కేసీఆర్ అంటే ఎందుకంత భయం

Wed,May 8, 2019 12:29 AM

1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశం మొత్తాన్ని కారాగారంగా మార్చేసింది. ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు, ఉద్యమకారులు అందరూ జైళ్లలో నిర్బంధించబడినారు. ఆ సమయంలో ఇందిరాగాంధీని ఎదిరించే మొనగాడే లేడు. ప్రతిపక్ష పార్టీలన్నీ పరస్పరం కలహించుకుంటూ కాలం గడుపుతున్నారు. అప్పుడు జయప్రకాశ్ నారాయణ్ చొరవ తీసుకొని మొరార్జీ దేశాయ్, చర ణ్‌సింగ్, చంద్రశేఖర్, మధు లిమాయె, వాజపేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి వివిధ పార్టీల నాయకులను కూడగట్టి జనతా పార్టీ అనే ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు. ఐకమత్యంతో పోరాడితే ఇందిరాగాంధీని గద్దె దించడం సాధ్యమవుతుందని ఉద్బోధించారు. జయప్రకాశ్ నారాయణ్ వ్యూహం, పోరాటం ఫలించాయి. 1977 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మట్టికరిచింది. ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జనతా పార్టీ పూర్తి ఆధిక్యతతో అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. అదంతా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి జయప్రకాశ్ నారాయణ్ చేసిన కృషి ఫలితం. 1984లో తన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ అక్రమంగా కూల్చేసిందన్న ఆక్రోశంతో నేషనల్ ఫ్రంట్ అనే కూటమికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన దాదాపు ఇరువై రాజకీయపార్టీల అధినేతలను కలిశారు. మీటింగ్‌లు పెట్టారు. కొన్నిసార్లు వారిని హైదరాబాద్ రప్పించారు. కొన్నిసార్లు తానే వారి రాష్ర్టాలకు వెళ్లారు. ఆంగ్లం, హిందీ సరిగా రాకపోయినా, వారితో సమావేశాలు నిర్వహించి, ఒప్పించి 1989 నాటికి జాతీయ రాజకీయాల్లో ఒక బలమైనశక్తిగా నేషనల్ ఫ్రంట్‌ను నిర్మించారు ఎన్టీఆర్.

రేపటి ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలు పూర్తి మెజార్టీ సాధించలేవనేది ఇప్పటి పరిస్థితిని బట్టి అంచనా. ఎన్డీయేకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మెజార్టీకి కనీసం అరువై, డ్బ్భై స్థానాలు తక్కువే వచ్చే అవకాశం ఉన్నది. ఎన్డీయేకు, యూపీఏకు కలిపి 260 స్థానాల లోపలే వస్తాయని కేసీఆర్ అంచనా. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఊపిరి పోసుకుంటే దానికే ఎక్కువ సీట్లు వస్తాయి. అలాంటి సందర్భం తటస్థిస్తే.. కేసీఆర్ జాతీయస్థాయిలో బలమైన నాయకుడిగా ఉద్భవిస్తాడు.


ఎన్టీఆర్ పోరాట ఫలితంగా 1984లో నాలుగు వందల సీట్లకు పైగా సాధించిన కాంగ్రెస్ పార్టీ 1989 చిత్తుగా ఓడిపోయింది. నేషనల్ ఫ్రంట్ మెజార్టీ సాధించి అధికారంలోకి రాగలిగింది. మళ్లీ 1994 నాటికి ఎన్టీఆర్ జాతీయస్థాయిలో చొరవ తీసుకొని కాం గ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో కూటమిని నిర్మించారు. అప్పట్లో ఆయన జీవించి ఉన్నట్లయితే 1996 ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యేవారని నేటికీ నమ్ముతారు కొందరు. అప్పటినుంచి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కూటములు కట్టడం, ఎన్నికలో గెలిచి అధికారం చేపట్టడం జరుగుతూనే ఉన్నది. కొన్ని పార్టీలు వెళ్లిపోతుంటాయి. కొన్ని పార్టీలు చేరుతుంటాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయేలో టీడీపీ రెండోసారి చేరింది. కొన్ని పార్టీలు బయటి నుంచి మద్దతునిచ్చాయి. ఇప్పుడీ చరిత్రను ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది నెలలుగా యూపీఏకు, ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయాలని కృషిచేస్తున్నా రు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఆయన మమతా బెనర్జీని, నవీ న్ పట్నాయక్‌ను, కుమారస్వామిని, పినరయి విజయన్‌ను కలిసి చర్చించారు. రేపో మాపో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలువబోతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఫ్రంట్‌లో చేరబోతున్నారు. కేసీఆర్ కృషి ఫలిస్తే, మోదీని, సోనియాను వ్యతిరేకించే మరికొందరు నాయకులు, పార్టీలు కూడా కేసీఆర్‌తో చేతులు కలుపొచ్చు. అయితే.. కేసీఆర్ చేస్తున్న పర్యటనలను, ఇతర రాష్ర్టాల నాయకులను కలువడాన్ని కొన్ని పచ్చ పత్రికలు, నాయకులు ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పర్యటనల వల్ల ఫలితం ఉంటుందా? ఫ్రంట్ ఏర్పాటు చేయడం కేసీఆర్‌కు సాధ్యమవుతుందా అంటూ తమ మీడియాలో రెచ్చిపోతున్నారు.

అసలు ఇతర రాష్ర్టా ల్లో కేసీఆర్ పర్యటించడాన్నే భరించలేకపోతున్నారు. నిన్నగాక మొన్న చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాను, ఆందోళన చేస్తాను, పోరాడతానంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికినపుడు ఆ మీడియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఇంకేముంది.. చంద్రబాబు తన నలభై ఏండ్ల అనుభవంతో ఢిల్లీని దద్దరిల్లజేస్తున్నాడు.. మోదీని దించేసేదాకా నిద్రపోడు.. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు.. మహా మహా నాయకులందరూ చంద్రబాబుకు తోడుగా నిలుస్తున్నారని ఒకటే డప్పులు, భజన చేసి తరించాయి. ఇంతకూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాధించిందేమైనా ఉన్నదా? ఈవీఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎత్తిన గొంతుకు ఒక్కరూ వంత పాడలేదు. చంద్రబాబు ధర్నాలు, ఆందోళనలు అట్టర్ ఫ్లాపయ్యాయి. అయినప్పటికీ, మరో రకం గా చంద్రబాబుకు భజంత్రీలు కొడుతుంటాయి. ప్రతి నియోజకవర్గంలో నూ యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని అడ్డంగా కొట్టేసింది సుప్రీంకోర్ట్. కానీ, దీన్ని చంద్రబాబు పరాజయంగా మీడియా రాయదు. అదే మీడియా కేసీఆర్ ప్రయత్నాలకు మాత్రం గండి కొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి! కేసీఆర్ ఒక దేవాలయానికి వెళ్తే అదే దో మహాపరాధంగా వార్తలు రాసిపడేస్తాయి. రేపటి ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలు పూర్తి మెజార్టీ సాధించలేవనేది ఇప్పటి పరిస్థితిని బట్టి అంచనా. ఎన్డీయేకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటి కీ మెజార్టీకి కనీసం అరువై, డ్బ్భై స్థానాలు తక్కువే వచ్చే అవకాశం ఉన్న ది. ఎన్డీయేకు, యూపీఏకు కలిపి 260 స్థానాల లోపలే వస్తాయని కేసీఆ ర్ అంచనా. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఊపిరి పోసుకుంటే దానికే ఎక్కువ సీట్లు వస్తాయి. అలాంటి సందర్భం తటస్థిస్తే.. కేసీఆర్ జాతీయస్థాయిలో బలమైన నాయకుడిగా ఉద్భవిస్తాడు. ఒక్క మమతాబెనర్జీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తాయి.
murali-mohan-Ilapavuluri
దక్షిణ భారతదేశంలో స్టాలిన్, కుమారస్వామి, జగన్ కేసీఆర్‌ను బలపరుస్తారు. నవీన్ పట్నాయక్ కూడా కేసీఆర్‌కే మద్దతు ప్రకటిస్తారు. కమ్యూనిస్టులు ఇద్దరూ మోదీ, సోనియాకు వ్యతిరేకులు కాబట్టి వారి మద్దతు కూడా కేసీఆర్‌కే లభిస్తుంది. వీరివి అన్నీ కలుపుకుంటే కనీసం వంద స్థానా లుంటాయి. కేంద్రంలో మైనార్టీ కూటములు ఏర్పడినపుడు వంద సీట్లు చేతిలో ఉన్నవాడు కేంద్రంలో అత్యున్నత పదవిని అధిరోహించడా? ఒకవేళ పై అంచనా అంతా తలకిందులు కావచ్చు. అవకాశం రాకపోవచ్చు. అయినా, మానవ ప్రయత్నం చేయాలి కదా? కృషి చేయడాన్ని కూడా తప్పుపడితే ఎలా?
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

323
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles