సంకీర్ణ సంక్షోభం

Wed,July 10, 2019 01:04 AM

కర్ణాటకలోని జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. వేగం గా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని అనిశ్చితి కొనసాగుతున్నది. అధికార కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలతోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి ఏకంగా బీజేపీ పక్షాన చేరిపోవటం తో అధికార కూటమికి మెజారిటీ నిరూపించుకోవలసిన సంకటం ఏర్పడుతున్నది. ఈ రాజకీ య సంక్షోభానికి కారణం నువ్వంటే, నువ్వని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ నిజానికి ఈ అనిశ్చితికి కారణం ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్న ఆధిపత్య రాజకీయాలే. కాంగ్రెస్ ముక్త్‌భారత్ అంటున్న బీజేపీని నిలువరించటం కోసం సంఖ్యాబలాన్ని చూడకుండా కాంగ్రెస్ జేడీ(ఎస్)కు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పి సంతృప్తిపడింది. అయితే బీజేపీ ఏమీ తక్కువ తినలేదు. గతంలో అరుణాచల్‌ప్రదేశ్, గోవా ఉదంతాల నేపథ్యం లో మూటగట్టుకు న్న అనైతిక రాజకీయ మరకలు, పార్టీ ఫిరాయింపుల అపవాదుల నుంచి తప్పించుకునేందుకు పావులు కదిపింది. ఎప్పటిలాగే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం పాలుచేస్తున్నారన్న నిందారోపణల నుంచి తప్పించుకోవటం కోసం రాజీనామాలనే కొత్త అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నది. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంఖ్యబలాన్ని కుదించేసి, తమకున్న సంఖ్యాబలాన్ని పెద్దదిగా చేసుకుంటున్నది.

కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే స్థితి వచ్చినప్పటి నుంచీ బీజేపీ అన్నిరకాల ప్రజాస్వామిక సంప్రదాయాలకు వక్రభాష్యాలు చెప్పటమే కాదు, తిలోదకాలు ఇస్తున్నది. వాజపేయి హయాంలో సమయానుకూలంగా వచ్చేదంతా సంకీర్ణయుగమని, చెప్పుకొస్తూ ఆ ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి చేటని చాటిచెప్పింది. ఇక 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టు వ్యవహరిస్తున్నది.


ఏడాదిన్నరకాలంగా (జేడీఎస్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం దినదిన గండంగా సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కూల్చివేయకుండానే అధికారం చేజిక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. కర్ణాటక సంక్షోభంలో కాంగ్రెస్ పాత్ర తక్కువేమీ కాదు. మొదటినుంచీ జేడీ(ఎస్)కు అధికా రం అప్పగించటం పట్ల కాంగ్రెస్‌లోని సిద్ధరామయ్య వర్గానికి కంటగింపుగా ఉన్నది. కేవలం 37 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జేడీ(ఎస్)కు మద్దతు ఇస్తూ డ్బ్భైకి పైగా సంఖ్యాబలం కలిగి ఉండి కూడా అధికారపగ్గాలకు దూరంగా ఉండ టం కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోంచే మొదటినుంచీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గీయులు అవకాశం దొరికినప్పుడల్లా కుమారస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అవినీతి ఆరోపణలతో ఇరుకునపెడుతూ ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి కూడా ప్రభుత్వ పనితీరును కాంగ్రెస్ విమర్శిస్తుండటం పట్ల ఒకానొక దశలో కుమారస్వామి కన్నీటి పర్యంతమైన సందర్భాలున్నాయి. సిద్ధరామయ్య వర్గీయులు చేస్తున్న సహాయ నిరాకరణ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సీఎం సీట్లో కూర్చొని అనుక్షణం తాను అనుభవిస్తున్న క్షోభ అంతాఇంతా కాదని కుమారస్వామి చెప్పుకున్నారు. అనేక సందర్భాల్లో అధికారపీఠంపై నిర్వేదాన్ని ప్రకటిస్తూ ముళ్ల కిరీటాన్ని మోయలేనని మొరపెట్టుకున్న సందర్భాలున్నాయంటే కాంగ్రెస్ అంతర్గతంగా ఎంతటి ఒత్తిడి రాజకీయాలకు పాల్పడిం దో ఊహించుకోవచ్చు. సంకీర్ణ నీతిని కాంగ్రెస్ ఏ మాత్రం పాటించినా కర్ణాటకలో ఈ దురవస్థ తలెత్తేది కాదు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే స్థితి వచ్చినప్పటి నుంచీ బీజేపీ అన్నిరకాల ప్రజాస్వా మిక సంప్రదాయాలకు వక్రభాష్యాలు చెప్పటమే కాదు, తిలోదకాలు ఇస్తున్నది.

వాజపేయి హయాంలో సమయానుకూలంగా వచ్చేదంతా సంకీర్ణయుగమని, చెప్పుకొస్తూ ఆ ప్రభుత్వాల ను అస్థిరపరిచే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి చేటని చాటిచెప్పింది. ఇక 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టు వ్యవహరిస్తున్నది. కేంద్రంలోని అధికారబలంతో వివిధ రాష్ర్టాల్లోని ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను ఆపరేషన్ లోటస్ పేరుతో పడగొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది. కనీస బలం లేకున్నా ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలను అస్థిరపరుస్తున్న బీజేపీ సుస్థిర ప్రభుత్వం కోసమే ప్రభుత్వాలను ఏర్పర్చామని బుకాయించింది. పశ్చిమబెంగాల్‌లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ చేస్తున్న హింసా రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. తాజాగా కర్ణాటకలో పార్టీ ఫిరాయింపుల మాట లేకుండానే రాజీనామాలతో రాజకీయాలను రచ్చకీడ్చింది. కర్ణాటకలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224 కాగా మెజారిటీకి కావాల్సింది 113. బీజేపీ 105 సీట్లు సాధించి 13 సీట్ల దూరంలో ఉన్నది. కాబట్టి 13 మంది రాజీనామాలతో మెజారిటీ మ్యాజిక్ సంఖ్య 106కు తగ్గుతుంది. దీంతో బీజేపీకి కావాల్సింది ఒక ఎమ్మెల్యే మద్దతు మాత్రమే. ఈ స్థితిలో కాంగ్రెస్ కూడా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది. మంత్రులతో రాజీనామా చేయించింది. అసంతృప్తులకు తిరిగివస్తే మంత్రివర్గంలో స్థానం కలిగిస్తామనే సంకేతాలు పంపుతున్నది. మరోవైపు బీజేపీ అనుసరిస్తున్న ఆధిపత్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికే హానికరం. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేల బేరసారాలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయాలలో విలువలను కాపాడటం అన్ని రాజకీయపక్షాల బాధ్యత.

182
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles