ఈసీపై మాయని మచ్చ

Thu,May 9, 2019 01:33 AM

భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడంలో ఎన్నికల సంఘం పాత్ర తక్కువే మీ కాదు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదనే విమర్శలకు ఆస్కారం ఏర్పడటం విచారకరం. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు కావిస్తుంటే ఎన్నికల కమిషన్ కట్ట డి చేయడం లేదనేది ప్రబలంగా నెలకొన్న అభిప్రాయం. మోదీ, అమిత్ షా అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఏ నిర్ణయమూ తీసుకోకుండా తాత్సారం చేసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అధికారపక్షంపై వచ్చిన ఆరోపణలపై ఇంత ఉదాసీనత ప్రదర్శించడం రాజ్యాంగసంస్థకు మచ్చ తెచ్చింది. ఎన్నికల కమిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఈ నెల 6వ తేదీలోగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై నిర్ణ యం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో హడావుడిగా నిర్ణయాలను ప్రకటించింది. మోదీ, అమిత్ షా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలను తిరస్కరించింది. అయి తే ఎన్నికల కమిషన్‌లోని ముగ్గురు సభ్యులలో ఒకరు ఈ నిర్ణయంతో ఏకీభవించలేదనే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న తీరుపై పారదర్శకంగా వ్యవహరిస్తే బాగుండే ది. ఎన్నికలను సజావుగా నిర్వహించడమే కాదు, రాజకీయపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో కూడా ఎన్నికల కమిషన్ ప్రజల మన్ననలను పొందాలె.

ఎన్నికల కమిషన్, న్యాయస్థానం ఈ వ్యాఖ్యలను తప్పు పడుతాయా లేదా అనేది వేరే విషయం. ప్రధా ని, అధికార పార్టీ అధ్యక్ష స్థానాలలో ఉన్నవారు చాలా సంయమనం పాటించాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు ప్రధానిగా, అధికార పార్టీ నాయకులుగా వ్యవహరించిన వారెవరూ ఎన్నికలలో ఈ స్థాయిలో మాట్లాడలేదు. సైనిక దళాల ఫోటోలను, కార్యకలాపాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని ఎన్నికల కమిషన్ గత నెలలో స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ప్రధాని రెండు ప్రసంగాలలో ఇవే అంశాలు ప్రస్తావించారు.


ప్రధాని మోదీ, అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఎన్నికల కమిషన్, న్యాయస్థానం ఈ వ్యాఖ్యలను తప్పు పడుతాయా లేదా అనేది వేరే విషయం. ప్రధా ని, అధికార పార్టీ అధ్యక్ష స్థానాలలో ఉన్నవారు చాలా సంయమనం పాటించాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు ప్రధానిగా, అధికార పార్టీ నాయకులుగా వ్యవహరించిన వారెవరూ ఎన్నికలలో ఈ స్థాయిలో మాట్లాడలేదు. సైనిక దళాల ఫోటోలను, కార్యకలాపాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని ఎన్నికల కమిషన్ గత నెలలో స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ప్రధాని రెండు ప్రసంగాలలో ఇవే అంశాలు ప్రస్తావించా రు. మహారాష్ట్రలోని లాతూరులో ప్రసంగిస్తూ కొత్త ఓటర్లు తమ మొదటి ఓటును బాలాకోట్ వైమానిక దాడి వీరులకు, పుల్వామా దాడిలో మరణించిన సైనికులకు అంకితమివ్వాలన్నారు. వార్ధాలో మాట్లాడుతూ- రాహుల్‌గాంధీ కేరళలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అల్పసంఖ్యాకవర్గాల సంఖ్య ఎక్కువ ఉండ టం కారణమని విమర్శించారు. రాజస్థాన్‌లోని బర్మార్‌లో మాట్లాడుతూ- అణ్వాయుధాలు ఉన్నది ఎందుకు? దీపావళి కోసం కాదు అం టూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రధాని పదవిలో ఉన్న వారి ప్రసంగాలను ప్రపంచదేశాలు గమనిస్తుంటాయి. అందువల్ల ఆచితూచి మాట్లాడాలె. ఎంతో సంయమనాన్ని ప్రదర్శించాలె. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధాని చేసిన విమర్శలు కూడా సంస్కారవంతంగా లేవు. అమిత్ షా కూడా రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న వయనాడ్‌లోని ఊరేగింపులు చూస్తే భారత్‌లోనా, పాకిస్థాన్‌లోనా అనేది చెప్పడం కష్టమని వ్యాఖ్యానించడం సమంజసంగా లేదు.

రాజకీయ నాయకులు ఏమి మాట్లాడినా తప్పుపడుతూ కట్టడి చేయడం ప్రజాస్వామ్యం కాదు. స్వేచ్ఛగా ప్రసంగాలు సాగించాల్సిందే. కానీ ఉచితానుచితాలు గ్రహించి మసులుకోవాలె. ఇతర రాజకీయపక్షాల నాయకులు ఎంతో సంయమనంగా, వివేచనతో మాట్లాడినా ప్రజాస్వామ్య స్ఫూర్తి కి భిన్నంగా తప్పు పట్టిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీ పెద్దలు మాట్లాడినప్పుడు మౌనం వహించడం పద్ధతి కాదు. బీజేపీ నాయకుల ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో బీజేపీ తన ఐదేండ్ల పాలనా తీరు, ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ఉద్వేగాలను రెచ్చగొడుతుందనేది తెలిసిందే. మోదీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలుచేయలేకపోయారు. ఐదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో విఫలమయ్యారు. బ్యాంకులను ముంచిన అవినీతిపరులు దర్జాగా దేశం విడిచిపోయారు. ఈ నేపథ్యంలో మోదీ పాల నావైఫల్యాలను ప్రధానాంశంగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహమై ఉండాలె. అవసరమైతే మిగతా రాజకీయపక్షాలను జమకట్టి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమను తాము సమర్థించుకోవడంలో నిమగ్నమైంది. బీజేపీపై ప్రతిదాడికి దిగి ఆ పార్టీని రక్షణ స్థితిలో పడేయలేకపోయింది. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిష న్, న్యాయస్థానం కన్నా ప్రజాక్షేత్రమే ప్రాధాన్యం గలది. ప్రజాతీర్పే అంతిమమైంది. బీజేపీని అడ్డుకోదలుచుకుంటే, వచ్చే రెండు దశల్లో అయినా కాంగ్రెస్‌పార్టీ ప్రజాక్షేత్రంలో క్రియాశీలంగా వ్యవహరించవచ్చు.

124
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles