కాంగ్రెస్ ఆఖరి ఆశలు కూలనున్నాయా?


Tue,March 19, 2019 11:18 PM

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సృష్టించిన ఈ నినాదం తారకమంత్రంలా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడుతాయంటాడు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు. రాజకీయనేతలు సరదాగా మాట్లాడే కొన్ని పదాలు, మాటలు వెనువెంటనే ప్రజల్లోకి వెళ్లి శాశ్వతంగా స్థిరపడుతాయి. కేటీఆర్ పుట్టించిన పై మాటలు ఇప్పుడు తెలంగాణలో అందరి నోళ్లలో నానుతున్నాయి. కాంగ్రెస్ పార్టీది ఒకప్పుడు ఘన చరిత్రే. తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రధానమంత్రి అయ్యారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య లాంటి యోధానుయోధులు కాంగ్రెస్ రక్తంతో పెరిగారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశా రు. కానీ, అదంతా స్వర్ణయుగంలో జరిగినవి. కానీ, గత ముప్ఫై ఏండ్లుగా కాంగ్రెస్ రక్తం ఏ మాత్రం ప్రవహించని పచ్చి అవకాశవాదులు, అవినీతిపరులు, ఇతర పార్టీల నుంచి వలసవచ్చినవారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్‌ను కలుషితం చేశారు. బలమైన ప్రత్యామ్నా యం, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినప్పుడు కాంగ్రెస్ కూలిపోయింది. సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ తర్వాత మళ్లీ టీఆర్‌ఎస్ రాగానే కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. టీఆర్‌ఎస్ పాలన ప్రజారంజకంగా ఉన్నదని భావించడంతో మళ్లీ అఖండమైన మెజార్టీని కట్టబెట్టి కాంగ్రెస్‌ను దూరంగా పెట్టారు. టీఆర్‌ఎస్‌లో కొందరు అంతర్గతంగా చేసిన ద్రోహం కారణంగా కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చాయి కానీ, లేకపోతే పది సీట్లు కూడా వచ్చేవి కావు.


కాంగ్రెస్‌లోని నాయకుల పట్ల ప్రజలకు సదభిప్రాయం ఏనాడో పోయింది. కాంగ్రెస్ ఎంపీలు అందరూ స్వార్థపరులు, పదవులను అడ్డం పెట్టుకొని అవినీతి చేసేవారన్న ముద్ర ప్రజల్లో బలంగా ఏర్పడింది. దాన్ని చెరిపేయడం కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు నాయకత్వం లేదు. ఆకర్షణీయమైన నాయకుల్లేరు. వారిలో వారే కొట్టుకుంటారు. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోటీచేస్తే తాను వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మరో కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ ప్రకటించారంటే కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని తేలిపోవడం, అవతల టీఆర్‌ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండటం, విపక్ష ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ గౌరవిస్తుండటం కాంగ్రెస్ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేశాయి. టీఆర్‌ఎస్ అధికారం మరో ఐదేండ్ల తర్వాత పోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటే పోనీ కాంగ్రెస్‌లోనే కొనసాగవచ్చు. కానీ, తెలంగాణ ప్రజల మనోగతం పరిశీలిస్తే మరో పాతికేళ్ల దాకా టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని అందరికీ అర్థమవుతున్నది. కేసీఆర్ ఏ కారణంగా అయినా కేంద్రానికి వెళ్లి నా, వెళ్లకపోయినా, పగ్గాలు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్‌ను భావి ముఖ్యమంత్రిగా జనం పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు పాతికేళ్లు తమ రాజకీయ భవిష్యత్తును బొంద పెట్టుకోవడమా లేక భవిష్యత్తు కల్పించే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడమా అని వారు ఆలోచిస్తే తప్పులేదు. ఎండిపోయి, ఆకులు రాలిన చెట్టు ఎవరికీ నీడనివ్వదు. ఊడలు దిగిన మర్రిచెట్టు కింద ఎంతమందైనా సేదదీరవచ్చు. ఎండిపోయిన వేపచెట్టు లాంటి కాంగ్రెస్‌లో కొనసాగటం వల్ల ప్రయోజనం ఏముంది? గత ఎన్నికలకు ముందు కల్పవృక్షాన్ని వదిలి ఎండమావి లాం టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినవారికి ఏ గతి పట్టిందో చూశాం కదా? వారిని ప్రజలు సంపూర్ణంగా తిరస్కరించారు. అందుకే తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవడమా లేక ప్రజాసేవ చేసుకునే అవకాశం వెతుక్కోవడ మా అనే ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు రణభేరి మోగింది.

కాంగ్రెస్‌కు ఒకప్పుడు నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ లాంటి జిల్లాలు కంచుకోటలే. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కోటలన్నీ కూలిపోయాయి నాయకుల ఆశ లతో సహా. టీఆర్‌ఎస్ తరపున గెలిచిన ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన పోరాటం, తెలంగాణ ప్రయోజనాల కోసం వారు శ్రమించిన తీరు అన్నీ ప్రజలు గమనించారు. టీఆర్‌ఎస్ ఎంపీల మీద అవినీతి ఆరోపణలు రాలే దు. పార్లమెంట్ హాజరుపట్టీలో టీఆర్‌ఎస్ ఎంపీల హాజరే అందరికన్నా ఎక్కువగా ఉన్నది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారం లభించింది. గత ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్ర పథకాలకు అనుమతులు సాధించడంలో ఎంపీల పోరాటం తక్కువ చేయలేం. అందరూ నిస్వార్థంగా పనిచేశారు. అందుకే టీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలని ప్రజలు ఏనాడో నిర్ణయించుకున్నారు. దేశంలో ఏ మీడియా సంస్థ సర్వే చేసినా, టీఆర్‌ఎస్ ప్రభంజనం తథ్యమ ని ఫలితాలు వెలువడుతున్నా యి. టీఆర్‌ఎస్ పదహారు స్థానా లు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
murali-mohan-Ilapavuluri
కాంగ్రెస్‌లోని నాయకుల పట్ల ప్రజలకు సదాభిప్రాయం ఏనాడో పోయింది. కాంగ్రెస్ ఎంపీలు అందరూ స్వార్థపరులు, పదవులను అడ్డం పెట్టుకొని అవినీతి చేసేవారన్న ముద్ర ప్రజల్లో బలంగా ఏర్పడింది. దాన్ని చెరిపేయడం కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు నాయకత్వం లేదు. ఆకర్షణీయమైన నాయకుల్లేరు. వారిలో వారే కొట్టుకుంటారు. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోటీచేస్తే తాను వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మరో కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ ప్రకటించారంటే కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు ప్రచారపర్వం మొదలైనా కాంగ్రెస్ నాయకుల ముఖంలో కళ లేదు. ప్రచారం పట్ల ఉత్సాహం లేదు. మొన్న జరిగిన రాహుల్‌గాంధీ సభకు స్పందనే కరువైంది. ఆయన ఉపన్యాసం పేలవంగా సాగిపోయింది. కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటో మొన్న జరిగిన సభనే తెలిపింది.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

712
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles