సంఖ్యాబలంపై ఆశలు అత్యాశలు

Thu,May 9, 2019 01:32 AM

దశల వారీగా జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ సరళి ఏ పార్టీకీ అనుకూల పవనాలున్నట్లు తెలుపటం లేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్నిపార్టీల నాయకులు పోరాడుతున్నారు. ముఖ్యంగా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారాన్ని నిలు పుకొనేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నది. మరోవైపు విపక్షాలుగా కాంగ్రెస్ వివిధ రాష్ర్టాల్లో స్థానిక ప్రాంతీయపార్టీలు కూడా బీజేపీని నిలువరించ టం కోసం గట్టిగానే పోరాడుతున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా బీజేపీకి వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యం లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కావల్సిన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవటం కోసం వ్యూహాలు పన్నుతున్నది. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నది. ఈ క్రమంలో బీజేపీ 2014 ఎన్నికల ఫలితాలను ఇప్పటి పరిస్థితులకు అన్వయించి చూస్తే నష్టపోయే సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. గత 2014 ఎన్నికలనే చూస్తే.. హిందీ బెల్ట్ రాష్ర్టా లు ప్రధానంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలోని రాష్ర్టాల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని పొందింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని మొత్తం 225 సీట్లలో 190 సీట్లను గెల్చుకొని అధికారానికి చేరువైంది. అయితే ఇప్పుడు ఈ రాష్ర్టాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 75 సీట్లు కోల్పోక తప్పని పరిస్థితి ఉన్న ది. ఈ కోల్పోయిన సంఖ్యాబలాన్ని దక్షిణ, తూర్పు భారతంలో పూడ్చుకోవాలని మోదీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. 42 స్థానాలున్న బెంగాల్‌లో గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లను గెల్చుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నది. దానికోసం బీజేపీ తనదైన సైద్ధాంతిక, విధానపరమైన విధానా ల అండతో బెంగాల్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది.

డార్జిలింగ్ ప్రాంతంలోని అన్ని స్థానాల్లో బీజేపీ, తృణముల్ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీపడినా ఓట్ల శాతంలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఇప్పటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గణనీయ స్థాయిలో ఓట్ల శాతం పెంచుకోగలిగితే.. డార్జిలింగ్ ప్రాంతంలోని ఉత్తర మాల్దా, అలిపూర్దౌర్, రాయ్‌గంజ్, దక్షిన్ మాల్దా, అసన్‌సోల్ బీజేపీ వశమవుతాయి. ఈ ప్రాంతంలో విజయం సాధిస్తే ఈ నాలుగు స్థానాలకు మరో రెండు కలిసి బీజేపీ స్థానాలు ఆరుకు చేరుకుంటాయి.


తూర్పు భారతంలో పశ్చిమబెంగాల్ ప్రాధాన్యంగల రాష్ట్రం. ఇక్కడ 42 పార్లమెంట్ స్థానాలున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెల్చుకొని ఉనికిని చాటుకున్నది. ఇప్పుడు తనదైన విధానాలతో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు అమ్ముల పొదిలోని అస్ర్తాలన్నింటినీ బయటకుతీస్తున్నది. జాతీయ పౌరసత్వ నమోదు రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ను ముందుకుతెచ్చి ప్రజల్లో విదేశీ వలస సమస్యను ఎజెండాగా చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. బెంగాల్‌లో పెద్దసంఖ్యలో వలసవచ్చిన వారుంటారు. అందువల్ల పౌరసత్వ బిల్లుతో హిందూ ఓటర్ల సానుభూతిని పొందేందుకు ఎత్తులు వేస్తున్నది. బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీగా ఆల్ ఇండియా తృణముల్ కాం గ్రెస్(ఏఐటీసీ), లెఫ్ట్‌ఫ్రంట్ (సీపీఎం, సీపీఐ తదితర వామపక్షపార్టీల కూటమి), బీజేపీ, దాని మిత్రపక్షాలు గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్‌ఎల్‌ఎఫ్), గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) బిమల్ గురాంగ్ వర్గం లాంటి వాటితో బీజేపీ జతకట్టి బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నది. బెంగాల్ స్థానిక పరిస్థితులు, రాజకీయ, సామాజిక పరిస్థితులు నేపథ్యంలో మేం అధ్యయనం చేశాం. ప్రధానంగా గత 2014 ఎన్నికలు, అం దులో ప్రధాన పార్టీలు పొందిన ఓట్ల శాతం, ఇప్పటి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీకి ఓట్ల శాతం ఎంత పెరుగుతుందన్న దిశగా అధ్యయ నం చేశాం. 2014లోని ఎన్నికల వాతావరణం, అప్పుడు సాధించిన ఓట్ల శాతం ఇప్పటికి అది పెరుగుతుందా, తగ్గుతున్నదా అన్నదే ప్రధానాంశంగా అధ్యయనం చేశాం. బీజేపీ విషయానికి వస్తే.. 2014తో పోలిస్తే, ఓట్ల శాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఒక స్థానంలో తగ్గితే నాలుగింటిలో మాత్రం పెరుగుదల కనిపిస్తున్నది. దీనికి మేం ప్రధానంగా ఆధారపడింది, ఎంచుకున్నది-బెంగాల్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు అందు లో ఆయా పార్టీలు పొందిన ఓట్ల శాతం. ఇందులో భవిష్యత్తుకు సంబంధించిన జోస్యాలు, అభూత కల్పనలు ఏమీ లేవు. సామాజిక రాజకీయ వాతావరణం, ఓటర్ల మానసిక రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓటర్ల గమనాన్ని గమనించాం, గణించాం.

గత ఎన్నికలను దేన్నిచూసినా లెఫ్ట్ ఫ్రంట్ క్రమంగా ఓట్ల శాతం తగ్గుతూ వస్తున్నది. లెఫ్ట్ ఫ్రంట్ కోల్పోతున్న ఓట్ల శాతం అంతా బీజేపీ వైపు మరలుతున్నది. అధికార తృణముల్ కాం గ్రెస్ మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలో బీజేపీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. బీజేపీ దూకుడును నిలువరిస్తున్నది. అయితే.. 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల స్థితికి ఇప్పటి పరిస్థితులను ఒకే గాటన కట్టి చూడలేం. అసెంబ్లీ ఎన్నికలు అనేసరికి స్థానిక అంశాలు ప్రధానమైపోయి ఓటర్ల తీర్పు స్థానికత చుట్టూ తిరుగటానికి అవకాశం ఉంటుంది. అదే సాధారణ ఎన్నకలు అనేసరికి జాతీయపార్టీల ప్రభావం, కేంద్ర రాజకీయ పరిస్థితు లు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో చూస్తే.. గతం లో కన్నా ఈసారి ఏదో స్థాయిలో బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకోవటానికే ఎక్కువ అవకాశం ఉన్నది. 2011 విధానసభ ఎన్నికలు, 2014 ఎన్నికలను చూస్తే.. బీజేపీ 12.7శాతం ఓట్లను ఎక్కువ పొందగలిగింది. అదే 2016 విధానసభ ఎన్నికలు, 2018 గ్రామ పంచాయతీ ఎన్నికలను చూస్తే.. బీజేపీ ఓట్ల శాతం 7.56 పెరిగింది. 2019 వచ్చేసరికి బీజేపీ ఆశిస్తున్న స్థాయిలో ఓట్ల శాతంలో మార్పు వస్తుందన్న పరిస్థితి లేదు. గతం లో దేశవ్యాప్తంగా మోదీ పవనం ఉన్న పరిస్థితుల్లో కూడా బెంగాల్‌లో పార్లమెంట్ స్థానాలు గెలువలేదు. ఇప్పుడు కూడా ఓట్ల శాతం పెరుగుతుందేమో కానీ గణనీయ సంఖ్యలో సీట్లు గెలిచేంతగా ప్రభావం ఉంటుందన్న పరిస్థితులు కనిపించటం లేదు. అయితే మొత్తంగా చూస్తే. బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలో బీజేపీకి కొంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం పెంచుకునే స్థితి ఉన్నది. డార్జిలింగ్ ప్రాంతంలోని అన్నిస్థానాల్లో బీజేపీ, తృణముల్ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడినా ఓట్ల శాతంలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఇప్పటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గణనీయ స్థాయిలో ఓట్ల శాతం పెంచుకోగలిగితే.. డార్జిలింగ్ ప్రాంతంలోని ఉత్తర మాల్దా, అలిపూర్దౌర్, రాయ్‌గంజ్, దక్షిన్ మాల్దా, అసన్‌సోల్ బీజేపీ వశమవుతాయి.
basu
ఈ ప్రాంతంలో విజయం సాధిస్తే ఈ నాలుగు స్థానాలకు మరో రెండు కలిసి బీజేపీ స్థానాలు ఆరుకు చేరుకుంటాయి. ఏ గణనాలు చేసినా, ఎలా చూసినా బీజేపీ ఆరు స్థానాలకన్నా ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితులు కనిపించటం లేదు. అయితే సామాజిక, రాజకీయ అంశాలను చాలా సందర్భాల్లో ఇతర అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఎవరూ ఊహించని, అద్భుతం అంటూ ఏదీ జరుగకపోతే బీజేపీ సంఖ్యాబలం ఆరుకు మించదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అర్థంలో కేంద్రం లో అధికారం చేపట్టడానికి హిందీ రాష్ర్టాల్లో కోల్పోయిన సంఖ్యాబలాన్ని తూర్పు, దక్షిణ భారతంతో పూడ్చుకోవాలన్న మోదీ ఆశ అత్యాశగానే కనిపిస్తున్నది.
(వ్యాసకర్తలు: మసాచుసెట్స్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్, గౌహతీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్)

203
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles