కాంచన కాళేశ్వరం

Fri,June 21, 2019 01:28 AM

తెలంగాణ అంటేనే
తేటతెనుగు ప్రతిబింబం..
కట్టకడకు ఆనకట్ట
కాళేశ్వర సంరంభం!
సంగీతం సాహిత్యం
ఇరురాష్ర్టాల బుధులు..
కృష్ణ గోదావరి రెండు
విరి ధాన్యాల నిధులు!
-కందుకూరి శ్రీరాములు 9440119245

జయహో కాళేశ్వరం

పరవళ్ల ఒయలతో
పరుగుల నాదమై
ఎగిసిపడే అలలతో
గోదారమ్మ సంద్రంలో ఒదిగిపోతుంటే
తెలంగాణ మాగాణమంతా వెక్కివెక్కి ఏడుస్తుండె
నీటిజాడ లేక రైతన్న దిక్కులని చూస్తుండె
కానీ నేడు నీరు పల్లమెరుగకుండా
అద్భుతాలను ఆవిష్కరించుకుంటూ
భగీరథ ప్రయత్నం ఫలించి కాళేశ్వర ప్రాజెక్టుతో
తెలంగాణ మాగాణంలోకి పరుగులు పెడుతోంది
రైతన్న మడి గుడి నీటితో నాట్యమాడపోతుంది
కలలను సాకారం చేస్తూ ..
జలధారను ఒడిసిపట్టి
ముఖ్యమంత్రి మనకందిస్తుండు!
మేడిగడ్డ అన్నారం కన్నెపల్లి అనంతగిరి
రంగనాయక సాగర్.. మల్లన్న సాగర్‌లు.. నింపి
పసిడి రాశులు అందించి
బంగారు తెలంగాణకు అన్నపూర్ణ పంచు
రైతన్నల నేస్తం మన కేసీఆర్..!
జయజయధ్వానాలతో కాళేశ్వర హోరుతో
పల్లె జనమంతా జయహో కాళేశ్వరమంటూ
ఆనందపడుతుండ్రు
ప్రాణహిత గోదావరి నీళ్లలో తానమాడాలని
అడుగడుగునా ఆహ్వానిస్తుండ్రు...
- ఉండ్రాల రాజేశం, 9966946084

166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles