పారదర్శకతకు ప్రతీక

Tue,April 16, 2019 01:04 AM

లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఇంతకాలం ఆశ్రయం పొందిన పారదర్శకతా ఉద్యమకారుడు అసాంజేను ఆ దేశ సహకారంతో ఇటీవల బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. 2012లో అసాంజేకు ఆశ్రయం ఇచ్చినప్పుడు ఈక్వెడార్‌లో అమెరికా వ్యతిరేక ప్రభు త్వం ఉండేది. కానీ రెండేండ్ల కిందట వామపక్ష భావాలతో ప్రజలను ఆకట్టుకొని అధికారం చేపట్టిన కొత్త అధ్యక్షుడు మోరెనో అమెరికా అనుకూలుడిగా మారిపోయాడు. అమెరికా ఒత్తిడి మూలంగా అసాంజేను బ్రిటిష్ పోలీసులకు అప్పగించాడు. ప్రభుత్వాల పనితీరులో పారదర్శకత ఉండాలని ఉద్యమిస్తున్న సైబర్ నిపుణుడు అసాంజే అమెరికాకు చెందిన రహస్య పత్రాలు భారీ సంఖ్యలో బయటపెట్టడం సంచలనం సృష్టించింది. దీంతో అమెరికా ప్రభుత్వం అతడిని తమ దేశానికి రప్పించి విచారించాలని పట్టుదలగా ఉన్నది. ఈ సందర్భంగా అసాంజేను అమెరికాకు అప్పగించకూడదని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులు కోరుతున్నారు. ఒక ఉద్యమకారుడిగా అమెరికా అసలు స్వరూపాన్ని ఆయన బయటపెట్టాడు తప్ప, అమెరికాకు శత్రువు కాదు. ఆయన చేసిన పనిలో వ్యక్తిగత లాభం ఏమీ లేదు. వికీలీక్స్ ద్వారా అనేక రహస్య పత్రాలు వెల్లడి కావడం వెనుక అసాంజే ఒక్కడే లేడు. అనేకమంది పారదర్శకతా ఉద్యమకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగించిన సమిష్టి కృషి ఇది. అసాంజే చేసింది తప్పా ఒప్పా అనేది అర్థవంతమైన చర్చ కాదు. పారదర్శకతను కోరుతున్న కార్యకర్తగా అసాంజే వెల్లడించిన అంశాలేమిటనే ది ప్రపంచమంతా ఆలోచించవలసి ఉంది.

పారదర్శకతా ఉద్యమకారులకు రక్షణ కల్పించాలనే భావన అమెరికాతో సహా అన్నిదేశాల్లో బలపడ్డది. వారి రక్షణకు చట్టాలు కూడా చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణం. పారదర్శకత కోసం సాగుతున్న ఉద్యమానికి అసాంజే ప్రతీక. అతడిని అమెరికాకు అప్పగించకుండా భద్రత కల్పించడానికి ప్రజాస్వామ్య ప్రియులు ప్రయత్నించాలె.


అమెరికా విదేశాలపై దాడులు సాగిస్తూ, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, అమాయక పౌరులపై దాడులు జరిపిన తీరు వికీలీక్స్ ద్వారా స్పష్టంగా వెల్లడైంది. వికీలీక్స్ ద్వారా అమెరికా అసలు స్వరూపం బట్టబయలైంది. ఇరాక్, ఆఫ్ఘ్ఘనిస్థాన్ దేశాలపై అమెరికా దాడులకు సంబంధించి వికీలీక్స్ వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతికరమైనవి. ఆఫ్ఘనిస్థాన్‌పై అమెరికా వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో అమాయక పౌరులు మరణించారు. ఆత్మాహుతి దళాలుగా అనుమానించి అమాయకులను హతమార్చా రు. ప్రజల మాట్లాడేతీరు, వ్యక్తీకరణ ఒక్కో దేశంలో ఒక్కోతీరుగ ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్ సాంస్కృతిక విషయాలు తెలువని నాటో దళా లు వారిని శత్రువులుగా భావించి హతమార్చా యి. ఒక ఘటనలో నాటో దళాల దాడిలో బడి పిల్లలు గాయపడ్డారు. పాఠశాలపై దాడి జరిపి పిల్లలను హతమార్చిన దుర్ఘటన కూడా వికీలీ క్స్ ద్వారా బయటపడ్డది. ఇరాక్‌లో 2004 నుంచి 2009 వరకు జరిగిన దాడుల్లో లక్ష మందికి పైగా ఇరాకీలు మరణించారు. వీరిలో 66 వేల మంది అమాయక పౌరులే. అమెరికా నియోగించిన కిరాయి దళాలు కూడా అనేక మందిని చంపాయి. హెలికాప్టర్‌పై నుంచి కింద ఉన్నవారిని కాల్చిన దృశ్యాలను కూడా వికీలీక్స్ బయటపెట్టింది. ఇందులో పాత్రికేయులు మరణించిన ఉదంతం కూడా ఉన్నది. అమెరికా మీడియా కూడా ఇరాక్‌లో మృతుల సంఖ్యను చాలా తక్కువగా చూపించింది. స్వతంత్ర కమిటీ ఒకటి మీడియా వార్తల ప్రాతిపదికగా లెక్కిం చి మృతులు పదిహేను వేల మందని తేల్చింది. వికీలీక్స్ వివరాలు లేకపోతే అదే సంఖ్య చెలామణి అయ్యేదేమో! అమెరికా దళాలు ఇరాకీలోని బందీలపై లైంగికదాడులతోపాటు అనేక చిత్రహింసలను సాగించాయనేది వెల్లడైంది. అరబ్ దేశాల పట్ల క్లింటన్ దంపతుల ద్వంద్వ ప్రమాణాలు, అమెరికా పత్రికలతో వారికి ఉన్న లోపాయి సంబంధాలు కూడా వెలుగు చూసినయి.

అమెరికా ప్రజలపై జరిపే నిఘా తీరును వికీలీక్స్ వెల్లడించింది. యురోపియన్ దేశాల నేతలు- ఫ్రెంచి, జర్మన్ దేశాల నాయకులపై కూడా సీఐఏ నిఘా పెట్టింది. అక్కడి కంపెనీల కార్యకలాపాలపై గూఢచర్యం సాగించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌పై కూడా అమెరికా గూఢచర్యం జరిపింది. ఇవన్నీ సాగుతున్నట్టు ప్రపంచానికి తెలువనిది కాదు, కానీ కచ్చితమైన ఆధారాలు లభించాయి. నేటి అంతర్జాతీయ పరిస్థితికి వికీలీక్స్ అద్దం పట్టింది. ఇతర దేశాలలో అమెరికా సాగించిన చర్యలు అనేకం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమైనవే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, యురోపియన్ దేశాల ఆధిపత్యం స్థిరపడి అంతర్జాతీయ న్యాయసూత్రాలకు ప్రాధా న్యం లేకుండాపోయింది. ఐక్యరాజ్య సమితి కూడా బలహీనపడ్డది. వర్ధమాన దేశాల గొంతు మూగబోయింది. దీంతో పాటు కార్పొరేట్ సంస్థలు ప్రాబల్యం హద్దు లేకుండా పెరిగింది. ప్రజాస్వామ్య, మానవీయ విలువలను కాలరాయడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ, కార్పొరేట్ సంస్థ కానీ పర్యావరణానికి, సమాజ హితానికి వ్యతిరేకంగా రహస్యంగా వ్యవహరిస్తుంటే వాటిని బహిరంగ పరుచడం ఒక ఉద్యమంగా మొదలైంది. ఈ ఉద్యమకారులు ప్రభుత్వాల, వ్యాపార సంస్థల బండారాన్ని బయటపెట్టినప్పుడు వారికి హాని జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పారదర్శకతా ఉద్యమకారులకు రక్షణ కల్పించాలనే భావన అమెరికాతో సహా అన్నిదేశాల్లో బలపడ్డది. వారి రక్షణకు చట్టాలు కూడా చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణం. పారదర్శకత కోసం సాగుతున్న ఉద్యమానికి అసాంజే ప్రతీక. అతడిని అమెరికాకు అప్పగించకుండా భద్రత కల్పించడానికి ప్రజాస్వామ్య ప్రియులు ప్రయత్నించాలె. అం తర్జాతీయ న్యాయసూత్రాలను కాపాడుకోవడంపై కూడా దృష్టిసారించాలె.

181
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles