కార్యకర్తలే వారధులు

Sun,July 7, 2019 02:32 AM

ప్రజాక్షేత్రంలో రాజకీయనేతలకు ప్రజల తో నేరుగా సంబంధాలు ఉన్నప్పుడే ఆ నాయకులు చిరకాలం ప్రజా నాయకులుగా నిలిచిపోతారు. రాజకీయ నేతలుగా గ్రామస్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో వెలుగొందిన వారు అనేకమంది ఉన్నారు. పార్టీల భవిష్యత్తు కూడా గ్రామస్థాయిలో ఉన్న బలంపైనే ఆధారపడి ఉంటుంది. గ్రామస్థాయిలో ఉండే నాయకుల విజయాలు, వైఫల్యాలే ఆయా పార్టీల జయాపజయాలను నిర్దేశి స్తాయి. అప్పుడప్పుడు మెరుపులా రాజకీయాలలో కొన్నిసార్లు ఎలాంటి నిర్మాణం లేని పార్టీలు అధికారంలోకి వచ్చినా, నిలదొక్కుకోవాలంటే గ్రామస్థాయి నుంచి నిర్మాణం చారిత్రక అవసరం. అలా గ్రామస్థాయిలో ఎలాంటి బలం లేక, ఎమర్జె న్సీ పరిణామాల అనంతరం ఏర్పడిన జనతా పార్టీ కొన్ని నెలల్లోనే కూలి పోయిన చరిత్ర తెలిసిందే. నిజానికి ప్రభుత్వాల విజయాలు ఆ పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధిపై ఆధా రపడి ఉంటుంది. వారు పార్టీపై చూపించే అభిమానం ఆ పార్టీ మనుగడకు ప్రధానం. అలాగే ఆ పార్టీ నాయకులు తమ కార్యకర్తల మంచి చెడులను చూసే విధానం, కార్యకర్తల సామర్థ్యాన్ని గుర్తించి, వారిని పైస్థా యికి ఎదిగించడంలోనే పార్టీ ఆత్మ దాగి ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల కు చేరాలంటే, ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకుల చురుకైన పాత్ర గ్రామాల్లో ప్రధానమైనది. గ్రామస్థాయిలో నిజమైన లబ్ధిదారులు లాభపడటానికి అధికారుల శ్రమ, ప్రణాళికలు మాత్రమే పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేవు. గ్రామస్థాయి పనుల్లో చాలావరకు అధికారులు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు గ్రామస్థాయి కార్యకర్తలపై ఆధారపడి వారి సూచనల మేరకే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసే ప్రయత్నాలు చేస్తారు. గ్రామస్థాయిలో ఉండే పార్టీ నాయకుల, కార్యకర్తలలో చిత్తశుద్ధి, నిజాయితీ లోపిస్తే అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉంటుంది.

పార్టీ అధ్యక్షుని ఆలోచనలకు రూపం ఇవ్వడానికి గాను, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ సామాన్య కార్యకర్తలకు రాజకీయ సిద్ధాంత అవగాహన తరగతులను కూడా నిర్వహించాలనుకోవడం టీఆర్‌ఎస్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. రాజకీయ కార్యకర్తలు అంటే అవినీతికి మూలం అనే అపవాదును రూపుమాపి, ప్రజలకు అన్నివేళలా సహాయకారులుగా, సేవకులుగా ఉండాలనే కేసీఆర్ ఆలోచనలకు రేపటి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు దేశంలోనే ఉదాహరణగా ఎదుగాలనేది లక్ష్యంగా పార్టీ నిర్మాణం కొనసాగడం హర్షణీయం. నిజానికిదే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పుకోవాలి.


నిజానికి ఈ రోజు అనేక పథకాలు లబ్ధిదారునికి చేరకపోవడాన్ని ప్రభుత్వాలే గుర్తించి అనేక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి కార్యకర్తల నిబద్ధ కార్యాచరణ ఎంతో అత్యావశ్యం. గ్రామస్థాయి లో సామాన్య ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునే పనులు చాలా చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖలతో గ్రామప్రజల్లో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు తప్పక అవసరం వస్తుంది. రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటుంది. జనన, మరణ ధృవపత్రాల వరకు రెవెన్యూ శాఖ అవసరం ఉంటుంది. విద్యార్థి పై చదువులకు అవసరం ఉన్న కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల వరకు రెవె న్యూ శాఖనే ఇస్తుంది. అలాగే రైతు జీవితానికి మూలమైన భూమి రికార్డుల విషయంలో గ్రామం నుంచి పట్టణం వరకు రెవెన్యూ శాఖదే బాధ్యత. అదేవిధంగా చిన్న వ్యక్తిగత సమస్యల నుంచి ఆర్థిక, రాజకీయ, సాంఘీక సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ పోలీసు శాఖను ఆశ్రయిస్తుంటారు. పోలీసులంటే సామాన్య ప్రజలకు రక్షణగా ఉంటారనే భావం ఉన్నది. కానీ చాలా సందర్భాల్లో సామాన్యులే బాధితులుగా ఉండటం శోచనీయం. బలహీనులు, ఆదివాసులు, మహిళలు తమ కనీస హక్కులను రక్షించుకోవడంలో, ఇతరులతో పాటు తాము కనీస గౌరవతో బతుకాలని కోరుకోవడం అత్యాశ కాదు. కానీ అలాంటి పరిస్థితులను ఏర్పరచాల్సిన బాధ్యత పాలకులది. ఈ బాధ్యతను సంపూర్ణంగా గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా ఎన్నో చర్యలను తీసుకున్నది. వినూత్న కార్యక్రమా లకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు రాజకీయ చిత్రపటమే కాదు, సామాజిక చిత్రపటం కూడా మార్చాలనే లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ప్రభుత్వ పాలనా యంత్రాంగాలను కూడా ప్రక్షాళన చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలతో ఒక ప్రాపంచిక సామాజిక దృక్పథంతో కేసీఆర్ పాలనా యంత్రాంగాలను ప్రజలకు జవాబుదారీగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులై కృషిచేస్తున్నారు.


నిజానికి దేశంలో రాజకీయ సిద్ధాంతాలకు, రాజకీయ నాయకులకు కొదువ లేదు. కానీ వారి ఆలోచనలను గ్రామస్థాయి కార్యకర్త వరకు చేరవేయడంలోనే వైఫల్యం ఉన్నది. గ్రామస్థాయిలో ఉండే పార్టీ నాయకత్వంలో సరైన నాయకత్వ లక్షణాలను పెం పొందించడంలో ఆయా పార్టీల నాయకత్వాలు విఫ లం కావడమే దీనికి కారణం. నిస్వార్థ రాజకీయ నాయకత్వ లోపమే గ్రామ స్థాయిలో అవినీతికి ప్రధా న కారణంగా సామాజికవేత్తలు చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని తమ సిద్ధాంతాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో ఎదిగించాలని తొలిసారిగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలాగే దక్షిణాదిలో ద్రావిడ మున్నేట్ర కజగం (డీఏంకే) మాదిరిగా శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోయేలా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను తయారుచేయడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నది. పార్టీ అధ్యక్షుని ఆలోచనలకు రూపం ఇవ్వడానికి గాను, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ సామాన్య కార్యకర్తలకు రాజకీయ సిద్ధాంత అవగాహన తరగతులను కూడా నిర్వహించాలనుకోవడం టీఆర్‌ఎస్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. రాజకీయ కార్యకర్తలు అంటే అవినీతికి మూలం అనే అపవాదును రూపుమాపి, ప్రజలకు అన్నివేళలా సహాయకారులుగా, సేవకులుగా ఉండాలనే కేసీ ఆర్ ఆలోచనలకు రేపటి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు దేశంలోనే ఉదాహరణగా ఎదుగాలనేది లక్ష్యంగా పార్టీ నిర్మాణం కొనసాగడం హర్షణీయం. నిజానికిదే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా చెప్పుకోవాలి. గ్రామాల్లో ఉండే పార్టీ కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పార్టీని ముందుకుతీసుకెళ్తే అన్నిరంగాల్లో అవినీతి రూపుమాపడం కష్టం కాదు.

ఎందుకంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో గ్రామీణ ప్రాంత రాజకీయ కార్యకర్తల పాత్ర ఎంత ప్రధానమైందో ప్రజలకు తెలిసిందే. వృద్ధాప్య పింఛన్లతో పాటు రెండు గదుల ఇండ్ల నిర్మాణం వరకు దాదాపు వందరకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజ యవంతం చేయటంలో గ్రామస్థాయి కార్యకర్తలదే కీలకపాత్ర. అందుకే పార్టీకి, పాలనా వ్యవస్థలకు, పాలనా రంగానికి కార్యకర్తలే కండ్లుఅని రాజనీతి శాస్త్రవేత్తలు చెబుతారు. సరిగ్గా ఈ లక్ష్యాల సాధన దిశగా టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమం సాగటం ఆహ్వానించదగిన పరిణామం. నిస్వార్థ, త్యాగపూరిత పార్టీ కార్యకర్తల బలం లేకపోయినట్లయితే.. సంక్షేమ పథకాలేవీ నిజమైన లబ్ధిదారులకు చేరటం అసాధ్యమవుతుంది. ఆయా గ్రామాల్లో ఉండే పరపతిగల వారు అధికారులను మభ్యపెట్టి, తప్పుడు ధృవపత్రలాను సృష్టించడం కష్టం కాదు. కానీ గ్రామంలో ఉం డే సామాన్య కార్యకర్త తమ గ్రామంలో ఉండే నిజమైన లబ్ధిదారులను గుర్తించడం సులువు. అతడు పార్టీకి, ప్రజలకు అంకితభావంతో కట్టుబడి ఉంటే గ్రామస్థాయిలో ఇలాంటి పథకాలలో అవకతవకలను అరికట్టవచ్చు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయడంలో కార్యకర్తలకు తగిన మార్గనిర్దేశనం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులదే. ఈ సత్యాన్ని గ్రహించిన టీఆర్‌ఎస్ పార్టీ రాబోయే కాలంలో సైనికుల్లాంటి కార్యకర్తలను తయారుచేసుకుంటే తెలంగాణలో సుపరిపాలన సుసాధ్య మే. ఉద్యమ పార్టీగా పుట్టి, రాజకీయ పార్టీగా ఎదిగిన టీఆర్‌ఎస్ మళ్ళీ ఉద్యమస్ఫూర్తితో పార్టీ నిర్మాణానికి పునాదులు వేయటం చారిత్రక అవ సరం.
Prabhakar-rao
తెలంగాణ ప్రజల ఆశాదీపం కేసీఆర్ లక్ష్యం టీఆర్‌ఎస్‌ను ప్రజల శక్తిగా, వారి ఆకాంక్షల ప్రతిరూపంగా తీర్చిది ద్దటం. పార్టీ, ప్రజలు వేరు కాదు, ప్రజల ఆశల ఆకాంక్షల ప్రతిబింబమే పార్టీ అని ఆచరణలో నిజం చేయటమే కేసీఆర్ లక్ష్యం. ప్రజల కోసమే ప్రభుత్వం అనే తాత్విక ఆలో చనా భూమికతో ఇప్పు డు చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)

225
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles