ఈ వలయం ఛేదించలేమా?

Sun,June 9, 2019 01:01 AM

ప్రభుత్వ సంస్థల నుంచి వ్యవసాయ రుణం తీసుకోవడానికి ఒక రైతు పడిన గోస ఇది. రైతు అప్పు కోసం తమ ఊరికి సంబంధించిన లీడ్ బ్యాంకు చుట్టూ చాలాసార్లు తిరిగాడు. ఆ బ్యాం కుకు చాలాకాలంగా మేనేజర్ లేడు. అక్కడున్న సిబ్బందికి రుణం ఇచ్చే విధానం తెలువకపోగా, వారికి అంత ఆసక్తి కూడా లేదు. చాలాకాలం తర్వాత ఒక చురుకైన మహిళా మేనేజర్ నియామకమైంది. దీంతో రైతులు దరఖాస్తుల పరిశీలన సాగింది. రైతుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో జాబితా ఇచ్చారు. ఈ డాక్యుమెంట్లు తెచ్చుకోవాలంటే, చాలా ఆఫీసు లు తిరుగాలని రైతుకు అర్థమైంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు బ్యాంకు న్యాయ విభాగాన్ని కలువాలె. మండలంలోని ఇతర బ్యాంకులకూ వెళ్లాల్సిందే. ఈ ఆఫీసులన్నీ ఆ రైతు గ్రామానికి ముప్ఫై కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. మండలంలోని ఇతర బ్యాంకుల నుంచి నో ఆబ్జెక్షన్ సెర్టిఫికెట్లు తెచ్చుకోవడం తో రైతు అప్పు కథ మొదలైంది. అదే భూమి ఆధారంగా ఇదేరకమైన అప్పు కోసం రైతు మరే ఇతర బ్యాంకు నుంచి అప్పు తీసుకోలేదనే ధ్రువపత్రం రైతు సమర్పించవలసి ఉంటుంది. ఇక పహాని కోసం ఎంఆర్‌ఓ ఆఫీసుకు పోవాలె. పహానిని ఇవ్వాల్సింది వీఆర్‌వో. వీఆర్‌వో ధ్రువీకరించిన పహానికి డిప్యూటీ తహసిల్దారో, ఎమ్మార్వోనో అటెస్టు చేయాలె. భూమి రికార్డుల డిజిటలీకరణ తర్వాత పహాని ఈ సేవా కేంద్రం నుంచి తెచ్చుకోవడం సులభమైపోయింది. ఆ పహాని ప్రతిని వీఆర్‌వో, ఎమ్మార్వో దగ్గరికి తీసుకపోవాలె. వారి అటెస్టేషన్ తర్వాత రైతు ఆ మండలంలోని బ్యాంకులకు వెళ్లాలె.

భూమి రికార్డుల నిర్వహణతోపాటు రైతులకు సేవ చేయడానికి ఒక కొత్త పేరు తో కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలె. రెవెన్యూ పాలన స్థానంలో రెవెన్యూ సేవలు ఉండాలె. జాప్యం జరుగకుండా, నిర్లక్ష్యం చూపకుండా, అవినీతికి చోటులేకుం డా రైతులకు సేవ చేసేవిధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలె. ప్రభుత్వ సిబ్బందిని పాతనంతా వదిలించుకొని కొత్తది నేర్చుకోవాలె. జిల్లా, మండలస్థా యిలో రైతులకు అనుకూలంగా ఉన్న విధానాలను గుర్తించి అంతటా అమలుచేయాలె. సిటిజన్స్ చార్టర్ మాదిరిగా రైతుల చార్టర్‌ను రూపొందించాలె. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలె.


పాపం ఆ రైతు- ఆ మండలంలో ఏయే బ్యాంకులున్నాయో వాళ్లనో వీళ్ళనో అడిగి తెలుసుకోవలిసిందే. రైతు ఏ సంబం ధం లేని ఆ బ్యాంకులకు వెళ్లి వారినుంచి అప్పు తీసుకోలేదని రాయించుక రావా లె. ఒక్కో బ్యాంకు నుంచి పత్రం తెచ్చుకోవడానికి వారం పడుతుంది. ఈ రైతు దరఖాస్తు తీసుకొని, రికార్డులు పరిశీలించి రాసివ్వడానికి ఆ బ్యాంకుకు సమయం ఉండాలె. దానిపై చివరగా ఆ బ్యాంకు మేనేజరు సంతకం ఉండాలె. ఆ బ్యాంకులకు రైతు విలువైన కస్టమర్ కాదు. లబ్ధి కలిగే ఖాతాదారు కూడా కాదు. ఏదో కొన్ని వందల రూపాయల కోసం తమ సమయాన్ని వృథా చేసే వ్యక్తిగా రైతును చూస్తారు. ఒక్కోసారి ఇదంతా అవమానకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉదంతం చెబుతాను. రుణం లేదనే ధ్రువపత్రం తీసుకోవడానికి వెళ్లిన రైతుకు సహకార బ్యాంకు ఎదుట బయట చెప్పులు విడిచిరావాలనే బోర్డు కనిపించింది. బ్యాంకు లో లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నందువల్ల చెప్పులు విడిచి రావాలని సిబ్బంది చెప్పా రు. కానీ బ్యాంకు సిబ్బంది మాత్రం చెప్పులతోనే లోపలికి పోతారు. తాను ఏనా డూ రుణం తీసుకోని బ్యాంకును రైతు ఎందుకు కలువాలో అర్థం కాదు. తమ ఖాతాదారు, డిపాజిట్‌దారు కాని రైతు కోసం ఇతర బ్యాంకులు ఎందుకు సమ యం వృథా చేసుకోవాలె? వ్యాపారుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్‌లు, స్వీయ ధ్రువీకరణలు ఉంటాయని విన్నాం. కానీ అటువంటి ఏర్పాటు వ్యవసాయ రుణాలకు ఎందుకు ఉండకూడదు? బ్యాంకుల చుట్టూ తిరిగిన రైతు ఇగ ముప్ఫై ఏండ్ల పాత పహానీల కోసం ఎమ్మా ర్వో ఆఫీసు చుట్టూ తిరుగాలె. పహాని ప్రతుల కోసం మొదట వీఆర్‌వోను కలువాలె. ఊరికే కలిస్తే పని కాదు. అతడిని సంతుష్టి పరుచాలె. డిప్యూటీ తహసీల్దార్ లేదా తహసీల్దార్‌ను వ్యక్తిగతంగా కలువాల్సి ఉంటుంది. చివరికి ఆఫీస్ ముద్ర వే సే ప్యూన్ చేతులు కూడా తడుపాల్సిందేనని ఆ రైతు చెప్పాడు.

డాక్యుమెంట్లు ఎం త ఎక్కువగా ఉంటే వారి ఖర్చు అంత ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ శాఖలో అయితే ఖర్చుతో పాటు అవమానకర పరిస్థితి ఉంటుంది. వారిని సంతుష్టి చేయడాన్ని బట్టి ఎన్నిసార్లు తిరుగాలనేది ఆధారపడి ఉంటుంది. ఎంత సమర్పించుకుంటే అంత వేగంగా పని పూర్తయితది. అప్పు తీసుకోవాలంటే, తప్పనిసరిగా దర్శించుకోవలసిన మరో కార్యాలయం- రిజిస్ట్రేషన్ శాఖ. భూమి అమ్మకం పత్రా లు ఇక్కడే పొందాలె. పహాని ఇతర పత్రాలన్నీ తీసుకొని న్యాయ సలహాదారును కలువాలె. ఈ లీగల్ సర్వీసు మాత్రం ఫ్యూడల్ రెవెన్యూ విధానంలా అవమానకరంగా ఉండదు. రైతు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా పొందవలసి ఉంటుంది. రైతు అవసరాలను ఆ అధికారి అంచనా వేస్తా డు. అతడి సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలిస్తాడు. ఈ సెర్టిఫికెట్ పొందడానికి కూడా ఓ లెక్క ఉంటుంది. ఓ రైతు ఈ విషయాన్ని పై అధికారి అయిన ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశాడు. ఇటువంటి విషయాలు కిందనే (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) దగ్గరే తేల్చుకోవాలని, తన స్థాయికి తేవద్దని ఆ ఎమ్మార్వో సలహా ఇచ్చాడు! రైతుల సంక్షేమం కోసం రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు ఆసక్తి ఉండదు. రైతుల పట్లనే వారు అనుమానంగా ఉంటారు. కొద్దిమంది తప్పులు చేసేవారిని నియంత్రించడానికి అంటూ రూపొందించిన వ్యవస్థ నిజాయితీపరుల పాలిట శిక్షగా మారింది. ఎమ్మార్వో స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం రైతుల పట్ల వ్యవహరించే తీరు ఆవేదనకరంగా ఉంటుంది. వలసవాద స్వభావం సంతరించుకున్న రెవెన్యూ వ్యవస్థ రైతు ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటుంది. రైతుల వర్గం, కులం, వయస్సు, స్త్రీ పురుషులను బట్టి వారిపట్ల ఈ నిర్లక్ష్యం స్థాయి ఉంటుంది. పేద మహిళా రైతు ఆఫీసులోకి అడుగుపెట్టగానే వారినుంచి అయిష్టతను ఎదుర్కొంటుంది.

కాంట్రాక్టు ఉద్యోగులతో సహా అక్కడి సిబ్బంది ఆమెను ఏ మాత్రం పట్టించుకోరు. వారు మాట్లాడకుండా చిన్న సైగ చేసినా అదొక భాగ్యంగానే భావించాలె. ఇది ఆశ్చర్యకరంగా కనిపించినా వాస్తవం. ఇది రైతుల అందరి కథ. అయితే వారి సామాజిక నేపథ్యాన్ని బట్టి ఈ నిర్లక్ష్యం మోతాదు ఉంటుంది. రెవెన్యూ శాఖ రాజ్యానికి సేవ చేసేదే తప్ప రైతులకు కాదనే భావన కొద్దీ రెవెన్యూ అధికారుల్లో ఈ ఉదాసీన వైఖరి ఏర్పడ్డది. భూమి శిస్తు వసూలు చేసే సంప్రదాయ పాత్ర ఇంకా వారి వ్యవహార సరళిలో జీర్ణించుకపోయి ఉన్నది. ఎమ్మార్వో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉన్నా, ప్రవేశ ద్వారం దగ్గర బంట్రోతు వలసవాద కాలపు కాపలా మనిషిలా భావించుకుంటాడు. ఎమ్మార్వో చాంబర్‌కు వెళ్ళగలిగి కలుసుకునే అదృష్టవంతు లు ఏ కొద్దిమందో ఉంటారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే వారు చాలా మంది వ్యవసాయ నేపథ్యం కలిగి ఉంటారు. వారికి రైతుల పరిస్థితి తెలిసే ఉం టుంది. కానీ రైతులపట్ల వారు కొంచెమైనా సానుభూతి చూపకపోవడం విచిత్రం. అధికారులు వలసవాద విధానాలకు కట్టుబడి ఉండటమే సమస్యలకు కారణం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఒక చిన్న కంప్యూటర్ ఆపరేటర్ రికార్డు ఎంట్రీలు చూసుకుంటాడు. అతడు ఏదో లాభం ఆశించడం రైతులకు ఆగ్రహం కలిగిస్తుంది. పై అధికారుల మద్దతు లేకుండా ఈ విధానం సాగదు. కొత్తతరానికి చెందిన కాం ట్రాక్టు ఉద్యోగికి కూడా రైతుల పట్ల పట్టింపు లేకపోవడం బాధాకరం. రెవెన్యూ యంత్రాంగంలో పారదర్శకత లేకపోవడం ఆశ్చర్యకరం. ఎమ్మార్వో కార్యాలయం పనిచేసే విధానంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండదు. చాలావరకు రెవెన్యూ కార్యాలయాలు వృద్ధులకు అందుబాటులో ఉండవు. ఇక వికలాంగుల గురించి చెప్పనవసరం లేదు. మెట్లు ఎత్తుగా ఉంటాయి, ర్యాంపులు ఉండవు. చాలా కార్యాలయాల్లో మౌలికవసతులు ఉండవు. పాత కాలపు ఫర్నిచర్ ఉంటుంది.

పనుల కోసం వచ్చే రైతులకు కూర్చోవడానికి కుర్చీ కాదు గదా నిలుచునే జాగ ఉండదు. మంత్రులు, ఉన్నతాధికారుల చాంబర్లను ప్రతి ఏటా ఆధునీకరిస్తారు. కానీ పేదలకు సేవ చేసే కార్యాలయాలను పట్టించుకోకపోవడం విచిత్రం. కలెక్టర్ నియంత్రణలోని జిల్లా యంత్రాంగం మరో వలసవాద వారసత్వపు మచ్చుతునక. రెవెన్యూ యంత్రాంగం వల్ల రైతులు పడే బాధలను ఏ మాత్రం పట్టించుకోదు. ఎమ్మార్వో కార్యాలయంలో పనికానివారు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే, వారి సమయం, శక్తి, ధనం మరింత వృథా అవుతాయే తప్ప ఫలితం ఉండదు. ఇక్కడ కూడా ప్రతి స్థాయిలో అవమానాలను ఎదుర్కొనవలసి వస్తుం ది. వలసవాద అణిచివేత పరిపాలనా సరళిని మనం ఇంకా కాపాడుకుంటూ సం బురాలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యదర్శికన్నా, జిల్లా కలెక్టర్ అధికార దర్పం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్య భారతంలో వలసవాద పాలన కొనసాగింపు అవశేషమే రెవెన్యూ శాఖ. రెవెన్యూశాఖలో కొత్తగా చేరి రైతులకు సేవ చేద్దామనుకునే అధికారులకు అక్కడి పరిపాలనా విధానం, నిబంధనలు నిరాశను కలిగిస్తాయి. డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న ఒక యువ అధికారిణి ఏ మాత్రం ఆశించకుండా వెంటనే తమ భూమికి సంబంధించిన పత్రం ఇచ్చిన ఉదంతాన్ని ఒక రైతు చెప్పాడు. భూమి రికార్డుల నిర్వహణతోపాటు రైతులకు సేవ చేయడానికి ఒక కొత్త పేరు తో కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలె. రెవెన్యూ పాలన స్థానంలో రెవెన్యూ సేవ లు ఉండాలె.
Ragavareddy
జాప్యం జరుగకుండా, నిర్లక్ష్యం చూపకుండా, అవినీతికి చోటులేకుం డా రైతులకు సేవ చేసేవిధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలె. ప్రభుత్వ సిబ్బందిని పాతనంతా వదిలించుకొని కొత్తది నేర్చుకోవాలె. జిల్లా, మండలస్థా యిలో రైతులకు అనుకూలంగా ఉన్న విధానాలను గుర్తించి అంతటా అమలు చేయాలె. సిటిజన్స్ చార్టర్ మాదిరిగా రైతుల చార్టర్‌ను రూపొందించాలె. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలె. ఎక్కువగా వ్యక్తుల మీద ఆధారపడకుండా, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సాధారణ పనులు సాగేలా చర్యలు తీసుకోవాలె.
(వ్యాసకర్త: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్)

243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles