మన సినీపరిశ్రమకు మంచిరోజులు

Wed,July 10, 2019 01:03 AM

n-shankar-cm-kcr
ఉధృతంగా కొనసాగి ఘన విజయం సాధించే ఏ ఉద్యమ మైనా ఒక మొదటి అడుగుతోనే మొదలవుతుంది. అడుగ డుగునా అవమానాలు, వివక్ష ఎదుర్కొంటూ ఆత్మగౌరవం కాపాడుకునే క్రమంలో సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి, ఆ తొలి అడుగు వేసిన శక్తి అయితే, ఆ విజయ ప్రయోజనం వ్యక్తిగతం కాకుండా సామాజికం అవుతుంది. అది అందరికీ ఉపయోగపడుతుంది. మా ఉద్యమ భాగస్వామి -ప్రతిభ గల చలన చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయిస్తున్నది తెలంగా ణ ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సినిమా అభివృద్ధిని కాం క్షించే ప్రతి వారికి ఎంతో సంతోషం కలిగింది. ఎన్.శంకర్! పెద్ద హీరోలతో సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకుడు. దార్శనికుడు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రభావితుడయ్యాడు. నాడు సినిమారంగంలో తనకున్న సంబంధ బాంధవ్యాలను, బంగారు భవిష్యత్తును కాదనుకొని, ప్రజల ఆకాంక్షను దిక్కులు పిక్కటిల్లేలా జై బోలో తెలంగాణ అని నినదించాడు. తనే నిర్మాతగా మారాడు. వర్తమాన ఉద్యమమే ప్రధాన కథాంశంగా జైబోలో తెలంగాణ చిత్రాన్ని ఒక ఉద్య మంలా నిర్మించాడు. రాష్ర్టాలుగా విడిపోదాం-అన్నదమ్ములుగా, గౌరవంగా బతుకుదాం అని చాటిచెప్పిన జై బోలో తెలంగాణ అనేక అవరోధాలను దాటుకొని ఉద్యమ నాయకుని ప్రోత్సాహంతో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ సమయంలో శంకర్ స్నేహితులు ఆందోళనపడ్డారు, అవతలివాళ్లు అడ్డు పడ్డారు. అయినా తనదైన చెరగని చిరునవ్వుతో శంకర్ తన సంకల్పం సఫలీకృతం అయ్యేదాకా పట్టిన పట్టు విడువలేదు. అది అతనిలో ఉన్న స్వాభావిక లక్షణం. తనమొదటి సినిమాలో కూడా సమాజంలో రగులు తున్న సమస్యనే ప్రధాన కథాంశంగా తీసుకున్నాడు.

ఏదేమైనా సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా శంకర్ స్టూడియోతో తొలి అడుగు పడిందనే అనుకుంటున్నాను. నల్లగొండ నుంచి వచ్చిన ఒక సామాన్యుడు, అసామాన్యుడు అయ్యాడు. తన కార్యసాధనతో అద్భుతంగా స్టూడియో నడిపి ఎందరికో ఆదర్శమవుతాడనే నమ్మకం నాకున్నది. అన్ని భాషల నిర్మాణాలకు అనువైన ప్రాంతంగా ఒక సినీ హబ్‌గా ఎంతో అవకాశం ఉన్న మన హైదరాబాద్ నగరంలో ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఒక విజనరీ సారథ్యంలో సరికొత్త స్టూడియో అందరికీ అందుబాటులోకి రావడం అందరూ హర్షించాల్సిన విషయం.


ఎన్‌కౌంటర్! ఎన్.శంకర్ అంటే ఎన్‌కౌంటర్ శంకర్ అన్నంతగా ఆ సినిమా పెద్ద హిట్టయింది. సూపర్‌స్టార్ కృష్ణకు ఒక సరికొత్త ఇమేజ్ తీసు కొచ్చింది. ఆ కథ చేస్తానన్న నిర్మాత ఆలస్యం చేస్తే ఆ కథనే తీస్తాను తప్ప ఇంకో సినిమా చేయనని పట్టుపట్టాడు. దర్శకుడిగా అవకాశాలు వచ్చినా వద్దనుకొని సహకార దర్శకుడిగానే కొనసాగాడు. ఆ పట్టుదల చూసి హీరో కృష్ణ ఆ సినిమా నిర్మించారు. గ్రామీణ మధ్యతరగతి నేపథ్యమైనా సాహిత్యం పట్ల అభిరుచి వివిధ సామాజికాంశాల గురించి చేసిన అధ్యయ నం శంకర్‌కు ప్రపంచాన్ని, ప్రపంచానికి శంకర్‌ను పరిచయం చేసింది. అధ్యయనమే ఆ తర్వాత రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తాను రూపొందిం చిన శ్రీరాములయ్య సినిమాకు ప్రేరణగా నిలిచింది. లార్జర్ దేన్ లైఫ్ లాం టి ఆ బయోపిక్‌ను చిన్న వయసులోనే డైరెక్ట్ చేసి సమాజం, సాహిత్యమే కాదు, సినిమా కళకు సంబంధించిన నైపుణ్యాన్ని ప్రతిభను ప్రదర్శించారు. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రదర్శకుడిగా ప్రతి ష్ఠాత్మకమైన నంది అవార్డ్స్ అందుకోవడమే కాకుండా అనేక రాష్ట్ర, జాతీ య, అంతర్జాతీయ అవార్డు కమిటీలకు చైర్మన్‌గా జ్యూరీ మెంబర్‌గా అత్యుత్తమ సేవలు అందించారు. వివాదాలకు ఆస్కారం ఉండే సినిమా పరిశ్రమకు చెందిన సంఘాలకు, సమాఖ్యలకు వివాదరహితుడిగా (అధ్య క్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో) సమర్థవంతంగా పనిచే శాడు. ప్రస్తుతం తెలుగు దర్శకుల సంఘం ప్రెసిడెంట్‌గా-నాయకత్వం వహిస్తు న్నారు. ఇదంతా శంకర్ సంకల్పబలాన్ని, సమర్థవంతమైన ఆచ రణాత్మక కార్యశీలతను సూచిస్తాయి. మన రాష్ట్రంలో అందరికీ ముఖ్యంగా తెలంగాణ యువతకు అందు బాటులో ఉండేవిధంగా స్టూడియో ఉంటే బాగుంటుందన్న కేసీఆర్ ఆలో చనకు అనుగుణంగా స్టూడియో నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు.

ఆ వెంటనే విదేశాల్లో ఉన్న స్టూడియోల నిర్మాణాన్ని అవలంబిస్తున్న ఆధునిక రీతులను ఆకళింపు చేసుకున్నాడు. స్టూడియో నిర్వహిస్తున్న అనేక మంది పెద్దలను వాటిని ఉపయోగిస్తున్న దర్శకనిర్మాతలను కలిసి వారి సాధక బాధకాలను కూలంకషంగా చర్చించా రు. ఫ్లోర్స్ నిర్మాణాల్లో స్థలం వినియో గానికి ఎలాంటి పద్ధతులను పాటించా లి, దర్శకనిర్మాతలకు వారి బడ్జెట్‌కు అనుగుణంగా ఏ రకంగా సేవలందించా లన్న విషయాల్లో ఆయన కు ఒక స్పష్ట త ఉన్నది. దేశమంటే మట్టికాదు అన్నట్టు స్టూడియో అంటే ఎత్తయిన గోడలు మార్చుకునే సెట్టింగులు కాదు, సినిమా రంగంలో మార్పులు తీసుకొచ్చే ఒక చలనచిత్ర విధానం అని కేసీఆర్‌కు తెలుసు, ఆయన ఆలోచనలను అభిమానించి అర్థం చేసుకున్న శంకర్‌కు తెలుసు. దర్శకుల కలలు, నిర్మా తల అభిరుచులు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌కు కావాల్సిన సౌకర్యాల గురిం చి వారితో కలిసి పని చేసిన అనుభవంతో అర్థం చేసుకొని డిజైన్ చేస్తున్నా రు. శంకర్ స్టూడియో అంటే అది మన స్టూడియో అని అనుకునేవిధంగా తెలంగాణ యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడమే కాకుండా వారికి తగినవిధంగా గైడెన్స్ కూడా ఇస్తానంటున్నారు. ఎందుకంటే తన కు బాధలు తెలుసు, బాధ్యతలు తెలుసు. ఏదేమైనా సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా శంకర్ స్టూడియోతో తొలి అడుగు పడిందనే అనుకుంటు న్నాను. నల్లగొండ నుంచి వచ్చిన ఒక సామాన్యుడు, అసామాన్యుడు అయ్యాడు.
allani-sridhar
తన కార్యసాధనతో అద్భుతంగా స్టూడియో నడిపి ఎందరికో ఆదర్శమవుతాడనే నమ్మకం నాకున్నది. అన్ని భాషల నిర్మాణాలకు అను వైన ప్రాంతంగా ఒక సినీ హబ్‌గా ఎంతో అవకాశం ఉన్న మన హైదరాబా ద్ నగరంలో ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఒక విజనరీ సారథ్యంలో సరికొత్త స్టూడియో అందరికీ అందుబాటులోకి రావడం అం దరూ హర్షించాల్సిన విషయం. తెలంగాణ సినిమా పరిశ్రమ ముఖ్య మంత్రి కేసీఆర్‌కు సగౌరవంగా ధన్యవాదాలు తెలుపుతున్నది.
జై బోలో కేసీఆర్!

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles