కాంగ్రెస్‌కు తగిన శాస్తి..

Sun,June 9, 2019 01:02 AM

cm-kcr-trs
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీ య పరిణామాలు చూస్తుం టే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రం ప్రతీకా రం తీర్చుకుంటున్నట్లే కనబడుతున్నది. 1956 నుంచి 2014 వరకు జరిగిన పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శించిం ది. ప్రతి సందర్భంలోనూ వివక్షాపూరితంగానే కాదు, కక్షపూరితంగానూ వ్యవహరించింది. అందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచి నేటిదాకా జరిగి న పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే అవగతమవుతుంది. 1956లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కాంగ్రెస్ పార్టీ బలవంతంగా విలీనం చేసింది. 1950లో ప్రత్యేక తెలంగాణను కోరు తూ తెలంగాణ ప్రజలు శాంతియుత ఆందోళనలు చేపట్టారు. అప్పుడే దేశంలో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్‌కు సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షిస్తూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోంచే 1955లో ఫజల్ అలీ కమిషన్ విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ రాష్ర్టాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్టును కాదని ఆంధ్ర ప్రాంత నాయకుల డబ్బు సంచులకు తలొగ్గి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేశారు. 1950లోనే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ విలీన ప్రతిపాద నలను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రాంత నీళ్లు, నిధులు నియామకాలు దోపిడీకి గురవుతాయని భయపడ్డారు.

2009లో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఆంధ్ర ప్రాంత నాయకుల ఒత్తిడికి తలొగ్గి డిసెంబర్ 23న ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నది. ఫలితంగా తెలంగాణలో వందల మంది యువకుల ఆత్మ బలిదానాలకు కారణమైంది. ఇదే సందర్భంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేరుతో మరో పెద్ద మోసానికి తెరతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీకృష్ణ కమిటీ నియామకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొనసాగింపుగానే అని కాంగ్రెస్ నమ్మబలికింది. అయినా తెలంగాణ ప్రజలు అనుమానంగా చూశారు. కమిటీ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజలు అనుమానించిందే అయ్యింది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే తీరు తెన్నుల మీద ఒక రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయటం గమనార్హం.


అనుకున్నట్టుగానే ఆరు దశాబ్దాలలో జరిగిన పాలన తీరుతెన్నులను గమనిస్తే వారు బయపడ్డట్లే జరిగింది. ఆంధ్ర ప్రాంత నాయకత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన కాంగ్రెస్ పార్టీ 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంత విషయంలో వివక్షను చూపింది. సమైక్య రాష్ట్రంలో 12 ఏండ్ల అలుపెరుగని పోరాటాలు, ఇబ్బందుల తర్వాత మొదటిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఉద్యమం ప్రారంభమైంది. లక్షల మంది యువకులు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కర్కశంగా ప్రజా ఉద్యమాన్ని అణిచివేశాయి. 369 మంది యువకులను పొట్టనపెట్టుకున్నా యి. 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా స్థాపించిన తెలంగాణ ప్రజాసమితికి చెందిన వారిని 10 మందిని ఎంపీలుగా గెలిపించి తమ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలతో తెలంగాణ ప్రజాసమితి పార్టీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విలీనం చేసుకొని ఉద్యమానికి మరోమారు తీరని ద్రోహం చేశారు. కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఆరిపోలేదు. అనేక రూపాల్లో తెలంగాణ ఆకాంక్షల వ్యక్తీకరణ జరుగుతూనే వచ్చింది. ఉద్యమకారులు, మేధావులు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు తమ రచనల ద్వారా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాం త నీళ్లు, నిధులు, వనరులు దోపిడీకి గురవుతున్న తీరును ప్రజల కండ్లకు కట్టారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులకు, డబ్బులకు తలొగ్గి, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను తాక ట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

మరోవైపు క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిమాండ్‌ను తన అధికార సాధనకు పనిముట్టుగా వాడుకున్నది. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పుడు తిరిగి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ముందుకుతెచ్చి వినియోగించుకున్నది. అంతే కాకుం డా తెలంగాణ నినాదంతో కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్ఠా నాన్ని బ్లాక్‌మెయిల్ చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి మాత్ర మే తెలంగాణను వాడుకున్నారు. ఇలాంటి కాంగ్రెస్ విద్రోహ చరిత్ర కాలంలో 2000 సంవత్సరంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీకి అంకురార్పణ జరిగింది. దీం తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నది. రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పెట్టుకున్న పొత్తు ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోటీకి నిలిపి మోసం చేసింది. టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న చోటనే పోటీకి నిలిపామనీ, స్నేహపూర్వక పోటీ అనీ అనేకవిధాలుగా విద్రోహ రాజకీయాలకు అందమైన పరిభాషణలు చెప్పి ప్రజలను మోసపుచ్చే చర్యలకు దిగింది. అంతిమంగా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే తీరుగా వ్యవహరించింది. ఉద్యమ అండతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 2004 నుంచి 2009 వరకు తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అనేక కారణాలు, సాకులు చూపుతూ కాంగ్రెస్ ఆల స్యం చేసింది. మరోవైపు అనైతికంగా టీఆర్‌ఎస్ పార్టీని బలహీనం చేసే కుట్రలకు కూడా తెరలేపింది.

అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో రాజీలేకుండా కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పోరాటం ఉచ్ఛదశకు చేరుకున్నది. 2009లో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఆంధ్ర ప్రాంత నాయకుల ఒత్తిడికి తలొగ్గి డిసెంబర్ 23న ఆ ప్రకటన ను వెనక్కి తీసుకున్నది. ఫలితంగా తెలంగాణలో వందల మంది యువకుల ఆత్మ బలిదానాలకు కారణమైంది. ఇదే సందర్భంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేరుతో మరో పెద్ద మోసానికి తెరతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీకృష్ణ కమిటీ నియామకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొనసాగింపుగానే అని కాంగ్రెస్ నమ్మబలికింది. అయినా తెలంగాణ ప్రజలు అనుమానంగా చూశారు. కమిటీ ఏర్పాటు విషయం లో తెలంగాణ ప్రజలు అనుమానించిందే అయ్యింది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే తీరు తెన్నుల మీద ఒక రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయటం గమనార్హం.
ఆ తర్వాత పరిణామాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేయటానికి పోలీస్ బలగాలను మోహరించి తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ నిర్బంధం పెంచింది. మరోవైపు ఇక్కడి నాయకులకు పదవుల ఆశ చూపి, తెలంగాణకు వ్యతిరేకంగా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం లాంటి పనులు చేసింది. మలి దశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నేతృత్వంలో ఒక్కో అడుగు ముందుకువేస్తూ, అహింసాయుత మార్గంలో నడిచింది కాబట్టే తెలంగాణ ప్రజల లక్ష్యం నెరవేరింది. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకుల ద్రోహ రాజకీయాలకు మరోమారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు బలైపోయేవి.
ravindhar-reddy
చివరిగా 2014లో రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసింది. కోర్టుల్లో కేసులు వేసింది. నిర్వాసితుల పేరుతో నకిలీ ఉద్యమాలు లేవదీసి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు పడరాని పాట్లు పడింది. ఉద్యోగ నియామకాల్లో యువత ఆకాంక్షలకు అడ్డుతగులుతూ, కోర్టుల్లో కేసులు వేసి తెలంగాణ ప్రాంతానికి ఒకే ఒక శత్రువు కాంగ్రెస్ అని నిరూపించుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించిన దాఖలాలు లేవు. దాని ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, చిత్తుగా ఓడిపోవటాలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఏనాడూ కట్టబడకపోవటమే కాదు, అడుగడుగునా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీపై ఇవ్వాళ తెలంగాణ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటున్న స్థితి కనిపిస్తున్నది. అందుకే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్‌ను కసితీరా ఓడిస్తున్నా రు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉన్న టీఆర్‌ఎస్‌కు పట్టం గడుతున్నారు.

355
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles