దృశ్యరూపంగా సాహిత్యం

Sun,June 9, 2019 01:00 AM

మనిషి అంతర్లీన ఆలోచనలను, అనుభవసా రాన్ని, ఉద్వేగాలను వ్యక్తంచేసే క్రమంలో అనాదిగా అనేక కళారూపాలను ఆవిష్కరిస్తూ వచ్చాడు. ఈ సృజన రూపాల్లో సాహిత్యం వేలాది సం వత్సరాలది. ఆ సాహిత్యంలో కథాకథన రీతి భిన్నంగా ఉంటూ, నూతనత్వాన్ని సంతరించుకుం టూ వచ్చింది. సాహిత్యంతో పా టు లలితకళలు, దృశ్యకళలు, ప్రదర్శనా కళలు ఇలా భావవ్యక్తీకరణ మాధ్యమాలు అనేక రూపాల్లో ఆవిష్కృతమవుతూ వచ్చాయి. గత శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పరిణామ క్రమంలో రూపొందిన సినిమా విలక్షణమైంది, వినూత్నమైంది. కాలక్రమేణా అనేక మార్పులను సంతరించుకొని ప్రపం చవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన కళా రూపంగా మారింది. సమస్తకళలను ఇముడ్చుకొని 24 క్రాఫ్ట్స్‌తో సినిమా ఎదిగింది. సినిమా సాహిత్యం భిన్న మాధ్యమాలు. సాహిత్యం వ్యక్తిగత సృష్టి అయితే సినిమా దర్శకుడి మేధోమథనం నుంచి ఉత్పన్నమైనదే అయినప్పటికీ పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులు సామూహికంగా రూపొందించాల్సి ఉంటుంది. భిన్నత్వం ఉన్నప్పటికీ సామాజిక దర్పణాలుగా ఏకత్వాన్ని కలిగి ఉన్నాయి. సామాజిక లక్షణాలను ఆవిష్కరించడంలో వాటిపైన వ్యాఖ్యానించడంలో సినిమా సాహిత్యాలు రెండూ ప్రదర్శించే స్వేచ్ఛ విశాలమైంది. ఆ రెండూ సామాజిక దర్పణాలు గా ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. సాహిత్య రచన సినిమాగా రూపాంతరం చెందడం 1902లోనే మొదలైంది. ఏమిలా జోలా రచించిన ఆసోమోర్‌ను అయిదు నిమిషాల సినిమాగా ఓ ఫ్రెంచ్ చలన చిత్రకారుడు రూపొందించాడు. దాంతో ఫిల్మిక్ ఆడాప్టేషన్ ఆరంభమైంది.

నిజానికి సాహిత్య రచన చదువడం, సినిమా చూడటం రెండూ భిన్నమైన అనుభవాలు. సాహిత్య పఠనం, వ్యక్తిగత అనుభవమైతే సినిమా వీక్షణం సామూహిక అనుభవం. పాఠకుడికి, ప్రేక్షకుడికి ఆ సందర్భాల్లో కలిగే అనుభూతి అనంతర అనుభవమూ భిన్నమైనవి. గొప్ప నవల చదివితే కలిగే అనుభూతి సినిమా వల్ల కలుగక పోవచ్చు, అట్లే ఓ గొప్ప క్లాసిక్ సినిమాను చూసినప్పుడు కలిగే అనుభూతి, అనుభవం రచన చదువడం వల్ల కలుగకపోవచ్చు. జీవిత దృశ్యాలు రచనల్లో పదాలుగా నిర్మితమైతే, సినిమాల్లో దృశ్యాలుగా రూపొందుతాయి.


ఆ క్రమంలో హాలీవుడ్, యురోపియన్ సినిమా రంగాలతో పాటు భారతీయ భాషా చిత్రాల్లో సాహిత్య రచనలు సినిమాలుగా రావడం కొనసాగుతూనే ఉన్నది. నిజానికి సాహిత్య రచన చదువడం, సినిమా చూడ టం రెండూ భిన్నమైన అనుభవాలు. సాహిత్య పఠనం, వ్యక్తిగత అనుభవమైతే సినిమా వీక్షణం సామూహిక అనుభవం. పాఠకుడికి, ప్రేక్షకుడికి ఆ సందర్భాల్లో కలిగే అనుభూతి అనంతర అనుభవమూ భిన్నమైనవి. గొప్ప నవల చదివితే కలిగే అనుభూతి సినిమా వల్ల కలుగక పోవచ్చు, అట్లే ఓ గొప్ప క్లాసిక్ సినిమాను చూసినప్పు డు కలిగే అనుభూతి, అనుభవం రచన చదువడం వల్ల కలుగకపోవచ్చు. జీవిత దృశ్యాలు రచనల్లో పదాలుగా నిర్మితమైతే, సినిమాల్లో దృశ్యాలుగా రూపొందుతాయి. అక్కడ దృశ్యానికి ధ్వనీ, సంగీతమూ, సంభాషణా అదనపు బలాన్ని అందిస్తాయి. సాహిత్య రచన మొదట పాఠకుడి ఆలోచనా సహజాతంపైన ముద్రవేసి అక్కడినుంచి క్రమంగా భావోద్వేగాన్ని కలిగిస్తుంది. కానీ సిని మా మొదటే భావోద్వేగాన్ని ప్రభావితం చేసి ఆ తర్వాత సినిమా స్థాయిని బట్టి ఆలోచనపైన ప్రభావాన్ని కలిగిస్తుంది. స్థల కాలాల కోణం నుంచి పరిశీలిస్తే రెంటిలో ఒక మౌలికమైన తేడా కనిపిస్తుంది. నవల ఫార్మేటివ్ సూత్రం కాలమే. అదే సినిమా విషయంలో స్థలమే సూత్రం. నవల స్పేస్‌ను ఆమోదితంగా తీసుకొని కాలవిలువల ఆధారంగా తన కథనాన్ని తీసుకువెళ్తుంది. సినిమా కాలాన్ని ఆమోదితంగా తీసుకొని స్పేస్‌ను ఆధారం చేసుకొని తన కథన రీతిని రూపొందించుకుంటుంది. నవల కాలానుగుణంగా కదులుతూ స్థలాని కి సంబంధించి భ్రమను కలిగిస్తుంది. సినిమా స్థలానుగుణంగా కదులుతూ కాలాన్ని భ్రమింపచేస్తుంది. అలా సినిమాకు స్పేస్, నవలకు టైం అత్యంత ప్రధానమైన అంశాలు.

అయితే నవలను సినిమాగా రూపాంతరీకరించే క్రమంలో దర్శకుడి ప్రతిభ ప్రధాన భూమికను పోషిస్తుంది. పేజీని స్క్రిప్ట్‌గానూ, పదాన్ని దృశ్యం గానూ మలచడానికి దర్శకుడికి గొప్ప సృజనాత్మక కాల్పనికత అవసరమవుతుంది. సాహిత్య రచనలోని కథనో, కథనమో భాషా నిర్మాణరీతో నచ్చినప్పుడు దాన్ని సిని మాగా మలిచేందుకు దర్శకుడు యత్నిస్తాడు. అయితే అన్ని రచనలూ దృశ్యీకరణకు లొంగవు. ఈ సాహిత్య రూపాంతరీకరణలు ప్రధానంగా రెండురకాలుగా జరుగుతాయి. మూల రచనకు, మూల రచయితకు నిబద్ధుడిగా ఉంటూ దృశ్యబద్దం చేస్తాడు. రెండోరకంలో మూల రచనలోని మౌలిక విషయానికి నిబద్ధుడవుతూనే దృశ్య లయను కళాత్మక తను సాధించేందుకు సృజనాత్మక స్వేచ్ఛను తీసుకొని సినిమా నిర్మిస్తాడు. ఈ రెండు రకా ల సినిమాలూ సినిమా చరిత్రలో విజయవంతమ య్యాయి. అయితే సినిమాల్లో వినోదాత్మకమైన ప్రధాన స్రవం తి సినిమాలు, దానికి సమాంతరంగా అర్థవంతమైన సినిమాలూ ఉన్నట్టే సాహిత్యంలోనూ పాపులర్ రచన లు అర్థవంతమైన రచనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాహిత్య రూపాంతరీకరణలు కూడా భిన్నమైన స్థాయిలోనే జరిగాయి. వాటి ప్రభావాలు కూడా అదే స్థాయి లో ఉన్నాయి. ఆర్థిక విజయాల విషయాలు పక్కన బెడి తే అర్థవంతమైన రచనల ఆధారంగా నిర్మించబడిన సినిమాలే పదికాలాల పాటు కళాత్మక సృజనాత్మక రం గాల్లో నిలిచి ఉన్నాయి. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ తదితర భాషాచిత్రాల్లో సాహిత్య రూపాంతరీకరణ పొందిన ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అట్లా మిగతా అన్ని భాషా రచనలతో పాటు తెలుగులో కూడా అనేక రచనలు, సినిమాలు వచ్చాయి.
varala-anand
తెలుగు సాహిత్యరంగంలో వెలుగొందిన యద్దనపూడి, మాదిరె డ్డి, అరికేపూడి లాంటి అనేకమంది నవలలు తెలుగులో వచ్చాయి (సెక్రెటరీ, ప్రేమనగర్ లాంటివి ఎన్నో) అం తేకాదు యండమూరి, సూర్యదేవర, మల్లాది, కొమ్మనాపల్లి లాంటి రచయితల రచనలు కూడా సినిమాలు గా వచ్చాయి (తులసిదళం మొదలైనవి). కానీ వాటిల్లో అత్యధిక శాతం పది కాలాలపాటు నిలబడలేకపోయా యి. అదే గురజాడ కన్యాశుల్కం, విశ్వనాథ ఏకవీర, కిషన్ చందర్ జబ ఖేత్ జాగే (మా భూమి), ప్రేమ్ చంద్ కఫాన్(ఒక వూరి కథ), సీఎస్ రావు ఊరుమ్మడి బతుకులు, దాశరథి చిల్లర దేవుళ్ళు లాంటివి ఇన్ని దశాబ్దాలుగా మంచి సినిమాలుగా గుర్తుండిపోయాయి. ఇట్లా సాహిత్యం, సినిమాలు రెండూ పరస్పర ఆధారితాలూ, ప్రభావితాలూ కూడా.

165
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles