ఫెడరల్ ఫ్రంట్‌కు దారి

Wed,March 20, 2019 01:04 AM

ఇటీవల కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించడానికి వెనుక అనేక చారిత్రక, సామాజిక కారణాలున్నాయి. ఉత్తరాదిలో 1967ల నుంచి లోహియా భావాలతో ప్రభుత్వాలు ఏర్పడుతూ, 1994 నుంచి అంబేద్కర్ భావాలతో యూపీలో బీఎస్పీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ, అధికారంలోకి వస్తూ కొనసాగుతున్నాయి. ఇలా ఉత్తరాదిలో ఎదుగుతున్న నూతన శక్తులను సమీకరించాల్సిన చారిత్రక సన్నివేశంలో ఫెడరల్ ఫ్రంట్ అనే భావన ముందుకువ చ్చింది. దీనికి జాతీయ, అంతర్జాతీయ దృక్పథాన్ని, దార్శనికతను కేసీఆ ర్ ముందుకు తెచ్చారు. దేశంలో లభ్యమయ్యే 70 వేల టీఎంసీల నీటిలో ముప్ఫై వేల టీఎంసీలతో దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని, మిగ తా నీటితో అనేక థర్మల్, హైడల్ విద్యుదుత్పత్తి, జలరవాణా, చేపల పెం పకం వంటివి చేపట్టవచ్చునని ఒక సూచనప్రాయమైన ప్రణాళిక అందించారు. అంతేకాకుండా, ఆసరా పథకం, రైతుబంధు, భూ రికార్డుల ప్రక్షాళన, గురుకుల పాఠశాలల ఏర్పాటు, మైనార్టీల జనాభా మేరకు వారికి రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లను తమిళనాడులో వలె పెంచాలనే దార్శనికత, ఆదాయాన్ని పెంచడం, సంపద అందరికీ పంచడమనే ఉదాత్త లక్ష్యం, చైనా, రష్యా, జపాన్, అమెరికాలతో పోల్చి 70 ఏండ్లలో వెనుకబడిన దేశాలు మనకన్నా ముందుకెలా సాగాయో వివరించారు. ఈ దార్శనిక శక్తి సమాఖ్య ఫెడరల్ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం గా కలిగిన అనుభవాల నుంచి రూపుదిద్దుకున్నదే. అందరిని ఎలా సింగి ల్ పాయింట్ ఎజెండాపై కలుపుకొనిపోవచ్చో తెలంగాణ రాష్ట్రం కోసం అన్నిపార్టీలను కలిసి చేసిన చర్చల అనుభవాలు ఫెడరల్ ఫ్రంట్‌కు భూమికను ఏర్పరిచాయి.

గతంలో దక్షిణాది నుంచి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆత్మగౌరవ ఉద్యమాలు ఉధృతంగా కొనసాగాయి. అయితే మొత్తం దేశాన్ని ఆకర్షించే, శాసించే నూతన శక్తులు పూర్తిస్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. దక్షిణాది నుంచి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి, కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్, ఎన్టీఆర్ జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేసినప్పటికీ జాతీయ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిర్దేశించడం జరుగలేదు.


సమకాలీన రాజకీయరంగంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక దార్శనికతలో కేసీఆర్‌ను చెప్పిన తర్వాతే మిగతావారిని చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, భావజాల చర్చలు, ప్రయోగాలు ఇందుకు భూమికను అందించాయి. నాగ్‌పూర్ కేంద్రంగా ఆర్‌ఎస్‌ఎస్ హిందూ ధార్మికత పేరిట రాజకీయ, సామాజికరంగాల్లో ఉత్తరాదిని నిర్దేశిస్తూ వస్తున్నది. మహారాష్ట్ర నుంచే ఛత్రపతి శివాజీ రాజ్యం తర్వాత ఆయన రాజ్యాన్ని కొందరు పీష్వాలు పరిపాలించారు. అట్లా అంబేద్కర్ అధ్యక్షులుగా రూపొందించిన భారత రాజ్యాంగం కూడా కొందరు పీష్వాల వంటి సామాజికవర్గాల చేతుల్లో పడి దేశం పరిపాలించబడుతున్నది. న్యాయం నిర్ణయించబడుతున్నది. ఇదో విచిత్రమైన వైరుధ్యం. కేంద్రానికి ఆదాయాన్ని సమకూర్చుతూ తాము తమ ఆదాయంలో 40 శాతానికి పైగా కోల్పోతూ వస్తున్న దక్షిణాది గత కొంతకాలంగా నూతన ఆలోచనలు చేస్తున్నది. దక్షిణాది ప్రత్యేక దేశంగా ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు. ఇది జరిగినా, జరుగకపోయినా మగధ సామ్రాజ్యం తర్వాత దక్షిణాది నుంచి శాలివాహన సామ్రాజ్యం ఉత్తరాదికి విస్తరించినట్టు దక్షిణాది నుంచి ఆచార్య నాగార్జున, ఆదిశంకరాచార్య, రామానుజ, మద్వాచార్య ధార్మిక ప్రచారాలు ఉత్తరాదికి విస్తరించినట్టు త్వరలో దక్షిణాది నుంచి రాజకీయ, సామాజిక, సాంస్కృతి క, ఆర్థికరంగాల్లో ఉత్తరాదికి నాయకత్వం అందించే అవకాశం ఉన్నది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి నాయకత్వం అందించినప్పుడల్లా ఉత్తరాది ఎంతో చక్కగా అభివృద్ధి చెందింది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి సామ్రా జ్యం విస్తరించినప్పుడల్లా సంఘర్షణలు, యుద్ధాలు, ఆదాయ వనరుల తరలింపు పెరుగుతూ వచ్చింది.

దక్షిణాది రాష్ర్టాలు తమ ఉత్తరాది కన్నా పార్లమెంట్ సభ్యుల సంఖ్యలో తక్కువ కాబట్టి వారితో కలిసి పనిచేయడంవల్ల ఎక్కువ ప్రయోజనమని ఉత్తరాది ప్రాంతీయపార్టీలు, సామాజిక వర్గాలు తప్పక దక్షిణాది నాయకత్వాన్ని ఆమోదిస్తాయి. అందుకు దార్శనికతను అందించడం దక్షిణాది దార్శనికుల సామాజిక శాస్త్రవేత్తల కర్తవ్యం. ఇందుకుగాను అనేక బృందాలు దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో సదస్సులు, పర్యటనలు, మహాసభలు నిర్వహించడం నూతన దార్శనికతను అందించడం ప్రథమ కర్తవ్యం.


ఇప్పుడు డాక్టర్ రావ్‌ుమనోహర్ లోహియా, డాక్టర్ బి.ఆర్.అంబేద్క ర్ ఇలా సమ్మేళనంతో ఉత్తరాది రాజకీయాలు ప్రభావితమవుతున్నాయి. దక్షిణాదిలో ఉత్తరాది ప్రభావితం కాకుండా, స్వతంత్రంగా లోహియా, అంబేద్కర్, పెరియార్, నారాయణగురుల సమ్మేళనంతో ఒక బలమైన శక్తిగా ముందుకు వస్తున్నాయి. ప్రతిదానికి ఢిల్లీపై ఆధారపడటం, ఢిల్లీ దక్షిణాదిని శాసించడం, తమ సామంతులుగా, ఆశ్రితులుగా ఉండేవారిని ప్రమోట్ చేయడం వల్ల దక్షిణాది నుంచి ప్రత్యేక అస్తిత్వ ఉద్యమం, ఆత్మ గౌరవ ఉద్యమం కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, జనతా పార్టీ, జనతాదళ్, బీఎస్పీ, ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ పార్టీలేవీ ఇందు కు మినహాయింపు కాదు. అలా ఉత్తరాది దక్షిణాదిని తమ పాలిత ప్రాం తంగా, వలస ప్రాంతంగా, భావిస్తూనే ఉన్నది. ఉత్తరాది ప్రజల్లో చాలామందికి దక్షిణాది రాష్ర్టాల స్పృహ ఉండదు. తామే దేశం, తమదే రాజ్య మనే భావన వారి అంతచ్ఛేతనలో కొనసాగుతున్నది. గాంధీజీ హిందీ, ఉరూ మిళితమైన హిందుస్థాని భాషను రాజ్యభాషగా ఉండాలని భావిస్తే హిందీ ప్రాంతాల వాళ్లు ఉర్దూ పదాలను బహిష్కరిస్తూ కొన్ని సామాజిక వర్గాల భాషను హిందీగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. దీనివల్ల దక్షిణాది తాత్వికంగా చాలా సవాళ్లను అణిచివేతను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీన్ని పరిష్కరించడానికి త్రిభాషా సూత్రం ముందుకుతీసుకురావడం జరిగింది. ఉత్తరాదిలో దక్షిణాది భాషలు నేర్చుకోవాలనే త్రిభాషా సూత్రం అమలు అంతంత మాత్రమే.

ఎంతపెద్ద జాతీయ, అంతర్జాతీ య సదస్సులు, సభలు, మహాసభలు దక్షిణాదిలో జరిగితే అవి ప్రాంతీ యస్థాయి సభల వలె మీడియా గానీ, ఉత్తరాది గానీ భావిస్తూ వస్తున్నది. ఢిల్లీ, కలకత్తా, ఆగ్రా, కశ్మీర్, పంజాబ్ వంటి ప్రాంతాల్లో జరిగేవి జాతీ య, అంతర్జాతీయ ప్రచారంలోకి తేబడుతున్నాయి. దక్షిణాది సంఘటనలపై జోన్ల వారీగా దక్షిణాది జోన్‌కు పరిమితం చేయడం వల్ల ఉత్తరాదికి ఈ విశేషాలు అందడం లేదు. గతంలో దక్షిణాది నుంచి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆత్మగౌరవ ఉద్యమాలు ఉధృతంగా కొనసాగాయి. అయితే మొత్తం దేశాన్ని ఆకర్షిం చే, శాసించే నూతన శక్తులు పూర్తిస్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. దక్షిణాది నుంచి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి, కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్, ఎన్టీఆర్ జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేసినప్పటికీ జాతీయ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిర్దేశించ డం జరుగలేదు. దశాబ్దాలు గడిచినకొద్ది దక్షిణాది రాష్ర్టాలు, ఉత్తరాదిలో ని నూతన ప్రాంతీయ సామాజికవర్గాల శక్తులతో కలిసి ఒక ఫెడరల్ ఫ్రం ట్‌గా ఏర్పడాల్సిన ఆవశ్యకత ముందుకువచ్చి దశాబ్దాలు గడిచింది. జాతీ య, అంతర్జాతీయ దృష్టితో సమస్త రాష్ర్టాలను, ప్రాంతాలను, సామాజికవర్గాలను కలుపుకొనిపోయే దూరదృష్టి, దార్శనికత, సహనం, త్యాగశీలత, కొరవడటంతో పాటు మాతృభాష, హిందీ భాష, దక్షిణాదికి, అవరోధంగా పరిణమించడమనే పరిమితులు, ఉత్తరాది ప్రాంతీయశక్తులు కొనసాగడం వల్ల దశాబ్దాలు గడిచినా, ఒక సమాఖ్య గొడుగు కిందికి పూర్తిస్థాయిలో రాలేక తాత్కాలిక ప్రాతిపదికపై కలుస్తూ, విడిపోతూ వస్తున్నాయి.

ఇప్పుడు ఒక దార్శనికత రూపుదిద్దుకున్నది. 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కలిగిన అనుభవాలు నూతన అభివృద్ధి, సంక్షేమ సామాజిక న్యాయం, దృష్టికోణం పెరుగుతూ వస్తున్నది. అలా దక్షిణాది నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ల అనుకూలతను ఉత్తరాది వ్యతిరేకించడం వల్ల, దక్షిణాది ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇది ఒక ప్రధాన సమస్య. ఆర్థికంగా దక్షిణాది రాష్ర్టాలు, ఉత్తరాది ఢిల్లీ కేంద్రానికి ఎంతో చెల్లిస్తూ తాము నష్టపోతున్నాయి. ఉద్యోగాల్లో కూడా దేశవ్యాప్తంగా రావలసిన వాటాని దక్షిణాది కోల్పోతున్నది. రాష్ర్టాలవారీగా, నియోజకవర్గాలవారీగా ఉద్యోగాలను, సైనికులను, రైల్వే, ఎల్‌ఐసీ, టెలిఫోన్, దూరదర్శన్, ప్రభుత్వరంగ బ్యాంకులు, పరిశ్రమలు మొదలైనవాటిల్లో నియామకా లు జరిగి ఉంటే అది నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధిచెంది ఉండేవి. ఇప్పుడు ఈ ఆవశ్యకత మరింత ముం దుకు తోస్తున్నది. అందువల్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఒక నూతన పునర్వికాసం ముందుకు వస్తున్నది. అలా ఆచార్య నాగార్జునుడి నుంచి తిరిగి ఉత్తరాదికి ఆదిశంకరాచార్య నుంచి తిరిగి ఉత్తరాదికి, కామరాజ్ నాడార్, మర్రి చెన్నారెడ్డి, దేవరాజు అర్సు నుంచి ఉత్తరాది ఇందిరాగాంధీకి, ఢిల్లీకి మద్దతునిస్తూ నిలబెడుతూ రావడం జరిగింది. ఆమెను నిలబెట్టి ఆమెకు తలవంచుతూ రావడం జరిగింది. తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం తప్పక నెరవేరుతుంది. క్రీ.శ. 70 ఏండ్ల తర్వాత శాలివాహన శకం ప్రారంభమైంది. 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ప్రారంభమవుతున్న ఈ నూత న వికాసం త్వరలోనే చాలా సుస్థిరంగా ముందుకుసాగే అవకాశం ఉన్న ది.
ramulu-bs
బలహీనులతో బలవంతుడు కలిసి పనిచేయడానికి సులభంగా ముం దుకువస్తారు. బలవంతులతో కలిసి పనిచేయడం వల్ల తమపై ఆధిపత్యం చెలాయిస్తారని సంకోచిస్తారు. దక్షిణాది రాష్ర్టాలు తమ ఉత్తరాది కన్నా పార్లమెంట్ సభ్యుల సంఖ్యలో తక్కువ కాబట్టి వారితో కలిసి పనిచేయడంవల్ల ఎక్కువ ప్రయోజనమని ఉత్తరాది ప్రాంతీయపార్టీలు, సామాజి క వర్గాలు తప్పక దక్షిణాది నాయకత్వాన్ని ఆమోదిస్తాయి. అందుకు దార్శనికతను అందించడం దక్షిణాది దార్శనికుల సామాజిక శాస్త్రవేత్తల కర్తవ్యం. ఇందుకుగాను అనేక బృందాలు దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో సదస్సులు, పర్యటనలు, మహాసభలు నిర్వహించడం నూతన దార్శనికతను అందించడం ప్రథమ కర్తవ్యం. ఢిల్లీ కేంద్రంగా కొన్ని బృందాలు పనిచేసినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం వేగవంతమవుతుంది.

465
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles