కొత్త నిబంధనలతో కరంట్ కష్టాలు

Thu,July 18, 2019 01:20 AM

దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు, అన్నివేళలా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగాలనే సమున్నత ఆశయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో క్రమశిక్షణ తీసుకురావాలనే లక్ష్యంతోనే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కేంద్రం సమర్థించుకుంటున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పంపిణీ వ్యవస్థలు, తాజా నిబంధనల ఫలితంగా ఎంత అవసరమైతే అంత కరంట్‌ను సమకూర్చుకోవడం తేలికకాదు అని రాష్ర్టాలు ఆందోళనగా ఉన్నాయి. విద్యుచ్ఛక్తి అనే ది ఉమ్మడి జాబితాలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే కీలక సంస్థలుండటంతో రాష్ర్టాలది నామమాత్ర పాత్రే అవుతుంది. కేం ద్రం తీసుకొచ్చిన నిబంధనలను అమలుచేయడమో, లేదంటే తమ రాష్ర్టాలను గాడాంధకారంలో ఉంచడమో తప్ప రాష్ర్టాలకు మరో మార్గం లేదు. విద్యుత్ ఉత్పత్తి-సరఫరా-పంపిణీ సంస్థల్లో పారదర్శకత, క్రమశిక్షణ తేవడమనే ప్రధాన లక్ష్యంతో పాటు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు (డిస్క మ్స్) నష్టాల ఊబిలో కూరుకుపోకుండా చూడటానికంటూ కేంద్ర విద్యు త్‌శాఖ కొద్ది రోజుల కిందట కీలక ఉత్తర్వులు జారీచేసింది. అందులో ప్రధానమైనది కొనబోయే కరంట్‌కు సంబంధించి ఒక నెల ముందే బ్యాం కుల ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.సి.) ఇవ్వాలనే నిబంధన. అంటే తమ డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్తును సమకూర్చుకోవడానికి అడ్వాన్స్ చెక్ ఇవ్వడమన్నమాట. ఈ నిబంధన పెట్టడానికి కేంద్రం కొన్ని కారణాలు చెబుతున్నది. అందులో ప్రధానమైనది డిస్కమ్‌లలో ఆర్థిక క్రమశిక్షణ తేవడం.

డిస్కమ్‌లు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు, రైల్వేశాఖ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని కేంద్రం చెబుతున్నది. భవిష్యత్ అవసరాల కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ వాదనను కూడా రాష్ర్టాలు కొట్టి పారేస్తున్నాయి.


అంటే తమ వద్ద ఆ నెలకు ఎంత డబ్బుంటే అంత కరంట్ మాత్రమే కొనాలి. డిమాండ్ ఎక్కువున్నప్పటికీ, కావాల్సిన కరంట్ ఇవ్వడానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సిద్ధంగా ఉన్నటిప్పటికీ, ఎల్.సి.లు సమర్పించకుంటే కరెంటు సరఫరా జరుగదు. ఎల్.సి.లు ఇవ్వని డిస్కమ్‌లకు కరంట్ సరఫరా చేయవద్దని సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు, నార్తర్న్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. డిస్కమ్‌లు ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తాయి. ఆ తర్వాత మాత్రమే బిల్లులు వసూలు చేస్తాయి. రైతులు, ఇతర వర్గాల కోసం అందించే సబ్సిడీలకు సంబంధించిన డబ్బులు కూడా ప్రభు త్వం నుంచి అందిన తర్వాతే డిస్కమ్‌లు ఆయా విద్యుత్ ఉత్పత్తి సంస్థల కు చెల్లిస్తాయి. వినియోగదారులైనా, ప్రభుత్వమైనా తమ ఆర్థిక వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజల నుంచి వచ్చిన పన్నుల ద్వారానే సబ్సిడీ మొత్తాన్ని అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రతీ నెలా సమానంగా ఆదాయం రాదు. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. మొదటి త్రైమాసికంలో తక్కు వ ఆదాయం వస్తుంది. దాని ప్రకారమే ప్రభుత్వం ఇతర సంస్థలకు చేయాల్సిన చెల్లింపులు చేస్తుంది. తమకు డబ్బులు సమకూరే స్థితిని బట్టే డిస్క మ్‌లు కూడా ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తాయి. ఇదే విధానం దేశంలోని 29 రాష్ర్టాల్లో ఇప్పటివరకు అమలవుతూ వస్తున్నది. కానీ కేంద్రం తాజాగా పెట్టిన షరతు ప్రకారం వచ్చే నెలలో ఎంత కరంట్ కొంటామో అంచనా వేసుకొని, అంతకు సరిపడా ఎల్.సి.లు సమర్పించాలి. ఇది డిస్కమ్‌లకు సాధ్యం కాదు. డిస్కమ్ లకు ఎల్.సి.లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాకపోవచ్చు.

దీంతో డిస్కమ్‌లు డిమాండ్ మేర విద్యుత్తును సమకూర్చుకోలేవు. ఈ పరిస్థితి విద్యుత్ కోతలకు దారితీస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అన్నివర్గాలకు, అన్ని వేళలా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ ఆశయానికి గండికొట్టే విధంగా ఉన్నది. ఎల్.సి. నిబంధన ఎత్తివేయాలని ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాల విద్యుత్ కమిటీ (ఎస్.ఆర్.పి.సి) డిమాండ్ చేసింది. ఎల్.సి. విధానం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కేంద్రానికి లేఖ రాసింది. కఠినంగా వ్యవహరించాల్సి రావడానికి కేంద్రం చెబుతున్న మరో ప్రధా న కారణం ఒకదానిపై ఒకటి ఆధారపడిన డిస్కమ్‌లను, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను, బొగ్గు సంస్థలను కాపాడుకోవడం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టా ల డిస్కమ్‌లు అప్పుల ఊబిలోనే ఉన్నాయని, శక్తికి మించి కొనుగోళ్లు చేయడమే అని కేంద్రం వాదిస్తున్నది. డిస్కమ్‌లు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ ఉత్పత్తి కేం ద్రాలు, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు, రైల్వేశాఖ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని కేంద్రం చెబుతున్నది. భవిష్యత్ అవసరాల కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ వాదనను కూడా రాష్ర్టాలు కొట్టి పారేస్తున్నాయి. డిస్కమ్ లు తాము వాడుకున్న కరంట్‌కు నెలానెలా ఒకటో తారీఖునే బిల్లులు చెల్లించలేకపోవచ్చు కానీ, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర వినియోగదారుల నుంచి బిల్లులు వసూలుచేసి, కట్టాలి కాబట్టి కాస్త జాప్యమవుతుందే తప్ప మొత్తానికి ఎగ్గొట్టిన దాఖలాల్లేవని రాష్ర్టాలు వాదిస్తున్నాయి. రైతులు, ఇతర పేద వర్గాల కోసం అమలుచేసే సబ్సిడీ పథకాలకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లోనే నిధులు సమకూరుస్తున్నాయి.

అవి ప్రతీ నెలా కాకపోయినా, వెసులుబాటును బట్టి ఆర్థిక సంవత్సరం మొత్తానికి కావాల్సిన సబ్సిడీని అదే ఆర్థిక సంవత్సరంలో అందిస్తున్నది. తెలంగాణను ఉదాహరణగా తీసుకుంటే, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, ఇతర సబ్సిడీలకు 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 5,900 కోట్లు కేటాయించింది. ఇవి కాకుండా అదనపు విద్యుత్ కొనుగోలు చేసినందుకు మరో రూ.2, 400 కోట్లు అదనంగా చెల్లించిం ది. అంతేకాదు, డిస్కమ్‌లను అప్పుల బారి నుంచి కాపాడటాని కి తెలంగాణ ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ ద్వారా రూ.8,900 కోట్ల రుణభారాన్ని తన మీద వేసుకున్నది. దాదాపు అన్నిరాష్ర్టాలు డిస్కమ్‌లను ఇదేవిధంగా కాపాడుకుంటున్నాయి. ప్రభుత్వ సాయం లేక, ఆర్థికంగా దివాళా తీయడం ద్వారా దేశంలో ఏ ఒక్క డిస్కమ్ కూడా మూతపడలేదనే విషయం ఇక్కడ గమనార్హం. డిస్కమ్‌లను అప్పుల ఊబిలోంచి బయటపడేయడానికి కేంద్రానికి ఇం కా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నా, వాటి మీద దృష్టిపెట్టడం లేదనే వాద న ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీ, ఎన్‌పీసీ, ఎన్‌ఎ ల్‌సీ నడుస్తున్నాయి. కరంట్ అమ్ముకోవడం ద్వారా ఇవి గతేడాది రూ. 42,000 కోట్ల ఆదాయాన్ని పొందాయి. ఇది కాకుండా రాష్ర్టాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాడుకునే బొగ్గు మీద టన్నుకు రూ.400 చొప్పున కేంద్రం క్లీన్ ఎనర్జీ సెస్ వసూలు చేస్తున్నది. దీనిద్వారా కేంద్రానికి గత ఆర్థిక సంవత్సరం రూ.24,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు మార్గాల ద్వారా కేంద్ర సంస్థలు రూ.66 వేల కోట్లకు పైగానే ఆదాయం పొందుతున్నాయి. బొగ్గు రవాణా ద్వారా రైల్వేశాఖ, దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేయడం ద్వారా పీజీసీఐఎల్ కూడా భారీగానే ఆదాయం పొందుతున్నాయి.
gatika-vijay-kumar
ఇదే సమయంలో రాష్ర్టాల డిస్కమ్‌లకు ఉన్న అప్పులు రూ.40 వేల కోట్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు డిస్కమ్‌లకు వేసే చార్జీలు కొంత తగ్గించుకున్నా, బొగ్గుపై సెస్ ఎత్తేసినా డిస్కమ్‌లపై ఆర్థికభారాన్ని తగ్గించే అవకాశం ఉందనేది రాష్ర్టాల అభ్యర్థన. కరంట్, బొగ్గు అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ప్లాంట్ల విస్తరణకు ఉపయోగిస్తున్నాం కాబట్టి, డిస్కమ్‌ల భారాన్ని పంచుకోలేమని కేంద్రం తెగేసి చెబుతున్నది. ఎవరి వాదన వారు వినిపిస్తున్న ఈ తరుణంలో రాష్ర్టాల మొరను ఆలకించి, కేంద్రం కాస్త మెత్తపడితే సరేసరి. లేదంటే దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు తప్పకపోవచ్చు. రైతులు, ఇతరవర్గాలకు ఇచ్చే సబ్సిడీల్లోనూ కోత లు పెట్టాల్సి రావచ్చు.

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles