రైతుకు ఎన్నడూలేని ధీమా

Sun,August 11, 2019 05:11 AM

రైతుబీమాతో పాటు కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనుగుణంగా విధా నాల రూపకల్పనతో తెలంగాణలో మరొక వ్యవసాయ విప్లవానికి అంకు రార్పణ చేసింది. దశాబ్దాల పోరాటం, ఎన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం వేస్తున్న అడుగు అన్ని రంగాల్లో ప్రగతి దిశగా సాగుతున్నది. ముఖ్యంగా దేశానికే వెన్నెముక లాంటి వ్వవసాయరంగంలో ప్రజలందరికీ ఆహారం సమకూరుస్తున్న అన్నదాత లు ఆత్మాభిమానంతో జీవించేమార్గాన్ని తెలంగా ప్రభుత్వం ఏర్పరుస్తున్నది. వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకనాటి కటిక పేదరికం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహ త్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దీనత్వం తాండవించే తెలంగాణలో ఇప్పుడు ప్రజానీకం జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. తమది నిజ మైన రైతురాజ్యం అని చాటుతూ కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగా నికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్రంలో వ్యవ్యసాయ రంగం లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు సజీవ సాక్ష్యంగా వారి ముఖా ల్లో ఆనందం కనిపిస్తున్నది. తెలంగాణలో వరి వంటి ఆహార పంటతో పాటు వాణిజ్యపంటలు కూడా అధికంగా పండించే వ్యవసాయం ఎక్కు వగా బోరుబావులపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి భారం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఐదేండ్ల పాలనలో విద్యుత్‌పై ఇతర రాష్ర్టాల మీద ఆధారపడే పరిస్థితిని మార్చివేసింది. ప్రస్తుతం నిరాఘాటంగా 24 గంటలు రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే స్థితికి చేరుకొని రికార్డు సృష్టించింది. రైతుల పంటలకు రక్షణ కల్పి స్తూ వారు నష్టాలబారిన పడకుండా నివారించడానికి కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన రైతుబంధు పథకం ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యయవసాయ సంస్థ రోమ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఎంపికైన రైతు సంక్షేమ పథకాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ పేరు మరోసారి ప్రపపంచస్థాయిలో వినిపించింది. గతంలో చేసిన రుణాలు భయంకరంగా రైతులను వెంటాడుతున్న నేప థ్యంలో రుణమాఫీ పథకాన్ని కూడా చిత్తశుద్ధితో అమలుచేసి రైతు రాజ్యం అనే పేరును సీఎం కేసీఆర్ సార్థకం చేశారు. నాలుగు విడుతల్లో లక్షలాది మంది రైతులకు రుణ విముక్తి లభించింది. రుణమాఫీ చేసి తాము నిజమైన రైతు బంధువులమని ప్రభుత్వం రుజువుచేసుకున్నది. ఆర్థిక సహాయంతో పాటు రైతులకు సాంకేతిక సహాయం కూడా అందించాలనే వినూత్నమైన ఆలోచన కూడా రైతాంగానికి తెలంగాణలో ఎంతగానో ఉపయోగపడింది.


ఈ పథకానికి మరింత ఊతం అం దించేదిశగా 2019-20 సంవత్సరానికి గాను రూ.908.30 కోట్లు జీవి తబీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం రైతుకు రక్షణగా, ఆసరాగా నిలువాలనే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గతేడాది కంటే 1,284 అధికంగా చెల్లిస్తున్న ఈ ప్రీమియం వల్ల 31 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 2018 ఆగస్టు 14నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం కింద 18 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న 29.58 లక్షల మంది పట్టాదారులకు ఒక్కొక్కరికి రూ 2,171.50 వంతున ప్రీమియం చెల్లించారు. దీనికింద 2018-19 సంవత్సరానికి గాను రూ 672 కోట్లు చెల్లించారు. ఇప్పటి వరకు బీమా పరిధిలో ఉన్న 30.92 మంది రైతులకు ప్రభుత్వం 704 కోట్లు ప్రీమియం చెల్లించింది. అయితే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైతులకు చెల్లించే ప్రీమియం 1284.44లకు పెంచటం జరిగింది. ఇది రైతుల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బీమా పథకం వర్తించే కుటుంబాలలో 15,027 మంది రైతు కుటుంబాలకు ఈ పరిహారం కింద 751.35 కోట్లు చెల్లించటం జరిగింది. 0.1 ఎకరం నుంచి అయిదు ఎకరాలలోపు ఉన్న రైతులలో 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీలకు చెందినవారే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి అందించాలనే ధ్యేయంతో ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లను కేటాయిస్తున్నది. వివిధ సాగునీటి ప్రాజె క్టులను శరవేగంతో పూర్తిచేస్తున్నది. దీంతో కొత్తగా ఆయకట్టు సాగులోకి తీసుకువస్తున్నది. అంతేకాకుండా కాకతీయ రాజులకాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులకు మిషన్‌కాకతీయ ద్వారా జీవం పోస్తున్నది. వానకాలం పంట సాగుకు సంబంధించి వ్యవ్యసాయశాఖ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం 80.24 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చిం ది. మిషన్ కాకతీయ కింద 46,531 చెరువుల్లో ఇప్పటికే 28,290 చెరువుల్లో పూడికతీసివేసి మరమ్మతులు పూర్తిచేసింది. దీనివల్ల భూగర్భ జలాల మట్టం కూడా పెరుగడానికి ఎంతగానో దోహదపడుతున్నది.

ఇదే సమయంలో భవిష్యత్తు నీటి అవసరాలను లభ్యత అవకాశాల ను దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యయంతో ఎక్కువ భూమిని సాగుచేసు కోవడానికి తోడ్పడే సూక్ష్మ సేద్య విధానాన్ని కూడా ప్రోత్సహించడం ప్రభుత్వ దూరదృష్టికి మరొక నిదర్శనం. అంతేకాదు సూక్ష్మ సేద్యం విధానం అమలుకు అవసరమైన పరి కరాల కొనుగోలుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం. మిగ తా రైతులకు 80 శాతం సబ్సిడీ కల్పిస్తున్నది. దీంతో 2.09 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. నీటి సరఫరాతో పాటు మరొక ముఖ్యమైన అవస రం సకాలంలో రైతులకు నాణ్యమైన విత్త నాల సరఫ రా. ఇందుకుగాను విత్తనాభివృద్ధి, సేంద్రియ ధృవీక రణ సంస్థ (తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ) ఆవిర్భవించిం ది. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులకే కాకుండా ప్రపం చ దేశాలకు కూడా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే స్థాయికి మనం ఎదిగాం. ఇది తెలంగాణను విత్తన భాండాగారం అనే పేరును తెచ్చిపెట్టిం ది. దేశంలోని విత్తనాల అవసరాల్లో 60 శాతం తెలంగాణ ద్వారా తీర్చగ లుగుతున్నామంటే మనం సాధిస్తున్న పురోగతిని చాటిచెబుతున్నది. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం ఇష్టాలో సభ్య త్వం సంపాదించడ మే కాకుండా ఇష్టా 32వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించుకోవటం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకున్నాం. ఒకప్పుడు పంటలకు తగిన పెట్టుబడి లేక అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు చేతికి అందక రైతులు అత్మహత్యలు చేసుకోవడమో, స్వస్థ లాలను వదలి పట్టణాలకు, పొరుగు రాష్ర్టాలకు కూలీ పనిచేసుకోవ డాని కి వలసపోవడం జరిగేది. కొన్ని దశాబ్దాలుగా రైతు భారతంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. కానీ కేసీఆర్ పాలన తెలంగాణలో రైతులకు ఆ చీకటిరోజులను దూరం చేసి, రైతు బతుకుకు భరోసా కల్పించే రైతు బం ధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వానకాలం, యాసంగి కాలాల్లో పంటలు వేసుకునే రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వడంతో రైతులకు ఎంతో ఊరట కలిగింది. 2
c-parthasarathi-ias
018-19 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల పేరుతో పాస్‌బుక్‌లను ఇచ్చి సకాలంలో వారికి ఈ సహాయం అందజేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన రైతుబంధు పథకం ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యయవసాయ సంస్థ రోమ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఎంపికైన రైతు సంక్షేమ పథకాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ పేరు మరోసారి ప్రపపంచస్థాయిలో వినిపించింది. గతంలో చేసిన రుణాలు భయంకరంగా రైతులను వెంటాడుతున్న నేప థ్యంలో రుణమాఫీ పథకాన్ని కూడా చిత్తశుద్ధితో అమలుచేసి రైతు రాజ్యం అనే పేరును సీఎం కేసీఆర్ సార్థకం చేశారు. నాలుగు విడుత ల్లో లక్షలాది మంది రైతులకు రుణ విముక్తి లభించింది. రుణమాఫీ చేసి తాము నిజమైన రైతు బంధువులమని ప్రభుత్వం రుజువుచేసుకున్నది. ఆర్థికసహాయంతో పాటు రైతులకు సాంకేతిక సహాయం కూడా అందిం చాలనే వినూత్నమైన ఆలోచన కూడా రైతాంగానికి తెలంగాణలో ఎం తగానో ఉపయోగపడింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారి వంతున 2,638 మంది విస్తరణాధికారుల నియామకం జరిగింది. ఉద్యానపంటలకు గాను సబ్సిడీని 75 శాతం పెంచారు. రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటుచేసి పంటలు, వాటి రక్షణ, సరైన గిట్టుబాటు ధర వచ్చే మార్కెట్ సదుపాయాల కల్పన తదితర అంశాలపై సలహాలిచ్చే విధానం కూడా రైతుల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నది. బీమా సౌకర్యంతో పాటు రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వ విధానాల అమలుతో రైతులకు జీవితం పట్ల ధీమాను కల్పిస్తున్నది. ఒకరకంగా రైతులకు కేసీఆ ర్ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటూ సంరక్షిస్తున్నది. రైతు కుటుంబాల్లో సంతోషాలతోనే బంగారు తెలంగాణ ఆవిష్కరణకు అర్థం, పరమార్థమని ప్రభుత్వం త్రికరణశుద్ధిగా నమ్ముతున్నది. అందుకే ఎంత క్లిష్టమైనా, ఎంత భారమైనా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యయసాయశాఖ ముఖ్య కార్యదర్శి)

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles