సంస్కరణలు అవసరమే!

Fri,April 19, 2019 01:22 AM

కాలానుగుణంగా పరిపాలనావసరాల నిమిత్తం ప్రభుత్వ విధానాల్లో మార్పు కోరుకోవడం సహజమే. తుప్పు పట్టి న, కాలం చెల్లిన వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోకపోతే పాలన అనేది ఎక్కడ వేసిన గొం గడి అక్కడే అన్న చందాన తయారవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లి నిల్వ ఉంచిన బంగారాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో అనుకోకుండా ప్రధాని అయిన పీవీ నరసింహారావు సంస్కరణల బాట పట్టా రు. రాజకీయాలకు యోజనాల దూరంలో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేసుకొని చేపట్టిన సంస్కరణలు దేశంలో పెను విప్లవానికి నాంది పలికింది. ఒక్కసారిగా అభివృద్ధి పరుగులు పెట్టింది. టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ, ఐటీ రంగం, విమానయాన రంగం, శాస్త్ర పరిశోధనారంగంతో పాటు అనేక రంగాల్లో భారతదేశం దూసుకొని వెళ్లింది. అగ్రరాజ్యాల సరసన మోరలెత్తుకొని నిలబడింది. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో మగ్గిన వేళ ఒక్క భారతదేశమే నిబ్బరంగా నిలబడింది. ఒక ధైర్యశాలి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రనే మార్చివేసింది. ఒకప్పుడు కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, ఫోన్ బిల్లులు చెల్లించడానికి ఆయా ఆఫీసులకు వెళ్లి, క్యూలలో గంటల తరబడి నిలుచొని, మంచినీళ్లు కూడా అందించే దిక్కులేక నానా కష్టాలు పడి బిల్లులు కట్టేవాళ్లం. ఇంట్లో కూర్చుంటేనే కంప్యూటర్‌ను ఉపయోగించగలిగేవాళ్లం. అతి కొద్దిమందికి మాత్రమే ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉండేవి. ఫోన్ మాట్లాడాలంటే ఇంట్లో కూర్చొని మాత్రమే మాట్లాడగలిగేవాళ్లం. బస్సు, రైలు టికెట్లు కావాలంటే బస్టాండ్, రైల్వే స్టేషన్లకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి, దరఖాస్తులను నింపి చచ్చీచెడీ టికెట్లు సంపాదించేవాళ్లం.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వలెనే రాష్ట్ర పరిపాలనా సర్వీస్‌ను రూపొందించాలని కేసీఆర్ తలపెట్టిన సంస్కరణ బహుధా ప్రసంశనీ యం. గ్రూప్-1, గ్రూపు-2 పరీక్షల ద్వారా మెరికల్లాంటి యువతను ఎంపిక చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (SAS)ను రూపుదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అయితే.. ఈ విప్లవాత్మకమైన మార్పును ఉద్యోగ సంఘాల అంత తేలికగా జీర్ణించుకోవు. ప్రతిఘటన తప్పకుండా ఎదురవుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల మనసును చూరగొని రెట్టించిన ఆధిక్యతతో రెండోసారి అధికారానికి వచ్చిన కేసీఆర్ తలుచుకుంటే అసాధ్యం అన్నదే లేదు.


ఇప్పటితరం వారికి తెలియదు కానీ, ఆ రోజుల్లో ఏ పని చెయ్యాలన్న ఎన్నెన్ని కష్టాలు పడవలసి వచ్చిందో నల భై ఏండ్లు దాటినవారికి బాగా అనుభవమే. మరిప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది? చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టుకొని ప్రభుత్వ సేవల బిల్లులను రెప్ప పాటు కాలంలో చెల్లించగలుగుతున్నాం. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తూ కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతున్నాం. ఒకప్పుడు చిన్న డబ్బాల్లాంటి టీవీల్లో పరిమితమైన ప్రసారాలను వీక్షించిన మనం సినిమా తెరకు తీసికొనంత తమలపాకు మందం స్మార్ట్ టీవీల్లో ప్రపంచంలోని అన్ని ఛానెళ్లను తిలకించగలుగుతున్నాం. ఇదంతా పురాతన సంప్రదాయాలను సంస్కరణీకరించిన ఫలితం కదా! అందువల్ల మార్పును సమాజం ఆహ్వానించాలి. అయితే ఇలాంటి సంస్కరణలు జాతీయస్థాయిలో తప్ప రాష్ట్ర స్థాయిలో పెద్దగా కనిపించవు. రాష్ర్టాల అధికారాలు, పరిధులు చిన్నవి కావడం, ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా రాష్ట్రంలో వరకు మాత్రమే పరిమి తం కావడం, ఏదైనా వికటిస్తే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంద నే భయం రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణ నిర్ణయాలను తీసుకోవడానికి వెనుకంజ వేయిస్తాయి. అందుకే రాష్ర్టాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేవు. మళ్లీ ఇన్నేండ్లకు సీఎం కేసీఆర్ మదిలో కొత్త ఆలోచనలు పురుడుపోసుకున్నాయి. సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో అనేక శాఖలు అవినీతికి ఆలవాలంగా మారాయి. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా శాఖల్లో అవినీతి మేట వేసుకొని పోయింది. ఏ శాఖలోనైనా అవినీతిపరుల శాతం 10 శాతం మించదు. కానీ, ఆ 10 మంది కారణంగా మిగిలిన 90 మంది నిందలు ఎదుర్కోవాల్సివస్తున్నది. ఇక వీటన్నింటిలో అవినీతిలో రెవెన్యూ శాఖది అగ్రతాంబూలం. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మాకు బంధువులైన ఇద్దరు యువకులు ఒకరు రెవెన్యూ శాఖలో చిరుద్యోగి.

మరొకరు ప్రసిద్ధి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నపుడు రెవెన్యూ ఉద్యోగికి డజన్లకొద్దీ సంబంధాలు వచ్చేవి. ఐటీ ఉద్యోగికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకువచ్చేవారు కాదు. రెవెన్యూ ఉద్యోగికి పెద్ద కట్నంతో 26 ఏండ్లకు పెండ్లి కాగా, ఐటీ ఉద్యోగి 35 ఏండ్ల్ల కు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది! దీన్నిబట్టి రెవెన్యూ శాఖలో ఉద్యోగం అంటే బంగారు బాతు అని చెప్పుకుంటే తప్పేముంది? జీతం కన్నా గీతం ఎక్కువ అని వారి గురించి చెప్పుకుంటారు. ఇంకా చెప్పుకోవాలంటే రెవెన్యూ బ్రిటిష్ వారి అవశేషం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఆ శాఖలో ఏ మాత్రం మార్పు లేదు. వారి భాష, పద కోశం సామాన్యులకు ఏ మాత్రం కొరుకుడు పడదు. లంచం లేనిదే పని జరుగ దు. లంచం ఇచ్చినా పదేపదే ఆఫీసులకు తిప్పుతుంటారు. వారు అడిగిన ఎన్ని కాగితాలు సమకూర్చినా ఇంకా ఏవేవో కావాలని వేధిస్తారు. ఒకసా రి రెవెన్యూ ఆఫీసుకు వెళ్లిన సామాన్యుడు మళ్లీ జన్మలో అధికార పార్టీకి ఓటు వేయకూడదు అనుకుంటాడు! రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చెయ్యాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కలుగడం ఆయన దార్శనికతకు, దూరదృష్టికి, ప్రజల ఇబ్బందుల పట్ల ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. అంతే కాదు.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వలెనే రాష్ట్ర పరిపాలనా సర్వీస్‌ను రూపొందించాలని కేసీఆర్ తలపెట్టిన సంస్కరణ ప్రసంశనీయం. గ్రూప్-1, గ్రూపు-2 పరీక్షల ద్వారా మెరికల్లాంటి యువతను ఎం పిక చేసి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (SAS)ను రూపుదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
murali-mohan-Ilapavuluri
అయితే.. ఈ విప్లవాత్మకమైన మార్పును ఉద్యోగ సంఘాల అంత తేలికగా జీర్ణించుకోవు. ప్రతిఘటన తప్పకుండా ఎదురవుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల మనసును చూరగొని రెట్టించిన ఆధిక్యతతో రెండోసారి అధికారానికి వచ్చిన కేసీఆర్ తలుచుకుంటే అసాధ్యం అన్నదే లేదు. ఆయనకు ప్రజాబలం ఉన్నది. ఆయన చేపట్టదలుచుకున్న సంస్కరణలు ప్రజల మేలు కోరేవి. అందువల్ల ఆయనకు ప్రజల మద్దతు విరివిగా లభిస్తుంది. అవినీతిరహిత తెలంగాణ రాష్ర్టాన్ని తయారుచేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలను కేసీఆర్ నిర్భయంగా తీసుకోవాలి. మేధావులు, విద్యావంతులు కేసీఆర్‌కు అండగా నిలబడాలి. ఎన్నాళ్లు పాలించామన్నది, ఎన్నాళ్లు అధికారంలో ఉన్నామన్నది గొప్పకాదు. ఎంత గొప్పగా పరిపాలించాం, ప్రజలకు ఎంత గొప్పగా సేవలు అందిచామన్నదే ప్రధానం. కేసీఆర్ తలపెట్టిన సంస్కరణలు ఆయన అమలు చెయ్యగలిగితే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా కొలువుదీరుతారు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

348
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles