తెలంగాణ కీర్తి!

Sat,June 22, 2019 01:30 AM

Kaleswarm-godavari
గోదావరీ! గోదావరీ!
నీవిక కాళేశ్వరం చేతిలో
శిక్షణ పొందిన సర్కస్ పిల్లవి!
జారి పారడం తప్ప
ఎగబాకటం తెలియని నీకు
ఎగిరి గంతేయడం నేర్పింది!
నీరు పల్లమే ఎరుగన్న అపకీర్తి
నేటితో పరిసమాప్తి
తెలంగాణలో నీదిక మంత్ర జల దీప్తి!
లక్ష్యమెరుగని నీ ప్రయాణం
సంద్రంలో కలిసిందా ఉనికే పరి సమాప్తి
మట్టితో మమేకమైన చరిత్ర ఒక సూక్తి!
గోదావరీ! గోదావరీ!
నీవు సహస్ర పాదాల స్ఫూర్తివి
ఇకపై ఆకు పచ్చ తెలంగాణ కీర్తివి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి 9440233261

159
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles