అటవీ సంరక్షణతోనే మానవ మనుగడ

Thu,March 21, 2019 01:01 AM

మనిషి మనుగడ అడవి నుంచే మొదలైంది. సృష్టి ఆరంభంలో ఆదిమ మానవుల కాలంలో మానవ మనుగడకు ఆలవాలమైంది అడవే. పచ్చటి పుడమితల్లి ఒడిలో మొదలైన మానవ ప్రస్థానం చివరికి ఈ భూమి మీద చెట్టు అనేదే లేకుండా చేసేవిధంగా ప్రయాణిస్తున్నది. తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్న ఈ మానవజాతి ప్రస్థానంలో తనకు ఆశ్రయమిచ్చిన అడవిని, జంతుజాలాన్ని కనుమరుగుచేయడమే పనిగా ఆధునిక మానవుడు తయారయ్యాడు. ఆదిమ కాలం దశ తర్వాత వ్యవసాయం కోసం అడవుల నరకడం మొదట్నుంచీ ఉన్నా, పారిశ్రామికీకరణ మొదలైన కాన్నుంచి మరింత తీవ్రమైం ది. మనిషి జీవితం కూడా పల్లె పట్టులోంచి నగరం గట్టుల్లోకి వచ్చింది. విద్యుదుత్పత్తి, ఇంధనం, కాగితం పరిశ్రమలు పెరిగాయి. వాటికి అనుగుణంగా కలప ఖర్చవుతూ, దానికోసం అడవులు క్రమక్షయమవుతూ వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గంటకు దాదాపు 1,483 హెక్టార్ల అటవీ సందప అంతరించిపోతున్నది. ఏటా సుమారు 3.2 కోట్ల ఎకరాల్లోని అడవులు అంతరిస్తున్నాయి. అంటే దాదాపుగా ఒక తెలంగాణ ప్రాంతపు విస్తీర్ణంలో ఉన్న చెట్లు మొత్తంగా నేలకూలుతున్నాయి. ఇప్పుడున్న వేగంతో నరుకుతూపోతే రెయిన్ ఫారెస్టులు వచ్చే వందేళ్లలో పూర్తి గా మాయమైపోతాయని అంచనా! క్రమక్షయాన్ని అడ్డుకోగలిగే అడవులే క్రమక్షయానికి గురవుతుండటం విషాదం.

తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో పచ్చదనాన్ని పెంచడానికి, అటవీసంరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. రాబోయే రోజుల్లో కూడా మొక్కలు నాటడం, వనసంరక్షణ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ వంటి విషయాలపై పూర్తి స్థాయి అవగాహన పెరిగి, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వహించే విధంగా తయారవుతారు.


అడవుల్లో 60వేల రకాల చెట్ల జాతులున్నాయి. ఇంకా గుర్తించనివి ఎన్నో! 160కోట్ల మంది పేదలు అడవిమీద ఆధారపడి బతుకుతున్నారు. ఆవా సం, ఆహారం అంతా అడవే వారికి. ఆదివాసులు నిరాశ్రయులు అవడం ఒక ఎత్తయితే, అడవులే ఆవాసాలుగా ఉన్న ఎన్నో వైవిధ్యమైన ప్రాణుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. సగటున రోజుకు 50-100 ప్రాణిరకాలు అంతరించిపోతున్నాయని అంచనా! భూపొరల్లో నీటిని చెట్లు పట్టి వుంచుతాయి. యంత్రాలు విడిచే కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించుకుని భూఉష్ణోగ్రతలు పెరుగకుండా చూస్తాయి. అయితే, సూర్యరశ్మిని అడ్డుకునే చెట్లు లేకపోతే నేలలు పొడి బారుతాయి. వర్షం కురిసినప్పుడు నీటిని అడ్డుకునే మార్గం లేక, భూమ్మీది పోషక పదార్థాలు కొట్టుకుపోతాయి. నీటి నియంత్రణ జkiగక, భూగర్భ జలాలు అడుగంటుతాయి. సారం కోల్పోయిన భూములు క్రమంగా ఎడారులుగా మారిపోతాయి. ప్రకృతి వృక్షజాతికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పింది. నీటిని, భూ క్షయాన్ని కాపాడే బాధ్యత చెట్టుది. చెట్లు లేకుంటే భూ పొరల్లోకి నీరు ఇంకటం జరుగదు. ఫలితంగా భూ గర్భజలాలు అడుగంటుతాయి. భూ క్షయం జరిగి భూసారం కోల్పోతుంది. బోరుబావులు బావురుమంటాయి. పంట లు ఎండిపోతాయి. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని కాలుష్యాన్ని నియంత్రించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. గనులు తవ్వుకోవడానికీ, ఆ గనులకు వెళ్లడానికి అవసరమైన రోడ్లు వేసుకోవడానికీ అడవుల్ని నరికేస్తున్నారు.

ఆ దారి వెంబడి వాహనాల్ని నడిపిస్తున్నారు. దీంతో పచ్చని అడవుల్లో ధ్వని, వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. అధిక జనాభా కూడా అడవుల వినాశనానికి ఓ కారణం. గ్రామాలు, పట్టణాలు మరింత విస్తరిస్తున్నాయి. పచ్చని పొలాలు రియల్‌ఎస్టేట్ వెంచర్లు అవుతున్నాయి. దట్టమైన అడవులు మనిషి అవసరాలు తీర్చే ప్రయత్నంలో ఉనికిని కోల్పోతున్నాయి. ఇక నగరాలలో గుండెల నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారీ మనం చిటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకున్నట్టే. కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి, ఎంతోకొంత కాలుష్యాన్ని తగ్గించే చెట్లేమో చెట్టుకొకటి పుట్టకొకటీ అన్నట్లున్నాయి. కార్ఖానాలూ, వాహనాలూ పోటీపడి సృష్టించే వాయు కాలుష్యం అంతా ఇంతా కాదు. నగరీకరణ పెరుగడంతో ఎయి ర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు వాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఫలితంగా గాలిలో క్లోరోఫ్లోరో కార్బన్ వంటి వాయువుల వాటా పెరుగుతున్నది. ఆ ప్రభావాలూ తీవ్రంగా ఉన్నాయి. ఉబ్బస వ్యాధులు, చర్మరోగాలు, మానసిక సమస్యలు వచ్చిపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో స్థానం సంపాదించుకున్నది. వాతావరణంలో కాలు ష్యం పేరుకుపోయి గ్రీన్‌హౌస్ ప్రభావానికి కారణమవుతున్నది. క్లోరోఫ్లోరో కార్బన్ ఓజోన్ పొరకు రంధ్రాలు వేస్తున్నది. అందులోంచి ప్రసరించే అతినీలలోహిత కిరణాలు అనేకానేక ఆరోగ్య సమస్యలకు మూలం. భూమి పెనంలా వేడెక్కిపోవడానికీ ఇదే ప్రధాన కారణం.

ఈ పన్నెండేళ్ల లో ప్రపంచ ఉష్ణోగ్రత 0.4 డిగ్రీలు పెరిగిందంటేనే తీవ్రత అర్థమవుతున్నది. రుతుపవనాలు గతి తప్పాయి. వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రపంచంలోనే అడవులు సమృద్ధిగా ఉన్న 10 దేశాలలో మనదేశం కూడా ఒకటి. మొత్తం భారతదేశం విస్తీర్ణం 8,02, 088 చదరపు కిలోమీటర్లకు గాను 24.39 శాతం అటవీ విస్తీర్ణం వుంది. అలాగే తెలంగాణ, ఏపీలో మొత్తం 171,306 చదరపు కిలోమీటర్లకు గాను 21.54 శాతం, తెలంగాణలో 1,12,077 చదరపు కిలోమీటర్లకు గాను 24 శాతం ఉన్నది. గత నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో పచ్చదనాన్ని పెంచడానికి, అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. రాబోయే రోజుల్లో కూడా మొక్కలు నాటడం, వనసంరక్షణ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ వంటి విషయాలపై పూర్తి స్థాయి అవగాహన పెరిగి, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వహించే విధంగా తయారవుతారు. అభివృద్ధి పేరుతో, అత్యాశతో భూమి మీద చెట్టు అనేదే లేకుండా చేస్తు న్నాం. అడవులను నరికివేస్తూ, సిమెంటు అరణ్యాలను నిర్మిస్తున్నాం. ఆశ కు అంతులేకుండా పోయి, చిన్న మొక్క కూడా లేకుండా ఇండ్లను నిర్మిస్తున్నాం.
ravi-mothe
స్వచ్ఛమైన గాలిని వదిలేసి, యాంత్రికమైన ఎయిర్ కూలర్ గాలిని నమ్ముకొంటున్నాం. తద్వారా ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతాన్ని కలిగిస్తున్నాం. ఇలా అభివృద్ధి పేరుతో, వస్తు విలాసంలో పడిపోయి మనం కూర్చున్న కొమ్మను ఇప్పటికే సగం నరుక్కున్నాం. ఇక మిగతా కొమ్మనైనా కాపాడుకుందాం.
(వ్యాసకర్త:సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు)
(నేడు ప్రపంచ అటవీ దినోత్సవం)

304
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles