అగ్ని ప్రమాదాలను నివారించాలె

Wed,April 17, 2019 11:26 PM

ఎండలు మండిపోతున్నాయి. ఎండకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది చూసుకు న్నట్లయితే పదుల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా ఆస్తి నష్టం చేకూరింది. ప్రమాదాలు పల్లెటూర్లలో గడ్డివాములున్న చోట ఎక్కువగా జరిగే అవకా శాలుంటాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వ్యవ హరించాలి. అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగాఉండాలి. చిన్నపాటి ఆలస్యంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉం టుంది. కాబట్టి అగ్నిమాపక శాఖ వాహనాల్లో నీళ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరి గిన వెంటనే సంఘటనా స్థలానికి తొందరగా వెళ్లేలా ప్రణాళికలు రచించుకోవాలి. అప్పుడే ఎక్కువగా ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూసుకోగలుగుతాం.
- ప్రవీణ్ కొత్వాల్, బేగంపేట, హైదరాబాద్

ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలె

హైదరాబాద్ నగరాన్ని శాంతి భద్రతలకు నిలయంగా చక్కదిద్దిన ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు అభినందనలు. అయితే నగ రంలో ఆటో డ్రైవర్ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ప్రయాణికుల దగ్గరి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అధికంగా వసూలు చేస్తున్న ఆటో డ్రైవర్లను గుర్తించి వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి.
- జి.శ్రీనివాసరావు, ఇసామియా బజార్, హైదరాబాద్

అసత్య ప్రచారాలు వద్దు

సోషల్ మీడియా వార్తల్లో అబద్ధాలు ఎక్కువగా ప్రచారమవుతు న్నాయి. ముఖ్యంగా సాధారణ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వా త లేని పోని అబద్ధాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు నెటిజ న్లు. ఇటీవల సీ కేటగిరీ ఈవీఎంలు ఆటోలో తరలిస్తే జగిత్యాలలో ఈవీఎంలు బయట కనిపించాయంటూ రాద్ధాంతం చేశారు. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తేలిపోయింది. దీనిపై ఈసీ కూడా స్పం దించింది. ఇలాంటి అసత్య ప్రచారాలు సరికాదు.
- పుల్కం సంపత్ కుమార్, రాములపల్లె, పెగడపల్లి, జగిత్యాల

166
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles