బిట్వీన్ ద లైన్స్

Tue,August 13, 2019 01:08 AM

సామాజిక పరిణామక్రమంలో, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరించి రాజకీయ అవగాహనల్లో మార్పు అనివార్యమైతది. కానీ కొన్ని సంప్రదాయ, కం ఫర్ట్ జోన్లను దోలాడుకునే స్టేటస్ కో మనస్తత్వాలు ఈ సంధికాలంలో అనుసరించాల్సిన గతితర్కాన్ని పట్టలేకపోతయి. వారి బుద్ధి జర అటకాయిస్తది. అంత తొందరగా మారదు. నిన్నటిదాకా పేరుకున్న భావజాలాన్ని కడుక్కోమంటే కడుక్కోలేవు. నేనెప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకమేనని అవగాహనారాహిత్యపు స్టేట్‌మెంట్లు ఇస్తయి. రాజులున్మత్తులు వారి సేవ నరకప్రాయంబు.. అంటూ పాసుపండ్ల పాటలు పాడుకుంటూ రాజరికానికి ప్రజాస్వామ్యానికి లెంకపెట్టే పిచ్చిశేతలకు దిగుతయి. లోపల ప్రగతిభవన్‌లకు పోవాలని బలంగా ఉన్నా బయటికి మాత్రం.. ప్రజాపక్షం అనుకుంటూ దబాయిస్తయి. బైటి కోటి లోపలోటి మాట్లాడుకుంట నలుగురి ముందు సిగ్గుపడుతయి. సరిగ్గ ఇసొంటప్పుడే మేధావితనం సామాజిక, రాజకీయ, తాత్త్వికత మీద లంగరేసుకోని నిలబడాల్సి వుంటది. మార్పు అనివార్యమనే సోయి తో మార్పు నుంచి మార్పు దిశకు ప్రయాణం సాగించే సామర్థ్యాన్ని పెం చుకోవాల్సి వుంటది. నిలదొక్కుకోవాల్సి వుంటది. ఈ గుణాత్మక మార్పు కుదింపులకు గురయ్యే ప్రతిసందర్భంలో మార్పు క్రమంలో అనివార్యమయ్యే సంధికాలం, వొక మార్పు నుంచి మరో మార్పునకు నడుమ షాక్ అబ్సర్బర్‌లాగా ఉంటదనే విషయాన్ని గుర్తించాలె. ఈ కోణంలో.. తెలంగాణ రాజకీయ తాత్త్విక ఆలోచనా విధాన పరిణా మ క్రమాన్ని మనం రెండుగా విభజించవలసి ఉంటది. అది తెలంగాణ రావడానికి ముందుకాలం, తెలంగాణ వచ్చిన తర్వాత కాలం. ఈ రెండు కాలాల నడిమి సంధికాలం. అంటే.. నాటి ఉద్యమసారథి నేటి సీఎం కేసీఆర్ దార్శనికతతో ఇప్పుడు నడుస్తున్న స్వయం పాలనా కాలం.

దేశాన్ని సామ్యవాద దేశంగా ప్రగతి పథంలో నడిపించిన నెహ్రూ, కశ్మీర్ విషయంలో వాస్తవ విరుద్ధంగా వ్యవహరించి, ఆర్టికల్ 370ని బలవంతంగా ఈ దేశం మీదనే రుద్దిండనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. నాడు నెహ్రూ విస్మరించిన వాస్తవమే ఇవాళ బీజేపీ చేతికి చిక్కింది. అదే సందర్భంలో డ్బ్భై ఏండ్లుగా మెజారిటీ మతస్తుల భావాలను విస్మరించి మైనారిటీ మత రాజకీయాలు చేసిన బీజేపీయేతర పార్టీలు మోదీ దూకుడుకు పరేషాన్ అయితున్నయి. ఎక్కడయితే సమాధానాలు విస్మరించబడుతయో అక్కడనే వొదిలేసిన ప్రశ్నలు విత్తనాలై మొలకెత్తుతయి.


తెలంగాణ కోసం జరిగిన రాజకీయ ఉద్యమ పోరాటాల్లో నాటి (వల స) ప్రభుత్వాన్ని నిత్యం నిరసిస్తూ ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ సాగింది. ఆ క్రమంలో ఉత్పత్తి అయిన భావజాలం అంతా కూడా, నిర్ది ష్టంగా ఆంధ్రా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, జనరల్‌గా ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ సాగింది. ఆ మాటకొస్తే ఈ విధానం నిజాం నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన తెల్లారి నుంచి సాగింది. అందుకు కార ణం అంతకుముందు రాచరిక నిజాం పాలన, ఆ తర్వాత మనదికాని వల స పాలన కావడమే. మొత్తంగా.. సాయుధ పోరాట కాలం నుంచి స్వయం పాలన వచ్చేవరకు తెలంగాణ బిడ్డల 70 ఏండ్ల జీవితం పరాయి పాలకుల మీద తద్వారా ప్రభుత్వాల మీద పోరాడటమే సరిపోయింది. దీంతోపాటు నడుమ తగులుకున్న సాయుధ పోరాట పంథా. ప్రభుత్వ వ్యతిరేక తెలంగాణ మనస్తత్వానికి అగ్నికి ఆజ్యం పోసినట్టయి, అసలు ఎన్నికలే బూటకం పార్లమెంటరీ పంథానే దోపిడీ అంటూ ఆయుధం ద్వారానే విముక్తి అనే సాయుధ పోరాట పంథా జమయ్యింది. దాంతో ప్రభుత్వాల వ్యతిరేకత మరింత మన బుద్ధిజీవుల్లో జీర్ణించుకున్నది. అట్లా తెలంగాణ తాత్త్విక మేధావి సిద్ధాంతకర్తల బుద్ధిజీవుల డీఎన్‌ఏల్లో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యతిరేకత పాతకాలపు ప్రవాహం కొత్త కాలపు స్వయం పాలనలోనూ ప్రవహిస్తున్నది. అదేవారి తాత్త్విక సమస్యగా మారింది. పాతకాలం నుంచి బయటపడి ఇప్పుడు స్వయం పాలనను సొంతం చేసుకోవాలంటే కుదరనిస్తలేదు. మనసు వొప్పుకుంట లేదు. ఎట్లయితే ఎండాకాలం పోయి వానకాలం వస్తున్నప్పుడు సర్ది జరం పట్టుద్దో అట్లనే మేధావి వర్గపు ఆలోచనలకు సర్దిజరం పట్టుకున్నది. అవగాహన చేసుకోగలిగే సామర్థ్యం ఉన్న మేధావితనం కొంతమేరకు ఇప్పటి కే ఈ కొత్త పాత సందు సర్దిజరం సదురుకున్నది. ఇంక కూడా ఈ తెలంగా ణ రాజకీయ సంధికాలాన్ని అర్థం చేసుకోలేక సతమతమైతున్న కొంతమంది, ఊకె కూసోక, సందులో ఏమన్నా దొరుకుద్దా అని అడ్డగోలు విమర్శలు చేస్తున్నరు.

ఇన్నాళ్ల కాంగ్రెస్ మార్క్ సామ్యవాద పాలనా క్రమాని కి అలువాటుపడిన మేధావివర్గం బీజేపీ మార్క్ హిందూ మతవాద జాతీ యవాద పాలన మార్క్‌ను అర్థం చేసుకుందానికి సతమతమైతున్నది. సం ధికాలాల్లో ఏర్పర్చుకోవాల్సిన రాజకీయ తాత్త్విక అవగాహనకు తేడా తెల్సుకోక శూన్యతను ఆవహించి కొట్టుమిట్టాడుతున్నది. తెలంగాణ ఉద్య మ నేపథ్యంలో తెలంగాణ మేధావివర్గం ఎట్లయితే ఉద్యమ ఆకాంక్షలకు నిర్దిష్ట కార్యాచరణ ఎంచుకోలేక విఫలమైంది. కేసీఆర్ అనుసరించిన పార్లమెంటరీ విధానాన్ని తిరస్కరించి ఎన్నికలను బూటకమని తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నది. భారత ప్రత్యామ్నాయ మేధావి తనం ఇవాళ మోదీ అనుసరిస్తున్న మెజారిటీ మత విధానాలను అట్లనే గుడ్డిగా తిరస్కరిస్తున్నది. కారల్ మార్క్స్ మతం గురించి చెప్పిన పూర్తి సారాన్ని పట్టకుండా, మార్క్స్‌ను బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోకుండా, మతం మత్తు మందు అనుకుంటూ ఆఖరి లైన్ను పట్టుకొని వేలాడుతున్నది. అట్లా డ్బ్బై ఏండ్లుగా తప్పుల మీద తప్పు లు చేస్తూ భారత సమాజాన్ని ప్రజాస్వామికరించేందుకు తమవంతు పాత్రను పోషించడంలో సర్వదా తప్పుటడుగులు వేస్తున్నది. సోయిల వుండో లేకో వీరు ఆచరించాల్సిన వాస్తవాలను విస్మరించడం వల్ల అవి మోదీ వంటి పోటీదారుడు అందిపుచ్చుకొని వాటినే ఆయుధంగా మారుస్తడు. దేశంలో విస్మరించబడిన మెజారిటీ భావోద్వేగాలు నాస్తికత్వం పేర, విప్లవాల పేర కాంగ్రెస్ సెక్యులరిజం పేర విస్మరించినవి. వాటినే మోదీ ఆయుధంగా మార్చుకుంటున్నడు. ఇటువంటి విస్మరించబడిన చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వాస్తవాలను రాజకీయ ప్రత్యర్థులు వాటిని ఎత్తుగడలో భాగంగా కావాలనే బహిరంగం చేస్తుంటరు. పరీక్ష పెడుతరు. ఇక్కడే మనం వారిసిరేసిన గాలానికి చిక్కకుండా వుండగలుగాలె.
ramesh-hazari
దేశాన్ని సామ్యవాద దేశంగా ప్రగతి పథంలో నడిపించిన నెహ్రూ, కశ్మీ ర్ విషయంలో వాస్తవ విరుద్ధంగా వ్యవహరించి, ఆర్టికల్ 370ని బలవంతంగా ఈ దేశం మీదనే రుద్దిండనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. నాడు నెహ్రూ విస్మరించిన వాస్తవమే ఇవాళ బీజేపీ చేతికి చిక్కింది. అదే సందర్భంలో డ్బ్భై ఏండ్లుగా మెజారిటీ మతస్తుల భావాలను విస్మరించి మైనారిటీ మత రాజకీయాలు చేసిన బీజేపీయేతర పార్టీలు మోదీ దూకుడుకు పరేషాన్ అయితున్నయి. ఎక్కడయితే సమాధానాలు విస్మరించబడుత యో అక్కడనే వొదిలేసిన ప్రశ్నలు విత్తనాలై మొలకెత్తుతయి. అయితే ఏ ప్రశ్ననైతే సమాధానంగా మోదీ దొరికించుకొని మొదలైండో, అదే మోదీ బీజేపీ మళ్లీ కొన్ని ప్రశ్నలను వదిలేసిపోతున్నది. అట్లా మోదీ వొదిలిన ప్రశ్నలే రేపు తిరుగబడి సమాధానాల కోసం పోరాడక తప్పదు. ఇది చరిత్ర చెప్పిన గతితర్కం.

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles