రోడ్డు ఆక్రమణలతో అవస్థలు


Tue,April 16, 2019 01:03 AM

ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే ఇండ్లు, షాపుల కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంటి యజమానులు, దవాఖానలు, షాపుల్లోకి వచ్చేవారు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయటం కారణంగా రోడ్డంతా ఆక్రమణకు గురవుతున్నది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నది. అయినా పోలీసులు ఏ చర్యలు తీసుకోవటం లేదు. అన్ని పట్టణాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. రోడ్డు ఆక్రమణలను అరికట్టాలి. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసి పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది.
- అయినం రాఘురామారావు, ఖమ్మం


రైతులను ఆదుకోవాలె

ఈ మధ్య అకాల వర్షాలు, ఈదురు గాడ్పులు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరిచేన్లు బాగా దెబ్బతిన్నాయి. ఇక మామిడి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయా రు. ఇంకా ఇతర పండ్ల తోటలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి మామిడి, వరి, ఇతర తోటల రైతులు నష్టపోయిన దాన్ని లెక్కించి పరిహారం అందించాల్సిన అవసరం ఉన్నది.
- బత్తిని లక్ష్మయ్య, మిర్యాలగూడ

ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలె

వేసవిలో ఎండ వేడిమి తీవ్రతతో పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్న అధికారులు ఇంజినీరింగ్, తదితర వృత్తివిద్యా కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవటంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది ఏండ్లుగా కొనసాగుతున్నా పట్టించుకోకపోవటం విషాదం. ఇప్పటికైనా అకడమిక్ ఇయర్‌ను తగువిధంగా రూపొందించి, వేసవి సెలవులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సాయికుమార్‌రెడ్డి, హయత్‌నగర్

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles