ప్రకృతి రంగులనే వాడండి

Thu,March 21, 2019 01:01 AM

రంగుల పండుగ హోలీ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రీతి పాత్రమైనది. పురాణ ఇతిహాసాల నుంచి నేటి ఆధునిక కాలం దాకా రంగుల పండుగ హోలీకి ప్రత్యేక స్థానం ఉన్నది. పల్లె నుంచి పట్నం దాకా ఆబాలగోపాలం హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా వినియోగించే రంగుల గురించి జాగ్రత్త వహించాలి. వెనుకటి కాలంలో హోలీ రంగులుగా ప్రకృతి పరమైన రంగులనే వాడేవారు. పూల నుంచి, చెట్ల బెర డు, కాయల నుంచి తీసిన రంగులనే వాడేవారు. అలాం టి రంగులతో ఎలాంటి ప్రమాదం ఉండకపోయేది. ఆ రంగులు శరీరం మీద పడినా ఎలాంటి చర్మసంబంధమై న ఇబ్బందులు తలెత్తకపోయేది. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో హోలీ రంగులుగా సింథటిక్ రంగులను వాడుతున్నారు. వీటిలో అతి ప్రమాదకరమైన రసాయనాలతో పాటు, భారలోహ పదార్థాలు, విషతుల్యమైన ఇతర కారకాలు ఉంటున్నాయి. హోలీ పండుగ ఇలాంటి రంగులు వాడటం మూలంగా ఆ రంగునీళ్లు కంటిలో పడినా, చర్మం మీద పడినా తీవ్రమైన విపరీతాలు జరుగుతున్నా యి. చర్మం మీద పడితే ఎలర్జీ లాంటి చర్మసంబంధమైన వ్యాధులు వస్తున్నాయి.

ఇక సున్నితమైన కంట్లో పడితే కొన్ని సందర్భాల్లో కండ్లు పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి హోలీ కోసం రసాయన రంగులను కాకుండా ప్రకృతి సహజసిద్ధమైన రంగులనే వాడితే అందరికీ మంచిది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మన పరిసరాల్లో దొరికే మోదుగుపూలు, ఇతర పూలను సేకరించి రంగులను తయారుచేసుకోవటం ఉత్తమం. కాబట్టి ఎవ రూ రసాయన రంగులను వాడొద్దని, వాడినా తగు జాగ్రత్తలు అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో పెద్దలు పిల్లలకు తగు సూచనలు చేస్తే మంచిది. ఎవరికి వారు ప్రకృతి, సహజ రంగులనే వాడు తూ, ప్రోత్సహిస్తూ కృత్రిమ రసాయన హోలీ రంగుల ప్రమాదం నుంచి బయటపడాలి. ఎలాంటి హాని, ప్రమా దం లేని సంతోషకరమైన హోలీ జరుపుకోవటానికి అంద రూ జాగరూకతతో వ్యవహరించాలి. రంగుల పండుగ ఆనంద హోలీ శుభాకాంక్షలు.
-దిడ్డి బాలాజీ, సామాజిక కార్యకర్త
యాదాద్రి భువనగిరి జిల్లా

286
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles