జాతి విద్వేషాలు

Fri,August 9, 2019 01:27 AM

అందరి నాయకుడిగా వ్యవహరించవలసిన దేశాధినేత ఒక వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొం దడం అతిపెద్ద విషాదం. అమెరికాలో మళ్ళా కాల్పులు జరిగి 31 మంది అమాయకులు బలయ్యా రు. అనేకమంది గాయపడ్డారు. ఈ కాల్పులకు జాతి విద్వేషమే కారణమని తెలుస్తున్నది. ఈ విద్వే ష దాడి బాధితులను పరామర్శించడానికి గురువారం అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళినప్పుడు నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. దేశాధ్యక్షుడిని జాత్యహంకారి, ఇంటికి పో, నిన్ను ఆహ్వానించడం లేదు, ట్రంప్ విద్వేషం జాతి వివక్ష మాకొద్దు అంటూ ప్రదర్శనలు జరిపారు. స్థానిక రాజకీ య నాయకులతో కూడా విభేదాలు పొడసూపాయి. కొందరు ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కూడా కలువకుండా మొహం చాటేశారు. విద్వేష దాడులకు ప్రత్యక్షంగా కారకులు కానప్పటికీ, ఆ భావజాలాన్ని నాయకులు ప్రచారం చేసినప్పుడు ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. ఇటీవల ఎల్ పాసోలో జరిగిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది గాయపడ్డారు. కొన్ని గంటలలోనే డేటన్‌లో జరిగిన కాల్పులకు మరో తొమ్మిది మంది బలయ్యారు. శ్వేత జాత్యహంకా ర భావజాలంతో, కాందీశీకుల పట్ల ఆగ్రహంతో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. మెక్సికో సరిహద్దుకు సమీపంలో ఉండే ఎల్‌పాసోలో లాటిన్ అమెరికా నుంచి వచ్చే వలస ప్రజలు ఎక్కువగా ఉంటారు. మెక్సికో సరిహద్దు మీదుగా వలసరావడాన్ని ట్రంప్ దాడిగా పేర్కొంటూ ఉం టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఇదేపదాన్ని వాడటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వలస వెళ్ళడం ఎక్కువైంది. పారిశ్రామికరంగం కూడా నిపుణులే కాకుండా సాధారణ శ్రామికులు కావాలని కోరుకుంటున్నది. వలస ప్రజలు సమాజాన్ని సంపద్వంతం చేస్తారనేది అనేక సందర్భాలలో వెల్లడైంది. అయినా వివిధ దేశాలలోని మెజారిటీ మతస్తుల్లో ఆందోళన పెరిగిపోయి దాడులు సాగుతున్నాయి. అమెరికాలోనే కాదు, యూరప్ దేశాలలో కూడా ఈ పోకడ కనిపిస్తున్నది. ప్రజల సమస్యలను పరిష్కరింపలేని పాలకులు అల్ప సంఖ్యావర్గాలు, కాందీశీకుల వల్లనే తమ అవకాశాలు దెబ్బతింటున్నాయనే భావనను ప్రచారంలో పెడుతారు.


మెక్సికో సరిహద్దులో గోడ కడుతామని ట్రంప్ పట్టుదలగా ఉండటం కూడా పరోక్షంగా వలస వచ్చిన ప్రజలు ప్రమాదకరమనే సందేశాన్ని ఇస్తున్నది. ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత విద్వేష దాడులు ఏటేటా పెరిగిపోతున్నాయి. అమెరికా వ్యాప్తంగా 2016లో 6,121 దాడులు జరిగితే ఆ మరుసటి ఏడాది 7,175 దాడులు జరిగా యి. ట్రంప్ ఇటీవల ఒక ప్రసంగంలో ఈ విద్వే ష దాడులను మాట మాత్రంగా ఖండించినప్పటికీ, ఆయన పలు సందర్భాలలో వ్యక్తం చేస్తున్న భావజాలం శ్వేత జాతీయులను రెచ్చగొట్టే విధం గా ఉంటున్నది. అమెరికాలో కాల్పుల ఘటనలన్నిటికీ విద్వేషమే కారణం కాకపోవచ్చు. కానీ విద్వేషదాడులు పెరిగిపోవడం సమాజంలోని విభేదాలకు సూచిక. సామాజిక సామరస్యం దెబ్బతినడం మరింత ప్రమాదకరం. అమెరికా లో కాల్పులకు సామాజిక-ఆర్థిక మూలాలున్నా యి. వాటిని అరికట్టడానికి పరిష్కారాలను అన్వేషించవలసి ఉన్నది. కానీ సమస్యను పరిష్కరించకుండా మతిస్థిమితం లేనివారు జరిపే దాడులుగా ముద్రవేయడం పరిపాటిగా మారింది. ట్రంప్ దాడులు జరిపిన వారిని మతిస్థిమితం లేనివారిగా పేర్కొనడం పట్ల మానసిక వైద్యులు అభ్యంతరం చెబుతున్నారు. మతిస్థిమితం కోల్పోయిన వారు దాడులు జరుపరని, వారిని బదనాం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్పుల ఘటనలకు ట్రంప్ చూపిస్తున్న పరిష్కారాలు కూడా విడ్డూరంగా ఉంటున్నాయి. బడి పిల్లలపై జరిగే కాల్పులను అరికట్టడానికి ఉపాధ్యాయులు తుపాకులు వాడటం నేర్చుకోవాలని సూచించారు. ట్రంప్ మాటల నేపథ్యంలో తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం మరింత సన్నగిల్లింది. తమ పిల్లల భద్రత విషయమై వారిలో ఆందోళన పెరిగిపోయింది. ఇటీవల తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ స్కూల్ బ్యాగ్‌లు కొనివ్వడం పెరిగిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వలస వెళ్ళడం ఎక్కువైంది. పారిశ్రామికరంగం కూడా నిపుణులే కాకుండా సాధారణ శ్రామికులు కావాలని కోరుకుంటున్నది. వలస ప్రజలు సమాజాన్ని సంపద్వంతం చేస్తారనేది అనేక సందర్భాలలో వెల్లడైంది. అయినా వివిధ దేశాలలోని మెజారిటీ మతస్తుల్లో ఆందోళన పెరిగిపోయి దాడులు సాగుతున్నాయి. అమెరికాలోనే కాదు, యూరప్ దేశాలలో కూడా ఈ పోకడ కనిపిస్తున్నది. ప్రజల సమస్యలను పరిష్కరింపలేని పాలకులు అల్ప సంఖ్యావర్గాలు, కాందీశీకుల వల్లనే తమ అవకాశాలు దెబ్బతింటున్నాయనే భావనను ప్రచారంలో పెడుతా రు. సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు చూపడం, ప్రజలను మెప్పించేలా పరిపాలించడం కష్టమైన పని. కానీ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడం తేలిక. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే. ఒకప్పుడు ఒక వర్గం ప్రజలపైకి మరో వర్గాన్ని రెచ్చగొట్టి జాత్యహంకార విధానాలను అవలంబించడం ఎక్కువగా జరిగేది. ఇతర దేశాల మీద యుద్ధాలకు దిగినప్పుడు ప్రజల మద్దతు సులభంగా లభిస్తుందని పాలకులు భావిస్తారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన తరువాత ఇటువంటి ఉన్మాద పోకడలు తగ్గాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మెప్పు పొందడం సాగేది. కానీ ఇటీవల ఆర్థిక విధానాలలో మార్పులు వచ్చి ప్రజానుకూల విధానాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళా రాజకీయనాయకులు విద్వేష దాడులను రెచ్చగొట్టడం ఎక్కువైంది. విద్వేషదాడుల ద్వారా పరిష్కారాలు లభించవని, విధాన మార్పులు రావాలని ప్రజలు కోరుకోవాలె.

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles