ప్రక్షాళనకు ప్రజా మద్దతు


Sat,April 13, 2019 11:59 PM

రెండు దశాబ్దాల కిందట చూసిన సినిమా దృశ్యం ఇప్పుడు ఆవిష్కృతమైంది. అంకు శం సినిమాలో ఒక వృద్ధుడు పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదర్శన చేస్తూ యాతన పడుతుంటే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులను మందలించి ఆ వృద్ధుని సమస్యను అప్పటికప్పుడు పరిష్కరిస్తాడు. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను కీ.శే.ఎమ్మెస్‌రెడ్డి అత్యంత సహజంగా నటిస్తే ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా కూడా ఉంటాడా, ఉంటే ఎంత బాగుండేదని భావించారు. అచ్చం అలాంటి సంఘటనే మన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్నది. ఒక నిరుపేద యువరైతు ఫేస్‌బుక్‌లో తమ సమస్యను పోస్టు చేస్తూ వేదన వెలిబుచ్చాడు. ఆ వేదనను చూసిన సీఎం కేసీఆర్ వెంటనే స్పందించడం, అతని సమస్యను నిమిషాల్లో పరిష్కరించడం చూస్తే నాటి అంకుశం సినిమాలోని సీన్ గుర్తొచ్చింది. కేసీఆర్ స్పందన, ఆ యువ రైతుతో జరిపిన సంభాషణలతో మనకు రెండు, మూడు విషయాలు అవగతమవుతున్నాయి. ఒకటి కేసీఆర్‌కు రైతులంటే ఎంత అభిమానమో తెలిసింది. రెండవది రెవెన్యూ శాఖలో అవినీతి సర్వసాధారణం కానీ అధికారంలో ఉన్న ఏ నాయకుడు తన పాలనలో అవినీతి ఉన్నదంటే ఒప్పుకోడు. కానీ కేసీఆర్ రెవెన్యూ శాఖను ఉతికి ఆరేసి, ఆ శాఖలో ప్రక్షాళన కోసం ప్రజల మద్దతు కోరాడు. సహజంగానే ఆ శాఖలోని ఉద్యోగులు, సంఘ నాయకులు ఒప్పుకోరు. పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తారు కూడా. విషాదమేమంటే ఈ మధ్య సోషల్ మీడియాలో యువకుల అభిప్రాయాలు విపరీతమైన బూతు భాషలో వెలువడుతున్నాయి.


ఏదేమైనా, ఎవరేమనుకున్నా ప్రభుత్వ శాఖల పనితీరును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రమశిక్షణ కొరవడిందని, అవినీతి అవధులు దాటిందని జన సామాన్యం చెప్పుకుంటున్నా రు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగులు కూడా భాగస్వాములైనారు కాబట్టి కేసీఆర్ వారితో స్నేహపూరిత వాతావరణంతో వ్యవహరిస్తున్నారు.


ముఖ్యంగా ఒక యువ కాంగ్రెస్ నాయకుని పేర యూత్ గ్రూప్ పెట్టి ఏ మాత్రం సంస్కారం ఉన్నవారు, ఇంగిత జ్ఞానం ఉన్నవారు భరించలేనంత బూతు పదాలు ఉపయోగిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం ఉందని అవధులు దాటి అసహ్యమైన రీతిలో జుగుప్సాకరమైన భాషలో సందేశాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సీఎం వ్యక్తిగత విషయాలపై, వారే స్వయంగా రైతు శరత్‌తో జరిపిన సంభాషణను దుర్భాషలాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ విమర్శ సహేతుకంగా, సముచితమైన రీతిలో ఉండాలి. ముఖ్యమంత్రి వీఆర్వోను వాడెవడు అన్నాడని కొంతమంది కొంతమంది తప్పుపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక పేద రైతు తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తే, దానికి స్పందనగా ఆవేశంతో, ఆ వేదనతో స్పందించిన సందర్భం అది. నేను గతంలో కూడా నా వ్యాసాల్లోకొన్నింటిలో ఎత్తిచూపాను. ప్రభుత్వ శాఖలలో రెవెన్యూ, పోలీసు శాఖలు సగటు మనిషి దృష్టిలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ రెండు శాఖలు సమర్థవంతంగా పనిచేస్తే ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని భావిస్తారు. కానీ రెవెన్యూ శాఖలోనే కాదు, అన్ని శాఖలలో అవినీతి పెరిగిపోయిందని, సామాన్యుని ఘోష ఎవ్వరూ పట్టించుకోవడం లేదని జనం ఒకవైపు కేసీఆర్‌ను అభిమానిస్తూనే, ఇంకోవైపు ఉద్యోగుల పనితీరును విమర్శిస్తున్నారు. ఇటీవల ఒకరు ఒక జోక్ కూడా పేల్చారు. గత ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం పెంచిన తర్వాత కూడా లంచం శాతం ఏ మాత్రం తగ్గలేదట. అంతకుపూర్వ ఒక పనికి 200 రూపాయలను తీసుకుంటే, వేతనం పెరిగిన తర్వాత 400 తీసుకున్నాడట.
chenreddy-alwal-reddy
ఒకరు ఎందుకు సార్ ఇంత పెంచారు అంటే ఆ ఉద్యోగి అవునయ్యా నా జీతం అప్పుడు 20000 కాబట్టి 200, ఇప్పుడు 40000 కాబట్టి 400 అన్నాడట. ఇది జోక్‌గా భావించినా చాలావరకు వాస్తవం కూడా. కాబట్టి లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ శాఖల పనితీరుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక రెవెన్యూ శాఖను రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి మాట ల్లో ధ్వనించింది. కానీ రద్దు చేసేముందు రైతులకు ఇబ్బం ది కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయా లి. పేదల ఆశలు, ఆకాంక్షలు బాగా ఎరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారని ఆశిద్దాం. ఏదేమైనా, ఎవరేమనుకున్నా ప్రభుత్వ శాఖల పనితీరును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రమశిక్షణ కొరవడిందని, అవినీతి అవధులు దాటిందని జన సామాన్యం చెప్పుకుంటున్నా రు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగులు కూడా భాగస్వాములైనారు కాబట్టి కేసీఆర్ వారితో స్నేహపూరిత వాతావరణంతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి శాసనసభలో ఎదురులేనంత మద్దతు ఉన్నది. కాబట్టి సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ ఆవిష్కరణకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. మంచి పనులు చేస్తున్నప్పుడు వ్యక్తిగత లాభాల కోసం కొందరు విమర్శ లు చేస్తారు. అట్టడుగు వర్గాలకు ప్రయోజనం కల్గించే పను లు చేపట్టడంలో అసలు వెనుకడుగు వేయనేవద్దు. సమాజంలోని ప్రతిరంగంలోని ప్రజల ఆశలు, ఆకాంక్ష లు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజ లు భావిస్తున్నారు. ఒక పేద రైతు పిలుపునకు స్పందించినందుకు కేసీఆర్‌కు జనం జేజేలు పలుకుతున్నారు. ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేస్తే ప్రజల మద్దతు తప్పనిసరిగా ఉంటుంది. పరిపాలనాదక్షుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్రలో నిలిచిపోయి భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండిపోతారు మన సీఎం కేసీఆర్.

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles