ఉద్యోగ ధర్మం

Fri,May 10, 2019 01:06 AM

ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు సేవ చేసే విధంగా కదిలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మహాయజ్ఞం దేశ చరిత్రలోనే మహత్తరమైనది. ఉద్యోగుల చేత పనిచేయించాలని, వారు సమ్మెకు దిగినా వెనుకాడకూడదనే దృఢ నిశ్చయాన్ని కేసీఆర్ ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగస్తులలో పరివర్తన కనిపిస్తున్నదని తెలుస్తున్నది. ఆ దిశగా ముందడుగు పడిందనేది వాస్తవం. రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యంగా భావించాలె. ప్రజా ప్రతినిధులైతే ఐదేండ్ల పదవీ కాలం తరువాత మళ్ళా ప్రజల ముందుకు పోతామనే భయంతో ఉంటారు. కానీ ఉద్యోగంలో ఒకసారి చేరిన వారిని కదిలించడం అంత సుల భం కాదు. అవినీతిపరులైతే వాటిని రుజువు చేయడం కష్టం. పేదలు అంత పోరాటం చేయలేరు. పేద ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాకుండా జీవిత కాలమంతా వ్యథ చెందుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఉద్యోగులంతా అవినీతిపరులే అనలేము కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక అనుభవం ఉండే ఉంటుంది. అందువల్లనే కేసీఆర్ మార్పు కోసం పిలుపు ఇవ్వగానే గ్రామీణులు మొదలుకొని నగర విద్యావంతుల వరకు ప్రజలలో అపూర్వ స్పందన కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల చేత పనిచేయించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం దూరదృష్టితో, ప్రజాస్వామ్య దృక్పథంతో కూడుకున్నది. తెలంగాణ సాధించిన వెంటనే ఉద్యోగులకు అసాధారణమైన రీతిలో వేతనాలు పెంచిన కేసీఆర్ వారి పనితీరు పట్ల కూడా దృష్టి సారించారు.

బయట నుంచి ఒత్తిడి వల్ల వచ్చే మార్పు కన్న ఉద్యోగులలో వచ్చే పరివర్తన ఆశించదగినది. ఇంకా కొత్త మార్పును పట్టించుకోని మొద్దుబారిన మనస్తత్వంగల ఉద్యోగులూ లేరని కాదు. వారిని ప్రజలే మార్చుకుంటారు. ప్రతి రంగంలో ఉత్తములు ఉంటారు, అధములూ ఉంటారు. కానీ ఉత్తముల మౌనం ప్రమాదకరమైనది. ఉద్యోగులలోని ఉత్తములు ముందుకు వచ్చి ప్రజల సమస్యల పరిష్కారాన్ని ఉద్యమంగా చేపట్టాలె. ఉద్యోగులు చైతన్యాన్ని ప్రదర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలె.


ప్రభుత్వ పథకాలను వేనోళ్ళ హర్షిస్తున్న ప్రజలు ఉద్యోగస్తుల పట్ల మాత్రం అసహనంగా ఉన్నారని పసిగట్టారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని కూడా గ్రహించారు. ప్రజలలో అసహనం పేరుకుంటూ పోతే అది ఏదో ఒక రూపంలో బద్ధలవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిమతం తీర్చడానికి ఒక మార్గాంతరం ఉండాలె. ఆ మార్గాంతరం ఏర్పాటు చేయడం ప్రజాప్రభుత్వ బాధ్య త. అందువల్లనే ప్రజల మనోగతం కనిపెట్టిన కేసీఆర్ ఉద్యోగస్తులకు హెచ్చరిక చేశారు. ఉద్యోగస్తులలో ఉండే కొందరు అవినీతిపరుల వల్ల మొత్తం వ్యవస్థనే కుదేలయ్యే ప్రమాదాన్ని తప్పించారు. ప్రజల సమస్యలను తీర్చకుండా అసహనాన్ని అణిచివేయడం నిరంకుశ పాలన లక్షణం. ప్రజాస్వామికంగా పరిష్కరించి ప్రజల ను శాంతపరచడం ఉత్తమమైన పాలకుల విధా నం. కేసీఆర్ ఈ రెండవ మార్గాన్నే ఎంచుకున్నా రు. ఏదేశంలోనైనా ఉద్యోగ బృందం యధాతథ స్థితిని కాపాడేదిగా, చైతన్యరహితమైనదిగా ఉంటుంది. ఇది శతాబ్దాల చరిత్రకు వారసత్వం గా వచ్చిన సంస్కృతి. రాచరికాలు నశించి ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని పోయినప్పటికీ, ఉద్యోగ బృంద స్వభావంలో ఆశించిన మార్పు రాలేదు. ఈ మార్పు తేవడం ఎట్లా అనే ది మన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విధానకర్తలను వేధిస్తున్న సమస్య. అనేక పాలనాసంస్కరణలు తెచ్చినా ఉద్యోగులలో మార్పు రానిది ఫలవంతం కావు. ఎన్ని పథకాలను రూపకల్పన చేసినా క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయకపోతే అమ లు కావు. అందువల్ల ఈ పరిస్థితిని మార్చే భారాన్ని కేసీఆర్ తన భుజస్కందాలపై వేసుకున్నారు. కేసీఆర్ స్ఫూర్తితో నమస్తే తెలంగాణ పత్రిక కూడా ప్రజలకు, ఉద్యోగస్తులకు వారధిగా మారి ధర్మగంట అనే శీర్షికను ప్రారంభించింది.

ఈ ధర్మగంట ప్రజల బాధలను వ్యక్తీకరించడానికి వేదికను కల్పించడంతో పాటు ఉద్యోగులు స్పందించి సమస్యలను తీర్చడానికి దారి చూపిస్తున్నది. ఈ ధర్మగంటను ప్రారంభించిన తరువాత అనేకమంది ప్రజలు నమస్తే తెలంగాణ పత్రికతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. పలువురు నిజాయితీగల ఉద్యోగులు కూడా ఈ ప్రయోగాన్ని హర్షించారు. వ్యవస్థను విమర్శిస్తూ పబ్బం గడుపుకునే మూస విధానాలకు భిన్నంగా ప్రజల సమస్యలకు మార్గం చూపడమనే కొత్త ఒరవడి పత్రికల పాత్రకు కొత్త నిర్వచనాన్నిచ్చింది. ఈ ప్రయోగం కొంతమేర ఉద్యోగుల ఆత్మపరిశీలనకు దారితీసింది. మాకు ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించిందని కొందరు ఉద్యోగస్తులే అంటున్నారు. ఇటీవల కీసర రెవెన్యూ డివిజన్‌లోని ఉద్యోగులు గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించారు. గ్రామాలవారీగా తేదీలను నిర్ణయించి శ్రమించారు. మొత్తం ఎనిమిది మండలాలలోని 106 గ్రామాలను సమస్య లులేని గ్రామాలు గా ప్రకటించారు. బయట నుంచి ఒత్తిడి వల్ల వచ్చే మార్పు కన్న ఉద్యోగులలో వచ్చే పరివర్తన ఆశించదగినది. ఇంకా కొత్త మార్పును పట్టించుకోని మొద్దుబారిన మనస్తత్వంగల ఉద్యోగులూ లేరని కాదు. వారిని ప్రజలే మార్చుకుంటారు. ప్రతి రంగంలో ఉత్తములు ఉంటారు, అధములూ ఉంటారు. కానీ ఉత్తముల మౌనం ప్రమాదకరమైనది. ఉద్యోగులలోని ఉత్తములు ముందుకు వచ్చి ప్రజల సమస్యల పరిష్కారాన్ని ఉద్యమంగా చేపట్టాలె. ఉద్యోగులు చైతన్యాన్ని ప్రదర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలె.

182
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles