తెలంగాణ ఆత్మ ‘మల్లేశం’

Sun,June 23, 2019 01:40 AM

పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితాన్ని తెరకెక్కించిన సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ది. సినిమా చూస్తూ జనాలు ఒక్కతీర్గా సీటీలు బజాయించిండ్రు. ఆడ నే అనిపించింది సీన్మా దుమ్ములేప్తదని. సినిమా ఎన్ని మాట్ల చూసినా మల్లమల్ల సూద్దాం అనే టట్లనే ఉన్నది. సినిమా చూసిన తర్వా త మాకు కలిగిన మధురానుభూతి, మనసులోని మాటలే ఈ వ్యాసం. మల్లేశం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఒక చిత్రవథకు గురవుతున్న ఛిద్ర నేత వ్యవస్థ వ్యథ.మల్లేశం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక జాతి కన్నీటి ధార. ప్రవాహంలో మునుగుతూ తేలుతున్నవాడికే తెలుస్తాయి ఈత కొట్టడంలో ఉన్న సాదకబాధకాలు. ఒక లక్ష్యసాధనలో ఎదురైన అవమానాల ను దిగమింగి, అపజయాలను తట్టుకొని, పేదరికాన్ని, నిరక్ష్యరాస్యతను లెక్కచేయక సంకల్పంతో అనుకున్నది సాధించే వరకు మల్లేశం పడిన మానసిక సంఘర్షణే ఈ సినిమా. ఇది వ్యక్తిగతమైన కథ. వ్యవస్థాగతంగా చూస్తే యంత్రాలొచ్చాక, ప్యాక్టరీలు పెట్టా క చేతిపనులు అడుగంటిపోయాయి. కులవృత్తులు కూలబడిపోయాయి. అంతవరకు స్వయం ఉపాధి కేంద్రాలుగా, చిన్న తరహా పరిశ్రమలుగా పనిచేసిన కుటుంబాలు రోజువారీ కూలీ పనులకు వెళ్ళలేక, తరతరాలుగా వస్తున్న చేతివృత్తుల ను మరువలేక నానా యాతన పడ్డారు. యంత్రం కొట్టిన దెబ్బను యంత్రంతోనే నయం చేయచ్చని నమ్మాడు చింతకింది మల్లేశం. పెద్ద యంత్రం వల్ల కలిగిన గాయాన్ని చిన్నయంత్రంతో నయం చేశాడు. పెరుగుతున్న జనాభా కోరికల ను, కొరతను తీర్చేలా చేతివృత్తిని చిన్నపాటి యాంత్రిక శక్తిగా మలిచే ఆలోచన చేశాడు. ఆరిపోతున్న చేనేత జీవన జ్యోతికి తనవంతు చమురును అందించాడు. అలా చేనేత కుల పురా ణ భావనారుషిగా కీర్తిగడించాడు.

మనిషి జీవనానికి ఎన్నో వృత్తులున్నాయి. కానీ చేనేత వృత్తి వల్లే ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్త్రం తయారవుతుంది. శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే బట్ట అవసరమయ్యే దశనుంచి ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేయగలిగే ట్రెండ్స్ వరకూ వస్త్ర సోయగం పురోగమించింది. ఈ పరిణామంలొనే వస్త్రంపై ఆకర్షణీయమైన డిజైన్‌లను అదనంగా నేసేందుకు చేయాల్సిన ఆసు పోయాడానికి చేసే శారీరక శ్రమను మల్లేశం కనిపెట్టిన లక్ష్మీ ఆసు యంత్రం మటుమాయం చేసింది. ఈ ఇతివృత్తాన్ని రెండున్నర గంటల సినిమాలో జనరంజకంగా మరుపురాని చలనచిత్రంగా మలిచిన ఘనత దర్శక రత్నం ఆర్.రాజ్‌కే దక్కుతుంది. డబ్బులు కుమ్మరించి ఈ సినిమా ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పటికీ మొక్కవోని దీక్షతో పేగుబంధం కోసం పోగు బంధనమే మల్లేశం సినిమా.


కథానాయకులు ఎవరో కాదు మనలోనే సామాన్యులే పుడతారని ఈ సినిమా తెలిపిం ది. అంచెలంచెలుగా కష్టాల కడలి ఈదుకుంటూ నాయకులు గా ఎదుగుతారని నిరూపించింది మల్లేశం జీవితం. దీనిని వెండితెరపై అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ సినిమా మా చిన్ననాటి జ్ఞాపకాలను, ఆటలను, పాటలను, సంస్కృతిని కలలా ఒక కళగా నా కళ్లముందు చూపించింది. ఇందులో నాటి సంస్కృతి, భాష, యాస, భావోద్వోగాలు చక్కగా ఒదిగాయి. హీరో ప్రియదర్శి మల్లేశం పాత్రలో ఒదిగాడు. నటనలో చాలాసార్లు కన్నీళ్లు తెప్పించాడు. హీరోయిన్ పాత్ర కూడా చాలా సహజంగా అందంగా ఉంది. హీరో తల్లిగా ఝాన్సీ, తండ్రిగా ఆనంద చక్రపాణి చక్కగా నటించా రు. సినిమా ప్రారంభంలో వచ్చే తత్త్వగీతం మనసును కదిలిస్తుంది. అన్ని పాటలు వినసొంపుగా సందర్భోచితంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎంతో ఆత్మీయంగా తీర్చిదిద్దారు దార్శనికులు అనదగ్గ దర్శకులు రాచకొండ రాజ్. సినిమాలో హీరోయిన్ తండ్రిగా, సినిమా నిర్మాణంలో ప్రొడక్షన్ డిజైనర్ గానూ తన సృజనాత్మకతతో అసాధారణ సేవలందించిన డాక్టర్ ఏలె లక్ష్మణ్ తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించారు. మల్లేశంతో సహజ నటుల నొసటన నుదిటి రాతనే తన గీతలతో మార్చారు లక్ష్మణ్. ఉద్యోగార్జన కోసమో, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కోసమో వృత్తి విద్యను అభ్యసిస్తున్న కుర్రాళ్ళు ఈ సినిమా చూస్తే.. జీవితమే ఎన్నో సాంకేతిక మెలకువలను ఒంటబట్టిస్తుందన్న కఠో ర వాస్తవాన్ని గ్రహిస్తారు.

మనం అన్నం వండుకొని తినే బియ్యం దుకాణంలో దొరుకుతాయని మాత్రమే తెలిసిన కొందరు నవతరం యువతకు, ఆ బియ్యమే వరిపంట ద్వారా వడ్లు నూర్చగా వస్తాయన్న క్షేత్రస్థాయి పరిజ్ఞానం ఇప్పుడు అంతగా అవసరంలేని విషయంగా అవతరిస్తున్న పరిణామాల మధ్య విడులవుతున్న ఈ మల్లేశం సినిమా మాత్రం బతుకు పోరాట అవసరాలే భవితవ్యం బాట వేస్తా యని, అన్వేషణ కోసం ఆలోచింపజేస్తాయని దృశ్యరూపంలో కళ్ళకు కట్టింది. గ్రామాల్లో మోట నుంచి మోటారుకు ఎదిగిన వ్యవసాయం మాదిరే.. చేనేతలో చేతితో మాత్రమే చేసే ఆసు పద్ధతిని, యంత్రం సాయంతో చేసే దాకా వచ్చిన సాంకేతిక క్రమం మల్లేశం ఆలోచింపజేస్తుంది. అప్పట్లో ఊర్లోని కమ్మ రి, కుమ్మరి, వడ్ల వాళ్ళు వ్యవసాయ పనిముట్ల తయారీకి ఏ ఇంజినీరింగ్ కోర్సులు చదివారన్న ప్రశ్నను రేకెత్తిస్తుంది మల్లే శం సినిమా. గౌండ్లోళ్ల మోకు, ఎడ్లబండి చక్రాలకు వాడే మేకు తయారీకి కేవలం బతుకుపోరాటం నేర్పిన జీవన పాఠాల ద్వారానే సాధ్యమైన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు సాంకేతిక విశ్వవిద్యాలయాలు సైతం క్షేత్ర స్థాయిలోనే సాంకేతిక సృజనాత్మకత బీజాలు మొలకెత్తుతాయని గ్రహించి పల్లెబాట పడుతున్నాయి. ఇదే కోవలో యాదాద్రి జిల్లా రఘునాథ పురంలోని మాచన కృష్ణ సాంచెల పరిశీలనకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వచ్చి పవర్‌లూం సాంకేతికతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అప్పటివరకూ సాధారణంగా తెలియని కొన్ని కొత్త సూక్ష్మ విషయాలను కనిపెట్టారు. ఏండ్ల నుంచి సాంచె నడుపుతున్న నాకే తెల్వని సంగతిని భావి ఇంజినీర్లు నాకు తెలిసేలా సూక్ష్మ గ్రాహ్యతతో పరిశీలించారని కృష్ణ వివరించారు.
machana-raghunandhan
మనిషి జీవనానికి ఎన్నో వృత్తులున్నాయి. కానీ చేనేత వృత్తి వల్లే ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్త్రం తయారవుతుంది. శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే బట్ట అవసరమయ్యే దశనుంచి ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేయగలిగే ట్రెండ్స్ వర కూ వస్త్ర సోయగం పురోగమించింది. ఈ పరిణామంలొనే వస్త్రంపై ఆకర్షణీయమైన డిజైన్‌లను అదనంగా నేసేందుకు చేయాల్సిన ఆసు పోయాడానికి చేసే శారీరక శ్రమను మల్లేశం కనిపెట్టిన లక్ష్మీ ఆసు యంత్రం మటుమాయం చేసింది. ఈ ఇతివృత్తాన్ని రెండున్నర గంటల సినిమాలో జనరంజకంగా మరుపురాని చలనచిత్రంగా మలిచిన ఘనత దర్శక రత్నం ఆర్.రాజ్‌కే దక్కుతుంది. డబ్బులు కుమ్మరించి ఈ సినిమా ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పటికీ మొక్కవోని దీక్షతో పేగుబంధం కోసం పోగు బంధనమే మల్లేశం సినిమా. మానవ జీవన పురోగతి పరిణామక్రమంలో ఫోన్, విద్యు త్తు బల్బు, రేడియోలు కనిపెట్టిబడినట్లే 2009లో ఆసు యం త్రం చింతకింది మల్లేశం కనిపెట్టారన్న విషయం చరిత్ర పుట ల్లో, చేనేత చరిత్రలో లిఖించబడుతుంది.1992 నుంచి మొదలైన ఆసు యంత్ర తయారీ ఆరాటం 1999 వరకూ ఏడేండ్లు సాగి 2009లో ఆ యంత్రం పేటెంట్ హక్కులు పొందడం జరిగిందని చింతకింది మల్లేశం వివరించారు. జూన్ 21న సినిమా విడుదలను పురస్కరించుకొని భూదాన్ పోచంపల్లి లో చిత్రబృందానికి చేనేత సమాజం ఘన సన్మానం చేసింది. చింతకింది మల్లేశం ఆసు యంత్రం ఆవిష్కరణ ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని ఆవిష్కరించింది.
(వ్యాసకర్తలు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉపాధ్యక్షులు)

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles