కనిపించని కుట్రలు

Sun,July 7, 2019 02:33 AM

అమెరికా అధ్యక్షుడిగా ట్రం ప్ ఎన్నికైన తరువాత, పోయిన ఏడాది 2018 లో, అమెరికా రాజనీతి శాస్త్రవేత్తలు స్టీవెన్ లెవిట్‌స్కీ, డేనియల్ జిబ్లాట్ ప్రజాస్వామ్యాలు ఎట్లా మరణిస్తయి (హౌ డెమాక్రసీస్ డై) అనే పుస్తకం రాసిండ్రు. అమెరికాలో ట్రంప్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కుప్పకూలుస్తున్న తీరును వారు ఈ పుస్తకంలో చర్చించారు. ఈ పుస్తకంలోని రచయితల అన్ని అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు. ప్రత్యేకించి లాటిన్ అమెరికా రాజకీయాలపై విశ్లేషణలకు సంబంధించి అమెరికా కోణంలో చూడటాన్ని మనం అంగీకరించలేము. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో సైనిక తిరుగుబాట్లకు, నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడటానికి అమెరికా కుట్రలే కారణమనేది వారు మనంత స్పష్టంగా చెప్పలేరు. ప్రచ్ఛన్నయుద్ధం తరువాత నేటి ప్రజాస్వామ్య దురవస్థలకు కారణం ఏ జంకూగొంకూ లేని బరితెగించిన కార్పొరేట్ శక్తులే అనేది ప్రధానాంశంగా వారు మాట్లాడకపోవచ్చు. అయినప్పటికీ రాజనీతి శాస్త్రవేత్తలుగా వారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు వచ్చిన ప్రమాదంపై చేసిన హెచ్చరికలు పరిగణనలోకి తీసుకోదగినవి. రాజకీయాల్లోకి చొరబడిన ట్రంప్ వంటి దేశ భక్తుల మూలంగా ప్రజాస్వామ్యం పతనమవుతున్న తీరును హెచ్చరిస్తూ ఇటువంటి వారిని ముందే పసిగట్టాలంటూ, వారి లక్షణాలను ఎత్తిచూపారు. అమెరికాలోనే కాదు, ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటున్న వర్ధమాన దేశాలలో కొందరు దేశభక్తుల పేర అవతరించి, ఇప్పుడున్న వ్యవస్థను బదనాం చేస్తూ అధికారానికి వచ్చి, క్రమంగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించే పోకడ సాగుతున్నది.

ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యానికి రక్షణ కేవలం ప్రజాస్వామిక వ్యవస్థల వల్ల లభించదు. రాజకీయపక్షాలే ప్రజాస్వామ్యానికి రక్షణ వ్యవస్థలు. అమెరికా రాజకీయాల్లో రెండు అలిఖిత నియమాలున్నాయి. ఒకటి పరస్పర సహనం పాటించడం. అంటే ఒకరినొకరు న్యాయబద్ధమైన ప్రత్యర్థిగా గుర్తించుకుంటారు. రెండవది అధికార వ్యవస్థలను ప్రత్యర్థులను అణిచివేయడానికి ఉపయోగించుకోకపోవడం. ఈ రెండు నియమాలే అమెరికా ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలుగా ఉన్నాయి. కానీ ఈ కవచాలు ఇప్పుడు బలహీనపడుతున్నాయి. 1980, 90 దశకం నుంచి మొదలైన ఈ పరిణామాన్ని ట్రంప్ వేగవంతం చేశాడు. అమెరికా సమాజంలో జాతి, సాంస్కృతికపరమైన కేంద్రీకరణ పెరిగిపోతున్నది. ఇటువంటి తీవ్ర కేంద్రీకరణలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తాయి.


దీనిని ఎదుర్కోవలసిన బాధ్యత సంప్రదాయ రాజకీయపక్షాల మీద ఉన్నదనేది వారి సూత్రీకరణ. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో పలు దేశాలలో సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి నియంతలు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పు డు ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ప్రమాదం సైనిక తిరుగుబాట్ల వల్లనో, నిరంకుశ శక్తులు కూలదోయడం వల్లనో కాదు. ప్రజాస్వామ్యం మరణించేది సైనిక జనరల్స్ వల్ల కాదు, ఎన్నికైన నాయకుల చేతుల్లోనే. దేశాధ్యక్షులు లేదా ప్రధానులు తాము అధికారంలోకి రావడానికి ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉపయోగపడ్డదో దానినే కూలదోస్తారు. కొన్ని సందర్భాల్లో జర్మనీలో హిట్లర్ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని వెంటనే కూలదోస్తారు. కానీ చాలా సందర్భాలలో ప్రజాస్వామ్యం మెల్లగా పతనమవుతుం ది, ఆ పతనం అయ్యే తీరు కంటికి కనిపించదు. బ్యాలట్ పెట్టె ద్వారానే ప్రజాస్వామ్యం పతనమవుతూ ఉంటుంది. చిలీలో తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని వెంటనే తెలిసిపోయింది. అధ్యక్ష భవనం తగులబడిపోయింది. అధ్యక్షుడి హత్య జరిగింది. రాజ్యాంగం రద్దయింది. కానీ ఈ కాలంలో ఇవేవీ జరుగవు. రోడ్ల మీద సైనిక ట్యాంకులు కనిపించవు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నీ పదిలంగానే కనిపిస్తాయి. ప్రజలు ఓట్లు వేస్తారు. ఎన్నికైన నాయకుడే ప్రజాస్వామ్యాన్ని మెల్లగా పీల్చిపిప్పి చేస్తాడు. ప్రజాస్వామ్యాన్ని పాతరపెట్టడమంతా చట్టబద్ధంగానే సాగుతుంది. ఈ తతంగాన్ని చట్టసభలు, కోర్టులు ఆమోదిస్తుంటాయి. దీనిని ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరుస్తున్నట్టుగా గొప్పగా చెప్పుకుంటారు. న్యాయ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు, అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు, ఎన్నికల ప్రక్రికయను ప్రక్షాళన చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది.

పత్రికలు అమ్ముడుపోతయి, లేదా బెదిరింపుల వల్ల స్వీయ సెన్సార్‌షిప్ పాటిస్తయి. ఏమి జరుగుతున్నదనేది ప్రజలకు అర్థం కాదు. సైనిక చట్టం అమల్లోకి వచ్చి రాజ్యాంగం రద్దయినట్టు ఒక్క ప్రకటన కూడా వెలువడదు. ప్రజాస్వామ్యం పతనమవుతున్న తీరు మనం గ్రహించనేలేము. రాజ్యాంగ వ్యవస్థలేవీ ఈ నిరంకుశ పాలకులను అడ్డుకోలేవు. న్యాయస్థానాలను, మీడియాను, రాజ్యాంగ తటస్థ వ్యవస్థలను ఈ నాయకులు ఆయుధాలుగా మార్చుకొని ప్రత్యర్థులను అణిచివేసేందుకు ఉపయోగించుకుంటారు. ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యానికి రక్షణ కేవలం ప్రజాస్వామిక వ్యవస్థల వల్ల లభించదు. రాజకీయపక్షాలే ప్రజాస్వామ్యానికి రక్షణ వ్యవస్థలు. అమెరికా రాజకీయాల్లో రెండు అలిఖిత నియమాలున్నాయి. ఒకటి పరస్పర సహనం పాటించడం. అంటే ఒకరినొకరు న్యాయబద్ధమైన ప్రత్యర్థిగా గుర్తించుకుంటారు. రెండవది అధికార వ్యవస్థలను ప్రత్యర్థులను అణిచివేయడానికి ఉపయోగించుకోకపోవడం. ఈ రెండు నియమాలే అమెరికా ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలుగా ఉన్నాయి. కానీ ఈ కవచాలు ఇప్పుడు బలహీనపడుతున్నాయి. 1980, 90 దశకం నుంచి మొదలైన ఈ పరిణామాన్ని ట్రంప్ వేగవంతం చేశాడు. అమెరికా సమాజంలో జాతి, సాంస్కృతికపరమైన కేంద్రీకరణ పెరిగిపోతున్నది. ఇటువం టి తీవ్ర కేంద్రీకరణలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తాయి.

ప్రజాస్వామిక విలువలను రాజకీయపక్షాలు గౌరవిస్తూ ఉండాలె. నిరంకుశ తత్వం కలవారు వ్యవస్థలో చొరబడి ఎదుగకుండా రాజకీయపక్షాలు జాగ్రత్తపడా లె. ఇది జరుగనప్పుడు నిరంకుశులు రాజకీయ వ్యవస్థ ద్వారా అధికారానికి వచ్చి, ఆ రాజకీయ క్రీడా నియమాలనే ఉల్లంఘిస్తారు. రాజకీయపక్షాలు ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి, అధికారంలోకి రావడానికి నిరంకుశ శక్తులతో చేతులు కలుపవద్దు. ఈ విధంగా పొత్తుపెట్టుకోవడం వల్లనే హిట్లర్, ముస్సోలిని వంటి నియంతలు బలం పుంజుకొని అధికారానికి రావడానికి బాటపడ్డది. ఇటువంటి పాపులిస్టు నాయకులు స్థిరపడి ఉన్న రాజకీయ పక్షాల విశ్వసనీయతను దెబ్బకొట్టే ప్రయ త్నం చేస్తారు. తమ వ్యతిరేక పార్టీలను ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. ప్రత్యర్థుల దేశభక్తిని కూడా ప్రశ్నిస్తారు. ఇప్పుడున్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదనీ, దీనిని కులీన వర్గం హైజాక్ చేసిందని చెబుతారు. ఇటువంటి లక్షణాలు గల వారిని రాజకీయపక్షాలు ముందుగానే పసిగట్టి అడ్డుకోవాలె. ఈ నిరంకుశ పోకడగల నాయకులను ముందుగా గుర్తించడానికి వారి లక్షణాలను ఈ పుస్తక రచయితలు వివరించారు. వీరికి ప్రజాస్వామ్య నియమాల మీద ఏ మాత్రం నమ్మకం లేకపోవడం మొదటి లక్షణం. తాను ఓడిపోతే ఈ ఎన్నికలను గుర్తించనని ట్రంప్ ముందే ప్రకటించాడు. వీరు రాజ్యాంగాన్ని తిరస్కరిస్తారు లేదా దానిని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తుంటారు. రెండవ లక్షణం-వీరు తమ ప్రత్యర్థులను విచ్ఛిన్నకారులని, దేశ భద్రతకు ప్రమాదకరమని ప్రచారం చేస్తారు. నేరస్తులనీ, చట్ట వ్యతిరేకులనీ, విదేశీ ఏజెంట్లనీ నిరాధార ఆరోపణలు కుమ్మరిస్తారు. ట్రంప్ హిల్లరీ క్లింటన్ నేరస్తురాలనీ, ఆమెను జైలులో పెట్టాలని అన్నాడు.
p-venkatesham
మూడవ లక్షణం-సాయుధ ముఠాలతో వీరికి సం బంధాలుంటాయి. మూకదాడులను ప్రోత్సహిస్తూ ఉంటారు లేదా వాటి విద్వేష దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తారు. నాలుగో లక్షణం- ప్రజల హక్కులను, అసమ్మతిని అరికట్టే చట్టాలకు మరింత పదునుపెట్టాలని కోరుకుంటారు. ప్రత్యర్థులను, మీడియాను కేసులు పెట్టి వేధిస్తారు, బెదిరిస్తుంటారు. ట్రంప్ వంటి నాయకుల్లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అమెరికాతోపాటు యూరప్‌లో, ఇతర ప్రజాస్వామ్య దేశాలలో జాతీయ వాదులుగా, దేశభక్తులుగా చెప్పుకునే నాయకులు ప్రమాదకరంగా తయారయ్యారు. ఇటువంటి నాయకులు వచ్చినప్పుడు రాజకీయపక్షాలన్నీ ఏకమై అడ్డుకోవాలె. ట్రంప్ లక్షణాలు ముందే బయటిపడినందున రిపబ్లికన్ పార్టీ వారు అతడికి వ్యతిరేకంగా పనిచేయాల్సింది. కానీ వాళ్లు పార్టీ బాటనే అనుసరించారు. ట్రంప్ అన్ని మెట్లెక్కుతూ చివరికి అధ్యక్షుడయ్యాడు. ఇటువంటి నాయకులను అడ్డుకోవడానికి పార్టీ ప్రయోజనాలకన్నా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలె. మిగతా పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి ఏక మై ఎదుర్కోవాలె. మతాలు, జాతులు, సంస్కృతులు ఎన్ని ఉన్నా పరస్పర గౌరవంతో సహజీవనం చేయడం ప్రజాస్వామ్య లక్ష ణం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే తప్ప నిలబడ దు. రాజ్యాంగబద్ధంగా కనిపించే ఇటువంటి ట్రంప్‌ల పాలన పట్ల అప్రమత్తం కావా లె. కనిపించని కుట్రలను కనుక్కోవాలె.
[email protected]

376
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles