తాలిబన్‌తో చర్చలు

Sat,July 20, 2019 01:06 AM

అమెరికా, తాలిబన్ల మధ్య దోహాలో ఏడు విడుతల చర్చలు జరిగాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని భిన్నపక్షాల మధ్య చర్చలు రష్యాలో సాగాయి. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నది అమె రికా కీలుబొమ్మ ప్రభుత్వం కనుక, దానితో చర్చలు జరుపబోమని తాలిబన్లు ఎంతోకాలంగా అంటున్నారు. చివరికి మధ్యేమార్గం అనుసరించారు. ఇటీవల దోహాలో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ అధికారులు తాలిబన్లతో చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వ అధికారులుగా కాకుండా వ్యక్తిగత హోదా పేర చర్చలకు హాజరయ్యారు.

ఆఫ్ఘనిస్థాన్ శాంతిచర్చలు కీలకదశకు చేరుకున్న ఈ దశలో భారత్ ఎంతో చతురతతో వ్యవహరిం చవలసి ఉన్నది. ఇప్పటివరకు భారత్ తాలిబన్లతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నది. కానీ మరో వైపు అమెరికా సహా అన్ని తాలిబన్లతో పీకలలోతున చర్చల్లో మునిగిపోయాయి. ఈ దేశాలన్నీ ఏదో ఒక దశలో తాలిబన్లను ఉగ్రవాదులుగా విమర్శించినవే. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. అమెరికాకు, తాలిబన్లకు, ఆఫ్ఘనిస్థాన్‌లోని భిన్నవర్గాలకు మధ్య చర్చలు సాగే విధంగా పురికొల్పుతున్నవి జర్మనీ, ఖతర్ దేశాలు. ఖతర్ ఈ చర్చలకు వేదికగా మారి తే, తెరవెనుక రాయబారాలను జర్మనీ సాగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తాజా పరిస్థితిని వివరించి కలుపుకపోవడానికి జర్మనీ దౌత్యవేత్త మార్కస్ పోట్జెల్ ఢిల్లీ చేరుకున్నారు. తమ దేశం తరఫున ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటున్నారు. ఈ నెల 12వ తేదీన బీజింగ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా, చైనా, రష్యాతోపాటు పాకిస్థాన్ కూడా పాల్గొన్నది. పాకిస్థాన్ చురుకైన పాత్ర వహించాలన్న అభిప్రాయాన్ని అమెరికా, చైనా, రష్యా వ్యక్తంచేశాయి. భారత్ అమెరికా బాటలోనే నడుస్తూ సొంత విధానాన్ని రూపొందించుకోలేకపోయింది. అమెరికా మద్దతుతో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూపోయింది. కానీ ఆఫ్ఘనిస్థాన్ అష్రాఫ్ ఘనీ ప్రభుత్వానికి ప్రజా పునాది లేదు. విదేశీ సేనల మద్దతు లేకపోతే నిలబడలేదు. ఈ దశలో కూడా భారత్ ఆఫ్ఘనిస్థాన్‌లోని అన్నిపక్షాలకు భాగస్వామ్యం ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అంటూ కొన్ని ప్రాతిపదికలను సూచిస్తున్నది. ఈ ప్రాతిపదికలు పరోక్షంగా తాలి బన్లకు వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నాయి. మార్కస్ పోట్జెల్ పర్య టన తర్వాత భారత్ వైఖరి ఎట్లా ఉంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది.

అమెరికాతోపాటు చైనా, రష్యా, ఇరాన్ తదిత ర దేశాలు తాలిబన్ల పట్ల తమ వైఖరిని హటాత్తు గా మార్చుకోవడానికి అనేక కారణాలు దోహద పడ్డాయి. ఇందులో ప్రధానమైనది తాలిబన్లను రూపుమాపడం సాధ్యం కాదనీ, ఆ సంస్థ అంగీ కారం లేకుండా ఆ దేశంలో ఏ పనీ జరుగదనీ ఇతర దేశాలు భావిస్తున్నాయి. తాలిబన్లు ఉగ్ర వాద సంస్థగా కాకుండా ప్రాతినిధ్య సంస్థగా కొం త పరివర్తన చెందడం మరో పరిణామం. అమెరి కా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలుకాలని భావించడం ఇంకో కారణం. ఈ యుద్ధం కోసం ఏటా 45 బిలియన్ డాలర్లు ఖర్చుచేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతు న్నారు. తాలిబన్లతో చర్చలు జరిపి, వారి నుంచి హామీలను పొంది, తమ సేనలను ఉపసంహరిం చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తాలిబన్ల మూలంగా తమ దేశాలలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు విస్తరిస్తున్నాయనే ఆందోళనతో చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు చర్చలకు సము ఖత చూపాయి. అమెరికా కన్నా చాలాముందే ఈ దేశాలు తాలిబన్లతో చేతులు కలిపాయి. పశ్చి మాసియాలో భీకరమైన పాత్ర పోషించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లోకి ప్రవేశిం చడం మొదలుపెట్టారు. సిరియా, ఇరాక్ తదితర దేశాలలోని శత్రు పక్షాలను దెబ్బకొట్టడానికి ఐఎ స్ తీవ్రవాదాన్ని అమెరికానే సృష్టించిందనే అభిప్రాయం చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు ఉన్నది. ఐఎస్‌ను కట్టడి చేయడానికి తాలిబన్లతో చెలిమి చేయడం మంచిదని ఇరాన్ ఇతర దేశాలు నిర్ణయించుకున్నాయి. మొదట తాలిబన్ వ్యతిరేక కూటమిలో ఉన్నప్పటికీ, ఇరాన్ ఆ సంస్థతో లోపాయి సంబంధాలను కలిగి ఉన్నది. భవిష్యత్తులో అమెరికాతో పోరాటానికి తాము సహకరి స్తామనే సంకేతాన్ని ఇరాన్ తాలిబన్లకు ముందే ఇచ్చింది. ఇరుగుపొరుగు దేశాలు తాలిబన్లకు మద్ద తు ఇస్తున్నందున, ఇక ఎంతకూ తెగని యుద్ధం చేయడం కన్నా చర్చలు జరుపడం మంచిదని అమెరికా స్థిర నిర్ణయానికి వచ్చింది.

అమెరికా, తాలిబన్ల మధ్య దోహాలో ఏడు విడుతల చర్చలు జరిగాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని భిన్నపక్షాల మధ్య చర్చలు రష్యాలో సాగాయి. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నది అమె రికా కీలుబొమ్మ ప్రభుత్వం కనుక, దానితో చర్చలు జరుపబోమని తాలిబన్లు ఎంతోకాలంగా అం టున్నారు. చివరికి మధ్యేమార్గం అనుసరించారు. ఇటీవల దోహాలో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ అధికా రులు తాలిబన్లతో చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వ అధికారులుగా కాకుండా వ్యక్తిగత హోదా పేర చర్చలకు హాజరయ్యారు. తాలిబన్లతో పాటు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ అధికారులు, పౌర సమాజ సభ్యులు, రాజకీయవేత్తలు, మహిళా కార్యకర్తలు- ఇట్లా అరువై మందికి ప్రతినిధులు పైగా ఉమ్మడి ప్రకటన జారీచేయడం అసాధారణం. యుద్ధాన్ని ఆపివేస్తేనే చర్చలు జరుపుతామనే షరతులు పెట్టకుండా, ఒకవైపు భీకర యుద్ధం సాగుతుండగానే ఇరుపక్షాలు శాంతి చర్చలకు దిగడం విశేషం. హింసాకాండను తగ్గిస్తామని, పౌరులపై దాడులను పూర్తిగా నిలిపివేస్తామని, మహిళల హక్కులను గౌరవిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడే శూన్యాన్ని భర్తీ చేసి ఇతర దేశాల కన్నా పైచేయి సాధించడానికి ఇతర దేశాలన్నీ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. శాంతిచర్చలూ ఒప్పందాలు వేరు, వాస్తవ పరిస్థితి వేరు. ఈ వేగవంతమైన పరిణామాలలో భారత్ పాత్ర ఏమి టనేది మోదీ ప్రభుత్వం అనుసరించే దౌత్యవ్యూహాన్ని బట్టి ఉంటుంది.

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles