వ్లాదిమిర్ నబొకొవ్ ( 22 ఏప్రిల్ 1899 - 2 జూలై 1977)

Mon,May 6, 2019 01:08 AM

VLADIMIR-NABOKOV
It was love at first sight, at last sight, at ever and ever sight అనే వాక్యంతో ప్రపంచాన్నే కనికట్టు చేసిన కవి, నవలా రచయిత, అనువాదకుడు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ నబొకొవ్. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఓ సంపన్న కులీన కుటుంబంలో జన్మించినప్పటికీ, రష్యాలో నాడు నెలకొన్న పరిస్థితుల వల్ల రచయిత, రాజకీయవేత్త అయిన తన తండ్రితో పాటు బెర్లిన్‌కు వలస వెళ్లారు. అక్కడ ఓ బహిరంగ సభలో ఆయన హత్యకు గురయ్యారు. ఈ సంఘటన నబొకొవ్‌లో అంతర్లీనంగా బలంగా ముద్రపడి, ఆయన రచనలలో ఇలాంటి రాజకీయ హత్యలు అనుకోకుండానే ఓ అంశంగా మారాయి.
నబొకొవ్ కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్‌లో ప్రవాసంలోని రష్యన్‌లకు ఇచ్చే గౌరవ వేతనంతో ప్రవేశాన్ని పొందారు. మొదట జంతుశాస్త్రంలో చేరినప్పటికీ, ఆ తర్వాత సాహిత్యంలోకి మారి డిగ్రీ పూర్తిచేశారు. నవలా రచయితగా Mashenka (1926), King, Queen, Knave(1928), The Defence (1930), Despair (1937), Bend Sinister (1947) వంటి నవలలెన్నో రాసినప్పటికీ, Lolita (1955) సృష్టికర్తగా ఆయన పేరు చిరస్థాయిని సాధించింది.
కవిగా కూడా తనదైన ప్రభావాన్ని ప్రదర్శించిన నబొకొవ్ కవితా సం కలనాలలో Poems(1916), Two Paths(1918),The Cluster (1923), The Empyrean Path వంటివి ప్రముఖమైనవి.
ఒకవైపు సృజనాత్మక రచనలను కొనసాగిస్తూనే, మరోవైపు కీటకాల శాస్త్రజ్ఞుడిగా సీతాకోక చిలుకలపై 18 పైగా శాస్త్రీయ పరిశోధనలను చేసిన నబొకొవ్ Speak, Memory (1951) అనే స్వీయ చరిత్రను కూడా రాశారు.
బెర్లిన్‌లో ఉన్నపుడు Vera Slonimను ప్రేమించి పెళ్లి చేసుకుని, చనిపోయేంతవరకు ఆమె ప్రేమలోనే గడిపిన నబొకొవ్ ఈ Encou-nter కవితను తన 24వ ఏట తొలిసారి Veraను చూసినప్పుడు రాశారు!

122
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles