ఒత్తిడి పెంచొద్దు

Sat,April 20, 2019 12:46 AM

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే బాధతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు శోచనీయం. విద్యార్థులను ఎప్పుడూ చదవాలి అనే ఒత్తిడి పెంచడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేని యువత ఆత్మహత్యల్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. విద్యార్థుల నైతిక ైస్థెర్యం పెంపొందించేలా అధ్యాపకులు, తల్లిదండ్రులు కృషి చేయాలి. అలాగే పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడాలి. అంతేగానీ కొంతమంది ఇతరులతో పోలుస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం నెలకొంటున్నది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి పిల్లలపై ఒత్తిడి పెంచే విధానాలకు ఇకనైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు స్వస్తిపలుకాలి.
-పి. లక్ష్మణ్, హైదరాబాద్

హుందాగా వ్యవహరించాలి

ఎన్నికల ప్రచార సమయంలో నేతలు హుందాగా మాట్లాడాలి. ఓట్ల కోసం వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదు. తమకు అవకాశం ఇస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల మద్దతు కూడగట్టు కోవాలి. అంతేగానీ ఓట్ల కోసం ప్రజల మధ్య విద్వేషం పెంచే వ్యాఖ్యలు చేయవద్దు. తాత్కాలిక లబ్ధి కోసం చేసే వ్యాఖ్యల వల్ల సమాజంలో ఒక అశాంతియుత వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఈ ఎరుకతో జాగ్రత్తగా మాట్లాడాలి.
-జి. అనిల్, భద్రాచలం

పొదుపుగా వాడుకోవాలి

ఎండాకాలంలో నీటి ఎద్దడి సమస్య ఉంటుంది. కాబట్టి అధికారులు ఎక్కడైతే ఈ సమస్య అధికంగా ఉంటుందో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.
- బి. రాఘవేంద్ర, జనగామ

137
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles