మూఢనమ్మకాలు వీడండి

Tue,March 19, 2019 01:03 AM

సమాజంలో మూఢ నమ్మకాలు నేడు అనేక రూపాల్లో విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో బాబాలు, స్వాముల పేరుతో మాయమాటలు చెబుతూ సామాన్య జనాన్ని బోల్తా కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. అదేవిధంగా ప్రజానీకం కూడా వారు చెప్పే మాయ మాటలు నమ్మి అనేకవిధాలుగా మోసపోవడం జరుగుతున్నది. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజ లు అస్వస్థకు గురైనవారిని, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురైనవారిని బాబాలు, స్వాములను ఆశ్రయించి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. వారిచ్చే పసుపు, కుంకుమ, విభూతి, నిమ్మకాయలను ఔషధాలుగా వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారు కూడా పాటించడం శోచనీయం.

డాక్టర్లు ఇచ్చే మందుల కన్నా, వారు చెప్పే సలహాల కన్నా బాబాలు, స్వాములు అని చెప్పుకునే మాయగాను ఎక్కువ నమ్మడం చాలా విషాదకరం. నిజంగా వీరి మాయలకు, మహిమలకు అతీత శక్తులున్నాయి అంటే అనుమానించాల్సిందే. నిజానికి వారుచేసే మహిమల వెనుక ఏదో ఒక సైన్స్, హస్త లాఘవం మాత్రమే ఉంటుంది. దాన్ని వారు తమ అతీతశక్తులుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేయడం జరుగుతున్నది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కొందరిని మంత్ర గాల్లనే నెపంతో అతికిరాతకంగా కొట్టి, కాల్చిచంపడం లాంటి ఘటనలు కూడా జరుగుతుండటం శోచనీయం.

ఇవ్వాళ ఇదొక సామాజిక సమస్యగా మారింది. ఎందరో అమాయకులు గ్రామీణ కక్షలకు, మంత్రాల పేరుతో బలవుతున్నారు. కాబట్టి ఇలాంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్య కార్కక్రమా లు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వచ్ఛంద ప్రజా సైన్స్ సంస్థలు కూడా వీటి నిర్మూలన కు కృషిచేయాలి. గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లా స్థాయి దాకా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే కమిటీలను ఏర్పాటుచేసి ప్రచార కార్యక్రమాలను నిర్వ హించాలి. తద్వారా ప్రజల్లో పాతుకుపోయిన మూఢ, అంధ విశ్వాసాలను పారదోలాలి.
- సంపతి రమేశ్ మహారాజ్, వెంకట్రావుపల్లి, రాజన్న సిరిసిల్ల

133
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles