కేటాయింపులులేని కేంద్ర బడ్జెట్


Tue,July 9, 2019 01:30 AM

సుసరైన కేటాయింపులు లేకుండానే భారీ లక్ష్యాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకంగా పార్లమెంటులో ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం లాగా కొత్తగా జల జీవన్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీటిని సరఫ రా చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇందుకు ఏవిధమైన ముందస్తు ప్రణాళిక లేకుండానే రాష్ర్టాల భాగస్వామ్యం లేకుండానే 2024 నాటికి దేశంలోని అన్ని ఇండ్లకు నల్లా నీళ్లను ఇస్తామని ప్రకటించారు. ఇది మంచి ఆలోచనే. కానీ నిధుల కేటాయింపే అసలు సమస్య. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ కొత్తగా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా, పథకమైనా నిధుల సమీకరణ, కేటాయింపులు లేకుండా ముందడుగు వేయరనే పేరున్నది. ఆయన దృఢ సంకల్పంతో మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందే ప్రాజెక్టుకు అవసరమైన నీళ్లు, భూమి, నిర్మాణ వ్యయం గురించి స్పష్టమైన అవగాహన, నిర్దిష్టమైన విధానంతో ప్రారంభించారు. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును ప్రశంసించింది. కానీ బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపు లేదు. ఇప్పుడా కార్యక్రమం తుది దశకు చేరింది. ఈ లెక్కన దేశమంతటికి ఇంటింటికి నదీ జలాల ద్వారా నల్లా నీరును ఇచ్చినట్లయితే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో అంత కేటాయింపులు లేవు. దీంతో ఈ ప్రాజెక్టు అమలుపై అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. కేటాయించిన నిధులు కూడా తాగునీరు, పారిశుద్ధ్యానికి అని పేర్కొన్నారు.


రానున్న కాలంలో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, కలప, ఆహార, ఆటోమొబైల్, రవాణా, విద్యుత్తు తదితర ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులను స్వీకరించి ప్రభుత్వం ముందుకు పోవాలి. దీనివల్ల కేంద్రం అనుకున్న లక్ష్యమైన 5 లక్షల ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి 2030 వరకు సాధ్యమయ్యే అవకాశముంటుంది. దానికి బడ్జెట్‌లో కేటాయింపులు భారీ ఎత్తున పెంచాలి. లేదంటే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన అనే నినాదం అపహాస్యమవుతుంది.


ప్రస్తుత కేటాయింపులతో 2024 కాదు కదా 2044లో కూడా ఇంటింటికి నల్లా నీళ్లు రావు. బడ్జెట్‌లో అతిముఖ్యమైన రెండు కొత్త నిర్ణయాలను ముందుకు తీసుకొచ్చారు. అందులో 1) మౌలిక వసతుల కల్పన, 2) డిజిటల్ ఎకనామి క్, ఉపాధి కల్పన వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 2014 బడ్జెట్ సందర్భంగా ప్రతి పల్లెకు ప్రధాన మంత్రి సడక్ యోజన కింద రోడ్డు సౌక ర్యం కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. కాని ఇప్పటికి మన దేశంలో 30శాతం పైన ఆవాసాలకు అంటే 1,60,000 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రం సరియైన నిధులు కేటాయించకపోవడమే. ప్రపంచంలో భారతదేశం రెండవ అతి పెద్ద రోడ్డు వ్యవస్థ ఉన్న దేశంగా ఉన్నది. మొత్తం లక్షల కిలోమీటర్ల రహదారుల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కంటే రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆధ్వర్యంలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని దేశంలో మౌలిక సదుపా యాల కల్పనకు బడ్జెట్‌లో 2030 నాటికి లక్షలకోట్ల రూపాయలు ఖర్చుపెడ్తామని ఆర్థికమంత్రి విన్నవించారు. కానీ మౌలిక వసతులలో ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలియచేయలేదు. అందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత? ప్రైవేట్ భాగస్వామ్యం ఎంత? అనే విషయాలపై స్పష్టత లేదు. అయితే కేంద్రం దీర్ఘకాలికమైన భారీ అభివృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. దీనివల్ల పట్టణ, గ్రామాల మధ్య అంతరం తగ్గుతుంది. ఇది దేశ సమతుల్య అభివృద్ధికి దోహదపడే అంశమే. అలాగే ఆ రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగడానికి అవకాశముంటుంది. కొత్తగా 2 నుంచి 3.50 లక్షల వరకు ఇంటి నిర్మాణ రుణగ్రస్తులకు వడ్డీ మినహాయింపు ఇవ్వడం వల్ల నిర్మాణ రంగం విస్తరించడానికి అవకాశముంటుంది.

దీనివల్ల స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. పెట్టుబడులు పెద్దమొత్తంలో రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కానీ బడ్జెట్ కేటాయింపులో మాత్రం మొత్తం 100 మంత్రిత్వశాఖలు, విభాగాలకు గాను 52 మంత్రిత్వశాఖలకు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించి చూపించారు. అతి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటున్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో 0.34శాతం, గ్రామీణ అభివృద్ధికి 0.45శాతం మాత్రమే ఈ బడ్జెట్‌లో కేటాయింపు చేయడం కేంద్ర లక్ష్యసాధనకు ప్రధాన అడ్డంకి అవుతుంది. రానున్న కాలంలో కాగితం, ప్రింటింగ్ రబ్బర్, టొబాకో, లోహపరిశ్రమ లాంటివి అనేకం సంక్షోభంలోకి వెళుతున్న నేపథ్యంలో కేంద్రం డిజిటల్ ఎకానమి, ఉపాధికల్పన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. దానిలో భాగంగా అంకుర కోసం కొత్త దూరదర్శన్ చానల్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా వారి సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగినది. అలాగే అంకుర సంస్థలకు ఆదాయ మదిం పు ఉండబోవడం లేదని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇవన్నీ డిజిటల్ ఎకా నమీ, ఉపాధి కల్పనకు సరిపోవు. చైనాకు దీటుగా అభివృద్ధి చెందాలంటే దేశంలోని యువతకు నవ సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలాగ ప్రోత్సహించాలి. రోబోటెక్స్, బిగ్‌డేటా, కృత్రిమ మేధ, వర్చువల్ రియాలిటి, త్రీడి ప్రింటింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. దేశంలో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం టి.ఎస్. ఐపాస్ ద్వారా సర్వతోముఖాభివృద్ధి చెందడానికి బాటలు వేస్తున్నది. కేంద్ర పాలకులు ఉపాధి లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తే అనేక అసమానతలు చోటు చేసుకుంటాయి.
dr-b-niranjan
ఉపాధి కల్పన అనేది ప్రధానాంశంగా పాలకులు భావించనందువల్లనే నిరుద్యోగం గత 45 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. మరొకవైపు నూతన ఆర్థిక విధానం అమలు తర్వాత కూడా 2018 లెక్కల ప్రకారం వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నవారు దేశంలో 43.9శాతం ఉన్నారు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత చైనా స్వాతంత్య్రం పొందింది. కానీ ఆ దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు నెలవారి జీతంతో జీవనం సాగిస్తుంటే మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే నెలవారీ జీతంతో జీవనం సాగిస్తున్నారు. దేశంలో వ్యవసాయేతర ఉపాధి కల్పన జరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగడగానికి అవకాశమేర్పడుతుంది. దీనికోసం ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలి. అంతేగాకుండా రానున్న కాలంలో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, కలప, ఆహార, ఆటోమొబైల్, రవాణా, విద్యుత్తు తదితర ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులను స్వీకరించి ప్రభుత్వం ముందుకు పోవాలి. దీని వల్ల కేంద్రం అనుకున్న లక్ష్యమైన 5 లక్షల ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి 2030 వరకు సాధ్యమయ్యే అవకాశముంటుంది. దానికి బడ్జెట్‌లో కేటాయింపులు భారీ ఎత్తున పెంచాలి. లేదంటే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాల న అనే నినాదం అపహాస్యమవుతుంది.
(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు)

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles