‘లోక్‌పాల్ కల.. నిజమైందిలా..’


Thu,April 11, 2019 11:40 PM

సంకల్పం.. సర్కార్‌కు సంకల్పమే ఉంటే బిల్లులు చకాచ కా ఆమోదం పొంది చట్టాలుగా మారిపోతాయి. లేకుంటే ఏండ్ల తరబడి మూలనపడి మూలుగుతుంటాయి. మొదటిదానికి ఉదాహరణ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు అయితే, రెండోదాన్ని మహిళా బిల్లుకు అన్వయించవచ్చు. కానీ, అవినీతిపై నిరంతర పోరాటానికి, జాతి జనుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఇటీవల చట్టబద్ధ వ్యవస్థ రూపం దాల్చింది లోక్‌పాల్. ఇది సామాన్యమైన విషయం కాదు. అర్ధ శతాబ్దానికి పైగా స్వతంత్ర భారతం స్వప్నించిన సుదీర్ఘ కల. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్, పదవులు, హోదాల్లో అగ్రస్థానంలో ఉండి అవినీతికి పాల్పడేవారి పనిపట్టే లోక్‌పాల్ స్వల్ప వ్యవధిలో చట్టంగా మారడం కాకతాళీయమే! లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి ఐదు దశాబ్దాలు పడితే.. చట్టరూపం దాల్చాక కూడా అమల్లోకి రావడానికి ఐదేండ్లు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకో ర్టు వరుస జోక్యంతో పూర్తిస్థాయి వ్యవస్థకు పట్టం కట్టక తప్పలేదు. లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు డిమాండ్ నేటిది కాదు. తొలిసారి ఈ పదా న్ని ప్రస్తావించి అంకురార్పణ చేసింది ఎ.ఎం సింఘ్వీ. అయితే రాజ్యాంగబద్ధంగా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని అశోక్‌కుమార్ సేన్ డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లును శాంతిభూషణ్ తొలిసారి ప్రస్తావించారు. మొరార్జీ దేశాయి ఆధ్వర్యంలోని మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ న్యూజిలాండ్ తరహా లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1964లో సిపార్సు చేసింది. కానీ అదే ఏడాది నెహ్రూ మరణం, తర్వాత ప్రధాని అయిన ఎల్.బి.శాస్త్రి 1966లో మరణించడంతో ఈ బిల్లు ప్రస్తావనకు రాలేదు.


ప్రభుత్వాల అవినీతిపై ఓ కన్నేసి ఉంచే లోక్‌పాల్ బిల్లును మన్మోహన్‌సింగ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాలు చివరి రోజుల్లోనే ఆమోదించడం గమనార్హం. అవినీతిరహిత దేశాల సూచీ-2018లో న్యూజీలాండ్ రెండోస్థానంలో ఉన్నది. ఇండియా మాత్రం 78వ స్థానంలో నిలిచింది. 1964లో మొదటి పరిపాలన కమిషన్ సూచించినప్పుడే న్యూజీలాండ్ మోడల్‌ను అనుసరిస్తే ఇప్పుడు మనకీ దుస్థితి పట్టేదే కాదు.


తొలిసారిగా 1968లో ఇందిరా సర్కార్ లోక్‌పాల్ బిల్లును దిగువ సభలో ఆమోదింపజేసింది. కానీ, రాజ్యసభలో బిల్లు వీగిపోయిం ది. నాటినుంచి బిల్లుతో దాదాపు అన్ని ప్రభుత్వాలు కపట ప్రేమ చూపా యి. ఈ బిల్లు ఆమోదం కోసం దాదాపు 10 సార్లు పార్లమెంట్ గడపతొక్కి విఫలమైంది. కానీ, యూపీఏ-2 సర్కార్ బొగ్గు, 2జీ లాంటి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోవడం.. ఈ నేపథ్యంలో అన్నా హజా రే రాజీలేని పోరాటం.. సరైన సమయంలో పౌర సమాజం జాగృతమవ డం.. అత్యున్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు నిలదీయడం తో పాలకులకు ఊపిరి సలపని పరిస్థితి తలెత్తింది. చివరికి తన పదవీకాలం ముగిం పు దశలో లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బరువు దించుకు న్నది యూపీఏ సర్కారు. 2013 డిసెంబర్‌లో ఉభయసభలు ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు 2014 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. అదే నెల 16 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్‌లో పేర్కొన్నారు. కానీ చైర్మన్, సభ్యుల నియామకంపై ఎడతెగని జాప్యం జరిగింది. ప్రధాని మోదీ నేతృ త్వంలోని ఎంపిక కమిటీ కనీసం సమావేశం కాలేదు. చట్టంగా మారినా అమల్లో జాప్యాన్ని ప్రశాంత్ భూషణ్‌కు చెందిన కామన్‌కాజ్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు చివాట్లు పెట్టింది. ఈ క్రమంలో రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం లో కేంద్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటుచేసింది. దీనిపేరుతో కాలయాపన చేయగా మళ్లీ సుప్రీంకోర్టు కల్పించుకున్నది. లోక్‌పాల్ నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిని డెడ్‌లైన్‌గా కూడా విధించింది. తుదకు విధిలేని పరిస్థితిలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమైంది.

మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్‌గా, మరో 8 మంది సభ్యులతో సంపూర్ణ వ్యవస్థకు పట్టం కట్టింది. అవినీతిపై పౌర సమాజంలో గూడుకట్టుకున్న ఆవేదనకు ప్రతిరూపమే లోక్‌పాల్ వ్యవస్థ. అయితే, అత్యున్నత స్థాయిలో అవినీతిని ప్రక్షాళన చేసే ఈ వ్యవస్థ మనుగడలోకి రాకూడదని అన్ని ప్రభుత్వాలు లోలోపల కోరుకున్నాయి. అందుకే ఇన్ని దశాబ్దాలు నిరీక్షించాల్సి వచ్చింది. దేశ భద్రత, రక్షణ అంశాలు, ఆంతరంగిక భద్రత లాంటి అతికొద్ది విషయాలు మాత్ర మే లోక్‌పాల్ పరిధిలోకి రావు. అత్యున్నత స్థాయిలో జరిగే మిగితా అన్ని రంగాల్లోని అవినీతిపై లోక్‌పాల్ నజర్ పెడుతుంది. విచారణ చేసి దోషులను తేల్చుతుంది. నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేండ్ల శిక్ష పడుతుం ది. ఇంతటి పారదర్శకత అంటే సహజంగానే మన ప్రభుత్వాలకు గిట్టదు. అందుకే లోక్‌పాల్ బిల్లును ఇన్నేండ్లుగా నాన్చారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఆధ్వర్యంలోని లోక్‌పాల్ వ్యవస్థలో నలుగు రు జ్యుడీషియరీ, మరో నలుగురు నాన్ జ్యుడీషియరీ సభ్యులుంటారు. ప్రధాని సహా ఉన్నత స్థానంలోని అనేకమందిపై లోక్‌పాల్ విచారణ చేయవచ్చు. అన్ని ప్రభుత్వ సంస్థలు, విదేశాల నుంచి రూ.10 లక్షల కన్నా ఎక్కువ నిధులు పొందే సంస్థలపై అవినీతి ఆరోపణలు వస్తే విచారణ చేస్తుంది. ఈ సంస్థ గరిష్ఠంగా ఏడేండ్ల కిందటి నాటి కేసులు సైతం విచారణ చేయగలదు. దీనికి స్వతం త్ర విచారణ విభాగం ఉంటుం ది. సందర్భాన్ని బట్టి సీబీఐ లాం టి సంస్థలతోనూ దర్యాప్తు చేయిస్తుంది. అవినీతి ఆరోపణలపై 60 రోజు ల్లో దర్యాప్తు, ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేస్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిని మధ్యలో నే తప్పించాలంటే తప్పకుండా లోక్‌పాల్ అనుమతి అవసరం.
singam-naresh
లోక్‌పాల్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుందని భావించలేం. కానీ, అవినీతిపరులకు ఇదో హెచ్చరికగా మాత్రం పనిచేస్తుంది. ప్రభుత్వాల అవినీతిపై ఓ కన్నేసి ఉంచే లోక్‌పాల్ బిల్లును మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాలు చివరి రోజుల్లోనే ఆమోదించడం గమనార్హం. అవినీతిరహిత దేశాల సూచీ-2018లో న్యూజీలాండ్ రెండోస్థా నంలో ఉన్నది. ఇండియా మాత్రం 78వ స్థానంలో నిలిచింది. 1964లో మొదటి పరిపాలన కమిషన్ సూచించినప్పుడే న్యూజీలాండ్ మోడల్‌ను అనుసరిస్తే ఇప్పుడు మనకీ దుస్థితి పట్టేదే కాదు. లోక్‌పాల్‌కు మూలం అంబుడ్స్‌మన్ అనే స్వీడిష్ పదం. అక్కడి భాషలో అంబుడ్స్‌మన్ అంటే మన తరఫున వకాల్తా పుచ్చుకునే వ్యక్తి అని అర్థం. ఈ వ్యవస్థను 1809లో తొలిసారిగా అమల్లోకి తెచ్చింది స్వీడ న్. అనంతర కాలంలో నార్వే, డెన్మార్క్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో అవినీతిరహిత పాలన కోసం ఈ వ్యవస్థ అవతరించింది. 1960వ దశకంలో లోక్‌పాల్ పేరుతో అంబుడ్స్‌మన్ వ్యవస్థ అవసరమని ఇండియా లో డిమాండ్లు వెల్లువెత్తాయి. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ ఎట్టకేలకు అమల్లోకి రావ డం ముదావహం. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోక్‌పాల్ చట్టం దోహదపడుతుంది.

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles