నీటి పొదుపు పాఠాలు నేర్చుకుందాం


Fri,March 22, 2019 01:13 AM

నీతి ఆయోగ్ 2018 జూన్‌లో ఇచ్చిన నివేదిక ప్రకారం దేశం లో 60 కోట్ల మంది మంచినీటి కోసం తీవ్రమైన ఇబ్బందు లుపడుతున్నారు. ఏటా రెండు లక్షలమంది సురక్షితమైన మంచినీరు అందుబాటులోలేక మరణిస్తున్నారు. దేశంలోని 84 శాతం మంది ప్రజలకు పైపుద్వారా లభించే మంచినీరు దొరుకడం లేదు. వీళ్ళందరూ కూడా కాలువలు, వ్యవసాయ బావులు, చిన్న చిన్న నీటి గుంతల మీద ఆధారపడుతున్నారు. దేశంలోని 21 నగరాలు 2020కల్లా తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నాయని సర్వేలో తేలింది. అందుబాటు లో వుండి మనం తాగుతున్న నీటికన్నా రెండింతలు వాటర్ డిమాండ్ 2030 నాటికల్లా ఏర్పడే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారం ఒక్కటే.. అది నీటి పొదుపు. మనం నీటిని సంరక్షించుకోకపోతే రేపటి రోజులు భయానకంగా ఉంటాయని గ్రహించాలి. నీటి ని పొదుపు చేసుకోవడం, ప్రతి నీటి చుక్కను ప్రాణ సమానంగా చూసుకోవలసిన తరుణం ఇదే. భూగర్భజలాలు అడుగంటిపోతున్నందు వల్ల ఉష్ణోగ్రత నమోదు ఎక్కువయినకొద్దీ భూమిలోని నీరు కూడా ఆవిరైపోతున్నది. ఏటా కురిసే వర్షా లు భూగర్భజలాలపై ప్రభావం పడుతుంది. తక్కువ వర్షపాతం నమోదై తే, భూగర్భజలాలు అడుగంటిపోతాయి. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం లోటు వర్షపాతం ఉండగా, హైదరాబాద్ నగరంలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గత నాలుగైదేండ్లుగా లోటు వర్షపాతం నమోదవుతూ వస్తున్నది. తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న నీటి డిమాండ్ కారణంగా నగరంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా పడిపోయాయి.


బావిలోని నీరు ఎండిపోతే గానీ మనకు నీటి విలువ తెలుస్తుందనేది సామెత. ఎండాకాలంలోనే నీటికొరత గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నది. వర్షాకాలంలో పడిన వర్షాన్ని మనం పొదుపు చేసుకుంటే ఈ బాధ ఉండదు. నీటి ప్రాముఖ్యం, వాన నీటి సంరక్షణ, నీటిని ఒడిసి పట్టడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి సుస్థిరత వంటి పలు అంశాల్లో మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వున్నది.


నీటి కోసం వేయి అడుగుల లోతుకు బోరును తవ్వాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇష్టారాజ్యంగా భూగర్భజలాల తోడివేత గత రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్నది. దీంతో నేలకింద అంతటా ఉప్పు మయమవుతున్నది. నీళ్ల లో వుండే ఖనిజ లవణాలు పోతున్నాయి. ఫ్లోరైడ్ భూతం కోరలు చాస్తున్నది. సీసం, క్రోమియం వంటివి నీటి మౌలిక స్వభావాన్నే మార్చివేస్తున్నాయి. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు నేరుగా వచ్చి నదుల్లో కలువడం వల్ల కూడా నీటి కాలుష్యానికి కారణాలవుతున్నాయి. నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద నీటి నాణ్యతలు పరిశీలిస్తే బిఓడి, పిహెచ్, బోరాన్, అమ్మోనియా వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలడంతో ఆనీళ్లు మనుషులు తాగేందుకే కాదు, కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా పనికి రావు. బావిలోని నీరు ఎండిపోతే గానీ మనకు నీటి విలువ తెలుస్తుందనేది సామెత. ఎండాకాలంలోనే నీటికొరత గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నది. వర్షాకాలంలో పడిన వర్షాన్ని మనం పొదుపు చేసుకుంటే ఈ బాధ ఉండదు. నీటి ప్రాముఖ్యం, వాన నీటి సంరక్షణ, నీటిని ఒడిసి పట్ట డం, నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి సుస్థిరత వంటి పలు అంశాల్లో మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వున్నది. అన్నం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు. కానీ నీళ్లు లేకుండా కొన్నిగంటలు కూడా బతకలేమన్నది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. నీటిని ఉత్పత్తి చేయలేం. అందుబాటులో వున్న నీటిని వినియోగించుకోవడమే తప్ప కొత్తగా నీటిని ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయలేం. రాబోయే తరానికి నీటిని అందించాలంటే, వర్షం వల్ల వచ్చే నీటిని సంరక్షించుకోవ డం, ఆ నీటిని భూగర్భంలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం.

నీటి వృథాను అరికట్టాలి. పైపుల లీకేజీల వల్ల రోజుకు మూడు కోట్ల గ్యాలన్ల నీరు వృథాగా పోతున్నదని లెక్కలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ దేశం సముద్ర జలాలను శుభ్రపరుచగలిగే సాంకేతికను, అరబ్ దేశా లు మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునే పద్ధతులు ఇప్పటికే జరుగుతున్నాయి. మురుగునీరు, వ్యర్థజలాలను తిరిగి ఉపయోగించుకునే పద్ధతి నగరాల్లో రావాల్సిన అవసరం వున్నది. భారత్‌లో ఐ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది గానీ, స్వచ్ఛమై న తాగునీరు మాత్రం లభించడం లేదని ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన నీరు- వ్యర్థాల నిర్వహణ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న షికాగో మెట్రోపాలిటన్ కమిషనర్ ఫ్రాంక్ ఆవిలా అన్నారు. నీటి కొరత ను అధిగమించేందుకు, ప్రజల్లో అవగాహనతో పాటుగా అక్కడున్న ప్రజలందరినీ నీటి సంరక్షణరంగంలో భాగస్వాములను చేసేందుకు తమ పూర్తికాలాన్ని నీటికోసం ఉపయోగిస్తున్న వాటర్ వారియర్స్ దేశంలో ఎందరో వున్నారు. తాగునీటి కోసం, సాగునీటి కోసం నిత్యం యుద్ధంలాగా చేస్తున్న ప్రజలను నీటి సంరక్షణలో భాగస్వా మ్యం చేయడానికి ముంబయికి చెందిన అమలారుయా, ఆబిద్ సుర్తి, రాజస్థాన్‌కు చెందిన రాజేం ద్రసింగ్, శిరీష్ ఆప్టే లాంటి వారు ఎందరో పనిచేస్తున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే రాజేంద్రసింగ్ గ్రామస్తులతో కలిసి వాననీటిని వృథా పోనివ్వకుండా ఏటవాలుగా మట్టి కట్టలను నిర్మించడం వల్ల రాజస్థాన్‌లోని ఒక వేయి గ్రామాల్లో నీటి కరువును పూర్తిగా నిర్మూలించగలిగాడు. నగరానికి నీటికొరత రాకుండా జలమండలి అన్నిచర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం సింగూరు, మంజీరా రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటినప్పటికీ, గోదావరి, కృష్ణా నదుల నుంచి తీసుకుని వస్తున్న నీటిని నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా జరుగుతున్నది.
D-Kishore
రోజుకు సుమారు 400 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నపుడు, వీటిలో 40 శాతం లీకేజీల వలన నీరు వృథాగా పోతున్నది. ఈ వృథాను అరికడితే నగర ప్రజలందరికీ ప్రస్తుతం సరఫరా చేస్తున్న మంచినీరు సరిపోతుంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న ఈ విలువైన నీటిని మనం పొదుపుగా, జాగ్రత్తగా వాడుకున్నపుడు నీటి కష్టాలు తగ్గిపోతాయి. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి నీటి కొరత రాకుండా ప్రభుత్వం కేశవపూర్, దేవలమ్మ నగరం వద్ద పది టీఎంసీ పరిమాణం గల రెండు పెద్ద రిజర్వాయర్లను నిర్మించే ప్రణాళికలతో వున్నది. రాబోయే రోజుల్లో ప్రతి వర్షపు నీటి చుక్క ను ఒడిసిపట్టాలి. నేటి నీటి పొదుపే రేపటి తరానికి మనం ఇచ్చే బంగారు భవిష్యత్తు.
(వ్యాసకర్త: మేనేజింగ్ డైరెక్టర్, జలమండలి అండ్ కమిషనర్, జి.హెచ్.ఎం సి)
(నేడు ప్రపంచ నీటి దినోత్సవం)

565
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles