ఒక్కొడొచ్చాడు... భగీరథుడు!

Sat,June 22, 2019 01:30 AM

కాళేశ్వరం అనే భారీ కల కార్యరూపం దాల్చి.. కార్యాచరణకు సిద్ధమై, పురుడుపోసుకుంటున్న పవిత్రమైన వేళ.. తెలంగాణ ఇంటింటా పండుగ చేసుకోవాల్సిన అద్భుత సందర్భం..!! కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీటుతో కట్టిన భారీ నిర్మాణం మాత్రమే కాదు, ఒక మహానుభావుడి సుదీర్ఘకాలపు కల. నీరు లేక నేలను ఎండబెట్టుకుంటున్న రైతుల కన్నీరు తుడిచే కల. నెర్రెలు పడిన నేలపై పచ్చదనం నింపాలని, తెలంగాణ పల్లెల కడుపులు నింపాలని, పొట్టచేత పట్టుకొని, కుటుంబాలను వదిలి వలసలు గట్టే దుఃఖపు దుస్థితికి అడ్డుకట్ట వేయాలని సంకల్పించిన మానవతావాది కేసీఆర్ మేధోమథనం నుంచి మొలిచిన భారీ కల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. దేశంలోనే ఇంత త్వరితగతిన నిర్మించిన మొదటి భారీ నిర్మాణం ఇది. దేశమంతా తెలంగాణ వైపు నోరెళ్లబెట్టి, కళ్లప్పగించి ఆశ్చర్యంగా వీక్షించే.. విస్మయపరిచే అద్భుత దేవాలయం. రైతు లు కృతజ్ఞతతో దండం పెట్టుకోవాల్సిన గుడి గోపురం ఈ నిర్మాణం. ఎన్ని ఆటంకాలు.. ఎన్ని కేసులు.. ఒక్కొక్కటీ అధిగమిస్తూ నిర్మాణం నిరాఘాటంగా సాగించిన నాయకుడి వ్యూహం ఈ రాష్ట్ర ప్రజలకు వరం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న పెద్దల మాట నిరూపించబడింది. నదీజలాల పుట్టుక, దారుల మీద, ఉపనదుల ప్రయాణం మీద, వాటి నీటి లభ్యత మీద, ఇప్పటికే ఇతర రాష్ర్టాలు కట్టిన ప్రాజెక్టుల మీద ఆయనకున్న అవగాహన-జ్ఞానం అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తోనే ఎవరికై నా అర్థమవుతుంది. ప్రతిపక్షాలకూ, ప్రజలకూ ఆయనిచ్చిన గూగుల్ వివరణ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ చేయనిదీ. సాహసించనిదీ. అరిచి గోల పెట్టాలని చూసిన ప్రతిపక్షాన్ని బెదిరిపారిపోయేలా చేసింది..!

నది నడకను మార్చి.. రైతు ఒడి చేరుస్తున్న అతడొక మహా భగీరథుడు. అవును.. సముద్రం వైపు జాలువారే గోదారమ్మను ఒడిసిపట్టి... తనదారుల్లో.. తెలంగాణ చెలకల రహదారుల్లోకి మళ్లించి జీవితాలను వెలిగించబోతున్న మహా స్వాప్నికుడు, మహా భగీరథుడు.


కేసీఆర్ ఇచ్చిన సూచనలతో, అభిప్రాయాలతో తెలంగాణ ఇంజినీర్లు ప్రాజెక్టును నడిపిన తీరు విస్మరించలేనిది. తెలంగాణ ఇంజినీరింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి చాటి మన గౌరవాన్ని పెంచారు. తెలంగాణ ప్రజల తరఫున వారికి మన ప్రేమాభినందనలు తెలిపితీరాల్సిందే..! తెలుగు రాష్ర్టాల చరిత్రలోనే ఇంతవేగంగా కట్టిన ప్రాజెక్టు లేదు కాబట్టి ఇది వారికొక ఛాలెం జ్ కూడా. నిద్రాహారాలు మాని, నిరంతర దీక్షతో తీర్చిదిద్దిన కాళేశ్వరం తెలంగాణ రైతులకు వారిచ్చిన అపురూప కానుక. పనిచేసిన ఇంజినీర్ల జీవితాల్లో మరిచిపోలేని రూపిక. చరిత్రలో ఇతర ప్రభుత్వాల హయాంలో కట్టిన కడుతూనే ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు దశాబ్దాలు గడిచిపోయేవి. ఎప్పటికీ ఒక రూపం దాల్చేది లేదు. అంచనాలు పెంచడం, అందినంత బొక్కడమే ఇంజినీర్లు చూసి ఉంటారు. అవి పూర్తయ్యే అవకాశం వారి ఉద్యోగ బాధ్యతల్లో ఉం డగా జరుగకపోయేవి. ఎందుకంటే నాయకులకు పూర్తికాని ప్రాజెక్టులు ఆదాయ వనరు గనక. అందువల్ల ఇంజినీర్లకు కూడా మనసుతో చేయాలనే శ్రద్ధ చచ్చిపోయేది. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగడం.. చరిత్రాత్మక కట్టడంలో తామూ భాగస్వాములమన్న సంతృప్తీ సంతోషాలు వారికి దేవుడి ప్రసాదం లాంటివే. రౌతు కొద్దీ గుర్రం అన్న సామెత ఊరికే రాలే దు. నాయకుడి చిత్తశుద్ధి, సంకల్ప బలం వల్ల ఇంజినీర్లు-సిబ్బందీ సైనికులై శ్రమించారు. సింగపూర్ నుంచో, జర్మనీ నుంచో బాహుబలి ఇంజినీర్లను నాయకత్వం ఆహ్వానించలేదు. మన ఇంజినీర్ల మేధను సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా తెలంగాణ సత్తా ఏమిటో కూడా ప్రపంచాని కి చూపించిన నాయకత్వం మనది.

మనకున్న వనరులతో 203 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడమంటే ఒక్కనాడు భారీ కార్యాన్ని తలకెత్తుకోవడమే. వరద నీటికి అడ్డుకట్టవేసి భూ గర్భంలోకి తరలించి.. భూమాత గర్భంలోనే పెద్దపెద్ద ట్యాంకులు కట్టి వాటిలో నిల్వ ఉంచడం. అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా ఎత్తిపోతల ద్వారా పొలాలకు పారించడం.. ఊహించడానికే ఒళ్లు పులకరిస్తున్నది. ఎన్నడూ వినని ప్రణాళిక. గొప్ప ఇంజినీరింగ్ అద్భుతం. రైతుల పేరుతో ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని చూసింది ఈ అద్భుతం మీద. పనికిరాని డిజైన్‌తో తుమ్మిడిహట్టి పేరుమీద ఎన్నటికీ పూర్తికాని ప్రాజెక్టు మొదలెట్టి.. దశాబ్దాలు గడిపిన కాంగ్రెస్ పార్టీ.. నిర్మాణాత్మక డిజైన్‌తో ప్రాజెక్టును కట్టి చూపించిన ప్రభుత్వాన్ని ఏ రకంగా విమర్శించగలదు. దేవుడి పేరు పెడితేనైనా ఆటంకాలు లేకుండా ఉంటుందని, కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నా కేసులు పెట్టడం ప్రతిపక్షాల పనితీరుకు నిదర్శనం. నాకు గోదావరితో ప్రత్యేక అనుబంధం. ఎమోషనల్ అటాచ్‌మెంట్. చిన్నప్పటినుంచీ గోదావరీ తీరాన భద్రాద్రి గాలి పీలుస్తూ పెరిగాను. గోదావరి జలాలతో ఆటలాడుతూ బాల్యం గడిచింది. చదువులయ్యాక నా జీవనం గోదారమ్మ ఒడిలోని భద్రాద్రిలో సాగింది. మనసు బాగోకపోతే గోదారమ్మ ఒడ్డున కూర్చొంటే అమ్మ ఓదార్చినట్లుండేది. అంతటి అనుబంధం. వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జి మీద నిలబడి గోదారమ్మను చూస్తుండేదాన్ని. ఉధృతమై న పరుగుతో నీటి ప్రవాహం సముద్రంలో కలువడం నాకు కన్నీరు తెప్పించేది. ఎందుకంటే గోదావరి జీవనది పక్కనుంచి కూడా ఎండిపోయిన పొలాలను చూశాను. రైతుల దుఃఖం నా దుఃఖంలా అనుభవించేదాన్ని. ఈ నీళ్లను అదుపుచేసి తోటలకు మళ్లించే మొనగాడే లేడా అని. నాయకుల నిర్లక్ష్యం పట్ల కోపంతో రగిలిపోయేదాన్ని.
ravulapalli-suneetha
మీ కోసమే అడవుల నుంచీ.. చిరునదుల నుంచీ మినరల్స్ నింపుకొని ప్రవహిస్తూ వచ్చా ను.. ఆపుకోరేం? అమాయకత్వమైతే అర్థం చేసుకుంటా గానీ.. నిలువెల్లా స్వార్థపరులై.. మీ ప్రయోజనాలే మీకు ముఖ్యమైన పాలకులారా చావండిరా.. అని కోపంగా వెళ్లిపోతున్నట్లు అనిపించేది. కానీ, అలా జరుగదు. ఒక్కడొచ్చాడు అని గోదారమ్మ ఆనందిస్తున్నది. రైతు మొహంలో ఆనందం నింపేందుకు గోదారమ్మ కొంగు పట్టుకు నడిపించే నాయకుడొచ్చా డు. జూన్‌లోనే ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎంతో ఆరాటపడ్డాడు. జూలై నుంచి పడే వర్షాలతో ప్రవహించే గోదారమ్మ నీటిలో ఒక్కబొట్టు వృథాగా సముద్రం దారి పట్టకూడదని.. భూగర్భ ట్యాంకర్లలోకి మళ్లించాలనే సంకల్పం నాయకుడిని పరుగులు పెట్టించింది. ఇంక గోదారమ్మ నడకకు నాట్యమూ, వంటికి ఒయ్యారమూ అద్దుకొంటుంది. ఇన్నాళ్ల కన్నీటిధారలు కొట్టుకుపోయేలా.. రైతు బతుకు దరిద్రాన్ని లుంగజుట్టి విసిరికొట్టేలా జలజలా.. కళకళా.. కాళ్ల గజ్జెల సప్పుడు సంగీతం తో.. అమాయక బాలుడైన రైతు బాహువుల్లో ఆనందభాష్పమై మురిపెపు ముద్దలా బందీ అవుతుంది. ఆ సుందర దృశ్యం కనుచూపు మేరలో మనముందుంది. నది నడకను మార్చి.. రైతు ఒడి చేరుస్తున్న అతడొక మహా భగీరథుడు. అవును.. సముద్రం వైపు జాలువారే గోదారమ్మను ఒడిసిపట్టి... తనదారుల్లో.. తెలంగాణ చెలకల రహదారుల్లోకి మళ్లించి జీవితాలను వెలిగించబోతున్న మహా స్వాప్నికుడు, మహా భగీరథుడు.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles