ఏకబిగి ఎన్నికలు

Fri,June 21, 2019 01:31 AM

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం నాడు అభిప్రాయపడటంతో, ఈ అంశంపై కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో తెలుస్తున్నది. ఒకరోజు ముందే బుధవారం ఇదే అంశంపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో తొందరపడబోమని కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సమావేశం ఏర్పాటైంది. కమిటీ వేసి నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నది. పార్లమెంటు, అసెంబ్లీలకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కానీ సూత్రప్రాయంగా అందరూ దీనిని ఆమోదించినా అమలులోకి తేవడం అంత సులభం కాదు. అమలుచేయడం అంటే ప్రతికూల ఫలితాలు రాకుండా అమ లుచేయడం. ప్రతికూల ఫలితాలు ఉంటే ముందే పసిగట్టి విరమించుకోవాలే తప్ప, మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగించకూడదు. లోక్‌సభ ఎన్నికలను నిర్దిష్ట వ్యవధికే జరుపాలని నిర్ణయిస్తే, ఆ క్రమంలో ప్రజాస్వామ్యానికి చేటు జరుగకూడదు. ఇదే విధంగా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుపాలని నిర్ణయిస్తే, ఆ క్రమంలో సమాఖ్యతత్వానికి ముప్పు వాటిల్లకూడదు. ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటూనే ఏ మార్పులైనా చేయాలె. అఖిల పక్ష సమావేశానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన తరువాతనైనా అన్ని పక్షాలు ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించాలె. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఈ అంశంపై కూలంకషంగా చర్చించాలె.

ఏకబిగిన అన్ని ఎన్నికలు జరుపడం వల్ల ఖర్చు తగ్గుందనేది అత్యంత బలహీనమైన వాదన. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖర్చుకు భయపడి ఎన్నికలను తగ్గించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. మన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఈ ఖర్చు అంత భారమైంది కాదు. కొంత భారమైనా ప్రజాస్వామ్యంలోని సుగుణాల కోసం భరించాల్సిందే. ఇరవయవ శతాబ్ద పూర్వార్ధంలో ప్రజాస్వామ్య పవనాలు ప్రపంచమంతా వీస్తున్నప్పుడు, స్విట్జర్లాండ్‌లోని ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎంతో మన్నన పొందాయి. ఎన్నికైన ప్రభుత్వం ఐదేండ్ల వరకు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ఉండాలనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య భావన.


స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో 1967 వరకు లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పటికీ అదే సాధ్యం కాదు. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో కూలిపోవడమో, కేంద్రంలోని రాజకీయశక్తి వాటిని కూలదోయడమో జరిగింది. ఈనేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు జరుగడం అసాధ్యమైపోయింది. లోక్‌సభ గడువుకు ఏడాది ముందు లేదా వెనుకగా జరిగే అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పాటు జరపడం వల్ల కొంత దగ్గరికి చేర్చినట్టవుతుంది. అది కూడా ఆయా రాష్ర్టాల అభీష్టానికి అనుగుణంగా జరుపాల్సిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఐదేండ్ల అధికారాన్ని నాలుగేండ్లకు తగ్గించుకోవడానికి ఇష్టపడక పోవచ్చు. స్వచ్ఛందంగా జరుగనప్పుడు, చట్టసవరణ ద్వారా నిర్బంధం చేయడం సమాఖ్యతతత్వానికి విరుద్ధమవుతుం ది. ఒకేసారి ఎన్నికలు జరుగాలంటే లోక్‌సభకు, అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు ఉండకూడ దు. ఒకసారి లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరుపవలసి వస్తే రాష్ర్టాల అసెంబ్లీలన్నిటికీ జరుపాలనడం భావ్యం కాదు. ఇందుకు సంబంధిం చి 1999లో లా కమిషన్ చేసిన సూచన గమనార్హమైనది. లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలంటే ప్రత్యామ్నాయంగా మరెవరిపై విశ్వాసం ఉన్నదో వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఈ సూచన పార్లమెంటరీ ప్రజాస్వామ్యస్ఫూర్తికి అనుగుణమైనదేనా అనేది ఆలోచించాలె. పార్లమెంటులో భిన్న ప్రాంత, సామాజిక, సైద్ధాంతిక వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉంటుంది. అధికారంలో ఉన్నవారు మెజారిటీ కాపాడుకోవడానికి వీలైనంత ఎక్కువమందిని కలుపుకపోవల సి ఉంటుంది. మెజారిటీ పాలన అన్నప్పటికీ, వీలైనంత సార్వత్రిక ఆమోదం ఆ ప్రభుత్వానికి ఉండ టం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని విశిష్టత.

ఒకసారి అధికారం చేపట్టిన తరువాత ఐదేండ్ల వరకు కూలదోయడం అంత సులభం కాదనే ధీమా ఉంటే పరిపాలన అంత ప్రజాస్వామికంగా సాగుతుందా అనేది ఆలోచించాల్సిందే. మెజారిటీ మద్దతు లేకున్నా నడిచే ప్రభుత్వం తమ విధాన నిర్ణయాలను, బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించుకోలేకపోతుంది. దీనివల్ల పరిపాలన స్తంభించి పోతుంది. ఏకబిగిన అన్ని ఎన్నికలు జరుపడం వల్ల ఖర్చు తగ్గుందనేది అత్యంత బలహీనమైన వాదన. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖర్చుకు భయపడి ఎన్నికలను తగ్గించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. మన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఈ ఖర్చు అంత భారమైంది కాదు. కొంత భారమైనా ప్రజాస్వామ్యంలోని సుగుణాల కోసం భరించాల్సిందే. ఇరవయవ శతాబ్ద పూర్వార్ధంలో ప్రజాస్వామ్య పవనాలు ప్రపంచమంతా వీస్తున్నప్పుడు, స్విట్జర్లాండ్‌లోని ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎంతో మన్నన పొందాయి. ఎన్నికైన ప్రభుత్వం ఐదేండ్ల వరకు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ఉండాలనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య భావన. అంతే తప్ప ప్రపంచీకరణ నేపథ్యంలో, తరచు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటం వల్ల ప్రజా సంక్షేమానికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందనే అభిప్రాయం ఉన్నది. ఇటువంటి భావనలతో జమిలి ఎన్నికల సూత్రాన్ని ఆమోదించకూడదు. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనపై నిర్మాణాత్మక చర్చ సాగించడంలో తప్పు లేదు. దేశవ్యాప్త చర్చలో ఏవైనా సృజనాత్మక ప్రతిపాదనలు రావచ్చు. కనీసం ఎన్నికల ప్రక్రియ తక్కువ వ్యవధిలో సాగడం, అయినదానికి కానిదానికి ప్రవర్తనా నియమావళిని వర్తింప చేయడం వంటి పెడధోరణులను అరికట్టడం మంచిది.

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles