ఇక ఓటే మన పాట

Thu,April 11, 2019 12:14 AM

thadi-chettu
పాట వల్ల ఏం జరుగుతుందంటే.. జాతికి వొక చిత్త సంస్కారం లభిస్తుంది. పాటలోని మౌఖికత మన మందినీ మన బొందినీ కలిపి రక్త ప్రసరణాన్ని శుద్ధి చేస్తుంది. రాబోయే తరాలను అప్రమత్తంగా వుండేలాగా సిద్ధపరుస్తుంది. జీవన ప్రమాదాలకూ యుద్ధాలకూ పాట.. గతకాలపు బతుకు అవశేషాలకు చిహ్నం మాత్రమే కాదు, శిలాజం మాత్రమే కాదు, మన వృత్తుల చిత్త ప్రవృత్తుల పంచనామా. మనం జీవించి ఎదురొడ్డిన కాలాల చిరునామా పాట. సరిగ్గా అటువంటి అసలు సిసలైన పాటను నేను పాటక శ్రోతగా విని మొదలంటుకుని నీరై పోయి, నిప్పయి పోయి భూమి పలుగుల్లోకి జీవ సారాన్నయి పోయి ఎతదేరిపోయాను. ఆ పాట రమేశ్ హజారి రాసిన పాట. ఈ పాటను గతిపరిచాడు స్థితి పరిచాడు స్వరపరిచాడు. ఈ పాట, మన బహుజన కులాల సకల సబ్బండజాతుల, సామాజిక కౌటుంబిక అస్తిత్వ కళాతత్వాన్ని ప్రతి బింబించిన, వొడిశిపట్టి గుండెకు తాపిన పాట. మన గ్రామీణ జనార్ద్రతతో, రంగునీ పొంగునీ కలిపితాపిన సుక్కపొద్దు కల్లు వంటి పాట. అది జానపదం. శ్రవణ పేయంగా హిందోళంలో physical గా కలిసి మనకు వినపడుతుంది. కానీ మన తెలంగాణ పెద్దపేగుల తడి సడి మంటల దూపను కూడా తీరుస్తుందని నాకనిపించింది. హజారి పాటలో కేసీఆర్ గారి రాజకీయ తత్వజ్ఞత, స్వర గాంధారమై, రూపాన్ని అధిగమించిన వస్తు గంధకమై మన చెవులను అంటి తానమాడిస్తుంది. వర్తమాన తెలంగాణకు అమరిన, కావాల్సిన బహుజన దార్శనికతను కాశెపోసి గోశికట్టి మన చూపుల ముందు సజీవంగా పటం కట్టి నిలబెడుతుంది. తెలంగాణ పాటకు పుట్టినూరు.

పాట తెలంగాణకు కొత్త కాదు. పాటకు మంత్రసాని తనం చేసి.. తల్లి వొడికి భద్రంగా జాతి దుగూటికి దీపంగా అందించిన పాటగాళ్ల తోట మనది. ఇటువంటి పాటల తొటలో రాళ్లమై, చెట్లమై, గుట్టలమై, పొలాలమై, పానాదులమై, తొవ్వలమై,జీవాలమై సంచారం చేస్తున్నందుకు మనం గర్వపడుతం. రుమాలె గిరేసుకుని భారతదేశాన్నంతా చుట్టుకొని గెలిచి, తెలంగాణ రాజకీయ సామాజిక తాత్విక దార్శనికతను చాటగలుగుతమని హజారి పాట విన్నంక నమ్మకం కలుగుతున్నది. ఇప్పటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో మోగుతున్నదీ అసలు సిసలైన ఫెడరల్ నాయకుని భారతీయ దార్శనికత రణభేరి. అటువంటి రణభేరిని warcry..గా దిశామానం చేసుకుని ఈ ఎన్నికలను చారిత్రక, నవ తాత్విక భారతీయ సమాజ సందర్భానికి సవాల్‌గా తీసుకుని వెల్దామని అనిపిస్తుంది. కేసీఆర్ గారి భారతీయ, రాజకీయ, గ్రామీణ, స్వతంత్రేచ్ఛను, ప్రత్యామ్నాయ అభివృద్ధి తత్వాన్ని బహుజన పాటవాన్ని main stream రాజకీయాల్లోకి పెరిస్త్రోయికాను పొడిపించుకొద్దాం. మన ఓటునే పాటగా మార్చి దశాబ్దాల భారతదేశ అసమానతల మీద యుద్ధాన్ని స్వరపరుద్దాం.. గెలుద్దాం. ఈ పాటను స్వరపరిచిన మల్లిక్‌కు, పాడిన శ్రీకృష్ణలకూ అభినందనలు..
- కవి సిద్ధార్థ
potter

సాగుతోంది కేసీఆర్ పాలన దేశమే తెలంగాణ బాటన

దుక్కి దున్ని సాలు తీసి
మొక్కలేసి పొతం జేసి
పంటను పసిబిడ్డ వోలె
కాపు రైతు సాది నట్టు..
నూలు పోగు సవరించి
మగ్గాన్ని ఆడించి
శాలోల్ల బావనరుషి
కొత్త చీర నేసినట్టు..
మందనుంచి గొర్రె పిల్ల
కాటు కలువకుంట కాసి
ఎలమందా తన మందను
మల్లేసుకున్నట్టు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమంతా తెలంగాణ తోవన //
తంగేడు చెక్క తెచ్చి
లందల తోలును తాల్చి
మాదిగొల్ల చెన్నన్నా
కాలి చెప్పు మలిసినట్టు..
సకినాల పిండోలే
సుక్కమన్ను పుటం బెట్టి
కుమ్మరి లింగన్న
కుండను సృజియించినట్టు..
మోకును తాడుకు సుట్టి
స్వర్గానికి ఎగబాకీ
సుర గంగను గౌడన్నా
భువికి దించి పంచినట్టు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమే ఇక తెలంగాణ తోవన //
వడుపుతోటి వల విసిరి
ముదిరాజు ముత్తన్నా
నిండు సంద మామలను
వొడ్డుకొడిసి పట్టినట్టు..
కొలిమిల ఇనుమును కాల్చి
సమ్మెటతో సాగదీసి
కమ్మరోల్ల ఎంకన్నా
కర్రు పదును పెంచినట్టు..
వులిబాడ్సెను ఆడిస్తూ
వొడ్ల బ్రహ్మచారి మామ
యాప కొమ్మను చెక్కి
ఇలవేల్పుగ దిద్దినట్టు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమంత తెలంగాణ బాటన//
తీరొక్క పుల్ల దెచ్చి
గూడు అల్లుకున్న పిట్ట
తన పిల్లల రెక్కలల్ల
పొదిగి సాదుకున్నట్టు..
ఇటుక మీద ఇటుక పేర్చి
ఇగురంతో ఇల్లుకట్టి
సుతారంగ తాపి మేస్త్రి
మనకు గూడు నిలిపినట్టు..
మైల బట్టలన్నీ ఏరి
చెరువు తల్లి గుడికి చేర్చి
సాకలోల్ల రామక్క
మల్లెమాల అల్లినట్టు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమే తెలంగాణ బాటన //
పాపుల క్షమియించుతూ
క్రీస్తు సిలువ మోసినట్టు
అల్లా దయ కోరుతూ
నమాజును చేసినట్టు..
గోధూళి వేళల్లో
ఆధ్యాత్మిక రాగాల
సూఫీ సంచారి యోగి
స్థితప్రజ్ఞత చూపినట్టు..
లోకహితం కోరుకుంటూ
భగవంతుని వేడుకుంటూ
నిష్టతోని మహారుషి
కఠిన దీక్ష చేసినట్టు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమంత తెలంగాణ బాటన//
తల్లి వోలె తల నిమిరి
తలనీలాలను కొరిగి
మనిషికి మంగళి కత్తి
మానవతను నేర్పినట్టు..
పనిముట్లు నాట్యమాడ
సృజనతో తాళం వేస్తూ
కృష్ణ శిలను మహశిల్పి
దైవముగా మలిచినట్టు..
పసిగుడ్డుకు పురుడు బోసి
జన్మకు వారధి కట్టి
పదిలంగా మంత్రసాని
తల్లి ఒడిల చేర్చినట్లు..
//సాగుతోంది కేసీఆర్ పాలన
దేశమంతా తెలంగాణ తోవన//
ఫెడరల్ స్ఫూర్తే
దేశ సమైక్యతకు రక్షయని
గంగా జమునల సంస్కృతి
భారతీయ తత్వమని
అభివృద్ధి సంక్షేమమే
జనపాలన లక్ష్యంగా
సబ్బండ జాతుల్లో
సింగిడి రంగులు విరియగ..
నడువాలే మన దేశపు పాలన
బంగారి తెలంగాణ బాటన..
నడువాలె మన దేశపు పాలన
దార్శనికుడు కేసీఆర్ తోవన..
-రచన: హజారి

263
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles