కశ్మీర్ నిర్ణయం ఎటు దారితీస్తుంది?

Tue,August 6, 2019 11:09 PM

youth-article
జేమ్స్‌బాండ్ తరహాలో నాటకీయ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత వివాదాస్పమై న రీతిలో మరో నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా ఇదేవిధంగా నోట్ల రద్దును ఉన్నపళంగా ప్రకటించి.. నల్లధనాన్ని అదుపు చేస్తానని, అరికడతానని మోదీ ప్రకటించారు. కానీ, ఆ నిర్ణ యం ఆయన చెప్పిన లక్ష్యాన్ని ఏ మాత్రం సాధించకపోగా.. కొన్ని కోట్ల మంది దేశ ప్రజల్ని ముఖ్యంగా మధ్యతరగతిని, పేదలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. బ్యాంకుల ముందు పడిగాపులు గాస్తూ, ఇంట్లో, బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎందుకూ పనికిరాకుండా పోయాయనే బాధతో, షాక్ తో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ, మోదీ తనదైన రీతిలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడు దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్న జమ్ముకశ్మీర్‌కు ఆ హోదాను రద్దుచేయటమేగాక, ఆ రాష్ర్టాన్ని రెండు ముక్కలు చేసి, జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేశారు. తద్వారా దానిని ఒక మున్సిపాలిటీ స్థాయికి మార్చివేశారు. ఈ అవమానాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ముఖ్యంగా కశ్మీరీలు ఎంతమేరకు జీర్ణం చేసుకుంటారు? ఏ విధంగా దీనిని వాళ్లు తీసుకుంటారు? వాళ్ల ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అన్నదానిపై వాళ్ల భవిష్య త్తే కాదు.. మిగిలిన భారతదేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది.

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని నాటి నెహ్రూ ప్రభుత్వం ఇవ్వటం ఒక పెద్ద తప్పని, ఏ రాష్ర్టానికి లేని హోదాను దానికే ఎందుకు ఇవ్వాలని.. సోషల్ మీడియాలో చరిత్రను చదువుకున్నవాళ్లు వీరావేశంతో ప్రశ్నిస్తున్నారు. కానీ, వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. అప్పడు ఆ స్వయంప్రతిపత్తిని బిచ్చం వేసినట్లు కశ్మీరీలకు ఇవ్వలేదు. జమ్ముకశ్మీర్ అనే రాష్ట్రం మనదేశంలోనే ఏకైక ముస్లిం మెజారిటీ (జనాభాలో 70 శాతం) రాష్ట్రం.


ఈ సమయంలో తెలంగాణ గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. 1956లో అప్పటి హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు.. ఈ విలీనం ఆంధ్రకు లాభకరంగా, హైదరాబాద్‌కు నష్టదాయకంగా పరిణమిస్తుందని హైదరాబాద్ నాయకులు భావించారు. ఆంధ్రకు హైదరాబాద్ రాష్ట్రం ఒక వలసగా మారిపోతుందని, తద్వారా ఇక్క డి ప్రజలు, నాయకులు నష్టపోతారని అనుమానించారు. ఈ అనుమానా లను దూరం చేయటానికి, ఇరు రాష్ర్టాల విలీనానికి వీలుగా పెద్ద మనుషుల ఒప్పందం (జెంటిల్మెన్ అగ్రిమెంట్) పేరుతో ఇరు రాష్ర్టాల నేతలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ, ఆ ఒప్పందం కాగితాలకే పరిమిత మై.. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన మరుక్షణం నుంచే ఒప్పందంలోని అంశాలను ఆంధ్ర నాయకులు గాలికి వదిలేశారు. దీని ఫలితంగానే తెలంగాణలో మళ్లీ స్వరాష్ట్ర ఆకాంక్ష మొగ్గ తొడుగటం, 1969లో అది ప్రళయభీకరరూపాన్ని సంతరించుకోవటం, అంతటి ఉద్యమాన్ని నాటి ఆంధ్ర పాలకులు నెత్తురుటేర్లలో ముంచి అణిచివేయటం మనముందున్న చరిత్ర. అయినప్పటికీ, తెలంగాణ అసంతృప్తి, ఆకాంక్ష అణిగిపోలేదు. అది మళ్లీ తలెత్తిం ది. అనేక ఉద్యమాలు, టీఆర్‌ఎస్ సారథ్యంలో జరిగిన రాజకీయ పోరాటా లు, ఎంతోమంది బలిదానాలతో స్వరాష్ట్రం సాకారమైనాక గాని, ఆ అసంతృప్తి చల్లారలేదు. పెద్దమనుషుల ఒప్పందాన్ని పక్కనబెట్టి తమ ప్రాంత అస్తిత్వాన్ని అణిచివేసినందుకే తెలంగాణ ఇంతగా తిరుగబడి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాతగాని శాంతించలేదు.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఈ ఆర్టికల్ 370 పెద్ద అవరోధం అన్నట్లుగా మోదీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. వచ్చే ఎన్నికల వరకూ, రానున్న ఐదేండ్లలో ఆ రాష్ర్టాన్ని భూతల స్వర్గంగా చేసి మళ్లీ నిలబెడుతామని చెబుతుంది. నోట్లరద్దు సందర్భంగా కూడా ఇటువంటి ప్రగల్భాలే పలికింది. కానీ, ఏమైందో చూశాం. ఇప్పుడు, ఈ విషయంలోనూ మోదీ సర్కార్ ఏ మేరకు మాటలను ఆచరణకు తీసుకొస్తుందన్నదానిపై సందేహాలు నెలకొనటం సహజం.


అటువంటిది, తమకున్న ప్రత్యేక ప్రతిపత్తిని, స్వయం ప్రతిపత్తిని కాలరాసి, ఏకంగా కేంద్రం చేతివేళ్ల తో ఆడుకునే ఒక మున్సిపాలిటీలాగా తమ ప్రాంతాన్ని మారిస్తే కశ్మీరీలు ఊరుకుంటారా అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నది. నిజమే, కశ్మీరీలకు లభించిన స్వయంప్రతిపత్తి వాళ్లకు ప్రగతి ఫలాలను అందించటం మాట అటుంచి, వాళ్ల మాతృభూమిని మరుభూమిగా మార్చి న మాట వాస్తవమే. కానీ, ఈ పాపం ఎవరి ఫలితం? స్వయంప్రతిపత్తిని ఇచ్చిన మాటేగానీ, దానిని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు (నాటి నెహ్రూ సర్కార్ నుంచీ) ఎన్నడు అమలుచేశాయి? కశ్మీర్‌ను ఒక భూ ఖండంగా మాత్రమే గానీ, అక్కడ ప్రజల అవసరాలను, అభివృద్ధిని ఎప్పుడు పట్టించుకున్నాయి? అత్యద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌ను అభివృద్ధి చేసి, అక్కడి ప్రజలకు ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి తగిన సదుపాయాలు కల్పిస్తే.. భారత్ నుంచి విడిపోతామన్న నినాదాన్ని, ఆజాద్ కశ్మీర్ అనే నినాదాన్ని ఎందుకు వాళ్లు భుజానికెత్తుకునే పరిస్థితి వస్తుంది? ఆ నినాదం వారికేమైన శాంతిని, సుఖాన్నిచ్చిందా? ఆ నినాదం కోసం కొన్ని వేలమంది యువకులు సైన్యంతో జరిగిన ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. జీవితం సుఖసంతోషాలతో ఉంటే, అందమైన భవిష్యత్తును సాకారం చేసుకునే పరిస్థితులే ఉంటే... తుపాకి పట్టుకొని, పట్టుమని 20-25 ఏండ్లు కూడా నిండకుండానే చావును కౌగిలించుకోవటానికి వాళ్లకేమైనా పిచ్చా? ఎల్‌బీనగర్ చౌరస్తాలో తననుతాను మంటల్లో కాల్చుకుంటూ కూడా జై తెలంగాణ నినాదాలు చేస్తూ తనువు చాలించిన శ్రీకాంతాచారికి పిచ్చి లేచి ఆ పని చేశాడా? లేక, ఆంధ్రపాలనలో తెలంగాణ బాగుపడదు, స్వరాష్ట్రం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.. ఆ లక్ష్యసాధన కోసం నా ప్రాణాలను ఒక సమిధగా ధారపోస్తున్నా అన్న అవగాహన తో ఆ పని చేశాడా?

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని నాటి నెహ్రూ ప్రభుత్వం ఇవ్వటం ఒక పెద్ద తప్పని, ఏ రాష్ర్టానికి లేని హోదాను దానికే ఎందుకు ఇవ్వాలని.. సోషల్ మీడియాలో చరిత్రను చదువుకున్నవాళ్లు వీరావేశంతో ప్రశ్నిస్తున్నారు. కానీ, వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. అప్పడు ఆ స్వయంప్రతిపత్తిని బిచ్చం వేసినట్లు కశ్మీరీలకు ఇవ్వలేదు. జమ్ముకశ్మీర్ అనే రాష్ట్రం మనదేశంలోనే ఏకైక ముస్లిం మెజారిటీ (జనాభాలో 70 శాతం) రాష్ట్రం. కాబట్టి, పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం ప్రకారం, విలీనంపై సంస్థానాలకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన హక్కు ప్రకారం నాడు వాళ్లు పాకిస్థాన్‌లోనే కలువొచ్చు. అందుకు అక్కడి భౌగోళిక పరిస్థితు లు కూడా ఎంతో అనుకూలం. కానీ, కశ్మీరీల ప్రజాస్వామ ఉద్యమ నేత షేక్ అబ్దుల్లా.. తమ రాష్ట్రంలో ఉన్న హిందువులు, బౌద్ధులు వంటి మైనారిటీలకు ఇస్లాం మతరాజ్యమైన పాకిస్థాన్‌లో హక్కులు లేకుండా పోతాయని భావించి సెక్యులర్ రాజ్యమైన భారత్‌లో కలువటానికి ముందుకొచ్చారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాజ్యంలో అన్నిమతాల ప్రజలు పాల్గొన్నట్లుగా, జమ్ముకశ్మీర్ పాలకుడు హరిసింగ్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం అక్కడి ప్రజలు మతాలకతీతంగా పాల్గొన్నారు. ఆ ఉద్యమ నేతగా షేక్‌అబ్దుల్లా ఆవిర్భవించారు. ఆ ఉద్యమ సంప్రదాయాలను పాటిస్తూ, ఆయన భారత్‌లో కలువటానికే మొగ్గుచూపారు. అందుకని, ఆయనను నాటి పాకిస్థాన్ నేతలు భారత్ ఏజెంట్ అని, ఇస్లాం ద్రోహి అని తిట్టిపోశారు. అయినా ఆయన చలించలే దు. మరోవైపు, భారత రాజ్యాంగం రూపకల్పన సందర్భంగా.. అప్పటివరకూ స్వతంత్రంగా ఉన్న సంస్థానాలకు తమవైన రాజ్యాంగాలను రూపొందించుకునే హక్కును, భారత రాజ్యాంగంలో మార్పులను సూచించే హక్కులను అప్పటి భారత రాజ్యాంగసభ ఇచ్చింది.
kv-ravi-kumar
ఈ మేరకు పలు సంస్థానాలు చేసిన సూచనలను రాజ్యాంగంలో పొందుపరిచారు. కశ్మీర్ మాత్రం తమకు రక్షణ, సమాచారం, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థికం తప్ప అన్నిరంగాల్లో స్వయంప్రతిపత్తి కావాలని డిమాండ్ చేసింది. దానికి రాజ్యాంగసభ ఆమోదించింది. ఈ విధంగానే ఆర్టికల్ 370 ఉనికిలోకి వచ్చింది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఈ ఆర్టికల్ 370 పెద్ద అవరోధం అన్నట్లుగా మోదీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. వచ్చే ఎన్నికల వరకూ, రాను న్న ఐదేండ్లలో ఆ రాష్ర్టాన్ని భూతల స్వర్గంగా చేసి మళ్లీ నిలబెడుతామని చెబుతుంది. నోట్ల రద్దు సందర్భంగా కూడా ఇటువంటి ప్రగల్భాలే పలికిం ది. కానీ, ఏమైందో చూశాం. ఇప్పుడు, ఈ విషయంలోనూ మోదీ సర్కార్ ఏ మేరకు మాటలను ఆచరణకు తీసుకొస్తుందన్నదానిపై సందేహాలు నెలకొనటం సహజం. ఈలోపు, కశ్మీరీలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. వారి ప్రమేయం ఏ మాత్రం లేకుండా, వారికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే.. మమ్మల్ని అభివృద్ధి చేయటానికే ఇదం తా మీరు చేస్తున్నారు. ఆ విషయం మాకు తెలియదా? రండి స్వాగతం అని స్వాగతం పలుకుతారా? లేక, ఈ ఏకపక్ష నిర్ణయాన్ని అత్యంత అవమానకరంగా భావించి ప్రతిఘటిస్తారా? అన్నది భవిష్యత్తులో కాని తేలదు. రెండోది జరిగితే మాత్రం.. కశ్మీర్ చిచ్చు ఇప్పటివరకూ మనం చూసినదానికన్నా మరింత పెరిగే ప్రమాదం ఉన్నది.

341
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles