ఎన్నాళ్లీ ఎన్నికల నియమావళి?

Wed,May 8, 2019 12:29 AM

తూర్పు-పశ్చిమ జర్మనీలు విడిగా ఉన్న రోజుల్లో తూర్పు జర్మనీకి చెందిన ఒక పౌరుడు తన దేశంలో స్వాతం త్య్రం లేదని భావించి దొంగతనంగా సరిహద్దు దాటి పశ్చిమ జర్మనీలోకి ప్రవేశించాడు. తనకు అంతులేని స్వాతంత్య్రం లభించిందని పొంగిపోయిన ఆ పెద్దమనిషి తన చేతి కర్ర ను విలాసంగా ఊపుకుంటూ పశ్చిమ జర్మనీ వీధుల్లో తిరుగడం ప్రారంభించాడు. ఆ కర్ర కాస్తా ఒకడి ముక్కుకు తగిలి వాడికి కోపం వచ్చింది. వాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు న్యాయస్థానానికి పోయిం ది. ఎందుకు ఇలా చేశావని న్యాయమూర్తి కర్ర తిప్పిన ఆసామిని ప్రశ్నించాడు. పశ్చిమ జర్మనీకి రాగానే తనకు స్వాతంత్య్రం వచ్చిందని భావించాననీ, అందుకే కర్రను ఇష్టం వచ్చినట్లు తిప్పాననీ జవాబిచ్చాడు. అత డి స్వాతంత్య్రం పక్కవాడి ముక్కు చివర మొదలవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించాడు. అలా ఉంది మన ఎన్నిక ప్రవర్తనా నియమావళి. ఎక్కడ మొదలవ్వాలో, ఎక్కడ పూర్తికావాలో అర్థం లేని-కాని ప్రవర్తనా నియమావళి మనది. భారతదేశ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో నెలల తరబడి ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటే ప్రభుత్వాలు పనిచేసేదె లా అనేది సమాధానం లేని ప్రశ్న. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయమై చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అభ్యంతరాలు లేవదీశారు. నియమావళి పేర ఎన్నికల సంఘం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని ఫిర్యాదులు చేస్తు న్నారు. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలై, ముగిసేంతవరకు పోటీలో ఉన్న రాజకీయపార్టీలు, అభ్యర్థులు వ్యవహరించాల్సిన తీరుతెన్నులే అయి ఉండాలి. అంతకుమించి ఉండటం భావ్యం కాదేమో! మన ఎన్నికల తతంగమంతా సుదీర్ఘ ప్రక్రియ. ఎన్నికలు ముగిసిన చాలాకాలం వరకూ ఫలితాలు ప్రకటించరు.

ముఖ్యమంత్రి వివిధ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం. ఎన్నికల్ కోడ్ ఉన్నా, లేకపోయినా సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత ఉంటుంది. అధికారికీ, మంత్రికీ మధ్య పరస్పర విశ్వసనీయత నెలకొన్నప్పుడే ప్రభుత్వ నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపడుతాయి.


ఎన్నికలైపోయిన తర్వాత కూడా ఇది చేయవద్దు.. అది చేయవద్దు అంటే సమంజసం కాదేమో! ఎన్నికల ప్రసంగాలను సాకుగా చూపి, ఉన్నదానికీ, లేనిదాని కీ అభ్యంతరాలు లేవదీసి నోటీసులు ఇవ్వడం భావ్యమేనా? హిందూ మతం మీద ఏదో వ్యాఖ్యలు చేశాడని తెలంగాణ సీఎంకు సంజాయిషీ నోటీసు ఇవ్వడం, ఆయన ఇచ్చిన జవాబుకు బదులుగా ఆయన ప్రసంగంలో తప్పులెంచడంలో ఔచిత్యం ఉన్నదా? ముఖ్యమంత్రులను అధికారిక సమీక్షలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించడం సమంజసం కాదేమో! తెలంగాణ, ఏపీ లాంటి ఎన్నికలు ముగిసిన రాష్ర్టాల్లో ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలుచేయడం సమంజసం కాదు. ఉదాహరణకు ఫొని తుఫాను సహాయక చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని ఏపీ ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? పోలింగ్ ముగిసినందున ఓటర్లను ప్రభావి తం చేయడమనే సమస్య తలెత్తదు. నియమావళి సాకుతో సమీక్షలు నిర్వహించకపోతే ఎన్నికైన ప్రభుత్వానికి అర్థమే లేదు. అధికార-అనధికార బృందం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ ఎన్నికల సంఘానికి కాదు. ఇదే పరిస్థితి ఒరిస్సా రాష్ర్టానికి కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్పన్నమయ్యే మౌలికమైన ప్రశ్న-ఎన్నికల తతం గం ముగిసేంతవరకూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? అనేదే. ఎన్నికల తతంగం పూర్తయి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా, ఏ ఆంక్షలు లేకుండా విధులు నిర్వహించడానికి అవకాశం ఉండాలి. అంతర్లీనంగా కానీ, బహిర్గతంగా కానీ, రాజ్యాంగంలోనైనా, మరెక్కడైనా, ఫలానా విధాన నిర్ణయమైనా, ఆర్థికపరమైన నిర్ణయమైనా తీసుకోరాదని చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో నిరంతర పాలన కొనసాగడానికి అణగారిన వర్గాల లబ్ధికి అభివృద్ధి-సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలవడానికీ, ఆర్థికభారంతో నిమిత్తం లేకుండా, నిర్ణయాలు తీసుకోవడానికి ఆంక్షలు ఉండకూడదు.

ఏపీ పరిణామాలను విశ్లేషిస్తే ఒక్క విషయం అవగాహన చేసుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ అభిప్రాయ భేదాలున్నాయని చెప్పకనే చెబుతున్నాయి కొన్ని సంఘటనలు. మంత్రి మండలి సమావేశం ఏర్పాటుచేయాల్సిందిగా సాధారణంగా పంపే నోట్‌కు బదులు సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖాముఖిగా కానీ, ఫోన్‌లో కానీ మాట్లాడితే బాగుండేదేమో! ఏం చేస్తే ఎన్నిక ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుండా మంత్రిమండలి సమావేశం జరుపుకోవచ్చని ఆయన్ను సంప్రదిస్తే బాగుండేదేమో!


తొలిసారిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేరళలో 1960 ఫిబ్రవ రిలో శాసనసభ ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చింది. అన్ని రాజకీ యపార్టీలు ఏకగ్రీవంగా ముసాయిదా నియమావళిని రూపొందించా యి. ఇది స్వయం క్రమశిక్షణ. దాంట్లో ఎన్నికల ప్రచారానికి, ఉపన్యాసాలకు, నినాదాలకు సంబంధించిన ఆంక్షలు పొందుపరిచారు. 1962 లో రాష్ర్టాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇదే ముసాయిదాను అన్ని రాష్ర్టాలకు పంపడం జరిగింది. 1968, 1969లో వివిధ రాష్ర్టాల మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఈ ముసాయిదా ఆధారంగా ఎన్నికల సంఘం ఒక డాక్యుమెంట్‌ను తయారుచేసింది. అందులో రాజకీయపార్టీల బాధ్యతలను వివరించింది. అదే మార్పులు-చేర్పులతో ప్రస్తుత ప్రవర్తనా నియమావళిగా రూపుదిద్దుకున్నది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో- మంత్రివర్గ సమావేశం నిర్వహించాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ సీఎం కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ పంపించినట్లు వార్తలొచ్చాయి. దీన్ని రొటీన్‌గా బహుశా సీఎస్ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శికి పంపించాలి. ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమా? అనే అంశం ఐఏఎస్‌ల మధ్య చర్చగా మారింది. సీఎం నిర్ణయం సమంజసమైనదని కొందరు, కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం పెట్టుకోవచ్చు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేబినె ట్ సమావేశం పెట్టాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) అనుమతి తప్పనిసరి అని కొందరి వాదన. అత్యవసరమై కేబినెట్ సమావేశం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదించాలి కానీ తిరస్కరించడం సబబేనా? ఈ అంశం ముఖ్యమంత్రికీ, సివిల్ సర్వెంటయిన ప్రధాన కార్యదర్శికి మధ్య విభేదాలకు దారితీయవచ్చా? అసలు పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో మంత్రులకూ, సివిల్ సర్వెంట్లకూ మధ్య ఎలాంటి సంబంధాలుండాలనేవి కూడా చర్చనీయాంశమే!

ముఖ్యమంత్రి వివిధ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం. ఎన్నికల్ కోడ్ ఉన్నా, లేకపోయినా సమీక్షా సమావేశా ల్లో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత ఉంటుంది. అధికారికీ, మంత్రికీ మధ్య పరస్పర విశ్వసనీయత నెలకొన్నప్పుడే ప్రభు త్వ నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపడుతాయి. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్‌లో రూపొందించిన ఆర్మ్‌స్ట్రాంగ్ మెమొరాండంలో వివరించారు. వాటి ఆధారంగా నేటి పరిణామాలను సమీక్షించడం సబబు. అధికారులు మంత్రులకు జవాబుదారీగా ఉండాలి. మంత్రులకు అంటే, ప్రజా తీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి అని అర్థం చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. (ముఖ్య) మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రథమ కర్త వ్యం. అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయా ల్లో సహకరిస్తూ ఉండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడాలె. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. (ముఖ్య)మంత్రి ఆలోచన సరళి కి భిన్నమైనదైనా ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి. సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయి నా, తాను శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా బాధ్యతారాహిత్యం అవుతుంది. ఇదంతా జరిగిన తర్వాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదై నా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, విభేదాలున్నా అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో అమలుచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు.
Vanam-Jwala-Narsimha-rao
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్‌లో అమలవుతున్న సత్సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టడం మంత్రులకు, అధికారులకూ మంచిది. ఈ నేపథ్యంలో ఏపీ పరిణామాలను విశ్లేషిస్తే ఒక్క విషయం అవగాహన చేసుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ అభిప్రాయ భేదాలున్నాయని చెప్పకనే చెబుతున్నాయి కొన్ని సంఘటనలు. మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సాధారణంగా పంపే నోట్‌కు బదులు సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖాముఖిగా కానీ, ఫోన్‌లో కానీ మాట్లాడితే బాగుండేదేమో! ఏం చేస్తే ఎన్నిక ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుండా మంత్రిమండలి సమావేశం జరుపుకోవచ్చని ఆయన్ను సంప్రదిస్తే బాగుండేదేమో! అలా గే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పట్టుదలకు పోకుండా ముఖ్యమంత్రిని కలిసి సాధ్యాసాధ్యాలను చర్చిస్తే బాగుంటుందేమో!

216
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles