఇప్పుడు కచ్చితంగా మాన వ జాతికి జీవన్మరణ విషయం అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రకటించారు. భూగోళ వాతావరణం ఈ జూన్ నెలలో 1.24 డిగ్రీల సెల్సియస్, జూలైలో 1.25 డిగ్రీల సెల్సియస్ (లేటె స్ట్ నాసా) ఎక్కువగా ఉన్నట్టు నిరూపితమైంది. 2019 మొదటి ఆరు నెలల్లోనే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ సంవత్సరానికి 3 పీపీఎం కంటే అత్యధికంగా పెరుగుతున్నది. గత 40 మిలియన్ సంవత్సరాలలో వాతావరణ కార్బన్ ఆక్సైడ్ 2 పీపీఎం చొప్పున పెరుగలేదు. వాతావర ణ చరిత్రలోనే 3 పీపీఎం అనేదే అన్నిటికంటే ఎక్కువ అని వాతావరణ వేత్త ఆంగ్రూ గ్లిక్సన్ 2016లో ప్రచురించారు. శిలాజ ఇంధనం ఉపయోగించడం వల్ల వెలువడిన వాయువులే ఈ పెరుగుదలకు కారణం.
raj-reddy-mahakala
వాతావరణ మార్పు అనే ఒక బాంబు. ఒక బిలియన్ సిలిండర్ల లోప ల ఒక బిలియన్ పిస్టన్ల బిలియన్ పేలుళ్ల వలె ప్రపంచ ముప్పునకు ఆజ్యం పోస్తుంది. మనం వాతావరణ మార్పు అనే దాడికి గురవుతు న్నామనేది నిజం. ఇందుకు రెండో ప్రపంచయుద్ధంలో మాదిరగా అందరమూ ఒక తాటిపైకి వచ్చి అన్ని అస్ర్తాలను సమీకరించుకోవాలి. మన మంతా కలిసి పర్యావరణ మార్పు అనే శత్రువుపై ఏకకాలంలో దాడి చేయాలి. అదే మనకు మిగిలిన ఏకైక ఆశ.
(వ్యాసకర్త: వాతావరణ మార్పు, సుస్థిర నగరాల నిపుణులు)

328
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles