ప్రజాతీర్పు ప్రక్షిప్తం


Fri,April 12, 2019 01:35 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఎన్ని కల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశ ఎన్నికల్లో 18 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవలికాలంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో మొదటి విడుతగా నిన్న ఎన్నికలు ముగిశాయి. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. వచ్చే నెల 23న తుది ఫలితాలు ప్రకటించనున్నారు. తొలి విడుతలో భాగంగా పార్ల మెంట్‌లోని 91 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పార్లమెంట్ సీట్లలో ఆరో వంతు స్థానాలకు ఎన్నికలు జరిగి ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియో గించుకున్నారు. ఈ దఫా ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ పాలనాతీరుకు, స్థానిక సమస్యలకు మధ్య జరుగుతున్న పోరుగా భావిం చాల్సి ఉన్నది. ఐదేండ్ల కిందట కరుడుగట్టిన హిందుత్వవాదిగా తెరమీది కి వచ్చిన మోదీ తనదైన శైలి ప్రచారంతో సంపూర్ణ మెజార్టీని సాధించా రు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. దేశంలోని 90 కోట్ల మంది ఓటర్లు తమ భవితవ్వాన్నే కాదు, దేశ భవి ష్యత్తును తమ ఓటు హక్కుతో నిర్దేశించే ఈ ఎన్నికలు అత్యంత ప్రధాన మైనవి. అందులో భాగంగానే ఓటర్లంతా ముఖ్యంగా యువ ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలు పుని చ్చారు. ముఖ్యంగా దేశంలో నిర్ణయాత్మకశక్తిగా కనిపిస్తున్న నాలుగున్నర కోట్ల యువ ఓటర్లు కీలకం కానున్న స్థితి ఉన్నది. గత 2014 ఎన్నికల సందర్భం నుంచి కూడా యువ ఓటర్లు కీలకంగా మారిన పరిస్థితి ఉన్నది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తర భారతంలో గత ఎన్నికల్లో బీజేపీ గట్టి పట్టును చూపించింది. ఈ ప్రాంతమంతా కవ్ బెల్ట్‌గా గో రక్షణ పేరుతో మెజార్టీవాదంతో రాజకీయాలు చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా గత 2014 ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలాగే ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్‌లోని కొంత భాగంలో కూడా ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌లో తిరుగులేని ఆధిపత్యంతో అధికారాన్ని చెలాయిస్తున్న తృణముల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఢీకొంటున్నది. బీజేపీ గత ఐదేండ్ల పాలనాకాలంలో ఏం చెప్పినా, చేసినా.. పెద్ద కార్పొరేట్ శక్తులు, వ్యాపారస్తుల అనుకూల పార్టీగా ముద్రపడింది.


గత నెల మొదటివారంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన బాంబుపేలుళ్లు, అందులో 40 మందికిపైగా భారత జవాన్లు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావటమే గాక, రాజకీయపార్టీల విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పోటాపోటీగా రాజకీయ పార్టీలన్నీ దానిపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజకీయపార్టీలు టెర్రరిస్టు దాడిని ఖండించినా.. దాన్నుంచి బీజేపీ ఎక్కువ ఫలితం పొందేందుకు అనుకూలంగా ఉన్న జాతీయవాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది.


ఈ నేపథ్యంలోంచే స్థాని క రాజకీయపార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. పలు దశల్లో జరిగే ఎన్నికలతో భారత సమాఖ్య విధానానికి ప్రతీకగా చెప్పవచ్చు. అందులో భాగంగానే ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రత, ఇతర మౌలిక ఏర్పాట్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధమైన ఎన్నికల నిర్వహణ జరుగుతున్నదని భావించవచ్చు. ఈ క్రమంలో దేశంలోని 90 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగిం చుకొని తదుపరి పాలకులెవరో తేల్చనున్నారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సాయంతో ఓటు హక్కును విని యోగించుకుంటారు. అయితే ఓటర్లు తమ ఓటును ఎలక్ట్రానిక్ మిషిన్ల లో ఉన్న మీటను నొక్కి, తామనుకున్న సరైన అభ్యర్థికే ఓటు పడిందని రూఢీ చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఎంతో నైపుణ్యం అవసరమైన ప్రక్రియ. కానీ దేశంలో ఇప్పటికీ దాదాపుగా 27 కోట్ల మంది నిరక్షరాస్యు లుగా ఉన్న స్థితిలో ఈ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా జరుగుతుండటం విశేషం. ఈ క్రమంలో ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాలను సందర్శించినప్పు డు అనేక ఆసక్తికరమైన, అనూహ్యమైన విషయాలు తెలిసివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నోయిడా ప్రాంతాన్ని పోలింగ్ ప్రారంభ మైన కొద్దిసేపటికే ఉదయం వేళల్లో చూసినప్పుడు ఓటర్లంతా తమ వాహనాలతో పోలింగ్ స్టేషన్లకు రావటం కనిపించింది. అందులో ఎక్కు వగా మహిళలు ఉండటం గమనార్హం. ఓటు వేయటం కోసం వచ్చిన వారంతా అవసరమైన గుర్తింపు పత్రాలను తీసుకొని వచ్చి ఓటు హక్కు ను బాధ్యతగా వినియోగించుకుంటున్న తీరుగా కనిపించింది. ఈ నేప థ్యంలో కొంతమందిని కదిలించినప్పుడు తమదైన ఆలోచనలను వ్యక్తీక రించారు. భోజ్ అనే డాక్టర్ మాట్లాడుతూ.. దేశం మోదీ చేతిలో సురక్షి తంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. అలాగే గతంలో అయితే ఎప్పుడూ ఏదో తెలియని అభద్రతా భావంలో దేశం ఉండేదని, ఇప్పుడలాంటి పరి స్థితి మోదీ కారణంగా లేదని చెప్పుకొచ్చాడు. రాజకీయ నాయకులు నేర స్తులతో కుమ్మక్కై ఎన్నో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన తీరు గతం లో ఉండేదని ఇప్పుడా దుస్థితి లేదన్నారు. తన అభిప్రాయం ప్రకారం.. దేశం గురించి ఆలోచించేవారే తిరిగి అధికారంలోకి రావాలని తన ఆకాం క్షను వ్యక్తం చేశాడు. మరో వ్యక్తిని పలుకరిస్తే.. చాలా ఆసక్తికరమైన సీరి యస్ విషయాలను చెప్పుకొచ్చాడు.

బీజేపీ, కాంగ్రెస్ లాంటి రెండు జాతీయపార్టీలు మొదటి దశలో జరిగిన ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్నాయి. తీవ్రమైన భావజాల, విధానపరమైన విధానాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రాంతీయ పార్టీలు ఢీకొంటున్నాయి.


తన పేరు చెప్పటానికి ఇష్టపడని అతను.. దేశంలో మౌలికంగా చట్టబద్ధ పాలన కనుమరుగవుతున్న తీరు కనిపిస్తున్నదని, ఇది తీవ్ర ఆందోళనకరమని తన అభిప్రాయాన్ని నిక్కచ్చి గా చెప్పాడు. దేశం ఇప్పుడున్న స్థితి చూస్తే.. ఫాసిజం వైపు ప్రయాణిస్తు న్న తీరు కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశాడు. గత నెల మొదటివారంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన బాంబుపేలుళ్లు, అందులో 40 మందికిపైగా భారత జవాన్లు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావటమే గాక, రాజకీయ పార్టీల విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పోటాపోటీగా రాజకీ య పార్టీలన్నీ దానిపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలు టెర్రరిస్టు దాడిని ఖండించినా.. దాన్నుంచి బీజేపీ ఎక్కువ ఫలి తం పొందేందుకు అనుకూలంగా ఉన్న జాతీయవాదాన్ని బీజేపీ ముం దుకు తెచ్చింది. ఒకానొక దశలో ఈ టెర్రరిస్టు దాడులు, ప్రతిగా భారత్ నిర్వహించిన లక్షితదాడుల నేపథ్యంలో బీజేపీకి చాలా అనుకూల రాజ కీయ వాతావరణం ఏర్పడింది. కానీ కాలక్రమంలో కాలం గడుస్తున్న కొద్దీ లక్షితదాడులు, పాకిస్థాన్ బూచి తదితరాలు వెనక్కిపోయి రాజకీ యార్థిక సమస్యలు, నిరుద్యోగం, స్థానిక సమస్యలు ప్రధానాంశాలుగా మారిపోయాయి. పరిస్థితులు ఇలా ఉంటే.. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో పరోక్షంగా టెర్రరిస్టు దాడులు, భారత సైనికుల త్యాగాలను వినియోగిం చుకునేవిధంగా మాట్లాడుతున్నారు. ఓటర్లంతా ముఖ్యంగా యువ ఓట ర్లంతా తమ మొదటి ఓటుహక్కును భారత జవాన్ల త్యాగానికి అంకితం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారత సైనికుల త్యాగాలను కూడా బీజేపీ తమ రాజ కీయ లాభం కోసం వాడుకో చూడటం ఘోరమని విమర్శించింది. మరో వైపు కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన అస్ర్తాన్ని బలంగా జనంలోకి తీసుకుపోతున్నది. దేశంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న 20 శాతం మంది నిరుపేదలకు నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఇచ్చే పథకాన్ని ప్రజల ముందు పెడుతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి రెండు జాతీయపార్టీలు మొదటి దశలో జరిగిన ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొ న్నాయి. తీవ్రమైన భావజాల, విధానపరమైన విధానాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రాంతీయ పార్టీలు ఢీకొంటున్నాయి.
Michael-Safi
యూపీలో కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఎందుకంటే.. అక్కడ ప్రతిపక్షాలుగా ఉన్న బీఎస్పీ, సమాజ్‌వాద్ పార్టీ రెండూ కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొంటున్నాయి. దీంతో మోదీ ప్రభావం అంతగా ఉండే పరిస్థితి కనిపించటం లేదు. కాంగ్రెస్ మోదీ వ్యతిరేకవిధానాన్ని అనుసరించిన పరిస్థితి కనిపించటం లేదు. అనేక ప్రాంతాల్లో స్థానిక ప్రాంతీయపార్టీలతో కలిసి పోటీచేసే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించలేదు. దీంతో కాంగ్రెస్ ఆశించిన మేర పుంజుకునే పరిస్థితి కనిపించటం లేదు. బెంగాల్‌లోని ఓ వ్యక్తిని తట్టిచూస్తే.. ఇప్పటిదాకా అయితే ఏ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నట్లు కనిపించటం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మోదీ వచ్చిన అవకాశంతో ఐదేండ్లు పాలన కొనసాగించాడు. ఇప్పుడు పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై దాడి తదితర అంశాలతో ఓటర్లను ప్రభావితం చేయాలని ఆలోచిస్తే.. అది సాధ్యమయ్యే పని కాదని ఒక ఓటరు అభిప్రాయపడ్డాడు. పుల్వామా ఘటనతో లబ్ధి పొందాలనుకునే వారు, ఇక దానిపై ఆశలు వదులుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు. అది తాత్కాలిక భావోద్వేగ సమస్య మాత్రమే నని పేర్కొనటం గమనార్హం. ఉత్తరాఖాండ్‌లోని ఓ వ్యక్తి ప్రకా రం.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రజల్లో ఆసక్తి కనపడటం లేదని పేర్కొ న్నాడు. గత ఎన్నికల ప్రచారం, హడావిడి చూస్తే ఈసారి చాలా స్తబ్దుగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే.. ప్రజల్లో గత ఐదేండ్ల మోదీ పాలనపై భిన్నాభి ప్రాయాలున్నాయి. మొత్తంగా చూస్తే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాకుండా భావోద్వేగాలపై రాజకీయాలు చేయటం ఆహ్వానిం చదగినది కాదని అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ సంక్షోభం, నిరు ద్యోగం, పేదరికం లాంటి సమస్యల పరిష్కారం దిశగా రాజకీయ పార్టీల విధానాలు కేంద్రీకరించిన నాడే దేశానికీ, ప్రజాస్వామ్యానికి మంచి జరు గుతుందని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: ది గార్డియన్ దక్షిణాసియా ప్రతినిధి)

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles