ఆకలి, అంతరిక్షం

Sat,June 22, 2019 01:30 AM

పాడవోయి భారతీయుడా.. అంటూనే- పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు అంటూ మహాకవి శ్రీశ్రీ ఓ సినిమా పాటలో దేశ దుస్థితిని ఆనాడే తెలియజెప్పారు. సాధించిన దానితో సంబురపడొద్దని హెచ్చరించారు. ముక్కుసూటిగా చెప్పాలనుకున్నదేదో చెప్పేయడం ఆ మహాకవి విశిష్ట లక్షణం.ఉగాదికవి సమ్మేళనాల వేళ కూడా శ్రీశ్రీ తన గోల విన్పించకుండా ఉండడు. పల్లవిలో ఎక్కడా లేని దేశభక్తిని ఒలికించి పాట చరణాలలో ఈ స్వతంత్ర భారతదేశం అధోగతిని అక్షరబద్ధం చేసిన ఘనుడు శ్రీశ్రీ. పాడవోయి భారతీయుడా పల్లవిని వినగానే లతామంగేష్కర్ దేశభక్తి పాట, మోదీయుల గుత్తాధిపత్యంలో బందీ అయిన దేశభక్తి జ్ఞాప కం వస్తాయి. దేశం వార్షిక అభివృద్ధి రేటు తగ్గిపోతున్నదని, దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయరంగం సంక్షోభం పాలైందని, నిరుద్యోగ సమస్య భయంకర స్వరూపం ధరిస్తున్నదని, ఎగుమతులు తగ్గాయని, దిగుమతులు పెరిగాయని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, నోట్ల రద్దు ప్రయో గం విఫలమైందని, తత్ఫలితంగా పేదల ఇక్కట్లు పెరిగాయని, అసహనం అంతర్గత ఛిద్రాలను సృష్టించి దేశాన్ని ముక్కలు చేస్తున్నదని తెలిసినా.. ఎవరికీ చీమ కుట్టినట్లయినా లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తత, అభద్రత కారణంగా రక్షణ వ్యయం విపరీతం గా పెరుగడం అనివార్యం. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదిత ర దేశాల నుంచి మన యుద్ధవిమానాల, ఇతర ఆధునిక ఆయుధాల కొనుగోలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఐదేండ్లలో మోదీ పాలనలో పెరిగింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలన్న తమ ఆదేశాన్ని శిరసావహించినట్లే, రష్యా నుంచి క్షిపణి సహిత యుద్ధ విమానాల కొనుగోలును నిలిపివేయాలన్న తమ ఆదేశాన్ని అమలుచేయాలని ట్రంప్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నది.

డ్బ్భై ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం ఇప్పటికీ ఈ దేశంలో కూడు, గూడు, గుడ్డ, తాగునీరు, పలకా బలపం, కంటినిండా కునుకు లేక దారిద్య్ర రేఖ దిగువన యాతన అనుభవిస్తున్న కోట్లమందిని పట్టించుకునేవారు లేరు. దేశమంతటా కోట్లాది నిరుపేదలను పేదరికం, అనారోగ్యం పీడిస్తున్నాయి. బీహార్‌లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ పాలనలో వందల మంది పసిపిల్లలు మెదడువాపు వ్యాధితో రాలిపోతుంటే దిక్కులేదు. యూపీలో సన్యాసి పాలనలో జిల్లా దవాఖాలో ఆక్సిజన్ సిలిండర్లు కరువై ఎందరో పసిబిడ్డలు మరణించారు.


గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్లు ఈ మధ్య, మోదీ రెండవ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ప్రకట న ఒకటి వచ్చింది. గగనయానంలో భాగంగా మళ్లీ ఎన్నికల నాటికి, 20 24 నాటికి, చంద్రునిపైకి ఒక మనిషిని పంపించడం, తర్వాత అంగారక గ్రహానికి ఉపగ్రహ ప్రయోగం ఈ ప్రకటన సారాంశం. అంతేకాదు, భార త వ్యోమగాముల విడిది కోసం (పరిశోధనల కోసమే కాకుండా) ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని వచ్చే ఏడేండ్ల కాలంలో నిర్మించదలిచినట్లు ఆ ప్రకటన వివరించింది. ఇస్రో ప్రయోగాలు, కార్యక్రమాల గురించి సాధారణంగా శాస్త్రజ్ఞులు, ఉన్నతాధికారులే ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు. కాని, ఇప్పుడు సంప్రదాయాలు మారుతున్నాయి. మొన్న టి ప్రకటన చేస్తున్నప్పుడు ఉన్నతాధికారుల పక్కన కేంద్రమంత్రి కూడా కూర్చుని ఉన్నాడు.. ఇస్రో ప్రయోగాలన్ని తమ ఖాతాలో చేరుతాయని దేశానికి చెప్పుకోవడానికి. ఇటీవలి ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో ఓ రోజు ప్రధాని మోదీ స్వయంగా టీవీ ఛానళ్ల ముం దుకొచ్చి అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాన్ని కూల్చే క్షిపణి ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా జరిపిందని ధీరోదాత్తంగా ప్రకటించారు! ఇస్రో జరిపిన విజయవంత ప్రయోగం తన ఖాతాలో చేరినట్లు మోదీ మాట్లాడారు. హావభావాలు ప్రదర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించ డం కాదని ఎన్నికల కమిషన్ మరో క్లీన్‌చిట్ ఇవ్వటం మోదీకి ఎన్నికల కమిషన్ ఇచ్చిన క్లీన్‌చిట్‌లతో ఒక దండ కుచ్చవచ్చు. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహ యానాలు, శత్రు ఉపగ్రహాలపై దాడుల కోసం క్షిపణి ప్రయోగాలు, అంతరిక్షంలో ప్రత్యేకంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మాణం పైసా ఖర్చులేకుండా జరిగేవి కావు. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల కోసం భారత ప్రజల కష్టార్జితం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చవుతుంది.

ప్రస్తుతం, రెండోసారి కూడా ఎన్నికై కేంద్రంలో రాజ్యస్థాపన చేసిన మోదీ ప్రదర్శిస్తున్న అసాధారణ, ఆశ్చర్యకర ఉదారత్వం క్షతగాత్రులైన ప్రతిపక్ష నేతలకు భరింపరానిదిగా ఉన్నది. ఎన్నికల ఎన్నో గాయాలపై కారం చల్లినట్లుగా ఉంది. మోదీ సంఖ్యలు ముఖ్యం కాదు అంటూ చూపుతున్న మెహర్బానీని ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారంటే అత్యుక్తి కాదు.


కమ్యూనికేషన్ సదుపాయాలను మినహాయిస్తే, ఇంకేవిధంగా భారత సామాన్య పేద ప్రజలు కోట్లాది మందికి ఇస్రో ప్రయోగాలు, పరిశోధనల వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? డ్బ్భై ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం ఇప్పటికీ ఈ దేశంలో కూడు, గూడు, గుడ్డ, తాగునీరు, పలకా బలపం, కంటినిండా కునుకు లేక దారిద్య్ర రేఖ దిగువన యాతన అనుభవిస్తున్న కోట్లమందిని పట్టించుకునేవారు లేరు. దేశమంతటా కోట్లాది నిరుపేదలను పేదరికం, అనారోగ్యం పీడిస్తున్నా యి. బీహార్‌లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ పాలనలో వందల మంది పసి పిల్లలు మెదడువా పు వ్యాధితో రాలిపోతుంటే దిక్కులేదు. యూపీలో సన్యాసి పాలన లో జిల్లా దవాఖాలో ఆక్సిజన్ సిలిండర్లు కరువై ఎందరో పసిబిడ్డలు మరణించారు. ఈ దుస్థితిలో ఈ దేశానికి (మాతృ, శిశు మరణాలలో, తలసరి సగటు ఆదాయంలో, జీవన ప్రమాణాలలో మన దేశానిది చిన్న చిన్న దేశాలతో పోల్చినా అధమస్థానమే!) ఇంతటి భారీ అం తరిక్ష పరిశోధనా వ్యయం అవసరమా? బద్ధ శత్రువులు అమెరికా రష్యా, అమెరికా చైనా అణు యుద్ధాలను, అంతరిక్ష యుద్ధాలను, నేల యుద్ధాలను నివారించుకొని వాటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి తహతహలాడుతున్నప్పుడు స్ట్రాంగ్ ప్రధాన మంత్రి మోదీ అం తరిక్షం విడిదిలో కూర్చొని అంతరిక్షయుద్ధం చేస్తారా? బహుశా పాకిస్థాన్ మత యుద్ధోన్మాదం కశ్మీర్ వరకే పరిమితమవుతుంది. మన అణ్వాయుధాలు దీపావళి క్రాకర్స్‌గా ఉపయోగించడానికా అని మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భాన మోదీ ప్రశ్నించారు. భారత అణ్వస్త్ర సంపదను, అంతరిక్ష విజయాలను తమ ఖాతాలో చూపించుకోవడానికి, (భారత సేనల విజయాలను చూపించినట్లు) ఆ పేరుతో ఓట్లు అడుగడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం పేదల సాపాటు గురించి ఆలోచించాలె.

నాలుగైదు అణ్వస్త్ర దేశాలలో, అంతరిక్ష పరిశోధన అగ్రగణ్య దేశాలలో భారతదేశం ఒకటని చెప్పుకొని పొంగిపోవాల న్న తహతహవల్ల నష్టమే గాని లాభం లేదని చెప్పడానికి పూర్వపు సోవియట్ యూనియన్ ప్రబల నిదర్శనం. భారీ పారిశ్రామిక అభివృద్ధిలో, రక్షణ బలంలో, అణ్వస్త్ర ఉత్పత్తిలో, అంతరిక్ష పరిశోధనలో అమెరికాతో ఢీ అంటే డీ అని పోటీ పడ్డ సోవియట్ యూనియన్ తన సామాన్య ప్రజ ల నిత్యజీవిత అవసరాలను, ముఖ్యంగా సాపాటును మరిచిపోయింది. అంతరిక్ష పరిశోధనరంగంలో పోటీపడి అమెరికా కంటే ముందే, ప్రపంచంలో అందరికంటే ముందు, 1961 ఏప్రిల్‌లోనే అంతరిక్షంలోనికి కాస్మొనాట్‌ను పంపిన దేశం సోవియట్ యూనియన్. అంతగా అమెరికాతో పోటీపడిన సోవియట్ యూనియన్ తన ప్రజల కనీస అవసరాల విషయం ఉపేక్షించి, మరిచిపోయి కబుర్లు చెప్పి, సోవియట్ విజయాల పిట్టకథలు ప్రచారం చేసి 75 ఏండ్లయినా నిండకముందే కుప్పకూలింది. అమెరికా పోటీ లేని దేశమైంది. సాపాటు లేక ఎన్నో పాట్లు పడ్డ సోవియట్ యూనియన్ ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థ విచ్ఛిన్నం కాగానే రొట్టెముక్కల కోసం కొట్లాడారట. పడతులు కడుపులోని ఆకలి మంటలను చల్లార్చుకోవడానికి పడుపు వృత్తిలోకి దిగజారినారట. గాలిలో విహరి స్తూ, ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న నేతలు అంతరిక్షం కంటే ఆకలి ముఖ్యం అన్న సత్యాన్ని గ్రహిస్తే అందరికి మేలు. ఆకలిలో అంతుపట్టని దహనశక్తి అంతర్ గర్భితమై ఉంది. ఆకలి విప్లవాగ్నిగా అలుముకున్నా ఆశ్చర్యపడవలసి ఉండదు. ఆకలి దహిస్తున్న వారి ముందు నిలిచి ఎన్ని బోధనలు చేసినా ఫలితం ఉండదని స్వామివివేకానందుడు, గాంధీ మహాత్ముడు ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

ఆకలి సమస్యను, అది కలిగిం చే ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించిన రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు కేసీఆర్ ఒక్కడే. ప్రస్తుతం, రెండోసారి కూడా ఎన్నికై కేంద్రంలో రాజ్యస్థాపన చేసిన మోదీ ప్రదర్శిస్తున్న అసాధారణ, ఆశ్చర్యకర ఉదారత్వం క్షతగాత్రులైన ప్రతిపక్ష నేతలకు భరింపరానిదిగా ఉన్నది. ఎన్నికల ఎన్నో గాయాలపై కారం చల్లినట్లుగా ఉంది. మోదీ సంఖ్యలు ముఖ్యం కాదు అంటూ చూపుతున్న మెహర్బానీని ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారంటే అత్యుక్తి కాదు. ఎండనక వాననక తన్నుక చచ్చింది సంఖ్యల కోసమే. చివరికి, ఎవరిదైనా మనదే అన్న భావనతో అన్నిటిని తమ ఖాతాలోనే వేసుకున్నది, ఎందుకైనా మంచిదని ఆఖరి అంకంలో కేదార్‌నాథ్ గుహలో కూర్చున్న ది నిజానికి అంకెల కోసమే. త్రీనాట్ త్రీ వరకు వెళ్లకపోతే సంఖ్యలు, అంకెలు ఎంత ముఖ్యమైనవో అర్థమయ్యేది. వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని ఓ కవి అన్నాడు. బీజేపీ మాతృసంస్థ ప్లస్ పితృ సంస్థ అధినేత బెంగాల్‌లోని హింస గురించి బాధాభరిత హృదయంతో వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఈ రిజర్వేషన్లు ఇంకెంత కాలం అంటూ ఆ మహానుభావుడు కొన్నాళ్ల కిందట చేసిన వ్యాఖ్య మీడియాలో పతాక శీర్షిక అయింది. ఒక్క బెంగాల్‌లోనే కాదు, కశ్మీరు నుంచి కేరళ వరకు, యోగీ జీ రాష్ట్రంలో కూడా హింసాకృత్యాలు సంభవిస్తున్నాయని అధినేతకు తెలియదేమో! ప్రస్తుతం మోదీ ప్రభుత్వం బడ్జెట్ 28 లక్షల కోట్లు. వచ్చే ఎన్నికల నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 350 లక్షల కోట్ల స్థాయికి వస్తుందని మోదీ రెండోసారి ప్రధాని కాగానే విజయోత్సాహంతో అన్నారు. అప్పటి సంగతి దేవుడికెరుక.
d-Prabhakar-Rao
ఇప్పటి జాతీయ వార్షిక అభివృద్ధి రేటు మోదీ ప్రభుత్వం చెప్పింది తప్పని ఆయనకు మొన్నటివరకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన అరవిందం అంటున్నారు. మొన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను ఘనం గా జరుపాలని అనుకున్నారట. సంతోషం. దెయ్యాలు వేదాలను వల్లించాయని అంటారు. గాంధీజీ హంతకుడు గాడ్సే దేశభక్తుడు, గాడ్సేకు గుడులు కట్టాలె అని ఢంకా బజాయించి అంటున్నవారు ప్రాముఖ్యం పొందుతున్నప్పుడు గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయా..?!

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles