అమిత్ షా అవివేకం

Thu,August 8, 2019 01:49 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవసరమై నప్పుడుల్లా తెలంగాణపై విషంగక్కుతూ పబ్బం గడుపుకుంటున్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తలు పులు మూసేసి మరీ విభజించిందంటూ ఆంధ్రప్రదేశ్‌పై వల్లెమాలిన ప్రేమ కనబరి చారు. ఇలాంటి అర్థం పర్థం లేని మాటల వెనుక ఉద్దేశమేంటో తెలుసుకోలేని స్థితిలో దేశ ప్రజలు ఉన్నారనుకోవడం అమిత్ షా అవివేకం. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలహీన మై, బీజేపీ పుంజుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు. కానీ అది జరుగని పని, అది కాకపోగా తెలంగాణ ప్రజలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తారని బీజేపీ నాయకులు తెలుసుకోవాలి.
- అన్నాజి రాజేందర్, కరీంనగర్

కశ్మీర్ టెర్రరిస్టుల అడ్డా

1949, 1954లలో 370, 35ఏతో జమ్ముకశ్మీర్‌కు అధికారాలు కట్టబె ట్టారు. పర్యవసానంగా 60 లక్షల కశ్మీరీ పండిట్లు వెళ్లగొట్టబడ్డారు. కాం గ్రెస్‌న చేసిన నిర్వాకం వల్ల కశ్మీరీ పండిట్లు కాందిశీకులయ్యారు. యాభై సంవత్సరాల నుంచి చేస్తున్న చర్చల ద్వారా సాధించేదేమీ లేదు. కాకపోగా పొయ్యిమీద ఉన్నం పొయ్యిలో పడ్డట్లయ్యింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ టెర్రరిస్టుల అడ్డా అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మిలిట రీని పెంచి టెర్రరిస్టులను నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
- వీర పూర్ణచందర్‌రావు, హైదరాబాద్

సుష్మ మరణం తీరనిలోటు

సుష్మా స్వరాజ్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉన్నది. కాబట్టి ఆమె మరణించిన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇంతగా తెలంగాణ ప్రజలు స్పందించడానికి కారణం ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలుకడం. దీంతో పాటు ఉద్యమానికి మద్దతుగా ఎన్నో సభలకు ఆమె హాజరవ్వడం. సుష్మా మీకు నివాళి.
- తలారి సతీష్, వికారాబాద్, రంగారెడ్డి

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles