చరిత్రను నిక్షిప్తం చేయాలె

Sun,August 11, 2019 03:14 AM

సినిమా పుట్టి వందేండ్ల పైచిలుకు కాలమే గడిచింది. కానీ వందేండ్ల కిందటే పుట్టిన సినిమాకు సంబంధించిన చారిత్రక పరిశీలన గానీ, సినిమాల పరిరక్షణ గానీ జరుగలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆధునిక సాంకేతిక వసతులు అందుబాటులోకి వచ్చినా కూడా భారతీ య సినిమారంగం తొలినాళ్లల్లో అంటే 1900 సంవత్సరానికి కొంచెం అటూఇ టూ రూపొందించబడిన 1300 పైచిలుకు మూకీ సినిమాల్లో 29 సినిమాలు మాత్రమే ఇప్పుడు లభిస్తునాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న ప్రింట్లల్లో కూడా తేడాలున్నట్టు ఇటీవలి పరిశీలనల్లో తెలుస్తున్నది. ఇప్పుడు లభిస్తున్న దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించిన రాజా హరిశ్చంద్ర ప్రింట్ 1913లోనిది కాదని అది 191 7లో తీసిన రీమేక్ ఫిల్మ్‌కు సంబంధించిందని చరిత్రకారులు అంటున్నారు. 1925లో బాబూరావు పాయింటర్ తీసినట్టు గా చెబుతున్న మాయాబజార్ నిజానికి ఆయనే 1921లో తీసిన సురేఖాహరణ్ పేరుమార్చిన సినిమా అని తేలింది. నిజానికి భారతీయ తొలి సినిమా 1901లో హరిశ్చంద్ర భట్వాడేకర్ ఒక రెజ్లింగ్ పోటీని షూట్ చేయడం ద్వారా రూపొందింది. తర్వాత 1912లో ఎన్.జీ.చిత్రే, ఆర్.జీ టోర్నీలు తీసిన పుండలీక్ మొట్టమొదటి భారతీయ నరేటివ్ ఫిల్మ్‌గా చరిత్ర చెబుతున్నది, అయితే భారతీయ సినిమా చరిత్రను లిఖించడంలో వ్యవస్థల కంటే వ్యక్తులే అధికంగా కృషిచేశార ని చెప్పుకోవచ్చు. డి.వి.ధరప్, ఫెరోజ్ రంగూన్ వాలా, ఎరిక్ భౌమిక్, కృష్ణస్వామి, భాగీశ్వర్ ఝాలు కూడా కృషిచేశారు. అదేక్రమంలో 1980 దశకం నుంచి వీర్‌చంద్ దారంశే అవిరాళంగా కృషిచేస్తున్నారు. ఆయన పరిశోధన ప్రకారం దక్షిణ భారతీయ సినిమా రంగంలో 1915లో నటరాజ మొదలియార్ నిర్మించిన గోపాలకృష్ణ మొదటి సినిమా అని తర్వాతే 1916లో కీచకవధం విడుదలైనదని తేలుతున్నది. అట్లా ఆయన పరిశోధనల్లో అనేక అంశాలు తేలనున్నాయి.

దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉంటూ తరతరాలుగా ఆ రంగంపైనే ఆధారపడి ఎదిగిన వ్యక్తులూ, సంస్థలూ ముందుకొచ్చి తెలుగు సినిమాల పరిరక్షణ పట్ల నడుం బిగించాలి. వ్యాపారాత్మకంగా ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లు ఏర్పాటుచేసినట్టే ఆర్కైవ్స్‌ను ఏర్పాటుచేయగలిగితే తమ వృత్తి కి ఎంతో దోహదం చేసినట్టవుతారు. కనీసం నటులు దర్శకులు, నిర్మాతల వారసులైనా వారి తల్లిదండ్రుల సినిమాలు, సినిమాల పోస్టర్లు, పాటల పుస్తకాలు, తదితరాలు సేకరించి వాటిని ఉత్తమ క్వాలిటీలో పునరుద్ధరించి భద్రపరుచాలి.


భారతీయ సినిమాల లిస్టుల విషయానికి వస్తే మొట్టమొదట సురేశ్ చాబ్రియా సంపాదకత్వంలో 1994లో వెలువడి న లైట్ ఆఫ్ ఆసియా ఇండియన్ సైలెంట్ సినిమా 1912-1934 అన్న పుస్తకం ముఖ్యమైంది. తర్వాత ఆశిష్‌రాజాధ్యక్ష వెలువరించిన ఎన్‌సైక్లోపెడియా ఆఫ్ ఇండియన్ సినిమా మరొక ముఖ్యమైన పుస్తకం. వివరాల సేకరణ లిస్టుల తయా రీ విషయం ఇట్లా ఉంటే ఆ ప్రింట్లను సేకరించి భద్రపరుచ డం మరెంతో ముఖ్యమైనది. కానీ ఆ క్రమంలో జరుగుతున్న కృషి అంతంత మాత్రమే. వ్యక్తుల కృషి కొనసాగుతున్నప్పటి కీ వ్యవస్థాగతంగా ప్రభుత్వాలు ముందుకురావాలి. సినిమా ప్రభావంతమైన దృశ్యమాధ్యమం. దేశంలో సిని మా, క్రికెట్‌లు రెండూ ప్రజలకు తమ జీవితాల్లో అంతర్భాగమైపోయిన అంశాలు. దశాబ్దాలుగా ఆ రెండూ భారతీయుల ను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక అంశాలు వచ్చిన తర్వాత ఆ రెండూ మన నట్టింట్లోకి వచ్చేశాయి. ముఖ్యంగా సినిమా అన్ని వయసుల, అన్నివర్గాల ప్రజలకూ చేరింది. వారి జీవితాల్లో అంతర్భాగమైపోయింది. సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలోని అన్నిదేశాల్లోకంటే అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా మన దేశం నిలుస్తున్నది. అధిక సినిమాలను అధిక సంఖ్యలో చూస్తున్నవారిగా భారతీయులకు పేరున్నది. సినిమాల చరిత్రను వాటి ప్రభావాన్ని చూసినప్పుడు చారిత్రక దర్పణాలుగా ప్రజల జీవనసరళికి, సంస్కృతికి సినిమాలు అద్దంపడుతాయి. ఆయా కాలాల జీవనపరిస్థితిని అవి ఎంతోకొంత రికార్డు చేస్తాయి. భావి యువతకు దేశ చరిత్రను చూపించాల్సి వచ్చినప్పుడు సినిమాలూ, డాక్యుమెంట రీ చిత్రాలు గొప్ప ఆధారాలవుతాయి. ఫిల్మ్ రీళ్లల్లో ఉపయోగించే సెల్యులాయిడ్ వందేండ్లే అయినప్పటికీ పెరిగిన సాంకేతికత పరిస్థితుల్లో వాల్టుల్లో ఉంచగలిగి తే సెల్యులాయిడ్ జీవితకాలాన్ని పెంచవచ్చు. వర్తమానకాలంలో మొత్తం డిజిటల్‌లోనే సినిమాల నిర్మాణం కొనసాగుతున్న స్థితిలో పాత సినిమాలను రిస్టోర్ చేసి భద్రపరిస్తే అపురూపమైన కళాసంపదను భావితరాలకు అందించినట్టవుతుంది.

కేంద్రం 1984లో పునాలో ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను స్థాపించింది. సినిమా ప్రింట్లను సేకరించడం, భద్రపరుచడం, అవసరమైన అధ్యయనం కోసం పంపిణీ చేయడం ముఖ్య లక్ష్యాలుగా ఏర్పాటుచేసిం ది. కేంద్ర సమాచార ప్రసారశాఖ అధీనంలో ఏర్పాటైన ఆర్కై వ్స్ సినిమా ప్రింట్లతో పాటు పోస్టర్లు, స్టిల్స్, ైస్లెడ్స్, స్క్క్రిప్టులు, లాబ్బి కార్డులు, సినిమా పాటల పుస్తకాల సేకరణ మొదలుపెట్టింది. ఆర్కైవ్స్ డైరెక్టర్‌గా పి.కె.నాయర్ అద్భుతమైన సేవ లందించారు. ప్రపంచస్థాయిలో సెల్యులాయిడ్ మాన్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆర్కైవ్స్‌లో లక్షా ముప్ఫై వేలకు పైగా ఫొటోలు, 17 వేలకు పైగా పోస్టర్లు, దాదాపు 12 వేల పాటల బుక్లెట్స్, 25 వేల సినిమా గ్రంథాలను సేకరించింది. 19 ఫిల్మ్ పరిరక్షక వాల్టుల్లో 2 లక్షల ఫిల్మ్ రీళ్లు భద్రపరిచే వసతులను కలిగి ఉన్నది. ఎన్నో అపురూపమైన పాత సినిమా వివరాలు ఈ ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి. నాయర్ పదవీ విరమణతో పాటు ప్రభుత్వ ఉదాసీన పోకడలతో అక్కడ కూడా నిధుల కొరత పట్టిపీడిస్తున్నది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిష న్ కార్యక్రమంలో భాగంగా ప్రాచీన అపురూప సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్ధరణ చర్యలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పునా,ముంబై, హైదరాబాద్, గౌహతీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురంల లో ఆర్కైవ్స్ సమావేశాలు ఏర్పాటుచేసి సినిమా ప్రతినిధుల తో చర్చించారు. ఇలా పలు చర్యలు జాతీయస్థాయిలో కొంత మేర కొనసాగుతున్నయి. అయితే ప్రాంతీయ స్థాయిలోనూ ప్రతి భాషలో ప్రత్యేక ఫిల్మ్ ఆర్కైవ్స్ ఏర్పాటుచేసి సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్ధరణ చర్యలకు పూనుకోవాలె. ఇది ప్రభుత్వం తరఫున, సినీరంగం తరఫున జరుగాలె.
varala-anand
దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉంటూ తరతరాలుగా ఆ రంగంపైనే ఆధారపడి ఎదిగిన వ్యక్తులూ, సంస్థలూ ముందుకొచ్చి తెలుగు సినిమాల పరిరక్షణ పట్ల నడుం బిగించాలి. వ్యాపారాత్మకంగా ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లు ఏర్పాటుచేసినట్టే ఆర్కైవ్స్‌ను ఏర్పాటుచేయగలిగితే తమ వృత్తి కి ఎంతో దోహదం చేసినట్టవుతారు. కనీసం నటులు దర్శకు లు, నిర్మాతల వారసులైనా వారి తల్లిదండ్రుల సినిమాలు, సినిమాల పోస్టర్లు, పాటల పుస్తకాలు, తదితరాలు సేకరించి వాటిని ఉత్తమ క్వాలిటీలో పునరుద్ధరించి భద్రపరుచాలి. ఫలితంగా సినిమా పరిశోధకులకు, నవతరం యువతకు చరిత్ర అందుతుంది. ఇక ప్రింట్లను డిజిటలైజ్ చేసి అధ్యయనానికి అందుబాటులో ఉంచితే సమాచార కొరత తీరుతుంది. ఏడాదికోసారి ఇటలీ వలె పునరుద్ధరించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటుచేయవచ్చు. తెలుగు సినిమా రంగంలోని పెద్దలు తెలుగు ఫిల్మ్ ఆర్కై వ్స్ ఏర్పాటుచేయాలె. తమ వారసత్వాన్ని, చరిత్రను, గత సంస్కృతిని ప్రతిబింబించే ఈ సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్ధరణ చర్యలకు పూనుకోవాలి. తమ చరిత్రను, వారసత్వాన్ని భావితరాల కోసం నిక్షిప్తం చేయాల ని ఆశిద్దాం.

218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles