ఫెడరలిజపు మహాయజ్ఞం


Thu,April 11, 2019 12:08 AM

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవటం అవసరం. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలంతా వాటిని గ్రహించాలి. ఆ రెండింటిలో ఒకటి స్థానికమైనది కాగా, రెండవది దేశమంతటికి సంబంధించినది. స్థానిక కోణం ఎక్కడ ఏ పార్టీ అధికారానికి వస్తుందన్నది. దేశమంతటి కోణం దేశ రాజకీయాల ధోరణి ఈ ఎన్నికల ఫలితాలలో ఏ విధంగా ప్రతిఫలించగలదనేది. ఒకస్థాయిలో ఈ రెండు కోణాలకు సంబంధం ఉన్నది. కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టాల స్థాయిలో గెలిచినట్లయితే అది జాతీయ స్థాయిలో ఫెడరలిజానికి మేలు చేస్తుందా, హాని చేస్తుందా.. అనేది ప్రశ్న. ఒకవేళ స్థానిక పార్టీలు గెలిచినట్లయితే అందువల్ల ఫెడరలిజానికి అనివార్యంగా మేలు కలుగుతుందని వారే చెప్పనక్కరలేదు. కాంగ్రెస్, బీజేపీల పాలనను 70 సంవత్సరాల పాటు గమనించిన మీద ట ఈ విషయాన్ని చర్చించవలసి రావటం ఒక విధంగా విచారకరం. ఈ రెండు పార్టీల మూలాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలోని వైవిధ్యం దృష్ట్యా అన్ని ప్రాంతాలు, ప్రజలు ఐక్యంగా ఉండాలంటే సహకార ఫెడరలిస్టు సూత్రాలను అనుసరించాలని అప్పటి నాయకత్వం నమ్మింది. అప్పటి ఈ భావన 1885 నాటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో, భావజాలంలో, వ్యవహారణలో ప్రతిఫలించింది. మరొకవైపు బ్రిటిష్ పాలకులు కూడా అదే విధంగా ఆలోచించటం గమనించదగ్గది. అది వారు నియమించిన కమిటీల సిఫారసులలో, వాటి ప్రకా రం చేసిన చట్టాలలో కన్పించింది. చివరకు ఈ రెండింటి సారాంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకున్నాయి. ఒకవేళ దీనిని స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు, అధికారపక్షాలు అనుసరించి ఉన్నట్లయితే, 70 సంవత్సరాలు గడిచిన అనంతరం ఈరోజున ఫెడరలిజం ఒక ప్రశ్న, చర్చనీయాంశం అయ్యేది కాదు.


కేసీఆర్ ఆజ్యం పోస్తున్న ఫెడరలిజపు మహాయజ్ఞంలో భాగం కాగల మొదటి విడత పోలింగ్ నేడు జరుగుతున్నది. దేశానికి ఫెడరలిస్టు లక్షణాలు తప్పనిసరనే భావన స్వాతంత్య్రోద్యమ కాలంలోనే మొదలై అనేక మలుపులు తిరుగుతూ రాగా, ప్రస్తుతం అందుకు బూస్టర్ రాకెట్ పేల్చుతున్న నాయకుడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ పరిపాలనాపరంగా, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించటం పరంగా విఫలమవుతూ రాజకీయంగా బలహీనపడుతున్న వర్తమాన కాలం ఫెడరలిజానికి అనుకూలమవుతున్నది. కనుక కేసీఆర్ కృషికి చేయూతనివ్వటం తెలంగాణ ప్రజల బాధ్యత.


ఫెడరలిస్టు భావనలో ముఖ్యంగా రెండు అంశాలున్నాయి. ఒకటి అన్ని ప్రాంతాలు, వర్గాలు, భాషా సంస్కృతుల వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి దోహదం చేయటం. స్వాతంత్య్రం నాటికి భారత జాతి నిర్మాణమన్నది నిజమైన అర్థంలో ఇంకా చోటుచేసుకోలేదు. కనుక ఈ ప్రాంతాలు, వర్గాలన్నీ జాతి నిర్మాణంలో భాగం అయేట్లు చేయటం. ఆ పని బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా జరుగటం. ఈ ఐక్యతా భావన వచ్చేందుకు దోహదం చేసే రెండవ మఖ్యమైన అం శం అన్నిప్రాంతాలు, వర్గాల ఆర్థికమైన, వస్తుపరమైన (మెటీరియల్), జీవన ప్రమాణాలపరమైన అభివృద్ధి. కాని దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఈ రెండు విషయాలలోనూ విఫలమయ్యాయి. అందువల్లనే ఫెడరలిజాన్ని కేసీఆర్ ఈరోజున మరొకమారు బలంగా ముందుకు తేవలసి వస్తున్నది. ఇది ఆయన పార్టీ తెలంగాణలో గెలువటానికి పరిమితమైన ప్రశ్న కాదు. అది కూడా ముఖ్యమే. కాని ఆయన ఆలోచనలో అంతకుమించిన ఉద్దేశాలు ఉన్నట్లు, అవి దేశవ్యాప్త లక్ష్యాలు అయినట్లు, తను పదే పదే ఇస్తున్న వివరణలను బట్టి స్పష్టమవుతున్నది. పైన అనుకున్నట్లు కాంగ్రెస్, బీజేపీలకు ఫెడరలిస్టు ఉద్దేశాలు, సంప్రదాయాలు తెలిసినవే. చారిత్రక నేపథ్యం తెలిసిందే. ఆ సూత్రాలను పాటించకపోవటం వల్ల ప్రాంతీయవాదాలు, ప్రాంతీయ పార్టీలు బలపడటం, జాతీయ పార్టీలను బలహీనపరుచటం. అందువల్ల తాము పలు రాష్ర్టాలలో, ఒకోసారి కేంద్రంలో అధికారాన్ని కోల్పోవటం మాట కూడా తెలు సు. అయినప్పటికీ అధికారాన్ని అయినా కోల్పోతాం కానీ ఫెడరలిజాన్ని పాటించబోమని, దానిని వీలైనన్ని విధాలుగా బలహీనపరుచగలమనే ధోరణిని తీసుకోవటం ఎందువల్ల? ఇందుకు సమాధానం కష్టం కాదు. జాతీయస్థాయిలో రాజకీయాధికారం, ఆర్థికాధికారం రెండూ కొన్ని వర్గా ల చేతిలో ఉన్నాయి. అవి ఈ రెండు పార్టీలను తెరవెనుక నుంచి, ముం దు నుంచి కూడా నియంత్రిస్తున్నాయి.

ఫెడరల్ ఐక్యతకు రాజకీయమైన అంశం (కంటెంట్)తో పాటు అభివృద్ధి పరమైన అంశాన్ని (కంటెంట్) జోడించ చూడటం ఆయన మాటలలో కనిపిస్తున్నది. నిజం చెప్పాలంటే ఇటువంటి ఆలోచన, ప్రయోగం లోగడ జరుగలేదు. ఇది ఎంత విజయవంతమైతే సహకార ఫెడరలిస్టు లక్ష్యాలు అంత సిద్ధిస్తాయి.అందువల్ల తెలంగాణ ప్రజలు ఈ సుదీర్ఘమైన, లోతైన, అఖిల భారత లక్ష్యాల సాధనకు వీలుగా కేసీఆర్ ప్రయోగాన్ని, ప్రయత్నాన్ని బలపరుచటం నేటి చారిత్రాకావసరం.


వాటికి అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రికరణ, అభివృద్ధి వికేంద్రీకరణ సరిపడదు. వికేంద్రీకరణలు ఆ శక్తుల కేంద్రీకృత ప్రయోజనాలకు ఆటంకమవుతాయి. దీనిని అకడమిక్ పరిభాషలో సెంట్రలిజం అనవచ్చు. ఆ విధంగా సెంట్రలిజానికి, ఫెడరలిజానికి మధ్య మౌలికమైన వైరుధ్యం ఉంది. నిరంతర ఘర్షణ ఉంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యం గాని, ఘర్షణ గాని అనివార్యమేమీ కాదు. సమన్వయం తప్పక సాధ్యమే. ఆ భావననే సహకార ఫెడరలిజం అని మన స్వాతంత్య్రోద్యమ కాలపు, రాజ్యాంగ నిర్మాణ కాలపు పెద్దలు స్వయంగా అన్నారు. ఆ ప్రకారం జరుగాలంటే కావలసింది కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలకు ఉండవలసింది కాస్త వివేకం, కాస్తంత దూరదృష్టి, కొంత దేశభక్తి. ఇంకా చెప్పాలంటే స్వీయ అస్తిత్వ స్పృహ కూడా. ఈ చివరి మాట అనటం ఎందుకంటే.. ఫెడరలిస్టు ధర్మాన్ని పాటించకుండా సెంట్రలిస్టు ధోరణికి కట్టుబడటం వల్ల తాము రాజకీయంగా బలహీనపడి అధికారాన్ని కోల్పోతుండటం కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవం. అది వారు అర్థం చేసుకోలేనిది కాదు. అయినప్పటికీ వారి తీరు మారటం లేదంటే వారు తమ స్వార్థ ప్రయోజనాలలో ఎంతగా మునిగిపోయారో చూడవచ్చు. జాతీయ పార్టీలు అనబడే వాటి ఫెడరలిస్టు వ్యతిరేక ధోరణులపై ఫెడరలిస్టు శక్తులు నిరసనలు ప్రకటించటం, స్వతంత్రంగా ఎదగటం, అధికారంలోకి వస్తుండటం, మధ్య మధ్య జాతీయ రాజకీయాలను శాసించటం చిరకాలంగా ఉన్నదే. ఆ వివరాలలోకి ఇక్కడ పోలేం గానీ అదం తా ప్రజలకు సాధారణ రూపంలో తెలిసిందే. ఫెడరలిస్టు పార్టీలు కొన్ని స్వీయ బలహీనతల వల్ల మధ్య మధ్య విఫలమవుతున్నప్పటికీ, మొత్తం మీద ఒక ధోరణిగా ఫెడరలిజం బలపడుతుండటం, యూనిటరిజం బలహీనమవుతుండటం కన్పిస్తున్నదే. ఇది గమనించదగ్గ విషయం.
Ashok
ఈ ధోరణిని నిర్మాణాత్మకమైన విధంగా, మరింత సవ్యమైన ప్రాతిపదికపైన ఒక ఉన్నత దశకు తీసుకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన అయినట్లు కన్పిస్తున్నది. అట్లా చేయటం వల్ల ఫెడరలిస్టు ఐక్యతా ప్రయోగాలు గతం లో తరచు విఫమైనట్లు కాక దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిలబడగలవని ఆయన ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకే ఫెడరల్ ఐక్యతకు రాజకీయమైన అంశం (కంటెంట్)తో పాటు అభివృద్ధి పరమైన అంశాన్ని (కంటెంట్) జోడించ చూడటం ఆయన మాటలలో కనిపిస్తున్నది. నిజం చెప్పాలంటే ఇటువంటి ఆలోచన, ప్రయోగం లోగడ జరుగలేదు. ఇది ఎంత విజయవంతమైతే సహకార ఫెడరలిస్టు లక్ష్యాలు అంత సిద్ధిస్తాయి. అందువల్ల తెలంగాణ ప్రజలు ఈ సుదీర్ఘమైన, లోతైన, అఖిల భారత లక్ష్యాల సాధనకు వీలుగా కేసీఆర్ ప్రయోగాన్ని, ప్రయత్నాన్ని బలపరుచటం నేటి చారిత్రాకావసరం.

467
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles